ఒకరి కారు డ్రైవింగ్‌ సరదా.. మరొకరి ప్రాణం తీసింది | Orissa: Car Hits Woman Deceased In Road Accident In Rayagada | Sakshi
Sakshi News home page

ఒకరి కారు డ్రైవింగ్‌ సరదా.. మరొకరి ప్రాణం తీసింది

Published Thu, Nov 25 2021 9:42 AM | Last Updated on Thu, Nov 25 2021 10:40 AM

Orissa: Car Hits Woman Deceased In Road Accident In Rayagada - Sakshi

రాయగడ( భువనేశ్వర్‌): కారు డ్రైవింగ్‌ నేర్చుకునే సరదా నిండు ప్రాణాన్ని బలికొన్న ఘటన స్థానిక రాణిగుడ ఫారం గ్యాస్‌గొడౌన్‌ సమీపంలోని మైదానంలో చోటుచేసుకుంది. ఐఐసీ రస్మీరంజన్‌ ప్రధాన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కరుణాకర్‌ బెహరా అనే యువకుడు స్థానిక మైదానంలో కారు డ్రైవింగ్‌ నేర్చుకుంటున్నాడు. అదే సమయంలో రాణిగుడ ఫారం నకు చెందిన మంగ సొపొరి(32) కూలి పనులను చేసుకునేందుకు ఆ మార్గంలో వెళ్తోంది. కారు అదుపుతప్పి, ఆమెను ఢీకొనడంతో తీవ్రగాయాల పాలైంది. స్థానికులు ఆమెను జిల్లా కేంద్రాస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందింది. దీనికి సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు కరుణాకర్‌ బెహరా, కారును అదుపులోకి తీసుకున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement