వర్షం కోసం కప్ప దేవర | poojas for rain in npkunta and thalupula | Sakshi
Sakshi News home page

వర్షం కోసం కప్ప దేవర

Published Sun, Jul 30 2017 9:43 PM | Last Updated on Tue, Sep 5 2017 5:13 PM

వర్షం కోసం కప్ప దేవర

వర్షం కోసం కప్ప దేవర

తలుపుల/నంబులపూలకుంట: వర్షం కురవాలని ప్రార్థిస్తూ తలపులు మండలం పులిగుండ్లపల్లి, నంబులపూలకుంట మండలం రెడ్డివారిపల్లి, చిన్నసానివారిపల్లి గ్రామాల్లో చిన్నారులు అదివారం కప్ప దేవర చేశారు. ఆయా గ్రామాల్లో కప్పలను పూజించి, ప్రతి ఇంటికీ తిరిగి ‘కప్ప కప్ప నీళ్లాడె.. కడవల కొద్దీ నీళ్ళొచ్చా.. ముర్రో వానదేవుడా’ అని పాటలు పాడారు.

వీధివీధినా రోడ్డుపై నీళ్లు పోసుకుంటూ గ్రామాల్లోని బొడ్రాయిల వద్ద పూజలు చేశారు. ప్రతి ఒక్కరూ తమకు తోచిన కాడికి ఇచ్చి ధాన్యంతో చెరువుకట్ట వద్దకు చేరుకుని సామూహికంగా వంటలు చేసి అందరూ కలిసి భోజనాలు చేశారు. అనంతరం ‘కప్పమ్మా నీలాడ చెరువులోకి నీళ్లుచ్చే కొర్రో వానదేవుడా’ అంటూ పాటలు పాడుతూ కట్టపైన మూడుసార్లు తిరిగి నోరు కొట్టుకుని, కప్పలను వదిలిపెట్టారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement