హైదరాబాద్ : నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ - 45లో ఆదివారం తెల్లవారుజామున కారు బీభత్సం సృష్టించింది. అధిక వేగంతో వెళ్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి... పల్టీ కొట్టింది. ఘటన అనంతరం కారులోని వారు... కారును వదిలి అక్కడి నుంచి పరారైయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... కారును రోడ్డుపై నుంచి పక్కకు తొలగించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే కారు పల్టీ కొట్టిన సమయంలో రహదారిపై వాహనాల రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.