జింఖానా, న్యూస్‌లైన్: ఆంధ్రప్రదేశ్ అమ్మాయి, టాప్ సీడ్ సామ సాత్విక ఆసియా అండర్-14 జూనియర్ టెన్నిస్ టోర్నీలో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఎల్బీ స్టేడియంలోని శాప్ కాంప్లెక్స్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో బాలికల సింగిల్స్ విభాగంలో ఆమె 6-1, 6-1తో ఐదో సీడ్ మెహక్ జైన్‌పై విజయం సాధించింది. రెండో సీడ్ శివాని ఇంగిల్ 3-6, 6-4, 6-2తో చల్లా హర్షసాయిపై నెగ్గి సెమీస్‌కు అర్హత సాధించింది.
ఎనిమిదో సీడ్ ప్రింకిల్ సింగ్ 7-5, 7-5తో నాలుగో సీడ్ ఆర్జా చక్రబర్తిపై, శివానుజ 6-4, 4-6, 6-2తో షాజియా బేగంపై నెగ్గారు. బాలుర సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ యావిన్ సాల్మన్ 7-6, 1-6, 3-6తో ప్రలోక్ చేతిలో పరాజయం పొందాడు. మూడో సీడ్ ప్రకృత్ కార్తీక్ పటేల్ 6-3, 6-4తో ఎనిమిదో సీడ్ తుషార్ శర్మపై, ఆరో సీడ్ శ్రీవత్స రాతకొండ 6-1, 7-6తో నాలుగో సీడ్ ఆదిత్యపై, అదిల్ కళ్యాణ్‌పూర్ 6-1, 6-2తో గౌరవ్‌పై గెలుపొందారు.
సెమీస్‌లో సాత్విక
Published Thu, Oct 31 2013 12:13 AM | Last Updated on Sat, Sep 2 2017 12:08 AM
Advertisement
Advertisement