Occult worshiped
-
వామ్మో..! ప్రాణం తీస్తున్న భూత వైద్యం..!!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: రోబోటిక్ టెక్నాలజీతో ఆస్పత్రుల్లో రోగాలకు చికిత్స చేస్తున్న కాలంలోనూ ఇంకా కొన్ని చోట్ల భూత వైద్యం పేరిట రోగాలు నయం చేస్తామనే ఘటనలు వెలుగులోకి వస్తున్నా యి. జిల్లాలో ఇప్పటికీ తాంత్రిక పూజలపై నమ్మకం ఉండడంతో అమాయకులు ఆస్పత్రుల్లో చికిత్సను కాకుండా భూత వైద్యులు, బాబాలను నమ్మి మోసపోతున్నారు. తాజాగా మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణానికి చెందిన యువకుడు క్షుద్రపూజలు చేస్తుండగానే ప్రాణాలు కోల్పోయిన ఘటన జిల్లాలో కలకలం రేపుతోంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆ యువకుడికి పూజలు చేస్తుండగా మృత్యువాత పడ్డాడు. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జిల్లాలో ఇంకా ఇలాంటి నమ్మకాలతో అమాయక జనాలను కొందరు మభ్య పెడుతున్నారు. ఆధునిక కాలంలోనూ పాతకాలం నాటి మూఢ నమ్మకాలను ఆచరిస్తున్నారు. కొందరు బాబాలు రూ.వేల కొద్దీ వసూలు చేస్తూ వేర్వేరు రకాలుగా బహుమానాలు తీసుకుంటున్నారు. డాక్టర్ వద్ద ఓపీ ఉన్నట్లు ఫీజులు తీసుకుంటూ మంత్రాలు, తాయత్తులకు డబ్బులు దండుకుంటున్నారు. ఊరికో ‘బాబా’లు.. ఆధ్యాత్మిక చింతనతో ప్రజా శ్రేయస్సు కోరే వారి కంటే ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని సొంత వైద్యం చేసే బాబాలు పెరిగిపోతున్నారు. చిన్నపిల్లలకు జ్వరం, కుటుంబ సభ్యులు, భార్యాభర్తల మధ్య సమస్యలు, సంతాన, ఆస్తులు, వారసత్వ, ఉద్యోగ, వ్యాపార ఇతర ఎలాంటి సమస్యలకై నా పరిష్కారం చూపుతామని ఏకంగా ప్రసార మాధ్యామాల్లోనూ ప్రచారం చేస్తున్నారు. జిల్లాలో జైపూర్ మండలం ఇందారం, నస్పూర్, మంచిర్యాల పట్టణం, కాసిపేట, బెల్లంపల్లి, కుమురంభీం జిల్లా రెబ్బెన మండలం తదితర ప్రాంతాల్లో ఇలాంటి కొందరు బాబాలు ఉన్నారు. ప్రజలు తమ సమస్య చెప్పుకుంటే ఏదో ఒక పరిహారం చూపిస్తున్నారు. ఇందుకు అవసరమైన డబ్బులు, సామగ్రి తెచ్చుకోమంటున్నారు. పూజలు, భూత వైద్యం పేరిట బాధితులతో ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో గత కొంతకాలంగా జ్వరాలు, అనారోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. దీంతో గ్రామాల్లో అనేకమంది బాబాలు నయం చేస్తామని చెబుతున్నారు. ప్రజల అమాయకత్వం, నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని బాబాల అవతారం ఎత్తుతున్నారు. కొందరు క్షుద్ర పూజలు, మందు పోయడం, కక్కించడం వంటివి చేస్తున్నారు. వీరికి తర్వాత అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. వీటిని ఆయా కుటుంబ సభ్యులు బయటకు తెలియకుండా జాగ్రత్త వహిస్తున్నారు. భూత వైద్యానికి వెళ్లేవారు అందరూ గోప్యంగా ఉంచడంతో వీరి వ్యవహారాలు బయటపడడం లేదు. ఇప్పటికీ మూఢ నమ్మకాలు, భూత వైద్యం, క్షుద్రపూజలు వంటివి నమ్మి ప్రజలు మోసపోవద్దని పోలీసు శాఖ ఆధ్వర్యంలో కళాజాతతో గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. అప్పట్లో కొందరు బాబాలపై కేసులు నమోదయ్యాయి. ఇటీవల వారిపై నిఘా కొరవడడంతో మళ్లీ ఘటనలు జరుగుతున్నాయి. మరింత అవగాహన అవసరం.. మారుమూల ప్రాంతాల్లో ఇంకా పాత కాలం నాటి నమ్మకాలు, తాంత్రిక, క్షుద్ర, భూతవైద్యాలపై మరింత అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. శరీరంలో ఏర్పడే జబ్బులకు అశాసీ్త్రయ విధానం దుష్ఫలితాలు ఇస్తుందని ప్రజల్లోకి వెళ్లాల్సి ఉంది. రోగం వస్తే తగిన చికిత్స మాత్రమే బాగు చేయగలదనే దృక్పథం పెంచుకోవాల్సి ఉంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేసే వారిపై నిఘా ఏర్పరిచి కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. లేకపోతే భవిష్యత్తులోనూ మరికొందరు మోసపోయే పరిస్థితి ఏర్పడవచ్చు. -
వరంగల్ నగరంలో క్షుద్రపూజల కలకలం
-
హైదరాబాద్ పాతబస్తీలో క్షుద్రపూజలు కలకలం
-
క్షుద్ర పూజలు అబద్ధం
నూజివీడు : మండలంలోని సుంకొల్లు పరిధిలోని తోటలలో క్షుద్ర పూజలు నిర్వహించడంతో పాటు నరబలి ఇవ్వడానికి ప్రయత్నించారంటూ ముసునూరుకు చెందిన చిన్నం ప్రవీణ్ కుమార్ చేసిన ఆరోపణల నేపథ్యంలో శనివారం పోలీసు, రెవెన్యూ అధికారులు విచారణ నిర్వహించారు. సీఐ మేదర రామ్‌కుమార్, పట్టణ, రూరల్ ఎస్ఐ చెదరబోయిన రంజిత్‌కుమార్, మేడిబోయిన చిరంజీవిలతో పాటు తహసీల్దారు గుడిశే విక్టర్‌బాబు ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. దీనిలో భాగంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న జోరిగే రాంప్రసాద్‌ను అతని తోటలోకి తీసుకెళ్లి అక్కడి ప్రాంతాలను పరిశీలించడంతో పాటు తోటలో కాపలా ఉంటున్న వృద్ధ దంపతులను జరిగిన విషయమై విచారించారు. ఆరోపణల్లో నిజం లేదు.. అనంతరం పట్టణంలోని తన కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో సీఐ రామ్‌కుమార్, తహసీల్దారు విక్టర్‌బాబు మాట్లాడారు. క్షుద్ర పూజలు, నరబలి ఇవ్వడానికి ప్రయత్నించారని వస్తున్న వదంతులు, ఆరోపణలు అవాస్తమన్నారు. అమ్మవారి గుడి నిర్మించడానికి గాను గురు పౌర్ణమి రోజున జొరిగే రాంప్రసాద్ ఏడుగురు వ్యక్తులను, చిన్నం ప్రవీణ్‌ను తీసుకెళ్లడం జరిగిందన్నారు. వెళ్తూ దారిలోనే ఉన్న గంగానమ్మ గుడి వద్ద పూజలు చేశారని చెప్పారు. గ్రామస్తులు ఎవరైనా పొలాల్లోకి వెళ్లేటప్పుడు అక్కడ పూజలు చేయడం, మొక్కుకోవడం, ముడుపులు చెల్లించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. అనంతరం తోటలోకి వెళ్లిన తర్వాత ప్రవీణ్ వృద్ధుల పాక వద్దకు వెళ్లి డబ్బా తీసుకుని బహిర్భూమికని వెళ్లి తిరిగి రాలేదన్నారు. అతను బహిర్భూమికి వెళ్లేటప్పుడు అతని వెంట ఎవరూ పడలేదని, మిగిలిన వ్యక్తుల వద్ద ఎలాంటి ఆయుధాలు కూడా లేవని దర్యాప్తులో తేలిందన్నారు. ప్రజలు ఇలాంటి వదంతులను నమ్మవద్దని, ఎక్కడైనా జరుగుతున్నట్లుగా చూసినట్లయితే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. ప్రజలెవరూ భయపడాల్సిన పనే లేదన్నారు. అయితే ప్రవీణ్‌కుమార్ నరబలి ఇవ్వడం కోసం క్షుద్ర పూజలు నిర్వహించారంటూ ఎందుకు చెప్తున్నాడో, దీని వెనుక ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా తదితర విషయాలపై దర్యాప్తు నిర్వహిస్తామని చెప్పారు. వారితో నాకు ప్రాణభయం ఉంది క్షుద్ర పూజల ఆరోపణలతో తప్పించుకున్న యువకుడి మొర ముసునూరు (నూజివీడు) : చంద్రగ్రహణం రోజు నరబలి ఇస్తే శుభాలు కలుగుతాయనే మూఢ నమ్మకంతో అమాయకుడైన యువకుడిని బలి చేయడానికి యత్నించారనే విషయంలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నూజివీడు మండలం యనమదల పరిసర అడవుల్లోకి జొరిగే రాంప్రసాద్, పామర్తి సాయి అనేవారు శుక్రవారం తనను బలవంతంగా బైక్‌పై ఎక్కించుకుని వెళ్ళి అక్కడ క్షుద్ర పూజలు చేసి, కత్తులతో తనపై దాడికి యత్నించారని ముసునూరుకు చెందిన చిన్నం ప్రవీణ్ విలేకరుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశాడు. బాధితుడు శనివారం సాయంత్రం స్థానిక దళితవాడకు చెందిన పెద్దలు, యువకులతో కలిసి విలేకర్ల సమావేశం నిర్వహించారు. తన యజమాని రాంప్రసాద్ పిలవడంతో వెళ్లానని, కానీ యనమదల అడవుల్లోకి వెళ్లాక అక్కడ మరికొందరు క్షుద్ర పూజారులు ఉండడంతో భయంతో వారి బారి నుంచి తప్పించుకుని నూజివీడు పోలీసు స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేసినట్లు బాధితుడు వాపోయాడు. ఈ విషయాన్ని పోలీసులు తేలికగా కొట్టిపారవేస్తూ ప్రెస్ మీట్లు ఏర్పాటు చేయడంతో ఆ వ్యవస్థపై తనకు నమ్మకం పోయిందని, మీరే న్యాయం జరిగేలా చూడాలంటూ విలేకర్లను బాధిత కుటుంబ సభ్యులు వేడుకున్నారు. తమకు సరైన న్యాయం జరగక పోతే విషయాన్ని జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేయడంతో పాటు పోలీసు స్టేషన్ ఎదుట ధర్నాలు, నిరాహార దీక్షలు చేపడతామని కుటుంబ సభ్యులు తెలిపారు. -
జేడీఎస్ అభ్యర్థి ఇంటి ఎదుట క్షుద్రపూజలు
తుమకూరు: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఎన్నికల్లో విజయం కోసం ఆరాటపడుతున్న నేతలు అందుకు తమకు అందుబాటులోనున్న ప్రతీమార్గాలను అనుసరిస్తున్నారు. మరికొంత మంది నేతలు ప్రత్యర్థులను మానసికంగా దెబ్బ తీయడానికి, విజయం సాధించడానికి క్షుద్ర పూజలు చేయిస్తున్న ఘటనలు తరచూ ఏదోఒక చోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. శుక్రవారం తుమకూరు గ్రామీణ నియోజకవర్గ జేడీఎస్ అభ్యర్థి గౌరీశంకర్ ఇంటి ముందు కూడా ఎవరో క్షుద్రపూజలు చేసి సందేశంతో కూడా కాగితాన్ని ఉంచి పరారైన ఘటన వెలుగు చూసింది. పట్టణంలోని నాగరబావిలోని గౌరీశంకర్ ఇంటి ఎదుట గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేసి కుంకుమ పూసిన కత్తితో పాటు ఒక లెటర్‌ను కూడా పళ్లెంలో ఉంచి పారిపోయారు. తమకు దక్కుతున్న ప్రజాదరణ చూసి ఎన్నికల్లో విజయం సాధించలేమనే భయంతో ప్రత్యర్థులు తమను మానసికంగా దెబ్బతీయడానికి తమ ఇంటి ముందు క్షుద్రపూజలు చేసి ఉంటారంటూ గౌరీశంకర్ అనుమానం వ్యక్తం చేశారు. ఇటువంటి కృత్యాలకు తాము భయపడే ప్రసక్తి లేదని ఇకపై తాము మరింత దూకుడుగా ప్రజల్లోకి వెళతామంటూ స్పష్టం చేసారు. -
క్షుద్రపూజల పేరిట కన్నకూతురు బలి
కాన్పూర్: కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే తన పసిబిడ్డను క్షుద్రపూజల పేరిట బలి ఇచ్చిన సంఘటన ఉత్తరప్రదేశలో చోటు చేసుకుంది. కాన్పూర్ జిల్లా జాగురా గ్రామంలో గిరిజేశ్ పాల్ (40) అనే వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గిరిజేశ్‌కు భార్య సునీత, అంకిత్(15), అమన్(12) అనే కుమారులతోపాటు తొమ్మిదేళ్ల కుషి అనే కూతురు ఉంది. ఈ దారుణం జరిగిన శనివారం సునీత, ఇద్దరు కుమారులతో పొరుగూరులోని బంధువుల వద్దకు వెళ్లింది. ఆ రోజు రాత్రి గిరిజేశ్ క్షుద్రపూజలు చేసి చిన్నారి కుషిని బలిచ్చాడు. భార్యా, కుమారులు రాత్రి తిరిగి వచ్చాక గిరిజేశ్ ఎంతకూ తన గది తలుపులు తెరవకపోవడంతో వారు తలుపు కన్నంలోంచి గదిలోకి చూడగా కుషి దేహం రక్తపు మడుగులో కనిపించింది. ఇరుగుపొరుగువారు తలుపులు బద్దలుకొట్టి గదిలోకి వెళ్లినప్పుడు గిరిజేశ్.. కుషి మృతదేహం చుట్టూ నృత్యం చేస్తూ కనిపించాడు. అతన్ని అరెస్టు చేసి కేసు దర్యాప్తు ప్రారంభించారు.