Prakash Karath
-
కార్పొరేట్ ఎజెండాకు ఆదివాసీలు బలి!
బిర్సా ముండా జయంతిని పునస్కరించుకుని మోదీ ప్రభుత్వం తాను ఆదివాసీలకు అనుకూలమని చాటుకోవడానికి భారీ ప్రయత్నమే తలపెట్టింది. దీంట్లో భాగంగానే బిర్సా ముండా జయంతిని ఇకనుంచి జనజాతీయ గౌరవ్ దివస్‌గా జరుపుకుంటామని కేంద్రం ప్రకటించింది. 2014లో కేంద్రంలో మోదీ అధికారం చేపట్టిన తర్వాత కూడా ఆదివాసీలను అడవులనుంచి తరిమేసి వారిని నిలువునా మోసగించడం అనే ప్రక్రియ ఏమాత్రం ఆగకపోగా, మరింత ఎక్కువైంది. ఒకవైపు ప్రభుత్వ ప్రాయోజిత మౌలిక వసతుల కల్పనా ప్రాజెక్టులు, మరోవైపు ప్రైవేట్ కార్పొరేట్ సంస్థల దురాశ కలిసి ఆదివాసీలను వారి సాంప్రదాయిక భూభాగాల నుంచి తరిమివేస్తున్నాయి. ఆదివాసీ ప్రముఖులను ప్రశంసించడం, వారిపేర్లను రైల్వే స్టేషన్లకు పెట్టడం చేస్తూనే, మరోవైపున అడవులపై ఆదివాసీల హక్కును కాలరాస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే హిందుత్వ కార్పొరేట్ పరిపాలనా వ్యవస్థకు ఆదివాసీలే బాధితులయ్యారు. నవంబర్ 15న ఆదివాసీ దిగ్గజ నేత బిర్సా ముండా జయంతి సందర్భంగా మధ్యప్రదేశ్ లోని భోపాల్‌లో జరిగిన ఆదివాసీల భారీ ర్యాలీని ఉద్దేశించి భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగించారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి దశాబ్దాలు గడుస్తున్నా ఆదివాసీలు నిర్లక్ష్యానికి గురవుతూనే ఉన్నారని ఆయన విచారం వెలిబుచ్చారు. ఒక్క తన ప్రభుత్వం మాత్రమే దేశాభివృద్ధిలో ఆదివాసీలను భాగస్తులను చేసి, వివిధ సంక్షేమ పథకాల ద్వారా వారికి లబ్ధి కలిగిస్తోందని ప్రధాని ఘనంగా చెప్పుకున్నారు. బిర్సా ముండా జయంతిని పునస్కరించుకుని మోదీ ప్రభుత్వం తాను ఆదివాసీలకు అనుకూలమని ఘనంగా చాటుకుంది. దీంట్లో భాగంగానే బిర్సా ముండా జయంతిని ఇకనుంచి ‘జనజాతీయ గౌరవ్ దివస్’గా జరుపుకుంటామని కేంద్రం ప్రకటించింది. దీంట్లో భాగంగానే మోదీ భోపాల్ లోని హబిబ్ గంజ్ రైల్వేస్టేషన్ పేరును గోండు రాణి కమలాపతి రైల్వే స్టేషన్‌గా మార్చింది. అదే రోజున రాంచీలో బిర్సా ముండా, ఆదివాసీ చరిత్రపై మ్యూజియంని కూడా ప్రధాని ఆన్లైన్లో ప్రారంభించారు. చెప్పేదొకటి... చేసేదొకటి! బిర్సా ముండా జయంతి ఉత్సవాలు నిర్వహించడం, ఆదివాసీ ప్రయోజనాల పరిరక్షణలో తానే చాంపియన్ అని ప్రధాని ప్రకటించుకోవడం చూడ్డానికి బాగానే ఉంది కానీ, కేంద్ర ప్రభుత్వం వాస్తవానికి ఆదివాసీ హక్కులను హరించివేస్తోంది. పైగా దేశంలోని అడవులు, అటవీ భూముల్లో అంతర్భాగంగా ఉంటున్న ఆదివాసీలను, వారి జీవన విధానాన్ని కేంద్ర ప్రభుత్వమే ధ్వంసం చేస్తోంది. ఒకవైపు ప్రభుత్వ ప్రాయోజిత మౌలిక వసతుల కల్పనా ప్రాజెక్టులు, మరోవైపు ప్రైవేట్ కార్పొరేట్ సంస్థల దురాశ కలిసి ఆదివాసీలను వారి సాంప్రదాయిక భూభాగాల నుంచి తరిమి వేస్తున్నాయి. కాంట్రాక్టర్లు ఆదివాసీల ప్రాథమిక, రాజ్యాంగబద్ధ హక్కులను సైతం నిర్లక్ష్యం చేస్తున్నారు. గత ప్రభుత్వాల ఆచరణ సరేసరి. కానీ 2014లో కేంద్రంలో మోదీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత కూడా ఆదివాసీలను అడవులనుంచి తరిమేసి వారిని నిలువునా మోసగించడం అనే ప్రక్రియ ఏమాత్రం ఆగలేదు సరికదా మరింత ఎక్కువైంది. పైగా గనులు, ఖనిజాల అన్వేషణ, రసాయన పరిశ్రమల ద్వారా ప్రైవేట్ పెట్టుబడి ప్రకృతి సహజ వనరులను, అటవీ సంపదను కొల్లగొట్టే ప్రక్రియ కూడా మొదలైపోయింది. అయిదవ, ఆరవ షెడ్యూల్ ప్రాంతాల్లో గనుల లీజు, ఇతర ప్రాజెక్టుల ఏర్పాటుకు గ్రామసభల ఆమోదం తప్పనిసరి అనే నిబంధనకు నరేంద్రమోదీ ప్రభుత్వం తూట్లు పొడిచింది. కేంద్రంలో అధికారం స్వీకరించాక మొట్టమొదటగా గనులు, ఖనిజాల (అభివృద్ధి, క్రమబద్ధీకరణ) సవరణ చట్టం 2015కి ఆమోదముద్ర వేసింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో 2011లో ఆమోదించిన సవరణ చట్టంలో ఆది వాసీల హక్కుల రక్షణకు సంబంధించిన నిబంధనలను ఈ కొత్త సవరణ చట్టం తుంగలో తొక్కింది. అయిదో, ఆరో షెడ్యూల్డ్ ప్రాంతాల్లో గనుల లీజుకు గ్రామసభల అనుమతి తీసుకోవడం, ఈ ప్రాంతాల్లోని చిన్న స్థాయి ఖనిజ వనరులను మంజూరు చేయడానికి ఆదివాసీ కో ఆపరేటివ్‌లకు అర్హత కల్పించడం, బొగ్గు గని సంస్థలు తమ లాభాల్లో 26 శాతాన్ని జిల్లా ఖనిజాల సంస్థకు ఇవ్వడం అనే అంశాలను ప్రధాని మోదీ ప్రభుత్వం ఒక్క వేటుతో రద్దు చేసి పడేసింది. సకల హక్కులకూ ఆదివాసీలు ఇక దూరం ఒకవైపు ఆదివాసీ జనాభాతో కూడిన అటవీ ప్రాంతాల్లో గనులు, ఖనిజాల పరిశ్రమలను నెలకొల్పుకోవడానికి లైసెన్స్ ఇస్తున్నారు. మరోవైపు అయిదో, ఆరవ షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని ఆదివాసీ ప్రజల రాజ్యాంగబద్ధ హక్కులను హరించివేస్తున్నారు. ఇంకా ఘోరమైన విషయం ఏమిటంటే భారతీయ అటవీ చట్టం 1927కు ప్రతిపాదించిన సవరణ వల్ల ఆదివాసీ గ్రామ సభల పాత్రను పూర్తిగా తుడిచిపెట్టుకు పోనుంది. దీంతో ఆదివాసీల పరిస్థితి... ఇతర కమ్యూనిటీలతో సరిసమాన స్థితికి దిగజారిపోవడం ఖాయం. పైగా, సాగు చేసుకునే హక్కు, చేపలు పట్టుకునే హక్కు, అటవీ ఉత్పత్తులపై, పశువుల మేతపై హక్కు వంటి ఆదివాసీ జీవితానికి సంబంధించిన అన్ని అంశాలనూ ఇకనుంచి నేరమయంగా మార్చివేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం 2015లో తీసుకొచ్చిన అటవీ చట్ట సవరణ బిల్లు పట్ల తీవ్రమైన వ్యతిరేకత ప్రబలిపోవడంతో ఇంతవరకు ఆ బిల్లుకు మోక్షం లభించలేదు. అయితే 2018–2019 ప్రతిపాదిత అటవీ విధానం లేక అటవీ పరిరక్షణ చట్టం 1980కి చేయదలుస్తున్న ఇతర సవరణల కారణంగా తక్షణ ఫలితం ఏమిటంటే, అటవీయేతర ప్రయోజనాల కోసం అటవీ భూములను మళ్లించడం ఇకపై సులభతరం కానుంది. అడవుల ప్రైవేటీకరణ, వాణిజ్యీకరణపై గ్రామసభ అనుమతి తప్పనిసరి కాగా ఇక ఆ హక్కు లేకుండా చేస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ కూటమి ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ మార్పుల కారణంగా అటవీ హక్కుల చట్టం నిబంధనలకే తూట్లుపడబోతోంది. దీర్ఘకాలంగా అడవుల్లోనే నివసిస్తున్నవారికి అటవీ భూముల కల్పన, గిరిజన సమాజాల హక్కును పరిరక్షించడం, ఆది వాసీల సాగు హక్కు, చిన్న చిన్న అటవీ ఉత్పత్తులను సేకరించుకోవడం వంటివాటిని ఈ అటవీ హక్కుల చట్టం నిలబెడుతూ వచ్చింది. మొత్తంమీద, మోదీ పాలనలో ఆదివాసీ ప్రజల హక్కులను టోకున హరించివేయడం పతాక స్థాయికి చేరుకుంటోంది. ఆదివాసీలు, ఆదివాసీ సమాజాలకు అటవీ భూములపై పట్టా కలిగి ఉండే హక్కు, అటవీ భూములను తాము మాత్రమే సాగు చేసుకునే హక్కును ప్రసాదించిన అటవీ హక్కుల చట్టం–2006ని సైతం ఇప్పుడు ఉల్లంఘించేశారు. కేంద్ర ఆదివాసీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం గిరిజనులు, ఆది వాసీ సమాజాలకు చెందినవారు దరఖాస్తు చేసుకున్న భూ హక్కు ప్రకటనల్లో 46.69 శాతాన్ని మాత్రమే ఆమోదించారు. అంటే 50 శాతం కంటే తక్కువ మందికి మాత్రమే భూ హక్కు లభించింది. మధ్యప్రదేశ్‌లో అటవీ హక్కుల చట్టం కింద అటవీ భూమిపై హక్కుకు సంబంధించి ఆదివాసీ కుటుంబాలు పెట్టుకున్న దరఖాస్తులను అయిదింట మూడో వంతు వరకు తిరస్కరించారు. ఆదివాసీ పిల్లల చదువులకు తలుపులు మూశారు మోదీ పాలనలో ఆదివాసీల సాంఘిక సంక్షేమ చర్యలు ఆదివాసీ పిల్లల దుస్థితికి దృష్టాంతాలుగా నిలిచాయి. 2020 మార్చి నుంచి అంటే కోవిడ్ తొలిదశలో లాక్డౌన్ ప్రకటించాక పాఠశాలలను మూసేశారు. 90 నుంచి 95 శాతంవరకు గ్రామీణ ఆదివాసీ విద్యార్థులు ఎలాంటి విద్యకూ నోచుకోలేదు. అన్లైన్ విద్య అనే ప్రపంచం ఆదివాసీ పిల్లలకు తలుపులు మూసేసింది. వీరిలో చాలామందికి సంబంధించి విద్యా హక్కు గాలికి కొట్టుకుపోయింది. ఆహార భద్రత కూడా లేకపోవడంతో గ్రామీణ ఆదివాసీ కుటుంబాలు తీవ్రంగా దెబ్బతినిపోయాయి. ఈ కాలంలో ఎక్కువ ఆకలి చావులు ఆదివాసీ కుటుం బాల్లోనే చోటు చేసుకున్నాయి. ఆదివాసీల పట్ల మోదీ ప్రభుత్వ వైఖరి మితవాద అస్తిత్వ రాజకీయాలకు మాత్రమే పరిమితమైపోయింది. ఆదివాసీ ప్రముఖులను ప్రశంసించడం, వారిపేర్లను రైల్వే స్టేషన్లకు పెట్టడం సరేసరి. మరోవైపున అటవీభూములపై, అడవులపై వారి హక్కును కాలరాస్తున్నారు. వారి ప్రజాస్వామిక, రాజ్యాంగ హక్కులను హరిస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే హిందుత్వ కార్పొరేట్ పరిపాలనా వ్యవస్థకు ఆదివాసీలే ప్రధాన బాధితులయ్యారు. వ్యాసకర్త: ప్రకాశ్ కారత్, సీపీఎం మాజీ ప్రధాన కార్యదర్శి -
కాంగ్రెస్‌తో దోస్తీకి సై
సాక్షి, హైదరాబాద్ : కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపటమే లక్ష్యంగా పని చేయాలని సీపీఎం 22వ జాతీయ మహాసభల్లో తీర్మానించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ వంటి శక్తులను ఎదిరించే క్రమంలో వామపక్ష, లౌకిక, ప్రజాతంత్ర శక్తులను ఏకం చేస్తూ ప్రజా ఉద్యమాలను నిర్మించాలని, ఈ క్రమంలో అవసరమైతే కాంగ్రెస్‌తోనూ రాజకీయ సంబంధాలను కొనసాగించాలని నిర్ణయించారు. పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ ప్రవేశపెట్టిన ముసాయిదా రాజకీయ తీర్మానంపై దాదాపు 18 గంటల సుదీర్ఘ చర్చ, 37 సవరణల ఆమోదం అనంతరం ఈ మేరకు ఏకాభిప్రాయానికి వచ్చారు. స్థానిక అవసరాల దృష్ట్యా బీజేపీయేతర ఏ పార్టీతోనైనా కలిసిపని చేయాలని నిర్ణయించారు. ఒక తీర్మానం.. రెండు బలమైన వాదనలు బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా పని చేయాలని, అదే సందర్భంలో కాంగ్రెస్‌తోనూ సమాన దూరం పాటించాలని ప్రకాశ్ కారత్ వాదిస్తూ వచ్చారు. దీనిపై కేంద్ర కమిటీలోనూ చర్చించి, ఆ మేరకు బుధవారం మహాసభల్లో ముసాయిదా రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టారు. కాంగ్రెస్‌తో రాజకీయ సంబంధాలు వద్దన్న అంశంపై పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విభేదిస్తూ వస్తున్నారు. కాంగ్రెస్‌తో ఎన్నికల పొత్తు ఉండాలని తాను కోరుకోవడం లేదని, కానీ బీజేపీని గద్దె దించే క్రమంలో వామపక్ష, ప్రజాస్వామిక శక్తుల కలయిక అవసరమని, అలాంటప్పుడు అవసరమైతే కాంగ్రెస్‌తో రాజకీయ సంబంధాలు కొనసాగించాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. తీర్మానంలో కాంగ్రెస్‌తో రాజకీయ సంబంధాలు వద్దనే వాక్యానికి సవరణలు చేయాలని పట్టుబట్టారు. కేంద్ర కమిటీలో చర్చ సందర్భంగా కూడా ఆయన ఈ విషయంపై గట్టిగా పట్టుబట్టారు. సభలో ఒకే తీర్మానంపై రెండు బలమైన అభిప్రాయాలు ముందుకు రావడం పార్టీలో రసవత్తర చర్చకు దారితీసింది. మద్దతు పలికినవారెవరు? మహాసభల్లో రాజకీయ ముసాయిదా తీర్మానంతోపాటు ఏచూరి అభిప్రాయంపై గురు, శుక్రవారాల్లో వాడివేడి చర్చ జరిగింది. 12 రాష్ట్రాలకు చెందిన 47 మంది ప్రతినిధులు తమ అభిప్రాయాలు చెప్పారు. ముసాయిదా తీర్మానంపై మొత్తంగా 373 సవరణలను సూచించారు. మెజార్టీ సభ్యులు కారత్ ప్రతిపాదన వైపే మొగ్గు చూపినట్లు మొదట్లో కనిపించినా తర్వాత ఏచూరి అభిప్రాయానికి అనుకూలంగా పరిస్థితి మారినట్లు తెలిసింది. శుక్రవారం రాత్రి వరకు ప్రతినిధులు రాజకీయ తీర్మానంపై తమ అభిప్రాయాలను తెలియజేసి సవరణలు సూచించారు. ఏచూరి అభిప్రాయానికి పశ్చిమ బెంగాల్ నేతలు గట్టి మద్దతు ఇచ్చారు. బీజేపీని ఓడించే ప్రయత్నంలోనే అవసరమైతే కాంగ్రెస్‌తో రాజకీయ అవగాహన కొనసాగించాలని స్పష్టంచేశారు. వారికి మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రానికి చెందిన నేతలు కూడా జత కలిశారు. ఒక దశలో తమ అభిప్రాయాన్ని అంగీకరించకపోతే రహస్య ఓటింగ్ నిర్వహించాలని పట్టుబట్టినట్టు తెలిసింది. ఏపీ నేతల ఝలక్! ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏచూరికి ఇక్కడి నేతలే ఝలక్ ఇచ్చారు. ఆయన అభిప్రాయంతో విభేదించి కారత్ తీర్మానాన్ని సమర్థించారు. కేరళ నేతలు కూడ కారత్ తీర్మానంతో ఏకీభవించారు. ఈ నేపథ్యంలో మహాసభ రెండు వర్గాలుగా చీలిపోయి వాడివేడి చర్చకు దారితీసింది. రెండు నెలల క్రితం రాజకీయ ముసాయిదా తీర్మానం రూపొందించినప్పుడు కూడా కేంద్ర కమిటీలో ఓటింగ్ జరిగింది. అప్పుడు ఏచూరి ప్రతిపాదన వీగిపోయింది. మహాసభల్లో ఓటింగ్ పెడితే కారత్ తీర్మానమే నెగ్గుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మరోవైపు కారత్ మధ్యాహ్నామే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి రాజకీయ తీర్మానంపై ఏకాభిప్రాయం కుదరకుంటే, ఓటింగ్ నిర్వహించి తుది ముసాయిదా ప్రకటిస్తామని వెల్లడించారు. శుక్రవారం రాత్రి వరకు ఓటింగ్ జరగవచ్చనే అభిప్రాయమే వ్యక్తం చేశారు. మరోవైపు రాజకీయ తీర్మానంపై ఓటింగ్‌లో తన ప్రతిపాదన వీగిపోతే ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పుకోవాలన్న ఆలోచనలో ఏచూరి ఉన్నారని, పార్టీ చీలిపోయే ప్రమాదం ఉందని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో మధ్యే మార్గంగా ఏచూరి అభిప్రాయానికి తగ్గట్టుగా ముసాయిదాలో సవరణ చేశారు. కారత్ ప్రతిపాదించిన పొలిటికల్ లైన్లో ‘‘కాంగ్రెస్‌తో అవగాహన, ఎన్నికల పొత్తులు లేకుండా’’అనే పదాలను తొలగిస్తూ ముసాయిదాను సవరించారు. ఈ సవరణతో భవిష్యత్ ప్రజా ఉద్యమాల్లో సీపీఏం పార్టీ కాంగ్రెస్‌తో కలిసి పనిచేసే వెసులుబాటు ఏర్పడింది. -
బీజేపీ ఓటమి.. కాంగ్రెస్‌తో వైరం!
సాక్షి, హైదరాబాద్: మతోన్మాద బీజేపీని ఓడించటమే సీపీఎం పార్టీ ప్రధాన లక్ష్యంగా ఆ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌కారత్ ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానంపై గురువారం చర్చ కొనసాగింది. ఇందులో 13 రాష్ట్రాలకు చెందిన పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. ముసాయిదాను సభలో ప్రవేశపెట్టడాని కంటే ముందే కేంద్ర కమిటీ దీనిపై చర్చించి పలు సవరణలు చేసింది. అనంతరం తీర్మానాన్ని సభ ముందుంచారు. కాంగ్రెస్‌తో రాజకీయ వైరం పాటించాలని, జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని.. పొత్తులతో పార్టీకి నష్టం జరిగిందని ప్రకాశ్‌కారత్ పెట్టిన తీర్మానంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. చర్చలో పాల్గొన్న సభ్యుల్లో పి.రాజీవ్ (కేరళ), శాంతన్ ఝా (పశ్చిమబెంగాల్), తపన్ చక్రవర్తి (త్రిపుర), ఎంవీఎస్ శర్మ (ఆంధ్రప్రదేశ్), అర్ముగ నయనార్ (తమిళనాడు), ఉదయ్ నర్వేల్కర్ (మహారాష్ట్ర), అరుణ్ మిశ్రా (బిహార్), ఇంద్రజిత్‌సింగ్ (హరియాణా), రాకేశ్‌సింగా (హిమాచల్ ప్రదేశ్), ధూలీ చంద్ (రాజస్తాన్), కేఎం తివారీ (ఢిల్లీ), సుప్రకాశ్ (అస్సాం) తదితరులున్నారు. సుప్రీం వ్యాఖ్యలు దురదృష్టకరం సీపీఎం జాతీయ మహాసభ ప్రకటన జస్టిస్ లోయా మృతిపై స్వతంత్ర దర్యాప్తును కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని సీపీఎం జాతీయ మహాసభ అభిప్రాయపడింది. జస్టిస్ లోయా మృతిపై అనేక సందేహాలున్నాయని, వాటిని నివృత్తి చేసేందుకుగాను మరో ఉన్నత ధర్మాసనం చేత సమీక్ష జరిపించాలని డిమాండ్ చేస్తూ మహాసభ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇదే విషయమై సీతారాం ఏచూరి విలేకరులతో మాట్లాడుతూ న్యాయాన్ని అందించాల్సిన వ్యవస్థలే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. -
బీజేపీని ఓడించడమే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: మతోన్మాద బీజేపీని ఓడించటమే పార్టీ ప్రధాన లక్ష్యమని సీపీఎం మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌కారత్ స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన పార్టీ జాతీయ మహాసభల్లో రాజకీయ ముసాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిపై వివిధ రాష్ట్రాల సభ్యులు రెండ్రోజులపాటు చర్చించి, తుది అభిప్రాయాన్ని సభకు నివేదిస్తారు. ఈ సందర్భంగా కారత్ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌తో రాజకీయ వైరం పాటించాలని సూచించారు. పొత్తులతో పార్టీకి నష్టం జరిగిందని, జాతీయ స్థాయిలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. ప్రాంతీయ పార్టీలు, సామాజిక శక్తులను కలుపుకొని పోయేలా ఎన్నికల ఎత్తుగడ ఉండాలని సూచించారు. అత్యంత కీలకమైన ఈ తీర్మానాన్ని సాధారణంగా పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రవేశపెడతారు. కానీ ఈసారి ప్రధాన కార్యదర్శి కాకుండా మాజీ ప్రధాన కార్యదర్శి ప్రవేశపెట్టడం గమనార్హం. బహుశా ఇది జాతీయ మహాసభల చరిత్రలోనే మొదటిసారి కావొచ్చని పార్టీ వర్గాలు తెలిపాయి. -
నాలుగేళ్లుగా నిద్రపోయారు!?
-
నాలుగేళ్లుగా నిద్రపోయారు!?
భీమవరం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘నాలుగేళ్లుగా నిద్రపోయారు. అకస్మాత్తుగా మేల్కొని పార్లమెంటులో ఆందోళన చేస్తున్నారు. ప్రత్యేక హోదాతో సహా విభజన చట్టంలోని అంశాలను అమలుచేయాలని వామపక్ష పార్టీలు మొదట్నుంచీ డిమాండ్ చేస్తూనే వచ్చాయి. ఎవరూ కలసి రావడంలేదని టీడీపీ ఇప్పుడెలా అడుగుతుంది? ఈ ఆందోళన వెనుక ఏమైనా బేరసారాలు జరుగుతున్నాయేమోనని అనుమానించాల్సి వస్తోంది’.. అని సీపీఎం మాజీ ప్రధాన కార్యదర్శి, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ప్రకాశ్‌కారత్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరుగుతున్న సీపీఎం రాష్ట్ర 25వ మహాసభల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన అన్ని హామీలను కేంద్రం అమలు చేయాల్సిందేనని, అలా కాలేదంటే అందుకు బాధ్యత ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వానిది కూడా అని కారత్ స్పష్టంచేశారు. పటిష్టంగా వైఎస్సార్సీపీ పునాదులు: ఇదిలా ఉంటే.. రాష్ట్ర మహాసభల్లో ప్రవేశపెట్టిన కార్యదర్శి నివేదికపై ప్రతినిధులు సుదీర్ఘంగా చర్చించారు. వివిధ రాజకీయ పార్టీల స్థ్ధితిగతులను, పార్టీ నిర్మాణ స్వరూపాన్నీ, గత కార్యక్రమాల తీరును నిశితంగా సమీక్షించారు. రాజకీయ పార్టీలలో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై జరిగిన చర్చలో.. 23 మంది ఎమ్మెల్యేలను అధికార టీడీపీ కొనుగోలు చేసినా ఆ పార్టీ పునాదులు పటిష్టంగానే ఉన్నాయని ప్రతినిధులు అభిప్రాయపడినట్లు తెలిసింది. వైఎస్సార్సీపీని ఆదరిస్తున్న ఆయా వర్గాలు చెక్కుచెదరలేదని, ఆ వర్గాలలో ఆ పార్టీ బలంగానే ఉందని సభ్యులు అభిప్రాయపడ్డారు. -
కాంగ్రెస్‌తో పొత్తుకు సీపీఎం నో!
కోల్‌కతా: కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకోవాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వర్గం ప్రతిపాదించిన ముసాయిదా తీర్మానాన్ని పార్టీ కేంద్ర కమిటీ తోసిపుచ్చింది. ఈ మేరకు ఆదివారం కోల్‌కతాలో జరిగిన ఓటింగ్‌లో పొలిట్‌బ్యూరో సభ్యుడు ప్రకాశ్ కారత్ నేతృత్వంలోని కేరళ బృందం ఏచూరి తీర్మానాన్ని ఓడించింది. ఈ తీర్మానానికి అనుకూలంగా 31 ఓట్లు, వ్యతిరేకంగా 55 మంది ప్రతినిధులు ఓటేశారు. కాంగ్రెస్‌తో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఎలాంటి పొత్తు ఉండొద్దని ప్రకాశ్ కారత్ బృందం తేల్చిచెప్పింది. కేంద్రంలో బీజేపీని అడ్డుకోవాలంటే కాంగ్రెస్‌తో ఒప్పందం చేసుకోవడమే మేలని ఏచూరి ప్రతిపాదించారు. మూడు రోజుల పాటు జరిగిన పార్టీ కేంద్ర కమిటీ సమావేశాలు ఆదివారం ముగిసిన తరువాత ఏచూరి మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు. సవరణలు చేసిన తరువాత ఆమోదం పొందిన తీర్మానంలో కాంగ్రెస్‌తో ఎలాంటి ఎన్నికల పొత్తు, అవగాహన కుదుర్చుకోవద్దని నిర్ణయించినట్లు వెల్లడించారు. త్రిపుర, పశ్చిమ బెంగాల్ ప్రతినిధులు అనుకూలంగానే ఉన్నా కేరళ సభ్యులు వ్యతిరేకించిననట్లు తెలిపారు. రాజీనామాకు సిద్ధపడ్డ ఏచూరి! కారత్ బృందం తీర్మానాన్ని పార్టీలో అంతర్గతంగా చర్చించడానికి ఫిబ్రవరిలో విడుదల చేస్తారు. ఏప్రిల్‌లో పార్టీ సమావేశాలు జరగబోయే ముందు దీనిపై అభిప్రాయాలు సేకరిస్తారు. తన తీర్మానం ఆమోదం పొందకుంటే సీపీఎం ప్రధాన కార్యదర్శిగా తప్పుకోవాలని ఏచూరి అనుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. తన ఓటమిని పసిగట్టిన ఏచూరి అసలు ఓటింగ్ జరగకుండా ఉండేలా ఎంతో ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఇందుకోసం అత్యవసరంగా పొలిట్ బ్యూరో సమావేశం ఏర్పాటుచేసినా ఏకాభిప్రాయం కుదరలేదు. కేంద్రకమిటీసభ్యుడి హఠాన్మరణం ఈ సమావేశాలకు హాజరైన కేంద్ర కమిటీ సభ్యుడు, త్రిపుర అధికార లెఫ్ట్‌ఫ్రంట్ చైర్మన్ ఖగేన్‌దాస్(79) హఠాన్మరణం చెందారు. శనివారం వేకువజామున ఆయన తీవ్ర గుండెపోటుతో మృతి చెందారని కుటుంబసభ్యులు తెలిపారు. దాస్ 1978, 1983 ఎన్నికల్లో శాసనసభ్యుడిగా, 1998–2002 కాలంలో రాజ్యసభ సభ్యుడిగా, 2002 నుంచి 2014 వరకు లోక్‌సభ సభ్యుడిగా పనిచేశారు. -
రాజకీయాలు వ్యాపారమయ్యాయి
సాక్షి, అమరావతి: నయా ఉదారవాద సంస్కరణల నేపథ్యం లో రాజకీయాలు వ్యాపారమయం అయ్యాయని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ప్రకాశ్‌కారత్ ఆవేదన వ్యక్తంచేశారు. వ్యాపారులు, కాంట్రాక్టర్లు, మద్యం మాఫియా ముఠాలు, కార్పొరేట్ సంస్థల యజమానులు రాజకీయ పార్టీలలో చేరి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులవుతున్నారన్నారు. సీపీఎం సీనియర్ నేత మోటూరి హనుమంతరావు శత జయంతి సందర్భంగా ఆదివారం విజయవాడలో ఏర్పాటుచేసిన సభలో.. ‘నయా ఉదారవాద, నియంతృత్వ, మతతత్వ విధానాలు– ప్రత్యామ్నాయం’ అంశంపై ఆయన ప్రసంగించారు. పీవీ నరసింహారావు మొదలు ఇప్పటివరకు అన్ని పార్టీలు దాదాపు ఇదే వైఖరిని ప్రదర్శిస్తున్నాయని చెప్పారు. మోదీ పాలన ప్రైవేటుమయమైందని, దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టినా, జాతి సంపదను ముక్కలు ముక్కలుగా అమ్మేసే పరిస్థితి వచ్చినా పార్లమెంటులో నోరు మెదపలేని, చర్చించలేని స్థితి వచ్చిందన్నారు. ఈ విధానాలను ఎదుర్కోవాలంటే ఐక్య ఉద్యమాలే పరిష్కారమని కారత్ అభిప్రాయపడ్డారు. నవంబర్‌లో మహాపడావ్ పేరిట పార్లమెంటు ఎదుట ఆందోళన చేయబోతున్నామని ఆయన తెలిపారు. -
అభివృద్ధి సంపన్న వర్గాలకే పరిమితం
సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ప్రకాశ్ కారత్ ఖమ్మం మయూరిసెంటర్: వందల సంవ త్సరాల నుంచి దేశంలో అభివృద్ధి సంపన్న వర్గాలకే పరిమితమైందని, బడుగు, బలహీన వర్గాలు ఇంకా అట్టడుగుకు చేరుతున్నాయని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు ప్రకాశ్ కారత్ అన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో చేపట్టిన మహాజన పాదయాత్ర శనివారం ఖమ్మంలో కొనసాగింది. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో కారత్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సబ్‌ప్లాన్‌ను రద్దు చేసేందుకు ప్రయత్ని స్తోందని, దీనిని కేసీఆర్ ప్రభుత్వం అనుసరిం చాలని చూస్తోందని విమర్శించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం మను స్మృతి ఆధారంగా నడుస్తోందని, ఆర్ఎస్ఎస్ దానిని నడిపిస్తోం దని ఆరోపించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ లో నియంత పాలన సాగుతోందని విమర్శించారు. సమస్యల కోసం ప్రశ్నించే వారిపై విరుచుకుపడే తీరులో పాలకులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. -
రైతుకు న్యాయం జరిగే వరకూ ఉద్యమిస్తాం
సోలార్ బాధితులకు భరోసా ఇచ్చిన సీపీఎం నేత ప్రకాష్ కారత్ కదిరి: ‘సోలార్ హబ్‌తో భూములు కోల్పోతున్న రైతులకు కాకుండా దొంగలకు పరిహారం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం చూస్తోంది. ఇందుకు చంద్రబాబు సర్కారు సమాధానం చెప్పాలి. ఈ ఉద్యమాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్తాం. రైతుకు న్యాయం జరిగే వరకూ ఉద్యమిస్తాం’ అని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాష్ కారత్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా ఎన్పీ కుంట మండలంలో ఏర్పాటు చేస్తున్న సోలార్ సిటీ భూనిర్వాసితులతో మాట్లాడేందుకు గురువారం ఆయన వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అనంతరం వందలాది మంది రైతులు, సీపీఎం కార్యకర్తలతో కలిసి సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్న ప్రాంతానికి వెళ్లడానికి ప్రయత్నించిన కారత్ను పోలీసులు అడ్డుకున్నారు. ఎన్పీ కుంటలో రోడ్డుపైనే బైఠాయించడంతో చివరకు కారత్‌తో పాటు నలుగురిని మాత్రం అనుమతించారు. -
'రైతుల కడుపుకొట్టి.. ప్రభుత్వం భూ దోపిడి'
అనంతపురం: ఎన్పీకుంట సోలార్ ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరిపై సీపీఎం జాతీయ నాయకులు ప్రకాశ్ కారత్ మండిపడ్డారు. గురువారం ఎన్పీ కుంట సోలార్ ప్రాజెక్టు బాధిత రైతులను కలుసుకున్న ఆయన.. ప్రభుత్వం రైతుల కడుపుకొట్టి భూ దోపిడీకి పాల్పడుతోందని ఆరోపించారు. సోలార్ ప్రాజెక్టులో భూములు నష్టపోయినటువంటి పట్టాలున్న రైతులకు కూడా ఎందుకు పరిహారం చెల్లించలేదని ప్రభుత్వాన్ని ప్రకాశ్ కారత్ ప్రశ్నించారు. 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేసి రైతులందరికి న్యాయం జరిగేలా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్పీ కుంట రైతు సమస్యలను జాతీయ ఉద్యమంగా మార్చనున్నట్లు ప్రకాశ్ కారత్ తెలిపారు. -
దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం: కారత్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు "ఓటుకు నోటు వ్యవహారం నీతిమాలిన పని, దిగుజారుడు రాజకీయాలకు నిదర్శనం" అని సీపీఎం జాతీయ నేత ప్రకాశ్ కారత్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఓటుకు నోటు వ్యవహారంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని.. అందులో భాగస్వాములైన అందరినీ బయటకు లాగాలని ఈ సందర్భంగా ప్రకాశ్ కారత్ డిమాండ్ చేశారు. ఓటుకు నోటు వ్యవహారంలో ఎవరెవరి హస్తం ఉందనేది విచారణ జరపాలన్నారు. ఎన్నికల్లో సంస్కరణలు.. పార్టీలకు ఇచ్చే నిధుల్లో పారదర్శకత రావాలని.. అప్పుడే రాజకీయాల్లో అవినీతి తగ్గుతుందని ప్రకాశ్ కారత్ అభిప్రాయపడ్డారు. -
ఐక్యకార్యాచరణతో ముందుకు..
దేశంలో వామపక్షాలు సన్నిహితం కావాలి యూపీఏ విధానాలనే అవలంబిస్తున్న ఎన్డీఏ: కారత్ రాష్ట్రాల స్వయంప్రతిపత్తిలో కేంద్రం జోక్యంవద్దు: సురవరం నగరంలో రెడ్‌షర్ట్ పటాలం భారీ ర్యాలీ హైదరాబాద్: దేశంలోని వుతోన్మాద, కార్పొరేట్, దోపిడీ పాలనకు వ్యతిరేకంగా ఐక్య కార్యాచరణ, ఉద్యవూలకు వావుపక్షాలు సవుర శంఖం పూరించారుు. ఐక్యకార్యాచరణ, ఉద్యవూలతో భవిష్యత్‌లో కవుూ్యనిస్టుల కలరుుక సాధ్యవువుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారుు. నగరంలోని నిజాం కాలేజీ గ్రౌండ్లో సోవువారం కవుూ్యనిస్టు యోధుడు చండ్ర రాజేశ్వరరావు శత జయుంతి వుుగింపు ఉత్సవాల సందర్భంగా సీపీఐ భారీ బహిరంగసభ నిర్వహించింది. పార్టీ జాతీయు కార్యవర్గసభుడు కె. నారాయుణ అధ్యక్షతన జరిగిన సభలో సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌కారత్ మాట్లాడుతూ అధికారంలోకి వస్తే పేదలకు వుంచి రోజులు వస్తాయుని చెప్పిన బీజేపీ ఇందుకు భిన్నంగా బడా పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాదులకు ఊడిగం చేస్తోందని వివుర్శించారు. రైల్వే, రక్షణ, బీవూ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు బార్లా తెరచి ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తోందన్నారు. ఉపాధి కల్పన. అభివృద్ధి, సంక్షే వు రంగాలకు కోత విధించి, ఇష్టారాజ్యంగా ధరలను పెంచి గత ప్రభుత్వాల వూదిరిగానే ప్రజలపై భారం మోపుతోందని మోడీ పాలనపై ధ్వజమెత్తారు. కార్మికులకు రక్షణ లేని చట్టాలు చేస్తూ... కార్పొరేట్, బడా కోటీశ్వరులు వంతపాడుతోందన్నారు. యూపీ, ఎంపీ, హర్యానా, రాజస్థాన్‌లలో వుతఘర్షణలు పెరిగాయుని అందోళన వ్యక్తంచేశారు. సంఘపరివార్, ఆర్ఎస్ఎస్ చేతుల్లో అధికారం ఉందని, విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయుత్నాలు జరుగుతున్నాయుని ఆవేదన చెందారు. వావుపక్ష ఐక్య ఉద్యవూలు, కార్యాచరణ పోరాటాలు భవిష్యత్‌లో కవుూ్యనిస్టుల కలరుుకకు దోహదపడగలవని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సీపీఐ పధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలో వావుపక్షాల ఐక్యత, సన్నిహితం వురింత పటిష్టవంతం కావాలని పిలుపునిచ్చారు. అందుకోసం ఐక్యవేదిక ఏర్పాటు చేయూలని నిర్ణరుుంచినట్టు తెలిపారు. యుూపీఏ అవలంబిస్తున్న ఆర్థిక ఉదరవాద విధానాలను మోడీ ప్రభుత్వం అనుసరిస్తోందని ఎద్దేవా చేశారు. మోడీ పాలనలో వుహిళలకు రక్షణ లేకుండా పోయిందని, ధరలు విపరీతంగా పెరిగాయుని దుయ్యుపట్టారు. రెండు రాష్ట్రాల వుధ్య వివాదాలు తలెత్తితే చర్చల ద్వారా పరిష్కారం కోసం కృషి చేయూల్పింది పోరుు... రాష్ట్రాల స్వయుంప్రతిపత్తిలో కేంద్రం వేలు పెట్టడం, విద్వేషాలను రగిలించటం వుంచిది కాదని హెచ్చరించారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా వూర్చాలని కేంద్రం ప్రయుత్నిస్తోందని సురవరం వివుర్శించారు. రిఫరీగా ఉంటా... ఇరు రాష్ట్రాల సీఎంలు రెచ్చగొట్టే వూటలు వూనుకొని సావురస్యంగా చర్చలు జరుకోవటం ద్వారా సవుస్యలు పరిష్కరించుకోవాలని సీపీఐ జాతీయు నాయుకుడు కె.నారాయుణ కోరారు. ఎల్బీ స్టేడియుంలో చర్చించుకోవడానికి ఇద్దరు సీఎంలు వస్తే తాను రిఫరీగా వ్యవహరిస్తానని తెలిపారు. తెలంగాణ సాయుుధ పోరాట ఉత్సవాలు అధికారికంగా జరపాలన్నారు. సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ వామపక్షాల్లో నూతన ఉత్తేజాన్ని తీసుకురావడానికి కృషి చేస్తామన్నారు. ఈ సభలో ఆర్ఎస్పీ నేత అబనీరాయ్, సీపీఐ(ఎంఎల్) ప్రధాన కార్యదర్శి దీపాంక్ భట్టాచార్య, ఏపీ కార్యదర్శి కె.రావుకృష్ణలు పాల్గొన్నారు. ఎరుపెక్కిన బాగ్‌లింగంపల్లి.. విప్లవోద్యమ సారథి చండ్ర రాజేశ్వర్‌రావు శత జయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి నారాయణగూడ, హిమాయత్‌నగర్ మీదుగా నిజాం కళాశాల వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కాకి ప్యాంట్, ఎర్ర చొక్కా ధరించిన జనసేవా దళ్ నాయకులు, కార్యకర్తలు ఉదయం 7 గంటల నుంచే సుందరయ్య పార్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా కళాకారులు ఆలపించిన విప్లవ గీతాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. -
బిల్లు పెట్టామంటే ఒప్పుకోం :కారత్
రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును వ్యతిరేకించాలని కోరిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు గందరగోళంలో ప్రవేశపెట్టిన బిల్లును అంగీకరించేది లేదన్న కారత్ సీపీఎం ప్రధాన కార్యదర్శితో జగన్ భేటీ సమాఖ్య స్ఫూర్తికి, రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా కేంద్రం వ్యవహరించిన తీరుపై వివరణ సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన తీరును తాము తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ చెప్పారు. పూర్తి గందరగోళం మధ్య ప్రవేశపెట్టిన ఆ బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని, బిల్లు పెట్టామంటే ఒప్పుకోబోమని స్పష్టం చేశారు. ఈ విషయమై తమ ఫ్రంట్‌లోని మిగతా పార్టీలతోనూ మాట్లాడతానని, ఆంధ్రప్రదేశ్ విభజన జరుగుతున్న తీరును వ్యతిరేకించేలా ఆ పార్టీలను ఒక్కతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేస్తామని.. వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి కారత్ హామీ ఇచ్చారు. పూర్తి అప్రజాస్వామిక పద్ధతుల్లో జరుగుతున్న విభజనను వ్యతిరేకించాలని కోరుతూ పలు జాతీయ పార్టీల నేతలను కలుస్తున్న జగన్ ఆదివారం ఉదయం సీపీఎం నేతతో భేటీ అయ్యారు. నాలుగు రోజుల కిందటే కారత్‌తో సమావేశమైన జగన్.. అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టకుండా చూడాలని ఆయన్ను కోరిన సంగతి తెలిసిందే. తాజా భేటీ సందర్భంగా కేంద్రం గురువారం లోక్‌సభలో ఏ విధంగా విభజన బిల్లును ప్రవేశపెట్టిందో ఆయన వివరించారు. సభా సంప్రదాయాలను పట్టించుకోకుండా, సమాఖ్య స్ఫూర్తికి, రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరించిన తీరును తెలియజేశారు. బిల్లును ప్రవేశపెట్టే సమయంలో కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఓ పథకం ప్రకారం ముందుకె ళ్లాయని, సొంత పార్టీ సభ్యులనే ఉసిగొల్పి దాడులు చేయించాయని చెప్పారు. కాంగ్రెస్, టీడీపీ పార్టీల నేతలు ఒకరినొకరు కొట్టుకున్నారని వివరించారు. ఇంత జరుగుతున్నా స్పీకర్ మాత్రం ఏకపక్షంగా, సభ్యుల నుంచి ఎలాంటి ఆమోదం తీసుకోకుండా బిల్లు ప్రవేశపెట్టామని చెప్పడాన్ని తాము ఖండిస్తున్నామని తెలిపారు. సీపీఎం సహా మిగతా జాతీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి బిల్లు ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించాలని జగన్ కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కారత్, ఫ్రంట్‌లోని 11 పార్టీలతో ఈ విషయమై చర్చిస్తామని తెలిపారు. బిల్లు ఎప్పుడు చర్చకు వచ్చినా తమ పార్టీ వ్యతిరేక త వ్యక్తం చేస్తుందని, తమ స్థాయిలో పోరాడతామని ఆయన హామీ ఇచ్చినట్టు సమాచారం. హక్కులు కాలరాస్తే అంగీకరించం: కారత్ ఈ భేటీ అనంతరం కారత్ విలేకరులతో మాట్లాడారు. ‘పార్లమెంట్లో గురువారం జరిగిన దురదృష్టకర సంఘటనలను ఖండిస్తున్నాం. రాష్ట్ర విభ జన బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టామని చెప్పడాన్ని మేము అంగీకరించట్లేదు. సభలో పూర్తిగా గందరగోళం నెలకొన్న సమయంలో బిల్లు ప్రవేశపెట్టారు. దీన్ని ప్రతిపక్ష పార్టీలు అంగీకరించవు. ఇది అత్యంత ప్రాముఖ్యమైన బిల్లు. దీనిపై పార్లమెంట్లో ప్రతిపార్టీ, ప్రతిఒక్కరూ చర్చలో పాల్గొని తమ అభిప్రాయం చెప్పాలి. బలవంతంగా విపక్షాలు, సభ్యుల హక్కులు కాలరాసే ధోరణితో వ్యవహరిస్తే మేము అంగీకరించబోం’ అని అన్నారు. ఓట్లు, సీట్ల కోసం విభజన సరికాదు: జగన్ జగన్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరుగుతున్న తీరును అన్ని ప్రధాన పార్టీలు వ్యతిరేకించాలని కోరారు. వ్యతిరేకించకుంటే చెడు సంప్రదాయానికి తెరతీసినట్లేనని పేర్కొన్నారు. ‘రాష్ట్ర విభజనను, ప్రజలకు కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని వ్యతిరేకించాల్సిందిగా మరోమారు కారత్ను కోరాం. అసెంబ్లీ ఒప్పుకోకపోయినా కేంద్ర ప్రభుత్వం బలవంతంగా విభజనకు దిగుతోంది. సభలో బిల్లు ప్రవేశపెట్టిన తీరు ప్రజాస్వామ్యయుతంగా లేదు. ఎవరూ అవునని, కాదని చెప్పకుండానే పది సెకన్లలో మొత్తం ఎపిసోడ్ పూర్తయింది. ఈ అప్రజాస్వామిక విధానాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఈ అప్రజాస్వామిక వైఖరిని ఖండించి కారత్ మాకు మద్దతు తెలిపారు. ఈ అన్యాయంపై పోరాడేందుకు తన మద్దతు ప్రకటించారు. మాకు మద్దతు తెలిపినందుకు ఆయనకు ధన్యవాదాలు’ అని అన్నారు. రాష్ట్ర విభజన అంశం ఈ నెల 17, 18, 19 తేదీల్లో పార్లమెంట్లో చర్చకు రానున్నట్లు తెలుస్తోందని, ఈ అన్యాయాన్ని సభలో అన్ని పార్టీలు వ్యతిరేకించకుంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌కు జరిగిందే మరో రాష్ట్రానికి జరగవచ్చని జగన్ హెచ్చరించారు. ‘రేపు తమిళనాడుకు, మరుసటి రోజు బెంగాల్‌కు, మరికొన్ని రోజులు పోతే కర్ణాటకకు జరగొచ్చు. పార్లమెంట్లో 270 మంది ఎంపీలుండి ఓట్ల కోసం సీట్ల కోసం ఇలా అడ్డగోలుగా రాష్ట్రాలను విభజిస్తామంటే అది సరికాదు..’ అని అన్నారు. -
లౌకిక కూటమిని తెస్తాం
పార్లమెంటు ఎన్నికలపై సీపీఎం ప్రకటన ‘‘వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని మేం అధికారంలోకి రానివ్వం. కాంగ్రెస్‌కు మద్దతివ్వం. కాంగ్రెసేతర, బీజేపీయేతర లౌకిక కూటమిని మేం ఏర్పాటుచేస్తాం. అది బీజేపీ అధికారంలోకి రాకుండా సమర్థవంతంగా నిరోధిస్తుంది’’ అని సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌కారత్ ప్రకటించారు. త్రిపుర రాజధాని అగర్తలాలో జరుగుతున్న పార్టీ కేంద్ర కమిటీ సమావేశం సందర్భంగా కారత్ శనివారం మీడియాతో మాట్లాడారు. ఇటీవలి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే.. అవినీతి, అధిక ధరల కారణంగా కాంగ్రెస్‌ను ప్రజలు తిరస్కరించారని.. బీజేపీ వంటి మతతత్వ శక్తులు ఆర్ఎస్ఎస్ సాయంతో అధికారంలోకి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని స్పష్టమవుతోందని ఆయన పేర్కొన్నారు. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్రమోడీని ప్రచారం చేస్తున్న అంశంపై కూడా కేంద్ర కమిటీ సమావేశంలో చర్చించామని తెలిపారు. ఈ ప్రచారం వల్ల మోడీకి కార్పొరేట్ సంస్థల నుంచి నిరంతర మద్దతు లభిస్తోందన్నారు. ‘‘కానీ ఆయన గతమేంటో మాకు తెలుసు. ఆయన అధికారంలోకి రాకుండా ఆపేందుకు ఏ అవకాశాన్నీ వదిలిపెట్టం’’ అని ఉద్ఘాటించారు. కాంగ్రెస్‌కు మద్దతిచ్చే ప్రసక్తే లేదని.. ఆ ప్రశ్నే తలెత్తదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం కాంగ్రెసేతర, బీజేపీయేతర శక్తులు ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలవన్నారు.