Girls Singles
-
క్వార్టర్ ఫైనల్లో శ్రీవల్లి రష్మిక
సాక్షి, హైదరాబాద్ : తెలుగమ్మాయి శ్రీవల్లి రష్మిక ‘ఐటా’ జాతీయ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్లో సత్తాచాటుతోంది. అహ్మదాబాద్‌లో జరుగుతున్న ఈ జూనియర్ టెన్నిస్ టోర్నీలో ఆమె క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన అండర్-14 బాలికల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఆమె 5-4 (5/2), 4-2తో మేఘారాయ్పై విజయం సాధించింది. బాలుర అండర్-16 సింగిల్స్ విభాగంలో తెలంగాణ కుర్రాడు శ్రీవత్స రాచకొండ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. అండర్-14 ప్రిక్వార్టర్స్‌లో రిత్విక్ చౌదరి (తెలంగాణ) 4-1, 4-1తో కుషాన్ షాపై గెలుపొందగా, అండర్-16 విభాగంలో శ్రీవత్స రాచకొండ 4-1, 4-1తో అతర్వ శర్మపై, ఎ.కె.రోహిత్ (తెలంగాణ) 2-4, 5-4, 4-2తో డానిష్ అహ్మద్‌పై గెలుపొందారు. -
సాత్విక డబుల్ ధమాకా
జింఖానా, న్యూస్‌లైన్: న్యూట్రిలైట్ ఆసియా అండర్-14 జూనియర్ టెన్నిస్ టోర్నీలో బాలికల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో టాప్ సీడ్ సామ సాత్విక టైటిల్ కైవసం చేసుకుంది. ఎల్బీ స్టేడియంలోని శాప్ టెన్నిస్ కాంప్లెక్స్‌లో జరిగిన బాలికల సింగిల్స్ ఫైనల్స్‌లో సాత్విక 6-4, 6-4తో రెండో సీడ్ శివానిపై నెగ్గింది. అలాగే డబుల్స్ విభాగంలో సాత్విక-శివాని జోడి 6-2, 6-0తో శ్రావ్య శ్రీవాణి-శివన్య జోడిపై నెగ్గి సత్తా చాటింది. బాలుర సింగిల్స్‌లో శ్రీవత్స రాతకొండ విజేతగా నిలిచాడు. శ్రీవత్స రాతకొండ 6-3, 3-6, 6-4తో టాప్ సీడ్ ఆదిల్ కళ్యాణ్పూర్పై విజయం సాధించాడు. విజేతలకు రిటైర్డ్ ఇన్‌కం టాక్స్ ఆఫీసర్ సుధాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ లాన్ టెన్నిస్ సంఘం కార్యదర్శి అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
సెమీస్‌లో సాత్విక
జింఖానా, న్యూస్‌లైన్: ఆంధ్రప్రదేశ్ అమ్మాయి, టాప్ సీడ్ సామ సాత్విక ఆసియా అండర్-14 జూనియర్ టెన్నిస్ టోర్నీలో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఎల్బీ స్టేడియంలోని శాప్ కాంప్లెక్స్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో బాలికల సింగిల్స్ విభాగంలో ఆమె 6-1, 6-1తో ఐదో సీడ్ మెహక్ జైన్‌పై విజయం సాధించింది. రెండో సీడ్ శివాని ఇంగిల్ 3-6, 6-4, 6-2తో చల్లా హర్షసాయిపై నెగ్గి సెమీస్‌కు అర్హత సాధించింది. ఎనిమిదో సీడ్ ప్రింకిల్ సింగ్ 7-5, 7-5తో నాలుగో సీడ్ ఆర్జా చక్రబర్తిపై, శివానుజ 6-4, 4-6, 6-2తో షాజియా బేగంపై నెగ్గారు. బాలుర సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ యావిన్ సాల్మన్ 7-6, 1-6, 3-6తో ప్రలోక్ చేతిలో పరాజయం పొందాడు. మూడో సీడ్ ప్రకృత్ కార్తీక్ పటేల్ 6-3, 6-4తో ఎనిమిదో సీడ్ తుషార్ శర్మపై, ఆరో సీడ్ శ్రీవత్స రాతకొండ 6-1, 7-6తో నాలుగో సీడ్ ఆదిత్యపై, అదిల్ కళ్యాణ్పూర్ 6-1, 6-2తో గౌరవ్‌పై గెలుపొందారు.