
ఇంటి ముందు పూజలు చేసిన దృశ్యం
తుమకూరు: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఎన్నికల్లో విజయం కోసం ఆరాటపడుతున్న నేతలు అందుకు తమకు అందుబాటులోనున్న ప్రతీమార్గాలను అనుసరిస్తున్నారు. మరికొంత మంది నేతలు ప్రత్యర్థులను మానసికంగా దెబ్బ తీయడానికి, విజయం సాధించడానికి క్షుద్ర పూజలు చేయిస్తున్న ఘటనలు తరచూ ఏదోఒక చోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. శుక్రవారం తుమకూరు గ్రామీణ నియోజకవర్గ జేడీఎస్ అభ్యర్థి గౌరీశంకర్ ఇంటి ముందు కూడా ఎవరో క్షుద్రపూజలు చేసి సందేశంతో కూడా కాగితాన్ని ఉంచి పరారైన ఘటన వెలుగు చూసింది.
పట్టణంలోని నాగరబావిలోని గౌరీశంకర్ ఇంటి ఎదుట గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేసి కుంకుమ పూసిన కత్తితో పాటు ఒక లెటర్‌ను కూడా పళ్లెంలో ఉంచి పారిపోయారు. తమకు దక్కుతున్న ప్రజాదరణ చూసి ఎన్నికల్లో విజయం సాధించలేమనే భయంతో ప్రత్యర్థులు తమను మానసికంగా దెబ్బతీయడానికి తమ ఇంటి ముందు క్షుద్రపూజలు చేసి ఉంటారంటూ గౌరీశంకర్ అనుమానం వ్యక్తం చేశారు. ఇటువంటి కృత్యాలకు తాము భయపడే ప్రసక్తి లేదని ఇకపై తాము మరింత దూకుడుగా ప్రజల్లోకి వెళతామంటూ స్పష్టం చేసారు.
Comments
Please login to add a commentAdd a comment