ఆస్ట్రేలియా పార్లమెంట్‌ చరిత్రలో తొలిసారి.. సెనేటర్‌గా భగవద్గీతపై ప్రమాణం! | Australian Senator Varun Ghosh Takes Oath On Bhagavad Gita | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియా పార్లమెంట్‌ చరిత్రలో తొలిసారి.. సెనేటర్‌గా భగవద్గీతపై ప్రమాణం!

Published Wed, Feb 7 2024 4:00 PM | Last Updated on Wed, Feb 7 2024 4:51 PM

Australian Senator Varun Ghosh Takes Oath On Bhagavad Gita - Sakshi

బ్రిటన్‌ పార్లమెంట్‌లో ప్రధానిగా రిషి సునాక్‌ భగవద్గీతపై ప్రమాణం చేయడం భారతీయులకు ఎంతో గర్వంగా అనిపించింది. వలస పాలనతో  మన దేశాన్ని పాలించిన ఆంగ్లేయుల దేశంలో మన భారత సంతతి వ్యక్తి రిషి సునాక్‌ ప్రధాని అవ్వడం, మన హిందూమత గ్రంథం భగవద్గీతపై ప్రమాణం చేయడం  ప్రతీ భారతీయుడిని భావోద్వేగానికి గురి చేసింది. అలా చేసిత తొలి యూకే ప్రధానిగా రిషి సునాక్‌ అందరీ దృష్టిని ఆకర్షించారు కూడా. మళ్లీ అదే తరహాలో ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమయ్యింది. అంతేగాదు ఆస్ట్రేలియన్‌ పార్లమెంట్‌ చరిత్రలోనే తొలిసారి ఓ చారిత్రక ఘట్టానికి వేదికయ్యింది. అదేంటంటే..

ఆస్ల్రేలియా పార్లమెంట్‌ చరిత్రలో తొలిసారిగా ఓ అపూర్వ ఘట్టం ఆవిష్కృతమయ్యింది. భారత సంతతికి చెందిన బారిస్టర్‌ వరుణ్‌ ఘోష్‌.. ఆస్ట్రేలియా పార్లమెంటు సాక్షిగా భగవద్గీతపై ప్రమాణం చేశారు. ఆస్ట్రేలియన్‌ పార్లమెంట్‌ చరిత్రలో ఈ ఘటన సాధించిన తొలి సభ్యుడిగా చరిత్ర సృష్టించారు. హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీత. ఇప్పటికీ మన కోర్టుల్లో దీనిపైనే ప్రమాణం చేస్తారు. మన చట్ట సభల్లో భగవంతుని సాక్షిగా, మనస్సాక్షిగా మన ప్రజాప్రతినిధులు ప్రమాణం చేస్తుంటారు. కానీ, ఆస్ట్రేలియన్‌ పార్లమెంటులో మన పవిత్ర గ్రంథంపై భారతీయ సంతతికి చెందిన సెనేటర్‌(ఎంపీ) ప్రమాణం చేసిన తొలి ఆస్ట్రేలియన్‌ సెనేటర్‌గా చరిత్ర సృష్టించారు.

లెజిస్టేటివ్‌ అసెంబ్లీ, లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ ఫెడరల్‌ పార్లమెంట్‌ సెనేట్‌లో పశ్చిమ ఆస్ట్రేలియాకి ప్రాతినిథ్యం వహించేందుకు వరుణ్‌ ఘోషను ఎంపిక చేశాయి. ఈ మేరకు ఆస్ట్రేలియన్‌ విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్‌ వరుణ్‌ ఘోష్‌కి స్వాగతం పలుకుతూ ట్విట్టర్‌లో..పశ్చిమ ఆస్ట్రేలియా సరికొత్త సెనెటర్‌ వరుణ్‌ ఘోష్‌కి స్వాగతం. సెనేటర్‌ భగవద్గీతపై ప్రమాణం చేసిన తొలి ఆస్ట్రేలియన్‌ సెనేటర్‌ మీరు. తొలిసారిగా ఓ వ్యక్తి సరికొత్త అధ్యయానికి తెరతీసినప్పుడూ అతనే చివరి వారు కాదని గుర్తుంచుకోవాలి. సెనేటర్‌ ఘోష్‌ పశ్చిమ ఆస్ట్రేలియన్ల బలమైన గొంతుకగా ఉంటారని నమ్ముతున్నా. అని పేర్కొన్నారు పెన్నీ వాంగ్‌. ఇక ఆస్ట్రేలియన్‌ ప్రధాన మంత్రి ఆంథోని అల్బనీస్‌ కూడా ట్విట్టర్‌లో పశ్చిమా ఆస్ట్రేలియా సరికొత్త సెనెటర్‌ వరుణ్‌ ఘోష్‌కి స్వాగతం. మీరు పార్లమెంటు సభ్యుడిగా ఉండటం అద్భుతంగా ఉంది. అని అన్నారు.

వరుణ్‌ నేపథ్యం..

పెర్త్‌లో నివాసం ఉండే వరుణ్‌ ఘోష్‌ వృత్తి రీత్యా న్యాయవాది. అతను వెస్ట్రన్‌ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయం నుంచి ఆర్ట్స్‌ అండ్‌ లాలో డిగ్రీని పొందాడు. క్రేం బ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో కామన్వెల్త్‌ స్కాలర్‌కూడా. అతను వాషింగ్టన్‌ డీసీలో ప్రపంచబ్యాంకు సలహదారుగా, న్యూయార్క్‌ ఫైనాన్స్‌ అటార్నీగా బాధ్యతలు నిర్వహించారు. ఆస్ట్రేలియాలోని లేబర్‌ పార్టీలో చేరడంతో అతని రాజకీయ జీవితం పెర్త్‌లో ప్రారంభమయ్యింది. ఇక వరణ్‌ ఘోష్‌ మాట్లాడుతూ..తాను మంచి విద్యను అభ్యసించడం వల్లే అధికారాన్ని పొందగలిగాను కాబట్టి నాణ్యమైన విద్య అందరికీ అందుబాటులో ఉండాలని గట్టిగా విశ్వసిస్తాను అని చెప్పారు. 

కాగా, అనారోగ్య కారణాలతో పదవీ విరమణ చేయబోతున్న సెనెటర్‌ పాట్రిక్‌ డాడ్సన్‌ స్థానంలో వరుణ్‌ ఘోష్‌ సెనేటర్‌గా ఎంపికయ్యారు. 17 ఏళ్ల వయసులోనే వరుణ్‌ ఘోష్‌ లేబర్‌ పార్టీలో చేరారు. భారతీయ – ఆస్ట్రేలియన్‌ బారిస్టర్‌ అయిన ఘోష్‌ గతవారం లేబర్‌ పార్టీ అధికారికంగా కీలక పాత్రకు ఎంపిక చేసింది. 

(చదవండి: 'ఉక్కు మనిషి' సర్దార్ అని ఎందుకు అంటారంటే..?)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement