జయపురం: పట్టణంలోని ఇండాల్ సర్వీసింగ్ కేంద్రానికి వచ్చిన కారులో 6 అడుగుల నాగుపాము కనిపించింది. దీంతో సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. వివరాల్లోకి వెళ్తే... నవరంగపూర్ జిల్లాలోని ఇంద్రావతిగుడకు ఆదిత్య పట్నాయక్ తన కారును సర్వీసింగ్ నిమిత్తం తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో బోనెట్ ఎత్తి పరిశీలిస్తున్న మెకానిక్‌కు లోపలి నుంచి శబ్ధం వినిపించింది.
కారు డోర్ ఓపన్ చేసి టార్చ్‌లైట్ వేసి పరిశీలించగా, సర్పం కనిపించింది. దీంతో అక్కడున్న వారంతా ఆందోళనకు గురయ్యారు. ఇంతలో కొందరు చాకచక్యంగా పామును బంధించి నక్కిడొంగర పర్వత ప్రాంతంలో విడిచి పెట్టారు. నవరంగపూర్ లోనే కారు ఇంజిన్‌లో పాము చేరి ఉంటుందని సర్వీసింగ్ సెంటర్ యజమాని తదితరులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
చదవండి కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం.. వాళ్లందరికి రేషన్ కార్డు రద్దు!
Comments
Please login to add a commentAdd a comment