సాక్షి, హైదరాబాద్: కీలక సమయంలో ఆరు వికెట్లు తీసిన అశ్విన్ మన్నే... ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో తిరుమల జట్టుకు చక్కని విజయాన్ని అందించాడు. దీంతో మంగళవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో తిరుమల జట్టు 98 పరుగుల భారీ తేడాతో ఎస్.రేమండ్స్ టీమ్‌పై నెగ్గింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన తిరుమల జట్టు 219 పరుగులు చేసింది. పవన్ (90), సారథి (64) రాణించారు. రేమండ్స్ బౌలర్ అరుణ్ 5 వికెట్లు తీశాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన రేమండ్స్ జట్టు 121 పరుగులకే కుప్పకూలింది.
అశోక్ (44), విఘ్నేశ్ (33 నాటౌట్) ఓ మోస్తరుగా ఆడారు. అశ్విన్ దెబ్బకు మిగతా వారు విఫలమయ్యారు. మరో మ్యాచ్‌లో అషీర్ (6/30) చెలరేగడంతో అభివన్ కోల్ట్స్... 3 పరుగుల స్వల్ప తేడాతో ఎస్‌యూసీసీపై గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన అభినవ్ కోల్ట్స్ 148 పరుగులు చేసింది. ప్రణీత్ (31) ఫర్వాలేదనిపించాడు. నవీద్‌కు 4 వికెట్లు దక్కాయి. తర్వాత ఎస్‌యూసీసీ 145 పరుగులకు పరిమితమైంది. మన్సూర్ (40), జీషాన్ (30) శ్రమ వృథా అయ్యింది.
ఇతర మ్యాచ్‌ల స్కోరు వివరాలు
షాలిమర్: 249/7 (శాంతన్ రెడ్డి 32, పవన్ 33, కృష్ణ ప్రసాద్ 51); రిలయన్స్: 55 (అక్షయ్ 4/17, వినీత్ 3/9).
పీకేసీసీ: 92 (కుమార్ 33); గౌలిపురా: 94/5 (విష్ణువర్ధన్ 30).
యూత్: 127 (వెంకట్ రెడ్డి 42, శ్రీనాథ్ 3/24, జితేశ్ 3/10); ఎల్‌ఎన్‌సీసీ: 98 (ముఖీత్ అహ్మద్ 3/31).
గ్రీన్‌ల్యాండ్స్: 265 (సుందర్ 34, ప్రత్యూష్ 51, కిరణ్ 61, మహేందర్ 5/75); కన్సల్ట్స్: 97 (శ్రీ చరణ్ 3/32, ప్రత్యూష్ 4/38).
సదరన్ స్టార్: 244 (హర్షిత్ 73, విజయ్ 51, వరుణ్ 30, రుద్రా అత్రి 6/69); చీర్‌ఫుల్ చార్మ్స్: 79 (కృష్ణ 5/31, వినోద్ 4/48).
భారతీయ: 158 (బాబు 78); డబ్ల్యూమ్‌సీసీ: 159/3 (సుశీల్ 83, వీవీవీఎస్ సాయిచరణ్ 38 నాటౌట్).
టైమ్ సీసీ: 297 (సవన్ 33, సంజీవ్ 39, కోటి రెడ్డి 82, చందు 49, బిందు 5/66); లక్కీ ఎలెవన్: 96 (ఫణి 43, కోటి రెడ్డి 4/24).
సికింద్రాబాద్ క్లబ్: 201/9 (దీపేందర్ 59, అక్షత్ 42, మోషిన్ 3/30); రుషి రాజ్: 169 (మోషిన్ 40, హసన్ 41, అక్షత్ 3/49).
భరత్ సీసీ: 171/7 (వికాస్ 42, తేజోదర్ రావు 44); సత్యం కోల్ట్స్: 127 (చందు 43, సోహన్ 3/39, గణేశ్ 3/28, హర్షవర్ధన్ 3/11).
మయూర్: 225 (అనంత్ 44, షరీఫ్ 3/44); యంగ్ మాస్టర్: 183 (షహజతుల్లా 36, ఇబ్రహీం 42).
మహావీర్: 132 (దీపక్ 30, షకీల్ 3/35, అజ్మత్ 5/37); బాయ్స్‌టౌన్: 135/2 (ఖురేషి 50, దూబే 32).
విజయానంద్: 131 (అవినాశ్ 34, కరీమ్ 30, భాను 3/18); ఎంఎల్ జైసింహా: 123 (నీరజ్ 55, యాది రెడ్డి 4/6).
అశ్విన్‌కు ఆరు వికెట్లు
Published Wed, Oct 23 2013 12:09 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement