'ఒబామా పర్యటనకు నిరసన తెలుపుతాం' | CPI Ready to protest obama, says chada venkat reddy | Sakshi
Sakshi News home page

'ఒబామా పర్యటనకు నిరసన తెలుపుతాం'

Published Mon, Jan 5 2015 3:38 PM | Last Updated on Mon, Aug 13 2018 8:10 PM

'ఒబామా పర్యటనకు నిరసన తెలుపుతాం' - Sakshi

'ఒబామా పర్యటనకు నిరసన తెలుపుతాం'

హైదరాబాద్: వామపక్ష పార్టీలు ఐక్యతతో పనిచేస్తాయని సీపీఎం నేత తమ్మినేని వీరభ్రదం చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కలిసి ఉద్యమాలు చేస్తాయని అన్నారు. ప్రజాసమస్యలపై మరింత ఉధృతంగా ఉద్యమాలు చేస్తామని ప్రకటించారు. మగ్దూమ్ భవన్ లో సీపీఎం, సీపీఐ సమన్వయసమావేశం సోమవారం జరిగింది. ప్రజాసమస్యలపై అన్ని వామపక్షాలను కలుపుకుని ఉద్యమాలు చేస్తామని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి ఈ సందర్భంగా చెప్పారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం లేదని విమర్శించారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు సెంటిమెంట్ ను అడ్డుపెట్టుకుంటున్నారని మండిపడ్డారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం నిజస్వరూపం బయటపడుతోందన్నారు. ఒబామా పర్యటనకు నిరసన వ్యక్తం చేస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement