ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనలో భాగంగా మాస్కోలోని భారతీయులను కలిశారు. వారినుఉద్దేశించి ప్రసంగించారు. ప్రవాస భారతీయులతో పలు ప్రశ్నలడిగి, వారితో ఉత్సాహంగా ముచ్చటించారు. తనకు స్వాగతం పలికేందుకు ప్రదర్శించిన రష్యన్ కల్చరల్ ట్రూప్ కళాకారులతో ప్రధాని మోదీ సంభాషించారు.
మాస్కోలో భారతీయ కమ్యూనిటీని ఉద్దేశించి చేసే ప్రసంగానికి ముందు త్రివర్ణ పతాకాన్ని చేబూనిన భారతీయులు చప్పట్లు, "మోదీ మోదీ" నినాదాలతో హోరెత్తించారు. అనంతరం తన ప్రసంగంలో మోదీ ఒక శుభవార్తను పంచుకున్నారు. రష్యాలో కొత్త కాన్సులేట్‌లను ప్రారంభిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. కజాన్, యెకటెరిన్‌బర్గ్‌లలో భారత కాన్సులేట్‌లను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇది పర్యాటకం, వ్యాపార వాణిజ్యాన్ని మెరుగుపరుస్తుందన్నారు.
ఎన్నాళ్లనుంచి డ్యాన్స్ నేర్చుకుంటున్నారని అని కళాకారులను ప్రధాని మోదీ ప్రశ్నించారు. కొంతమంది పదేళ్లు, మరికొంతమంది 30 ఏళ్లు సమాధానమిచ్చారు. కొంతమంది భారతదేశంతో, మోదీతో తమకున్న అనుభవాన్ని పంచుకున్నారు. ఇస్కాన్ మాస్కో ప్రెసిడెంట్, సాధు ప్రియా దాస్, రామ్ కృష్ణ మిషన్ నుండి స్వామి ఆత్మలోకానంద తదితరులు మాట్లాడారు.
కాగా సోమవారం సాయంత్రం రష్యాలోని మాస్కోకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ తన పర్యటనను కొనసాగిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా రష్యా ఉప ప్రధాని డెనిస్ మంత్రోవ్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తన ఇంటికి వచ్చిన మోదీకి పుతిన్ ఘన స్వాగతం పలికారు మోదీపై పుతిన్ ప్రశంసల్లో ముంచెత్తిన సంగతి తెలిసిందే.
#WATCH | Prime Minister Narendra Modi meets artists of the Russian Cultural Troupe who performed to welcome PM Modi during his address to the Indian community in Moscow, Russia
(Souce: PMO) pic.twitter.com/qUWMVkVk3K— ANI (@ANI) July 9, 2024
Comments
Please login to add a commentAdd a comment