హైదరాబాద్: జూబ్లీహిల్స్ పరిధిలోని కృష్ణానగర్‌లో బుధవారం ఓ కారు బీభత్సం సృష్టించింది. కారు హ్యాండ్ బ్రేక్ ఫెయిల్ కావడంతో పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో అంబిక అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.