Video: భగవద్గీత సాక్షిగా బ్రిటన్ ఎంపీగా శివాని ప్రమాణం | Indian Origin UK MP Shivani Raja Takes Oath On Bhagavad Gita | Sakshi
Sakshi News home page

Video: భగవద్గీత సాక్షిగా బ్రిటన్ ఎంపీగా శివాని ప్రమాణం

Published Thu, Jul 11 2024 3:57 PM | Last Updated on Thu, Jul 11 2024 4:17 PM

Indian Origin UK MP Shivani Raja Takes Oath On Bhagavad Gita

భారత సంతతికి చెందిన 29 ఏళ్ల శివాని రాజా యూకే పార్ల‌మెంటులో హిందువుల పవిత్ర‌గ్రంథం భ‌గ‌వ‌ద్గీత సాక్షిగా ఎంపీగా ప్ర‌మాణ స్వీకారం చేశారు.  తాను ఎంపీగా ప్ర‌మాణం చేసిన వీడియోను ఆమె సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. లీసెస్టర్ ఈస్ట్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ  పార్లమెంటులో ప్రమాణ స్వీకారం చేయడం గౌర‌వంగా భావిస్తున్న‌ట్లు ఆమె తెలిపారు. భ‌గ‌వ‌ద్గీత‌పై ప్ర‌మాణం చేసి కింగ్ ఛార్లెస్ రాజుకు విదేయ‌త‌గా ఉంటాన‌ని పేర్కొన్నారు.

శివాని రాజా చేసిన‌ స్వీకారోత్సవం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. అనేక మంది నెటిజ‌న్లు ఆమెను మెచ్చుకుంటున్నారు.  మ‌న‌ పవిత్ర గ్రంథాలకు మీరు తగిన గౌరవం ఇవ్వ‌డం సంతోషంగా ఉంది. మీ బాధ్య‌త‌ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌ర్తించ‌డంలో ఈ భ‌గ‌వ‌ద్గీత మార్గ‌ద‌ర్శ‌కంగా ప‌నిచేస్తుంద‌ని భావిస్తున్నాం* అంటూ కామెంట్ చేస్తున్నారు.

 కాగా  గుజరాత్ మూలాలున్న ఈ 29 ఏళ్ల శివాని వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు.  ఇటీవల జరిగిన యూకే పార్ల‌మెంట్‌ ఎన్నికల్లో  లీసెస్టర్ ఈస్ట్ నుంచి ఆమె క‌న్జ‌ర్బేటివ్ పార్టీ ఎంపీగా విజయం సాధించారు. అక్క‌డ గ‌త 37 ఏళ్లుగా కన్జర్వేటివ్ పార్టీకి చెందిన నేత‌లెవ‌రూ  గెలవక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇన్నేళ్ల తరవాత గెలిచి శివాని రాజా రికార్డు సృష్టించారు. అయితే ఈ  ఎన్నికల్లో ఓడించింది కూడా భారత సంతతికి చెందిన  నేత (రాజేశ్‌ అగర్వాల్‌) కావ‌డం విశేషం. శివానికి 14,526 ఓట్లు రాగా రాజేశ్‌కు 10,100 ఓట్లు ప‌డ్డాయి.

ఇక ఇంగ్లాండ్, స్కాట్లాండ్‌, వేల్స్‌, నార్తర్న్ ఐర్లాండ్‌ వ్యాప్తంగా 650 పార్లమెంటు స్థానాలున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ మార్కు 326 సీట్లు కాగా లేబర్‌ పార్టీ 412 స్థానాల్లో గెలుపొందింది. కన్జర్వేటివ్‌లు కేవలం 121 స్థానాల‌కే ప‌రిమితమైంది. దీంతో భార‌త సంత‌తికి చెందిన‌ రిషి సునాక్‌ అధికారాన్ని కోల్పోగా..  14 ఏళ్ల త‌ర్వాత లేబ‌ర్ పార్టీ నేత‌ కీర్ స్టార్మర్ బ్రిట‌న్  కొత్త ప్ర‌ధానిగా బాధ్యతలు స్వీకరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement