
దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం: కారత్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు "ఓటుకు నోటు వ్యవహారం నీతిమాలిన పని, దిగుజారుడు రాజకీయాలకు నిదర్శనం" అని సీపీఎం జాతీయ నేత ప్రకాశ్ కారత్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఓటుకు నోటు వ్యవహారంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని.. అందులో భాగస్వాములైన అందరినీ బయటకు లాగాలని ఈ సందర్భంగా ప్రకాశ్ కారత్ డిమాండ్ చేశారు. ఓటుకు నోటు వ్యవహారంలో ఎవరెవరి హస్తం ఉందనేది విచారణ జరపాలన్నారు. ఎన్నికల్లో సంస్కరణలు.. పార్టీలకు ఇచ్చే నిధుల్లో పారదర్శకత రావాలని.. అప్పుడే రాజకీయాల్లో అవినీతి తగ్గుతుందని ప్రకాశ్ కారత్ అభిప్రాయపడ్డారు.