జింఖానా, న్యూస్‌లైన్: ఐటీఎఫ్ జూనియర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి ప్రాంజల క్వార్టర్ ఫైనల్లో గెలిచి సెమీస్‌కు చేరుకుంది. ఎల్.బి స్టేడియంలోని ‘శాప్’ కాంప్లెక్స్‌లో గురువారం జరిగిన అండర్-18 బాలికల సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో రెండో సీడ్ ప్రాంజల 2-6, 6-3, 6-0తో 10వ సీడ్ ఓజస్వినీ సింగ్‌పై విజయం సాధించింది.
మూడో సీడ్ యా తింగ్ చాంగ్ (చైనీస్ తైపీ) 6-2, 7-5తో ఆరో సీడ్ వాసంతీ షిండేపై, ఐదో సీడ్ రియా వైద్యా 6-1, 6-1తో 16వ సీడ్ దేవన్షి జి భయామనిపై గెలుపొందారు. టాప్ సీడ్ స్నేహదేవి రెడ్డి 6-3, 6-0తో 11వ సీడ్ ప్రియాంక సుందర్‌పై అలవోకగా గెలిచింది. అండర్-18 బాలుర సింగిల్స్ క్వార్టర్స్‌లో టాప్ సీడ్ గార్విత్ బట్రా 6-3, 6-2తో నిక్షేప్ బల్కరే రవికుమార్‌పై నెగ్గి సెమీస్‌కు చేరుకున్నాడు. మూడో సీడ్ యై వీ హాంగ్ (చైనీస్ తైపీ) 6-4, 6-2తో చింగ్ హాంగ్ త్సాయ్ (చైనీస్ తైపీ)పై, 10వ సీడ్ హర్దీప్ సింగ్ సందూ 4-6, 6-2, 6-2తో నాల్గో సీడ్ చంగ్ ఉలూ (చైనీస్ తైపీ)పై గెలవగా, ఏడో సీడ్ ఆర్యన్ గోవీస్ 4-6, 6-2, 7-6తో 14వ సీడ్ షావ్‌ఫాన్ లూయి (చైనీస్ తైపీ) ైపై విజయం సాధించారు.
అండర్-18 బాలుర డబుల్స్ ఫలితాలు
హన యు చెన్-చింగ్ హాంగ్ త్సాయ్ (చైనీస్ తైపీ) 7-6, 7-5తో ఆదిత్య దేశ్వాల్-హర్దీప్ సింగ్ సందూపై, గార్విట్ బాట్రా-షోకి కషారా 6-4, 6-0తో సింగ్ బాజ్వా-మయూఖ్ రావత్‌పై, షావ్ ఫాన్ లూయి- యుట్సెట్సౌ (చైనీస్ తైపీ) 6-2, 6-3తో సాహిల్ ఘవారె- ఆర్యన్ గోవీస్‌పై, బాసిల్ ఖుమా- దీపక్ విశ్వకర్మ 7-5, 6-1తో యై వీ హాంగ్- చాంగ్ ఉలూ (చైనీస్ తైపీ)పై నెగ్గారు.
అండర్-18 బాలికల డబుల్స్ ఫలితాలు
స్నేహదేవి రెడ్డి- ధృతి తతచార్ 6-0, 6-3తో జీల్ దేశాయ్-స్నేహల్ మానెపై, యా టింగ్ చాంగ్-జు హుయ్ చెన్ (చైనీస్ తైపీ) 4-6, 6-4తో ఇస్కా అక్షర-వాసంతి షిండేపై, ఓజస్వినీ సింగ్-కర్మాన్ కౌర్ 6-2, 6-3తో దేవన్షి భిమ్‌జియాని-నందిని శర్మపై గెలుపొందారు.
సెమీస్‌లో ప్రాంజల
Published Fri, Sep 6 2013 12:02 AM | Last Updated on Fri, Sep 1 2017 10:28 PM
Advertisement