swathika
-
భారత టెన్నిస్ జట్టులో సాత్వికకు చోటు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ క్రీడాకారిణి సామ సాత్వికకు భారత అండర్-14 జట్టులో స్థానం లభించింది. ఐటీఎఫ్ ఆసియా 14 అండ్ అండర్ డెవలప్మెంట్ చాంపియన్‌షిప్-2014లో భారత జట్టుకు సాత్విక ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ నెల 15నుంచి 28 వరకు వియత్నాంలోని హోచిమిన్‌లో ఈ టోర్నీ జరుగుతుంది. జాతీయ స్థాయి అండర్-14 విభాగంలో ప్రదర్శనను బట్టి ఎంపిక చేసిన ఐదుగురు అమ్మాయిలలో సాత్విక కూడా ఎంపికైంది. గతంలో అండర్-12 భారత నంబర్‌వన్‌గా ఉన్న ఈ అమ్మాయి ప్రస్తుతం నాసర్ స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతోంది. -
తల్లే తొలి స్నేహితురాలు
అది 1998వ సంవత్సరం. మార్చి నెల. నా జీవితంలోకి ఓ కొత్త ఆనందం ప్రవేశించింది. ఓ అనిర్వచనీయమైన అనుభూతి నన్ను వెతుక్కుంటూ వచ్చింది... నా చిట్టితండ్రి సాత్విక్ రూపంలో. అమ్మా అన్న పిలుపును నాకు తొలిసారి రుచి చూపించిన నా తొలి సంతానం సాత్విక్. బుజ్జి బుజ్జి కాళ్లు, చిన్ని చిన్ని చేతులు... ఓ అందమైన పుష్పాన్ని చూస్తున్నట్టుగా ఫీలయ్యాను. వాడిని తొలిసారి చేతుల్లోకి తీసుకుంటున్నప్పుడు... ప్రపంచంలో ఎవరూ పొందని గొప్ప విజయమేదో పొందినంత గర్వపడ్డాను. ఇదే ఆనందం నాకు రెండేళ్ల తరువాత మరోసారి దక్కింది. మా పాప శృతి పుట్టింది. ఓహ్... ఇక నాకు ప్రపంచంలో మరేదీ అక్కర్లేదనిపించింది. ఆ తరువాత కొన్ని సంవత్సరాల వరకూ నాకు నా పిల్లలు తప్ప మరెవరూ కనిపించలేదు. వాళ్ల సంతోషం తప్ప ఇంకేమీ కనిపించలేదు నా కంటికి. అంతకుముందు నేను ఉద్యోగం చేసేదాన్ని. కానీ పిల్లల కోసం మానేశాను. నా పిల్లల ముద్దొచ్చే ముఖాలను చూడటంతో మొదలై... వాళ్లను నిద్రపుచ్చి పక్కమీదకు చేరడంతో నా రోజు ముగిసేది. నేనో పోస్ట్ గ్రాడ్యుయేట్‌నని, ఉద్యోగినని మర్చిపోయాను. నా పిల్లలకు తల్లిని అన్న ఒకే ఒక్క విషయమే గుర్తుంది నాకు. ఓ బిడ్డకు జన్మనివ్వడమే పునర్జన్మను పొందడమనుకుంటే... ఆ పుట్టిన బిడ్డలను పెంచి పెద్ద చేయడం ఓ పెద్ద తపస్సు తల్లికి. పిల్లలు పెరుగుతున్నకొద్దీ వాళ్లతో పాటు మనమూ ఎదగాలి. నేను కాస్త స్ట్రిక్ట్‌గానే ఉంటాను. మరీ కోప్పడనుగానీ... చేయకూడనిది చేస్తే వెంటనే సరిచేస్తాను. దానిలో తప్పేంటో, ఎందుకలా చేయకూడదో వివరిస్తాను. ఈ పని అన్నిటికంటే కష్టమైనది. ఎందుకంటే, కాస్త మనం ఎక్కువ మాట్లాడినా వాళ్ల మనసులు నొచ్చుకుంటాయి. ఆ బాధ నుంచే వారికి భయం పుడుతుంది. ఆ భయం కాస్త హద్దు దాటిందంటే, మన పిల్లల దృష్టిలో మనం విలన్లయిపోవడం ఖాయం. అందుకే నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. నా దృష్టిలో తల్లే పిల్లలకు మొదటి స్నేహితురాలు. స్నేహం దేనినైనా చెప్పుకునే స్వేచ్ఛనిస్తుంది. నా పిల్లలకు నా దగ్గర ఆ స్వేచ్ఛ ఉండాలి. నేనేదో అంటానన్న భయంతో ఏదీ దాచిపెట్టకూడదు. అందుకే మా తల్లీపిల్లల బంధాన్ని స్నేహబంధంగా మార్చేసుకున్నాను నేను! - అరుణా శేఖర్, వైజాగ్ (సాక్షి పాఠకురాలు) -
తుది పోరుకు సాత్విక, శివాని
జింఖానా, న్యూస్‌లైన్: న్యూట్రిలైట్ ఆసియా అండర్-14 జూనియర్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో బాలికల సింగిల్స్‌లో టాప్ సీడ్ సామ సాత్విక ఫైనల్లోకి దూసుకె ళ్లింది. ఎల్బీ స్టేడియంలోని శాప్ టెన్నిస్ కాంప్లెక్స్‌లో గురువారం జరిగిన సెమీఫైనల్లో సాత్విక 3-6, 6-0, 6-1తో ఎనిమిదో సీడ్ ప్రింకిల్ సింగ్‌పై విజయం సాధించింది. తనతో పాటు రెండో సీడ్ శివాని 7-5, 6-1తో ఏడో సీడ్ శివానుజపై నెగ్గి ఫైనల్స్‌కు అర్హత సాధించింది. బాలుర సింగిల్స్‌లో ఆదిల్ కళ్యాణ్పూర్, శ్రీవత్స రాతకొండ ఫైనల్స్‌లోకి ప్రవేశించారు. సెమీస్‌లో ఆదిల్ 6-3, 6-1తో ప్రాకృత్ కార్తీక్ పటేల్‌పై, శ్రీవత్స 6-2, 6-4తో రెండో సీడ్ యావిన్ సాల్మన్‌పై గెలుపొందారు. మిగిలిన ఫలితాలు బాలుర డబుల్స్ క్వార్టర్‌ఫైనల్స్: ఆదిల్-కార్తీక్ జోడి 6-0, 6-0తో రిషిల్ గుప్తా-యశోధన్ జోడిపై, ప్రలోక్ ఇక్కుర్తి-గౌరవ్ కుర్వ జోడి 6-2, 6-1తో అరవింద్ కళ్యాణ్-తుషార్ శర్మ జోడిపై, నీల్ గరుడ్-ఆతిఫ్ షేక్ 4-6, 7-5, 10-5తో దేవ్-రోనిత్ రాణా జోడిపై, ఆయనంపూడి-గౌరవ్ జోడి 6-2, 6-1తో సుందర్-కేల్ జోడిపై, బొల్లిపల్లి-సాయి కార్తీక్ రెడ్డి 6-0, 6-3తో ఆశిష్ ఆనంద్- సాయి ప్రతీక్ జోడిపై, రాతకొండ-సాకినేని జోడి 6-0, 6-1తో తరుణ్-తేజస్వి జోడిపై, నితిన్-అమన్ జోడి 6-4, 6-4తో రుచిత్ గౌడ్-ప్రీతమ్ జోడిపై, ఆదిత్య-యావిన్ సాల్మన్ జోడి 6-4, 6-4తో ఆదిత్య కల్లేపల్లి-టి.మాచెర్ల జోడిపై గెలిచారు. బాలికల డబుల్స్ క్వార్టర్‌ఫైనల్స్: జువేరా ఫాతిమా-సాన్యా సిన్హా జోడి 6-2, 6-1తో షాలిక-నిఖిత జోడిపై, ప్రత్యూష-శివాని జోడి 6-3, 6-2తో అన న్య-రైనా జాఫీ జోడిపై, శివాని-సాత్విక 6-2, 6-1తో భక్తి-మాన్య విశ్వనాథ్ జోడిపై, పాన్య- ఎస్.భమిడిపాటి జోడి 1-6, 6-4, 10-6తో అక్షయ-షాజిహా బేగం జోడిపై, ఎస్.చిలకలపూడి-శివానుజ జోడి 3-6, 7-5, 10-7తో ఎ.చక్రబొర్తి-హర్ష సాయి జోడిపై, భవ్య-భూమిక జోడి 6-2, 6-1తో బిపాషా-సాహితీ రెడ్డి జోడిపై, మెహక్ జైన్-షేక్ హుమేరా జోడి 6-3, 6-2 ధరణి-నేహ జోడిపై నెగ్గారు. -
మూడో రౌండ్లో సాత్విక
జింఖానా, న్యూస్‌లైన్: ఆసియా అండర్-14 జూనియర్ టెన్నిస్ టోర్నీలో టాప్ సీడ్ సామ సాత్విక మూడో రౌండ్లోకి ప్రవేశించింది. ఎల్బీ స్టేడియంలోని శాప్ టెన్నిస్ కాంప్లెక్స్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో బాలికల రెండో రౌండ్లో సాత్విక 6-1, 6-0తో భవ్య రామినేనిపై విజయం సాధించింది. తనతో పాటు రెండో సీడ్ శివాని 6-2, 6-3తో మిరికా జైస్వాల్‌పై నెగ్గి మూడో రౌండ్‌కు అర్హత సాధించింది. ఐదో సీడ్ మెహక్ జైన్ 6-3, 6-4తో జువేరియా ఫాతిమాపై, నాలుగో సీడ్ ఆర్జా చక్రవర్తి 6-3, 6-2తో అమినేని శివానిపై, శ్రీవల్లి 6-1, 6-4తో ఎనిమిదో సీడ్ ప్రింకిల్ సింగ్‌పై, ఏడో సీడ్ శివానుజ 6-1, 6-3తో సాన్యా సింగ్‌పై, షాజిహా బేగం 5-7, 6-2, 6-4తో షేక్ తహూరపై, హర్షసాయి 6-3, 6-0తో ప్రత్యూషపై గెలిచారు. బాలుర విభాగంలో రెండో సీడ్ యావిన్ సాల్మన్ మూడో రౌండ్లోకి దూసుకెళ్లాడు. రెండో రౌండ్లో యావిన్ 7-6, 6-1, 6-2తో తీర్థ శశాంక్‌పై గెలుపొందాడు. అదిల్ కళ్యాణ్పూర్ 6-1, 6-3తో రిత్విక్‌పై, గౌరవ్ 6-3, 6-3తో అతీఫ్ షేక్‌పై, మూడో సీడ్ ప్రకృత్ కార్తీక్ పటేల్ 6-4, 6-3తో సాయి కార్తీక్ రెడ్డిపై, తుషార్ శర్మ 2-6, 7-6, 7-6తో ఆదిత్యపై, శ్రీవత్స రాతకొండ 6-1, 6-7, 6-2తో రోహిత్‌పై, ప్రలోక్ ఇక్కుర్తి 5-7, 6-3, 6-2తో దుర్గా హిమకేశ్పై, నాలుగో సీడ్ ఎస్ఎం ఆదిత్య 6-1, 6-2తో అమన్ అయూబ్ ఖాన్‌పై నెగ్గారు.