న్యూఢిల్లీ: వింబుల్డన్ జూనియర్ టెన్నిస్ టోర్నమెంట్‌కు భారత్ ఆతిథ్యమివ్వనుంది. వింబుల్డన్‌కు సంబంధించిన ఓ టోర్నీని ఇంగ్లండ్ వెలుపల నిర్వహించనుండటం ఇదే తొలిసారి. ఇలాంటి అవకాశం భారత్‌కు లభించడం పట్ల ఏఐటీఏ వర్గాలు ఉబ్బితబ్బిబ్బవుతున్నాయి. ఈ నెలలో ఇక్కడికి రానున్న ప్రపంచ మాజీ నాలుగో ర్యాంకు ఆటగాడు టిమ్ హెన్‌మన్ ఢిల్లీ, ముంబై నగరాల్లో ‘రోడ్ టు వింబుల్డన్’కు శ్రీకారం చుడతారు.
అండర్-14 బాల,బాలికలకు కోచింగ్ క్లినిక్స్, ఈవెంట్లు నిర్వహించి ఇందులో రాణించిన వారిలో 16 మంది బాలబాలికలను ఎంపిక చేస్తారు. వీరికి ఒక టోర్నమెంట్‌ను ఏప్రిల్ నెలలో ఢిల్లీలో నిర్వహిస్తారు. ఇందులో విభాగానికి ఇద్దరేసి ఫైనలిస్టులకు వింబుల్డన్ జూనియర్ ప్రధాన టోర్నీలో అవకాశం ఇస్తారు.
భారత్‌లో వింబుల్డన్!
Published Fri, Jan 3 2014 1:14 AM | Last Updated on Sat, Sep 2 2017 2:13 AM
Advertisement