varun goud
-
వరుణ్ గౌడ్ డబుల్ సెంచరీ
సాక్షి, హైదరాబాద్: కూచ్ బెహర్ ట్రోఫీ అండర్–19 క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్ బ్యాట్స్‌మన్ వరుణ్ గౌడ్ (263 బంతుల్లో 238; 38 ఫోర్లు) డబుల్ సెంచరీతో దుమ్మురేపాడు. వరుణ్‌తో పాటు బౌలింగ్‌లో అజయ్ దేవ్ గౌడ్ (5/26), సంకేత్ (5/59) చెలరేగడంతో హైదరాబాద్ గెలుపు ముంగిట నిలిచింది. ఉప్పల్ మైదానంలో ఏ అండ్ ఏ జట్టుతో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ బౌలర్లు ఒకేరోజు 14 వికెట్లు నేలకూల్చడం విశేషం. ఓవర్‌నైట్ స్కోరు 311/5తో రెండోరోజు సోమవారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన హైదరాబాద్ 129 ఓవర్లలో 7 వికెట్లకు 527 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. 114 పరుగుల వ్యక్తిగత స్కోరుతో ఆట ప్రారంభించిన వరుణ్ 245 బంతుల్లో ద్విశతకాన్ని సాధించాడు. అలంకృత్ (111 బంతుల్లో 51; 6 ఫోర్లు), టి. సంతోష్ గౌడ్ (59 బంతుల్లో 65; 4 ఫోర్లు, ఒక సిక్స్) అర్ధసెంచరీలతో రాణించారు. అలంకృత్తో కలిసి ఆరో వికెట్‌కు 157 పరుగుల్ని జోడించిన వరుణ్, సంతోష్ గౌడ్‌తో కలిసి ఏడో వికెట్‌కు 145 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ప్రత్యర్థి బౌలర్లలో అల్ఫ్రెడ్ 2 వికెట్లు పడగొట్టగా, సాబీర్ ఖాన్, అభిషేక్ ఆనంద్, తహ్మీద్ తలా వికెట్ తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ బరిలోకి దిగిన ఏ అండ్ ఏ జట్టు 33.3 ఓవర్లలో 130 పరుగులకే కుప్పకూలింది. దీంతో హైదరాబాద్‌కు 497 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అభిషేక్ ఆనంద్ (54; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), సోను కుమార్ గుప్తా (30; 4 ఫోర్లు) ఆకట్టుకున్నారు. తర్వాత ఫాలోఆన్ ఆడుతూ రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన ఏ అండ్ ఏ జట్టు ఆట ముగిసే సమయానికి 13 ఓవర్లలో 4 వికెట్లకు 22 పరుగులతో నిలిచింది. హైదరాబాద్ బౌలర్ అజయ్ దేవ్ గౌడ్ (4/10) ధాటికి నలుగురు బ్యాట్స్‌మెన్ డకౌట్గానే పెవిలియన్ చేరారు. -
మృత్యుంజయుడు వరుణ్
హైదరాబాద్: మాసాయిపేట వద్ద స్కూలు బస్సును రైలు ఢీకొన్న ప్రమాదంలో గాయపడి సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థి వరుణ్‌గౌడ్(7) పూర్తిగా కోలుకోవడంతో వైద్యులు గురువారం డిశ్చార్జి చేశారు. ఈ ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చేరిన 18 మంది విద్యార్థులు పూర్తిగా కోలుకోగా గతంలోనే వైద్యులు వారిని ఇంటికి పంపారు. గురువారం ఆస్పత్రి మెడికల్ డెరైక్టర్ డాక్టర్ లింగయ్య చికిత్స వివరాలను వెల్లడించారు. దుర్ఘటనలో మృత్యువు అంచులదాకా వెళ్లి వరుణ్‌గౌడ్ బతికి బయటపడ్డాడు. ప్రమాదంలో తల, ఛాతి, ఎడమ ఊపిరి తిత్తి కింది భాగంలోనూ తీవ్ర గాయాలయ్యాయి. దీంతో కోలుకోవడం చాలా కష్టమని వైద్యులు కూడా భావించారు. నాటి నుంచి 30 రోజుల పాటు వెంటిలేటర్‌పై ఉన్నాడు. వైద్యులు తల, ఊపిరితిత్తులకు శస్త్ర చికిత్సలు చేశారు. కాలుకు గాయం కావడంతో అక్కడా శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతం వరుణ్‌గౌడ్ మాట్లాడుతున్నా ఇంటి పరిసరాలకు వెళితే అక్కడి వాతావరణానికి పూర్తిగా కోలుకుంటాడని వైద్యులు తెలిపారు. ఒక బిడ్డను కోల్పోయి.. మరుణ్ తల్లిదండ్రులు మల్లాగౌడ్, లతలకు ముగ్గరు సంతానం. వీరిలో రుచితగౌడ్, వరుణ్‌గౌడ్, శృతి ఉన్నారు. ఒకే స్కూల్లో చదువుతున్న వీరిలో ప్రమాదం జరిగిన చోటే శృతి ప్రాణాలు కోల్పోగా.. రుచిత గౌడ్ కొద్ది రోజుల్లోనే కోలుకుంది. ఒక బిడ్డను కోల్పోయి ఇద్దరు బిడ్డలు ఆస్పత్రిలో చికిత్స పొందుతుంటే కన్నవారు తల్లడిల్లి పోయారు. ఎట్టకేలకు పూర్తి ఆరోగ్యంతో వరుణ్ బయటపడటంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు. వైద్యులు, ప్రభుత్వం కృషితోనే.. గతంలో డిశ్చార్జ్ అయిన సాయిరాం, రుచిత, నబీరా ఫాతిమా, కరుణాకర్, అభినందు, త్రిశ, శ్రావణిలు గురువారం పరీక్షలకు ఆస్పత్రి వచ్చారు. ఈ సందర్భంగా చిన్నారులతో పాటు వారి తల్లిదండ్రులు మాట్లాడుతూ వైద్యులు అందించిన సేవలు మరువలేనివన్నారు. అలాగే ప్రభుత్వం కూడా అన్ని విధాలా సహకరించిందని, తమ బిడ్డలు క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ చంద్రశేఖర్, డాక్టర్లు మురళీ మోహన్‌రెడ్డి, డాక్టర్ కార్తీక్, డాక్టర్ బీజే రాజేష్ తదితరులు పాల్గొన్నారు. -
రాణించిన వరుణ్, రుత్విక్
జింఖానా, న్యూస్‌లైన్: వరుణ్ గౌడ్ (109), రుత్విక్ (100 నాటౌట్) రాణించడంతో టిమ్కున్ జట్టుకు విజయం దక్కింది. ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 179 పరుగుల తేడాతో ఫ్యూచర్ స్టార్ జట్టుపై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమ్ కున్ జట్టు 5 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఫ్యూచర్ స్టార్ జట్టు 119 పరుగుల వద్ద కుప్పకూలింది. టీమ్ కున్ జట్టు బౌలర్ అంకిత్ సింగ్ 5 వికెట్లు తీశాడు. మరో మ్యాచ్‌లో పాంథర్స్ ఎలెవన్ 10 వికెట్ల తేడాతో విజయ్ భారత్ జట్టుపై నెగ్గింది. మొదట బరిలోకి దిగిన విజయ్ భరత్ జట్టు 152 పరుగులు చేసింది. నరసింహ (41), రాజు (33) ఫర్వాలేదనిపించారు. షాజీల్ 6 వికెట్లు తీసి ప్రత్యర్ధి జట్టును కట్టడి చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పాంథర్స్ జట్టు వికెట్టు కోల్పోకుండా 155 పరుగులు చేసి గెలిచింది. జీషాన్ అలీ ఖాన్ 102 పరుగుల చేసి నాటౌట్‌గా నిలిచాడు. అంతర్ జిల్లా రెండు రోజుల లీగ్ స్కోర్లు వరంగల్ తొలి ఇన్నింగ్స్: 112, రెండో ఇన్నింగ్స్: 157 (సాయినాథ్ 37, ఫరూఖ్ 43; మజీదుద్దీన్ 6/29), నిజామాబాద్ తొలి ఇన్నింగ్స్: 253, రెండో ఇన్నింగ్స్: 17/0. కరీంనగర్: 208 (కృష్ణారెడ్డి 34, కిషోర్ 35, శశి 42), ఆదిలాబాద్: 138 (సైఫ్ అలీ 39, రాజశేఖర్ రెడ్డి 52; కృష్ణారెడ్డి 3/29, షన్వాజ్ 4/40). -
రాణించిన వరుణ్, రుత్విక్
జింఖానా, న్యూస్‌లైన్: వరుణ్ గౌడ్ (109), రుత్విక్ (100 నాటౌట్) రాణించడంతో టిమ్కున్ జట్టుకు విజయం దక్కింది. ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 179 పరుగుల తేడాతో ఫ్యూచర్ స్టార్ జట్టుపై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమ్ కున్ జట్టు 5 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఫ్యూచర్ స్టార్ జట్టు 119 పరుగుల వద్ద కుప్పకూలింది. టీమ్ కున్ జట్టు బౌలర్ అంకిత్ సింగ్ 5 వికెట్లు తీశాడు. మరో మ్యాచ్‌లో పాంథర్స్ ఎలెవన్ 10 వికెట్ల తేడాతో విజయ్ భారత్ జట్టుపై నెగ్గింది. మొదట బరిలోకి దిగిన విజయ్ భరత్ జట్టు 152 పరుగులు చేసింది. నరసింహ (41), రాజు (33) ఫర్వాలేదనిపించారు. షాజీల్ 6 వికెట్లు తీసి ప్రత్యర్ధి జట్టును కట్టడి చేశాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పాంథర్స్ జట్టు వికెట్టు కోల్పోకుండా 155 పరుగులు చేసి గెలిచింది. జీషాన్ అలీ ఖాన్ 102 పరుగుల చేసి నాటౌట్‌గా నిలిచాడు. అంతర్ జిల్లా రెండు రోజుల లీగ్ స్కోర్లు వరంగల్ తొలి ఇన్నింగ్స్: 112, రెండో ఇన్నింగ్స్: 157 (సాయినాథ్ 37, ఫరూఖ్ 43; మజీదుద్దీన్ 6/29), నిజామాబాద్ తొలి ఇన్నింగ్స్: 253, రెండో ఇన్నింగ్స్: 17/0. కరీంనగర్: 208 (కృష్ణారెడ్డి 34, కిషోర్ 35, శశి 42), ఆదిలాబాద్: 138 (సైఫ్ అలీ 39, రాజశేఖర్ రెడ్డి 52; కృష్ణారెడ్డి 3/29, షన్వాజ్ 4/40).