హైదరాబాద్ పరాజయం
126 పరుగుల తేడాతో గుజరాత్ ఘనవిజయం
రాణించిన ప్రియజీత్‌సింగ్, రింకేశ్ వాఘేలా
సాక్షి, హైదరాబాద్: రంజీ ట్రోఫీ 2024-25 సీజన్‌ను హైదరాబాద్ జట్టు పరాజయంతో ప్రారంభించింది. బ్యాటర్ల వైఫల్యం కారణంగా కొత్త ఎడిషన్ ఆరంభ మ్యాచ్‌లోనే చేదు అనుభవం ఎదుర్కొంది.
కాగా హైదారాబాద్ గ్రూప్ ‘బి’ ఎలైట్ డివిజన్ తొలి రౌండ్ లీగ్ మ్యాచ్‌లో భాగంగా హైదరాబాద్ తొలుత.. మాజీ చాంపియన్ గుజరాత్‌తో తలపడింది. సికింద్రాబాద్‌లోని జింఖానా మైదానంలో సోమవారం ముగిసిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ 126 పరుగుల తేడాతో ఓడిపోయింది.
170 పరుగులకే
చివరిరోజు ఆటలో భాగంగా.. 297 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు 59.1 ఓవర్లలో 170 పరుగులకే కుప్పకూలింది.
ఓపెనర్ అభిరత్ రెడ్డి (59 బంతుల్లో 51; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకంతో ఆకట్టుకోగా... ఇతర బ్యాటర్లు క్రీజులో నిలదొక్కులేకపోయారు. గుజరాత్ బౌలర్లలో ప్రియజీత్‌సింగ్ జడేజా, రింకేశ్ వాఘేలా 3 వికెట్ల చొప్పున తీయగా... సిద్ధార్థ్ దేశాయ్, అర్జన్ నాగ్‌వాస్‌వలా 2 వికెట్ల చొప్పున పడగొట్టారు.
ఇక ఈ విజయంతో గుజరాత్‌కు 6 పాయింట్లు లభించాయి. గుజరాత్ బ్యాటర్ మనన్ హింగ్రాజియాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఈనెల 18 నుంచి డెహ్రాడూన్‌లో జరిగే తదుపరి మ్యాచ్‌లో ఉత్తరాఖండ్‌తో హైదరాబాద్ తలపడుతుంది.
స్కోరు వివరాలు
వేదిక: జింఖానా గ్రౌండ్, హైదరాబాద్
టాస్: గుజరాత్.. తొలుత బ్యాటింగ్
గుజరాత్ తొలి ఇన్నింగ్స్: 343
హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్: 248
గుజరాత్ రెండో ఇన్నింగ్స్: 201
హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్: 170
ఫలితం: హైదరాబాద్‌పై 126 పరుగుల తేడాతో గుజరాత్ విజయం
తన్మయ్ అగర్వాల్ (బి) అర్జన్ నాగ్‌వాస్‌వాలా 1; అభిరత్ రెడ్డి (సి) సిద్ధార్థ్ దేశాయ్ (బి) రింకేశ్ వాఘేలా 51; రాహుల్ సింగ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అర్జన్ నాగ్‌వాస్‌వాలా 0; రోహిత్ రాయుడు (బి) రింకేశ్ వాఘేలా 26; హిమతేజ (సి) రిషి పటేల్ (బి) ప్రియజీత్ సింగ్ 29; రాహుల్ రాధేశ్ (సి) ఉర్విల్ పటేల్ (బి) ప్రియజీత్ సింగ్ 17; తనయ్ త్యాగరాజన్ (సి) ఉరి్వల్ పటేల్ (బి) ప్రియజీత్ సింగ్ 1; సీవీ మిలింద్ (సి) ప్రియాంక్ పాంచాల్ (బి) సిద్ధార్థ్ దేశాయ్ 28; అనికేత్ రెడ్డి (సి) రిషి పటేల్ (బి) సిద్ధార్థ్ దేశాయ్ 2; రక్షణ్ రెడ్డి (సి) ప్రియాంక్ పాంచాల్ (బి) రింకేశ్ వాఘేలా 7; నిశాంత్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (59.1 ఓవర్లలో ఆలౌట్) 170. వికెట్ల పతనం: 1–12, 2–12, 3–76, 4–83, 5–127, 6–130, 7–133, 8–145, 9–170, 10–170. బౌలింగ్: సిద్ధార్థ్ దేశాయ్ 16.1–3–47–2, అర్జన్ నాగ్‌వాస్‌వాలా 12–4–28–2, చింతన్ గజా 9–3–16–0, ప్రియజీత్ సింగ్ జడేజా 10–1–23–3, రింకేశ్ వాఘేలా 12–2–52–3.
చదవండి: W T20 WC: కథ మళ్లీ మొదటికి...
Comments
Please login to add a commentAdd a comment