అశ్విన్‌కు 4 వికెట్లు
ఎ1-డివిజన్ 3 రోజుల లీగ్
సాక్షి, హైదరాబాద్: కాంటినెంటల్ బ్యాట్స్‌మెన్‌పై ఎస్‌బీహెచ్ బౌలర్లు సమష్టిగా విజృంభించారు. దీంతో ఎ1-డివిజన్ మూడు రోజుల లీగ్‌లో ఆట మొదటి రోజే కాంటినెంటల్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 182 పరుగులకే ఆలౌటైంది. అర్జున్ (74 బంతుల్లో 52, 8 ఫోర్లు) అర్ధసెంచరీతో రాణించాడు.
చందన్ సహాని 40 పరుగులు చేశాడు. మిగతా బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. ఎస్‌బీహెచ్ బౌలర్లలో అశ్విన్ యాదవ్ 46 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. డానియెల్ మనోహర్, ఆకాశ్ భండారి చెరో 2 వికెట్లు పడగొట్టారు. తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఎస్‌బీహెచ్ ఆట ముగిసే సమయానికి 47 ఓవర్లలో 3 వికెట్లకు 163 పరుగులు చేసింది. డాని డెరెక్ ప్రిన్స్ (95 బంతుల్లో 70, 11 ఫోర్లు) ఆకట్టుకున్నాడు. అహ్మద్ ఖాద్రీ (46 బ్యాటింగ్), ఆకాశ్ భండారి (30 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
ఇతర మ్యాచ్‌ల స్కోర్లు
ఫలక్‌నుమా తొలి ఇన్నింగ్స్: 256/9 (సిద్ధు 107; కనిష్క్ నాయుడు 5/51, అమోల్ షిండే 4/61) ఆంధ్రాబ్యాంక్‌తో మ్యాచ్
ఈఎంసీసీ తొలి ఇన్నింగ్స్: 118/7 (రవి తేజ 38, శరత్ 32; అన్వర్ అహ్మద్ 3/28, అనిరుధ్ 3/56), హైదరాబాద్ బాట్లింగ్‌తో మ్యాచ్ ఎన్స్‌కాన్స్ తొలి ఇన్నింగ్స్: 276/1 (రేయాన్ అమూరి 133 బ్యాటింగ్, ఇబ్రహీం ఖలీల్ 85 బ్యాటింగ్, అరుణ్ దేవా 53), ఎంపీ కోల్ట్స్‌తో మ్యాచ్ ఆర్.దయానంద్ తొలి ఇన్నింగ్స్: 199/5 (నిమీశ్ 72, నితీశ్ 41), డెక్కన్ క్రానికల్‌తో మ్యాచ్ ఎస్‌సీ రైల్వే తొలి ఇన్నింగ్స్ 104/4 (హరీశ్ 2/39), కేంబ్రిడ్జ్ ఎలెవన్‌తో మ్యాచ్.
కాంటినెంటల్ 182 ఆలౌట్
Published Tue, Aug 5 2014 11:58 PM | Last Updated on Tue, Mar 19 2019 9:20 PM
Advertisement