junnior tennis tournment
-
భారత్‌లో వింబుల్డన్!
న్యూఢిల్లీ: వింబుల్డన్ జూనియర్ టెన్నిస్ టోర్నమెంట్‌కు భారత్ ఆతిథ్యమివ్వనుంది. వింబుల్డన్‌కు సంబంధించిన ఓ టోర్నీని ఇంగ్లండ్ వెలుపల నిర్వహించనుండటం ఇదే తొలిసారి. ఇలాంటి అవకాశం భారత్‌కు లభించడం పట్ల ఏఐటీఏ వర్గాలు ఉబ్బితబ్బిబ్బవుతున్నాయి. ఈ నెలలో ఇక్కడికి రానున్న ప్రపంచ మాజీ నాలుగో ర్యాంకు ఆటగాడు టిమ్ హెన్మన్ ఢిల్లీ, ముంబై నగరాల్లో ‘రోడ్ టు వింబుల్డన్’కు శ్రీకారం చుడతారు. అండర్-14 బాల,బాలికలకు కోచింగ్ క్లినిక్స్, ఈవెంట్లు నిర్వహించి ఇందులో రాణించిన వారిలో 16 మంది బాలబాలికలను ఎంపిక చేస్తారు. వీరికి ఒక టోర్నమెంట్‌ను ఏప్రిల్ నెలలో ఢిల్లీలో నిర్వహిస్తారు. ఇందులో విభాగానికి ఇద్దరేసి ఫైనలిస్టులకు వింబుల్డన్ జూనియర్ ప్రధాన టోర్నీలో అవకాశం ఇస్తారు. -
సాత్విక డబుల్ ధమాకా
జింఖానా, న్యూస్‌లైన్: న్యూట్రిలైట్ ఆసియా అండర్-14 జూనియర్ టెన్నిస్ టోర్నీలో బాలికల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో టాప్ సీడ్ సామ సాత్విక టైటిల్ కైవసం చేసుకుంది. ఎల్బీ స్టేడియంలోని శాప్ టెన్నిస్ కాంప్లెక్స్‌లో జరిగిన బాలికల సింగిల్స్ ఫైనల్స్‌లో సాత్విక 6-4, 6-4తో రెండో సీడ్ శివానిపై నెగ్గింది. అలాగే డబుల్స్ విభాగంలో సాత్విక-శివాని జోడి 6-2, 6-0తో శ్రావ్య శ్రీవాణి-శివన్య జోడిపై నెగ్గి సత్తా చాటింది. బాలుర సింగిల్స్‌లో శ్రీవత్స రాతకొండ విజేతగా నిలిచాడు. శ్రీవత్స రాతకొండ 6-3, 3-6, 6-4తో టాప్ సీడ్ ఆదిల్ కళ్యాణ్పూర్పై విజయం సాధించాడు. విజేతలకు రిటైర్డ్ ఇన్‌కం టాక్స్ ఆఫీసర్ సుధాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ లాన్ టెన్నిస్ సంఘం కార్యదర్శి అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మూడో రౌండ్లో సాత్విక
జింఖానా, న్యూస్‌లైన్: ఆసియా అండర్-14 జూనియర్ టెన్నిస్ టోర్నీలో టాప్ సీడ్ సామ సాత్విక మూడో రౌండ్లోకి ప్రవేశించింది. ఎల్బీ స్టేడియంలోని శాప్ టెన్నిస్ కాంప్లెక్స్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో బాలికల రెండో రౌండ్లో సాత్విక 6-1, 6-0తో భవ్య రామినేనిపై విజయం సాధించింది. తనతో పాటు రెండో సీడ్ శివాని 6-2, 6-3తో మిరికా జైస్వాల్‌పై నెగ్గి మూడో రౌండ్‌కు అర్హత సాధించింది. ఐదో సీడ్ మెహక్ జైన్ 6-3, 6-4తో జువేరియా ఫాతిమాపై, నాలుగో సీడ్ ఆర్జా చక్రవర్తి 6-3, 6-2తో అమినేని శివానిపై, శ్రీవల్లి 6-1, 6-4తో ఎనిమిదో సీడ్ ప్రింకిల్ సింగ్‌పై, ఏడో సీడ్ శివానుజ 6-1, 6-3తో సాన్యా సింగ్‌పై, షాజిహా బేగం 5-7, 6-2, 6-4తో షేక్ తహూరపై, హర్షసాయి 6-3, 6-0తో ప్రత్యూషపై గెలిచారు. బాలుర విభాగంలో రెండో సీడ్ యావిన్ సాల్మన్ మూడో రౌండ్లోకి దూసుకెళ్లాడు. రెండో రౌండ్లో యావిన్ 7-6, 6-1, 6-2తో తీర్థ శశాంక్‌పై గెలుపొందాడు. అదిల్ కళ్యాణ్పూర్ 6-1, 6-3తో రిత్విక్‌పై, గౌరవ్ 6-3, 6-3తో అతీఫ్ షేక్‌పై, మూడో సీడ్ ప్రకృత్ కార్తీక్ పటేల్ 6-4, 6-3తో సాయి కార్తీక్ రెడ్డిపై, తుషార్ శర్మ 2-6, 7-6, 7-6తో ఆదిత్యపై, శ్రీవత్స రాతకొండ 6-1, 6-7, 6-2తో రోహిత్‌పై, ప్రలోక్ ఇక్కుర్తి 5-7, 6-3, 6-2తో దుర్గా హిమకేశ్పై, నాలుగో సీడ్ ఎస్ఎం ఆదిత్య 6-1, 6-2తో అమన్ అయూబ్ ఖాన్‌పై నెగ్గారు. -
సెమీస్‌లో ప్రాంజల
జింఖానా, న్యూస్‌లైన్: ఐటీఎఫ్ జూనియర్ టెన్నిస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి ప్రాంజల క్వార్టర్ ఫైనల్లో గెలిచి సెమీస్‌కు చేరుకుంది. ఎల్.బి స్టేడియంలోని ‘శాప్’ కాంప్లెక్స్‌లో గురువారం జరిగిన అండర్-18 బాలికల సింగిల్స్ క్వార్టర్ఫైనల్లో రెండో సీడ్ ప్రాంజల 2-6, 6-3, 6-0తో 10వ సీడ్ ఓజస్వినీ సింగ్‌పై విజయం సాధించింది. మూడో సీడ్ యా తింగ్ చాంగ్ (చైనీస్ తైపీ) 6-2, 7-5తో ఆరో సీడ్ వాసంతీ షిండేపై, ఐదో సీడ్ రియా వైద్యా 6-1, 6-1తో 16వ సీడ్ దేవన్షి జి భయామనిపై గెలుపొందారు. టాప్ సీడ్ స్నేహదేవి రెడ్డి 6-3, 6-0తో 11వ సీడ్ ప్రియాంక సుందర్‌పై అలవోకగా గెలిచింది. అండర్-18 బాలుర సింగిల్స్ క్వార్టర్స్‌లో టాప్ సీడ్ గార్విత్ బట్రా 6-3, 6-2తో నిక్షేప్ బల్కరే రవికుమార్‌పై నెగ్గి సెమీస్‌కు చేరుకున్నాడు. మూడో సీడ్ యై వీ హాంగ్ (చైనీస్ తైపీ) 6-4, 6-2తో చింగ్ హాంగ్ త్సాయ్ (చైనీస్ తైపీ)పై, 10వ సీడ్ హర్దీప్ సింగ్ సందూ 4-6, 6-2, 6-2తో నాల్గో సీడ్ చంగ్ ఉలూ (చైనీస్ తైపీ)పై గెలవగా, ఏడో సీడ్ ఆర్యన్ గోవీస్ 4-6, 6-2, 7-6తో 14వ సీడ్ షావ్ఫాన్ లూయి (చైనీస్ తైపీ) ైపై విజయం సాధించారు. అండర్-18 బాలుర డబుల్స్ ఫలితాలు హన యు చెన్-చింగ్ హాంగ్ త్సాయ్ (చైనీస్ తైపీ) 7-6, 7-5తో ఆదిత్య దేశ్వాల్-హర్దీప్ సింగ్ సందూపై, గార్విట్ బాట్రా-షోకి కషారా 6-4, 6-0తో సింగ్ బాజ్వా-మయూఖ్ రావత్‌పై, షావ్ ఫాన్ లూయి- యుట్సెట్సౌ (చైనీస్ తైపీ) 6-2, 6-3తో సాహిల్ ఘవారె- ఆర్యన్ గోవీస్పై, బాసిల్ ఖుమా- దీపక్ విశ్వకర్మ 7-5, 6-1తో యై వీ హాంగ్- చాంగ్ ఉలూ (చైనీస్ తైపీ)పై నెగ్గారు. అండర్-18 బాలికల డబుల్స్ ఫలితాలు స్నేహదేవి రెడ్డి- ధృతి తతచార్ 6-0, 6-3తో జీల్ దేశాయ్-స్నేహల్ మానెపై, యా టింగ్ చాంగ్-జు హుయ్ చెన్ (చైనీస్ తైపీ) 4-6, 6-4తో ఇస్కా అక్షర-వాసంతి షిండేపై, ఓజస్వినీ సింగ్-కర్మాన్ కౌర్ 6-2, 6-3తో దేవన్షి భిమ్జియాని-నందిని శర్మపై గెలుపొందారు.