న్యూఢిల్లీ: కొంతమంది క్రియేటివిటీని చూస్తే.. దడపుట్టాల్సిందే. అలాంటిదే ఈ కారు వెనుక ఉన్న అస్థిపంజరం బొమ్మ. కానీ, ముందు భయపడినా ఆ క్రియేటివిటీలోని సరదాను చూస్తే మాత్రం నవ్వకుండా ఉండలేం.
ఇన్‌స్ట్రా గామ్‌లో హల్‌చల్ చేస్తున్న ఈ కారు వీడియోకు లైక్ కొట్టుకుండా ముందుకు కదలేం. @behindtheshield911 ఇన్‌స్టా అకౌంట్‌లో షేర్ చేసిన ఆ వీడియోలో ఏముందంటే.. ఓ కారు, కారు వెనుక అస్థిపంజరం బొమ్మ. పక్కనే ‘విందు కావాలంటే హరన్ కొట్టు’ అనే కాప్షన్.
దాన్ని చూసి సరదాగా హరన్ కొడితే ఆ అస్థి పంజరం బొమ్మ వెనక ఉన్న కారుపై పడేలా నీళ్లను వెదజల్లుతుంది. అస్థిపంజరాన్ని చూసి భయపడిన మనకు అది నీళ్లు వెదజల్లే విధానం చూస్తే నవ్వురాకుండా ఉండదు.
చదవండి: థియేటర్ మొత్తం మంటలు, సినిమా చూస్తూ నిమగ్నమైన ప్రేక్షకులు
Comments
Please login to add a commentAdd a comment