Odisha MLA Prasant Jagdev Vehicle Runs Over Crowd In Khordha, 22 injured - Sakshi
Sakshi News home page

జనంపైకి దూసుకెళ్లిన ఎమ్మెల్యే కారు.. చితకబాదిన స్థానికులు

Published Sat, Mar 12 2022 5:02 PM | Last Updated on Sat, Mar 12 2022 7:11 PM

Odisha Bjd Mla Prashant Jagdev Vehicle Moves Over Crowd Several Injured - Sakshi

భువ‌నేశ్వ‌ర్: ఒడిశాలో లఖింపుర్‌ ఖేరి తరహా ఘటన చోటు చేసుకుంది. శనివారం బీజూ జ‌న‌తాద‌ళ్ పార్టీ నుంచి స‌స్పెండైన ఎమ్మెల్యే ప్ర‌శాంత్ జ‌గ‌దేవ్ కారు ప్రజల‌పైకి దూసుకెళ్లి బీభ‌త్సం సృష్టించింది. ఈ ఘటన పలువురు గాయపడగా, ఏడుగురు పోలీసులు ఉన్నారు.

వివరాల ప్రకారం.. బ్లాక్ చైర్‌పర్సన్ ఎన్నిక జరుగుతుండగా బీడీఓ బాణాపూర్ కార్యాలయం వెలుపల ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. అయితే అదే సమయంలో అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే కారు అక్కడ గుంపుగా ఉన్న జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 22 మందికి తీవ్ర గాయాలు కాగా ఒకరు మృతి చెందారు.దీంతో ఆగ్రహించిన ప్ర‌జ‌లు ఎమ్మెల్యేపై తిర‌గ‌బ‌డి చిత‌క‌బాదడంతో పాటు ఆయన కారు కూడా ధ్వంసం చేశారు. ఎమ్మెల్యేకు కూడా తీవ్ర గాయాల‌య్యాయి. పార్టీ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డినందుకు జ‌గ‌దేవ్‌ను గ‌తేడాది బీజేడీ నుంచి స‌స్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement