మూడో రౌండ్‌లో సాత్విక | under -14 junnior tennis tournment swathika entered in third round | Sakshi
Sakshi News home page

మూడో రౌండ్‌లో సాత్విక

Published Wed, Oct 30 2013 12:17 AM | Last Updated on Sat, Sep 2 2017 12:06 AM

under -14 junnior tennis tournment swathika entered in third round

జింఖానా, న్యూస్‌లైన్:  ఆసియా అండర్-14 జూనియర్ టెన్నిస్ టోర్నీలో టాప్ సీడ్ సామ సాత్విక మూడో రౌండ్‌లోకి ప్రవేశించింది. ఎల్బీ స్టేడియంలోని శాప్ టెన్నిస్ కాంప్లెక్స్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో బాలికల రెండో రౌండ్లో సాత్విక 6-1, 6-0తో భవ్య రామినేనిపై విజయం సాధించింది. తనతో పాటు రెండో సీడ్ శివాని 6-2, 6-3తో మిరికా జైస్వాల్‌పై నెగ్గి మూడో రౌండ్‌కు అర్హత సాధించింది.

 ఐదో సీడ్ మెహక్ జైన్ 6-3, 6-4తో జువేరియా ఫాతిమాపై, నాలుగో సీడ్ ఆర్జా చక్రవర్తి 6-3, 6-2తో అమినేని శివానిపై, శ్రీవల్లి 6-1, 6-4తో ఎనిమిదో సీడ్ ప్రింకిల్ సింగ్‌పై, ఏడో సీడ్ శివానుజ 6-1, 6-3తో సాన్యా సింగ్‌పై, షాజిహా బేగం 5-7, 6-2, 6-4తో షేక్ తహూరపై, హర్షసాయి 6-3, 6-0తో ప్రత్యూషపై గెలిచారు.

బాలుర విభాగంలో రెండో సీడ్ యావిన్ సాల్మన్ మూడో రౌండ్లోకి దూసుకెళ్లాడు. రెండో రౌండ్లో యావిన్ 7-6, 6-1, 6-2తో తీర్థ శశాంక్‌పై గెలుపొందాడు. అదిల్ కళ్యాణ్‌పూర్ 6-1, 6-3తో రిత్విక్‌పై, గౌరవ్ 6-3, 6-3తో అతీఫ్ షేక్‌పై, మూడో సీడ్ ప్రకృత్ కార్తీక్ పటేల్ 6-4, 6-3తో సాయి కార్తీక్ రెడ్డిపై, తుషార్ శర్మ 2-6, 7-6, 7-6తో ఆదిత్యపై, శ్రీవత్స రాతకొండ 6-1, 6-7, 6-2తో రోహిత్‌పై, ప్రలోక్ ఇక్కుర్తి 5-7, 6-3, 6-2తో దుర్గా హిమకేశ్‌పై, నాలుగో సీడ్ ఎస్‌ఎం ఆదిత్య 6-1, 6-2తో అమన్ అయూబ్ ఖాన్‌పై నెగ్గారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement