జింఖానా, న్యూస్‌లైన్: న్యూట్రిలైట్ ఆసియా అండర్-14 జూనియర్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో బాలికల సింగిల్స్‌లో టాప్ సీడ్ సామ సాత్విక ఫైనల్లోకి దూసుకె ళ్లింది. ఎల్బీ స్టేడియంలోని శాప్ టెన్నిస్ కాంప్లెక్స్‌లో గురువారం జరిగిన సెమీఫైనల్లో సాత్విక 3-6, 6-0, 6-1తో ఎనిమిదో సీడ్ ప్రింకిల్ సింగ్‌పై విజయం సాధించింది. తనతో పాటు రెండో సీడ్ శివాని 7-5, 6-1తో ఏడో సీడ్ శివానుజపై నెగ్గి ఫైనల్స్‌కు అర్హత సాధించింది.
బాలుర సింగిల్స్‌లో ఆదిల్ కళ్యాణ్‌పూర్, శ్రీవత్స రాతకొండ ఫైనల్స్‌లోకి ప్రవేశించారు. సెమీస్‌లో ఆదిల్ 6-3, 6-1తో ప్రాకృత్ కార్తీక్ పటేల్‌పై, శ్రీవత్స 6-2, 6-4తో రెండో సీడ్ యావిన్ సాల్మన్‌పై గెలుపొందారు. మిగిలిన ఫలితాలు బాలుర డబుల్స్ క్వార్టర్‌ఫైనల్స్: ఆదిల్-కార్తీక్ జోడి 6-0, 6-0తో రిషిల్ గుప్తా-యశోధన్ జోడిపై, ప్రలోక్ ఇక్కుర్తి-గౌరవ్ కుర్వ జోడి 6-2, 6-1తో అరవింద్ కళ్యాణ్-తుషార్ శర్మ జోడిపై, నీల్ గరుడ్-ఆతిఫ్ షేక్ 4-6, 7-5, 10-5తో దేవ్-రోనిత్ రాణా జోడిపై, ఆయనంపూడి-గౌరవ్ జోడి 6-2, 6-1తో సుందర్-కేల్ జోడిపై, బొల్లిపల్లి-సాయి కార్తీక్ రెడ్డి 6-0, 6-3తో ఆశిష్ ఆనంద్- సాయి ప్రతీక్ జోడిపై, రాతకొండ-సాకినేని జోడి 6-0, 6-1తో తరుణ్-తేజస్వి జోడిపై, నితిన్-అమన్ జోడి 6-4, 6-4తో రుచిత్ గౌడ్-ప్రీతమ్ జోడిపై, ఆదిత్య-యావిన్ సాల్మన్ జోడి 6-4, 6-4తో ఆదిత్య కల్లేపల్లి-టి.మాచెర్ల జోడిపై గెలిచారు.
బాలికల డబుల్స్ క్వార్టర్‌ఫైనల్స్: జువేరా ఫాతిమా-సాన్యా సిన్హా జోడి 6-2, 6-1తో షాలిక-నిఖిత జోడిపై, ప్రత్యూష-శివాని జోడి 6-3, 6-2తో అన న్య-రైనా జాఫీ జోడిపై, శివాని-సాత్విక 6-2, 6-1తో భక్తి-మాన్య విశ్వనాథ్ జోడిపై, పాన్య- ఎస్.భమిడిపాటి జోడి 1-6, 6-4, 10-6తో అక్షయ-షాజిహా బేగం జోడిపై, ఎస్.చిలకలపూడి-శివానుజ జోడి 3-6, 7-5, 10-7తో ఎ.చక్రబొర్తి-హర్ష సాయి జోడిపై, భవ్య-భూమిక జోడి 6-2, 6-1తో బిపాషా-సాహితీ రెడ్డి జోడిపై, మెహక్ జైన్-షేక్ హుమేరా జోడి 6-3, 6-2 ధరణి-నేహ జోడిపై నెగ్గారు.
తుది పోరుకు సాత్విక, శివాని
Published Fri, Nov 1 2013 12:05 AM | Last Updated on Sat, Sep 2 2017 12:10 AM
Advertisement
Advertisement