జింఖానా, న్యూస్‌లైన్: భారత్ సీసీ జట్టు బౌలర్ తేజోధర్ (5/24) చక్కటి బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశాడు. దీంతో ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో భరత్ సీసీ 71 పరుగుల తేడాతో ఇంటర్నేషనల్ జట్టుపై నెగ్గింది. తొలుత భరత్ సీసీ 193 పరుగులకు ఆలౌటైంది.
తేజోధర్ 41, గణేశ్ 35, వికాస్ రావు 31 పరుగులు చేశారు. ఇంటర్నేషనల్ జట్టు బౌలర్ బాలకృష్ణ 4 వికెట్లు చేజిక్కించుకున్నాడు. తర్వాత ఇంటర్నేషనల్ జట్టు 122 పరుగులకే చేతులెత్తేసింది. అమిత్ (35) మినహా మిగిలిన వారు రాణించలేకపోయారు. భరత్ సీసీ బౌలర్ యశ్వంత్ 3 వికెట్లు తీసుకున్నాడు.
మరో మ్యాచ్‌లో ఎంపీ యంగ్‌మెన్ బ్యాట్స్‌మన్ శ్రీకాంత్ (103 నాటౌట్) సెంచరీతో అజేయంగా నిలవడంతో ఆ జట్టు 30 పరుగుల తేడాతో ఎంపీ స్పోర్టింగ్ జట్టుపై నెగ్గింది. తొలుత ఎంపీ యంగ్‌మెన్ 6 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. నితిన్ 39 పరుగులు చేశాడు. తర్వాత ఎంపీ స్పోర్టింగ్ 230 పరుగులు చేసి ఆలౌటైంది. చైతన్య (55), వినీత్ (56 నాటౌట్) అర్ధ సెంచరీతో చెలరేగాడు. ఎంపీ యంగ్‌మెన్ బౌలర్ అమృత్ 4 వికెట్లు పడగొట్టాడు.
ఇతర మ్యాచ్‌ల స్కోర్లు
అగర్వాల్ సీనియర్స్: 184 (ఫారుఖ్ 43, అజీమ్ 5/44); అపెక్స్ ఎలెవన్: 122 (బిపిన్ 4/12, షాకీర్ 3/25).
స్పోర్టివ్ సీసీ: 212 (రోషన్ శ్యామ్యూల్ 54, గణేశ్ 35, తరుణ్ 31; విద్యాసాగర్ 5/72, యోగేష్ మెహతా 4/54); ఆజాద్ సీసీ: 214/7 (సాయి చరణ్ 62 నాటౌట్, హుజేఫా 67; మురళీ మోహన్ 5/28).
సదరన్ స్టార్: 85 (నాగరాజు 3/20, నగేంద్ర కుమార్ 4/6); ఇన్‌కమ్ టాక్స్: 86/2 (సాయి లక్ష్మణ్ 39 నాటౌట్).
హెచ్‌పీఎస్: 257/5 (విఘ్నేశ్ 35, రాజా 111 నాటౌట్, యాదవ్ 63); లాల్ బహదూర్: 253 (పరమేశ్వర్ రెడ్డి 42, పవన్ కుమార్ 60; ధీరజ్ 3/32, గౌస్ బాబా 3/48).
చీర్‌ఫుల్ చమ్స్: 153 (రాజశేఖర్ 41, సందీప్ 31; ప్రేమ్ 5/38, సాయి కార్తీక్ 3/5); ఎస్‌ఎన్ గ్రూప్: 154/8 (ఫిరోజ్ 3/45, మధు 3/35).
యునెటైడ్ సీసీ: 187 (శ్రవణ్ 70; భార్గవ్ 4/50); గగన్‌మహల్: 89 (శ్రవణ్ 5/42, విక్రమ్ 4/30).
సఫిల్‌గూడ: 82 (ఆదిత్య 5/11); సెయింట్ ఆండ్రూస్: 87 (బౌమిక్ 44 నాటౌట్).
ఏపీ హైకోర్ట్: 161/4 (అనిల్ 71, అభిషేక్ 70; సూర్య కుమార్ 4/41); కెనరా బ్యాంక్: 79 (కుమార్ 35 నాటౌట్; చంద్రశేఖర్ 5/20).
తేజోధర్‌కు 5 వికెట్లు
Published Mon, Jan 13 2014 11:49 PM | Last Updated on Sat, Sep 2 2017 2:36 AM
Advertisement