జింఖానా, న్యూస్‌లైన్: వరుణ్ గౌడ్ (109), రుత్విక్ (100 నాటౌట్) రాణించడంతో టిమ్‌కున్ జట్టుకు విజయం దక్కింది. ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 179 పరుగుల తేడాతో ఫ్యూచర్ స్టార్ జట్టుపై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమ్ కున్ జట్టు 5 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఫ్యూచర్ స్టార్ జట్టు 119 పరుగుల వద్ద కుప్పకూలింది.
టీమ్ కున్ జట్టు బౌలర్ అంకిత్ సింగ్ 5 వికెట్లు తీశాడు. మరో మ్యాచ్‌లో పాంథర్స్ ఎలెవన్ 10 వికెట్ల తేడాతో విజయ్ భారత్ జట్టుపై నెగ్గింది. మొదట బరిలోకి దిగిన విజయ్ భరత్ జట్టు 152 పరుగులు చేసింది. నరసింహ (41), రాజు (33) ఫర్వాలేదనిపించారు. షాజీల్ 6 వికెట్లు తీసి ప్రత్యర్ధి జట్టును కట్టడి చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పాంథర్స్ జట్టు వికెట్టు కోల్పోకుండా 155 పరుగులు చేసి గెలిచింది. జీషాన్ అలీ ఖాన్ 102 పరుగుల చేసి నాటౌట్‌గా నిలిచాడు.
అంతర్ జిల్లా రెండు రోజుల లీగ్ స్కోర్లు
వరంగల్ తొలి ఇన్నింగ్స్: 112, రెండో ఇన్నింగ్స్: 157 (సాయినాథ్ 37, ఫరూఖ్ 43; మజీదుద్దీన్ 6/29), నిజామాబాద్ తొలి ఇన్నింగ్స్: 253, రెండో ఇన్నింగ్స్: 17/0.
కరీంనగర్: 208 (కృష్ణారెడ్డి 34, కిషోర్ 35, శశి 42), ఆదిలాబాద్: 138 (సైఫ్ అలీ 39, రాజశేఖర్ రెడ్డి 52; కృష్ణారెడ్డి 3/29, షన్వాజ్ 4/40).
రాణించిన వరుణ్, రుత్విక్
Published Sat, Aug 31 2013 12:22 AM | Last Updated on Fri, Sep 1 2017 10:17 PM
Advertisement
Advertisement