
కారు హల్‌చల్‌పై టీటీడీ ఈవో ఆగ్రహం
తిరుమల: తిరుమలలో శ్రీవారి ఆలయం ప్రధాన ద్వారం వద్దకు ఓ కారు దూసుకురావడంపై ఈవో సాంబశివరావు స్పందించారు. ఇద్దరు హోంగార్డులను సస్పెండ్ చేయడంతో పాటు కారును సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఓ ఎర్ర రంగు కారు మూడు గేట్లను దాటుకుని శ్రీవారి ఆలయం ప్రధాన ద్వారం ముందు వరకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ కారు టీటీడీ బోర్డు సభ్యుడు దొరస్వామి రాజుకు చెందినదిగా అధికారుల విచారణలో తేలింది.అయితే, సెక్యూరిటీ సిబ్బంది నిర్లక్ష్యం బయటపడడంతో ఈవో ఆగ్రహంచి చర్యలకు ఆదేశించారు.