జింఖానా, న్యూస్‌లైన్: న్యూట్రిలైట్ ఆసియా అండర్-14 జూనియర్ టెన్నిస్ టోర్నీలో బాలికల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో టాప్ సీడ్ సామ సాత్విక టైటిల్ కైవసం చేసుకుంది. ఎల్బీ స్టేడియంలోని శాప్ టెన్నిస్ కాంప్లెక్స్‌లో జరిగిన బాలికల సింగిల్స్ ఫైనల్స్‌లో సాత్విక 6-4, 6-4తో రెండో సీడ్ శివానిపై నెగ్గింది.
అలాగే డబుల్స్ విభాగంలో సాత్విక-శివాని జోడి 6-2, 6-0తో శ్రావ్య శ్రీవాణి-శివన్య జోడిపై నెగ్గి సత్తా చాటింది. బాలుర సింగిల్స్‌లో శ్రీవత్స రాతకొండ విజేతగా నిలిచాడు. శ్రీవత్స రాతకొండ 6-3, 3-6, 6-4తో టాప్ సీడ్ ఆదిల్ కళ్యాణ్‌పూర్‌పై విజయం సాధించాడు. విజేతలకు రిటైర్డ్ ఇన్‌కం టాక్స్ ఆఫీసర్ సుధాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ లాన్ టెన్నిస్ సంఘం కార్యదర్శి అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సాత్విక డబుల్ ధమాకా
Published Sat, Nov 2 2013 1:47 AM | Last Updated on Sat, Sep 2 2017 12:12 AM
Advertisement
Advertisement