ప్రిక్వార్టర్స్‌లో ప్రాంజల | prajwala reached in finals | Sakshi
Sakshi News home page

ప్రిక్వార్టర్స్‌లో ప్రాంజల

Published Wed, Nov 6 2013 12:21 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

సియోవిపో ఆసియా ఓసియానియా ఇంటర్నేషనల్ జూనియర్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది.

సాక్షి, హైదరాబాద్: సియోవిపో ఆసియా ఓసియానియా ఇంటర్నేషనల్ జూనియర్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది.
 
  దక్షిణ కొరియాలో జరుగుతున్న ఈ ఈవెంట్‌లో ఆమె 11వ సీడ్‌గా బరిలోకి దిగింది. రెండో రౌండ్ పోరులో ఆమె 3-6, 6-1, 6-3తో క్లెయిర్ యూన్‌కీ చోయ్ స్పాక్‌మన్ (హంకాంగ్)పై విజయం సాధించింది. తొలి సెట్‌లో చతికిలబడిన ప్రాంజల తర్వాతి సెట్లలో పుంజుకొని ఆడింది. దీంతో ప్రత్యర్థికి పరాజయం తప్పలేదు. ప్రిక్వార్టర్స్‌లో ఏపీ క్రీడాకారిణి... కొరియాకు చెందిన ఐదో సీడ్ డబిన్ కిమ్‌తో తలపడనుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement