npkunta
-
వర్షం కోసం కప్ప దేవర
తలుపుల/నంబులపూలకుంట: వర్షం కురవాలని ప్రార్థిస్తూ తలపులు మండలం పులిగుండ్లపల్లి, నంబులపూలకుంట మండలం రెడ్డివారిపల్లి, చిన్నసానివారిపల్లి గ్రామాల్లో చిన్నారులు అదివారం కప్ప దేవర చేశారు. ఆయా గ్రామాల్లో కప్పలను పూజించి, ప్రతి ఇంటికీ తిరిగి ‘కప్ప కప్ప నీళ్లాడె.. కడవల కొద్దీ నీళ్ళొచ్చా.. ముర్రో వానదేవుడా’ అని పాటలు పాడారు. వీధివీధినా రోడ్డుపై నీళ్లు పోసుకుంటూ గ్రామాల్లోని బొడ్రాయిల వద్ద పూజలు చేశారు. ప్రతి ఒక్కరూ తమకు తోచిన కాడికి ఇచ్చి ధాన్యంతో చెరువుకట్ట వద్దకు చేరుకుని సామూహికంగా వంటలు చేసి అందరూ కలిసి భోజనాలు చేశారు. అనంతరం ‘కప్పమ్మా నీలాడ చెరువులోకి నీళ్లుచ్చే కొర్రో వానదేవుడా’ అంటూ పాటలు పాడుతూ కట్టపైన మూడుసార్లు తిరిగి నోరు కొట్టుకుని, కప్పలను వదిలిపెట్టారు. -
'రైతుల కడుపుకొట్టి.. ప్రభుత్వం భూ దోపిడి'
అనంతపురం: ఎన్పీకుంట సోలార్ ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరిపై సీపీఎం జాతీయ నాయకులు ప్రకాశ్ కారత్ మండిపడ్డారు. గురువారం ఎన్పీ కుంట సోలార్ ప్రాజెక్టు బాధిత రైతులను కలుసుకున్న ఆయన.. ప్రభుత్వం రైతుల కడుపుకొట్టి భూ దోపిడీకి పాల్పడుతోందని ఆరోపించారు. సోలార్ ప్రాజెక్టులో భూములు నష్టపోయినటువంటి పట్టాలున్న రైతులకు కూడా ఎందుకు పరిహారం చెల్లించలేదని ప్రభుత్వాన్ని ప్రకాశ్ కారత్ ప్రశ్నించారు. 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేసి రైతులందరికి న్యాయం జరిగేలా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్పీ కుంట రైతు సమస్యలను జాతీయ ఉద్యమంగా మార్చనున్నట్లు ప్రకాశ్ కారత్ తెలిపారు.