
కరీంనగర్: జాతీయ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర అధికార ప్రతినిధిగా కరీంనగర్‌కు చెందిన డాక్టర్ అక్షితను నియమిస్తూ జాతీయ అధ్యక్షుడు అవ్వారు మల్లికార్జున్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కష్టపడేవారికి సరైన గుర్తింపు ఉంటుందని, సంఘం బలోపేతానికి పాటుపడుతున్న కరీంనగర్ జిల్లా అధ్యక్షురాలు అక్షిత సేవలను మరింతగా వినియోగించుకునేందుకు రాష్ట స్థాయి బాధ్యతలు అప్పగించినట్లు పేర్కొన్నారు.
తన నియామకానికి సహకరించిన జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్, రాష్ట్ర ఇన్‌చార్జి కాటా రాందాస్, అధ్యక్షుడు మాడ రాజా, గౌరవ అధ్యక్షులు తిరందాస్ వేణుగోపాల్, కోట దామోదర్, యువజన విభాగం అధ్యక్షుడు చిలివేరి రామకృష్ణ, మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు ఎలుబాక సుజాతలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment