అభివృద్ధి సంపన్న వర్గాలకే పరిమితం | Prakash Karath comments on the kcr government | Sakshi
Sakshi News home page

అభివృద్ధి సంపన్న వర్గాలకే పరిమితం

Published Sun, Feb 19 2017 3:44 AM | Last Updated on Tue, Aug 14 2018 2:34 PM

అభివృద్ధి సంపన్న వర్గాలకే పరిమితం - Sakshi

అభివృద్ధి సంపన్న వర్గాలకే పరిమితం

సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ప్రకాశ్‌ కారత్‌

ఖమ్మం మయూరిసెంటర్‌: వందల సంవ త్సరాల నుంచి దేశంలో అభివృద్ధి సంపన్న వర్గాలకే పరిమితమైందని, బడుగు, బలహీన వర్గాలు ఇంకా అట్టడుగుకు చేరుతున్నాయని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు ప్రకాశ్‌ కారత్‌ అన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నేతృత్వంలో చేపట్టిన మహాజన పాదయాత్ర శనివారం ఖమ్మంలో కొనసాగింది.

ఈ సందర్భంగా నిర్వహించిన  సభలో కారత్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సబ్‌ప్లాన్‌ను రద్దు చేసేందుకు ప్రయత్ని స్తోందని, దీనిని కేసీఆర్‌ ప్రభుత్వం అనుసరిం చాలని చూస్తోందని విమర్శించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం మను స్మృతి ఆధారంగా నడుస్తోందని, ఆర్‌ఎస్‌ఎస్‌ దానిని నడిపిస్తోం దని  ఆరోపించారు.  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ లో నియంత పాలన సాగుతోందని విమర్శించారు. సమస్యల కోసం ప్రశ్నించే వారిపై విరుచుకుపడే తీరులో పాలకులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement