మితుల్-ధనుష్ జోడీకి టైటిల్ | Mitul-Dhanush combination title | Sakshi
Sakshi News home page

మితుల్-ధనుష్ జోడీకి టైటిల్

Published Fri, Aug 8 2014 12:57 AM | Last Updated on Sat, Sep 2 2017 11:32 AM

Mitul-Dhanush combination title

రుక్మిణీ బాయి స్మారక టీటీ
 ఎల్బీ స్టేడియం: రుక్మిణీ బాయి స్మారక ప్రైజ్‌మనీ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్‌లో అండర్-12 బాలుర డబుల్స్ టైటిల్‌ను మితుల్ అగర్వాల్, ఎ.ధనుష్ జోడి (బీవీబీ, జూబ్లీహిల్స్) చేజిక్కించుకుంది. సికింద్రాబాద్ పబ్లిక్ స్కూల్‌లో జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో మితుల్-ధనుష్ జోడి 3-0తో వేణు-సుదర్శన్ ద్వయం (గీతాంజలి దేవాశ్రయ్ స్కూల్)పై విజయం సాధించింది. ఈ పోటీల విజేతలకు ఎస్‌బీఐ జన రల్ మేనేజర్ హేమంత్ ట్రోఫీలను అందజేశారు. మిగతా ఫైనల్స్ ఫలితాలు ఇలా ఉన్నాయి.
 
 ఫైనల్స్ ఫలితాలు
 అండర్-12 బాలుర సింగిల్స్: 1. సుదర్శన్ (గీతాంజలి దేవాశ్రయ్ స్కూల్), 2. కేశవన్ కన్న(జీఈపీఎస్). అండర్-12 బాలికల సింగిల్స్: 1. రమ్య(సెయింట్ ఆంథోని స్కూల్), 2. రుచిరల్ (సెయింట్ పాల్స్ హైస్కూల్). అండర్-12 బాలికల డబుల్స్: 1. దేవయాని-భవిత జోడి (గీతాంజలి), 2. కీర్తన, ఇషిత జోడి (రోజరి కాన్వెంట్ స్కూల్).
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement