
కోలారు(బెంగళూరు): రాజ్యసభ ఎన్నికల్లో జేడీఎస్ పార్టీ సొంత ఎమ్మెల్యేలకే ఒక్కొక్కరికి రూ. 50 లక్షలు చొప్పున ఇచ్చి కొనుగోలు చేసిందని కోలారు ఎమ్మెల్యే కె శ్రీనివాసగౌడ ఆరోపించారు. శనివారం నగరంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తనకు కూడా రూ. 50 లక్షలు ఇవ్వజూపారని, అయితే తాను తీసుకోలేదని అన్నారు. ఎమ్మెల్యేలను లంచం ఇచ్చి కొనుగోలు చేసిన పార్టీ నాయకులు తన గురించి ఆరోపణలు చేయడంలో అర్థం లేదని అన్నారు.
జేడీఎస్‌కి ఎప్పటి నుంచో దూరంగా ఉన్నానని, అందుకే రాజ్యసభ ఎన్నికలలో కాంగ్రెస్‌కు ఓటేశానని బహిరంగంగానే చెప్పానని అన్నారు. స్థానిక జేడీఎస్ నాయకులు తన ఇంటి ముందు ఆందోళన చేస్తే తాను భయపడేది లేదని అన్నారు. విలేకరుల సమావేశంలో డీసీసీ బ్యాంకు డైరెక్టర్ బ్యాలహళ్లి గోవిందగౌడ పాల్గొన్నారు.
చదవండి: బాబు, పవన్‌కు రాజకీయ హాలిడే
Comments
Please login to add a commentAdd a comment