skeleton
-
అస్తిపంజరం డ్యాన్స్ చేస్తున్న దృశ్యాలను మీరెప్పుడైనా చూశారా?
దేవుడున్నాడన్నది ఎంత నిజమో దెయ్యాలు ఉన్నాయన్నది కూడా అంతే నిజం. కూడా దెయ్యాలకూ కొన్ని స్పెషల్ డేస్ ఉంటాయి. అదే హలోవీన్ ఫెస్టివల్. ఈ పండగను పురస్కరించుకొని రకరకాల వికృత వేషాలు చూస్తుంటాం. తాజాగా దుబాయ్‌లో అస్తిపంజరం డ్యాన్స్ చేస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తోంది. భారతీయ సాంప్రదాయంలో పలు పండగలకు ప్రత్యేకమైన విశిష్టతలున్నాయి. అదే విధంగా దెయ్యాలకూ స్పెషల్‌గా పండగలున్నాయి. అదేనండీ మన హలోవీన్ పండగ. ఐర్లాండులో పుట్టిన ఈ పండగ తర్వాతి రోజుల్లో ప్రపంచ దేశాలకూ పట్టింది. హాలోవీన్ అనే స్కాట్లాండ్ పదం ఆల్ హాలో ఈవ్ నుంచి వచ్చింది. 1846లో ఏర్పడిన తీవ్రమైన కరువు కారణంగా ఉత్తర అమెరికాకు వలస వెళ్లిన ఐర్లాండు ప్రజలు.. ఈ సంప్రదాయాన్ని పరిచయం చేశారు. దీన్ని సాంహైన్ పండుగ అని కూడా అంటారు. 2,000 సంవత్సరాల కిందట ఐర్లాండ్, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్‌లోని కొన్ని ప్రాంతాలలో నివసించిన సెల్ట్స్ జాతి ప్రజలు నవంబరు 1ని కొత్త సంవత్సరంగా జరుపుకునేవారు. దానికి ఒకరోజు ముందే హాలోవీన్ వేడుకలు నిర్వహించే సంప్రదాయం కొనసాగుతోంది.పండుగ రోజున మంటలను వెలిగించి, దెయ్యాలను పారదోలాలనే ఉద్దేశంతో ప్రజలు విచిత్రమైన వస్త్రధారణలో ఉంటారు. హలోవీన్ పండ అంటే ప్రాణం ఉన్నవారికి, మరణించినవారికి మధ్య సరిహద్దులు తొలగిపోతాయని అప్పటి ప్రజలు నమ్మేవారు. పూర్వం ‘హాలోవీన్’ రోజున పశువులను బలి ఇచ్చి, వాటి ఎముకలను కాల్చేవారు. ఈ రోజున చెడు ఆత్మలను అనుకరిస్తూ.. దెయ్యాలు, మంత్రగత్తుల్లా వేషాలు వేయడం ఆనవాయితీగా వస్తోంది. హలోవీన్ డే వస్తుందంటే చాలు ప్రజలు పలు హర్రర్ సినిమాల్లోని భయానక పాత్రలను అనుసరిస్తూ వికృత వేషాల్లో కనిపిస్తారు. తాజాగా దుబాయ్‌లో హలోవీన్ డేను పురస్కరించుకొని భారీ డ్రోన్ షోను నిర్వహించారు. ఇందులో ఓ అస్తిపంజరం డ్యాన్స్ చేస్తున్న దృశ్యాలను వీడియోలో చూడొచ్చు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. -
విందు కోసం హారన్ కొట్టు.. చూస్తే మాత్రం నవ్వకుండా ఉండలేం..
న్యూఢిల్లీ: కొంతమంది క్రియేటివిటీని చూస్తే.. దడపుట్టాల్సిందే. అలాంటిదే ఈ కారు వెనుక ఉన్న అస్థిపంజరం బొమ్మ. కానీ, ముందు భయపడినా ఆ క్రియేటివిటీలోని సరదాను చూస్తే మాత్రం నవ్వకుండా ఉండలేం. ఇన్స్ట్రా గామ్‌లో హల్చల్ చేస్తున్న ఈ కారు వీడియోకు లైక్ కొట్టుకుండా ముందుకు కదలేం. @behindtheshield911 ఇన్‌స్టా అకౌంట్లో షేర్ చేసిన ఆ వీడియోలో ఏముందంటే.. ఓ కారు, కారు వెనుక అస్థిపంజరం బొమ్మ. పక్కనే ‘విందు కావాలంటే హరన్ కొట్టు’ అనే కాప్షన్. దాన్ని చూసి సరదాగా హరన్ కొడితే ఆ అస్థి పంజరం బొమ్మ వెనక ఉన్న కారుపై పడేలా నీళ్లను వెదజల్లుతుంది. అస్థిపంజరాన్ని చూసి భయపడిన మనకు అది నీళ్లు వెదజల్లే విధానం చూస్తే నవ్వురాకుండా ఉండదు. చదవండి: థియేటర్ మొత్తం మంటలు, సినిమా చూస్తూ నిమగ్నమైన ప్రేక్షకులు -
భార్య సహకారంతో తోడల్లుడి దారుణం.. 225 రోజులకు దొరికిన అస్తిపంజరం
సాక్షి, హైదరాబాద్: వివాహేతర సంబంధం నేపథ్యంలో గత సంవత్సరం ఆగస్టు 19న రాగ్యానాయక్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి, బతికుండగానే కాళ్లు చేతులు కట్టేసి కృష్ణా నది బ్యాక్ వాటర్‌లో ముంచి హత్య చేసిన విషయం తెలిసిందే. కేసును చేధించిన రాయదుర్గం పోలీసులు అప్పట్లో మృతదేహం కోసం ముమ్మరంగా గాలించినా మృతదేహం ఆచూకీ లభ్యం కాలేదు. కృష్ణానదిలో బ్యాక్ వాటర్ తగ్గడంతో 225 రోజుల తర్వాత చేపల వలలో చుట్టి ఉన్న అస్థి పంజరాన్ని గుర్తించిన తుంగపాడు, లావు తండా వాసులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో శుక్రవారం రాయదుర్గం పోలీసులు అక్కడికి వెళ్లి అస్థి పంజరాన్ని స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా, తుంగపాడు గ్రామానికి చెందిన రాగ్యానాయక్(28), పెద్దవూరకు చెందిన రోజాతో 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. రాగ్యానాయక్ క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తూ మణికొండలో నివాసం ఉండేవారు.. ఇబ్రహీంపట్నం మండలం, గున్గల్ సమీపంలోని ఎల్లమ్మతండాకు చెందిన అతడి తోడల్లుడు లక్పతితో రోజా వివాహేతర సంబంధం కొనసాగించేది. ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి.ఈ క్రమంలో లక్పతి రాగ్యానాయక్‌ను చంపుతానని బెదిరించినట్లు అతని బంధువులు అప్పట్లో రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా లావుతండాలో రాగ్యానాయక్ స్థలాన్ని కొనుగోలు చేసిన లక్పతి అతడికి రూ. 3 లక్షలు బాకీ ఉన్నాడు. గత ఆగస్టు 19న బొంగులూర్ గేట్ వద్దకు వస్తే డబ్బులు ఇస్తానని రాగ్యానాయక్‌ను అక్కడికి పిలిపించుకున్నాడు. దేవరకొండలో డబ్బులు రావాల్సి ఉందని చెప్పి కారులో వెంట తీసుకెళ్లారు. లక్పతితో పాటు అతని స్నేహితులు మన్సింగ్, బాలాజీ, శివ తదితరులు రాగ్యానాయక్‌కు మద్యం తాగించి నేరుడుగొమ్మ మండలం, బుగ్గతండా వద్ద కాళ్లు చేతులు కట్టి, శరీరానికి ఐరన్ రాడ్లు కట్టి, చేపల వలలో చుట్టి, పడవలో తీసుకెళ్లి కృష్ణా నది మధ్యలో పడేశారు. తన భర్త నాలుగు రోజులుగా ఇంటికి రాలేదని, ఫోన్ పని చేయడం లేదని ఆగస్టు 23న అతడి భార్య రోజా రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు రోజా ప్రవర్తనపై అనుమానంతో విచారణ చేపట్టగా లక్పతితో వివాహేతర సంబంధం వెలుగులోకి వచ్చింది. దీంతో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా రాగ్యానాయక్‌ను హత్య చేసినట్లు లక్పతి అంగీకరించడంతో నిందితులిద్దరినీ రిమాండ్‌కు తరలించారు. స్వాధీనం చేసుకున్న అస్థిపంజరానికి దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టు మార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. ఇందులో కొన్ని ఎముకలను డీఎన్ఏ టెస్టుకు పంపనున్నట్లు ఇన్స్పెక్టర్ మహేష్ తెలిపారు. రాగ్యానాయక్ హత్య కేసులో అస్తి పంజరం కీలకంగా మారనుందని ఆయన పేర్కొన్నారు. -
డైనోసార్లకే.. సారు!
విమానమంత పొడవు.. కొంచెం అటూఇటుగా 4 అంతస్తుల ఎత్తు.. 57 టన్నుల బరువు.. ఇది టిటనోసార్..ఈ భూప్రపంచం ఇప్పటివరకూ చూసిన అతి పెద్ద డైనోసార్.. దీని ముందు అంతటి టీ రెక్స్ కూడా జూజూబీనే..ఎప్పుడో పది కోట్ల ఏళ్ల కింద భూమ్మీద తిరుగాడిన ఈ టిటనోసార్ అస్థి పంజరాన్ని లండన్‌లోని నేచురల్ హిస్టరీమ్యూజియంలో ప్రదర్శనకు పెట్టారు. ఆరు డైనోసార్ల ఎముకలతో... 2010లో అర్జెంటీనాలోని ఓ రైతు తన పొలంలో పెద్ద ఎముకను గుర్తించాడు. శాస్త్రవేత్తలు తవ్వకాలు జరపడంతో.. క్రెటాషియస్ కాలానికి చెందిన 6 టిటనోసార్లకు చెందిన 280 ఎముకలు బయటపడ్డాయి. వాటిలో బాగున్న వాటిని కలిపి ఒక పూర్తిస్థాయి టిటనోసార్ అస్థిపంజరాన్ని సిద్ధం చేశారు. దీనికి ‘పటగోటిటన్ మయోరమ్’గా పేరుపెట్టారు. ఈ డైనోసార్ అస్థి పంజరంలోని తొడ ఎముక ఒక్కటే 8 అడుగుల పొడవు, 500 కిలోలకుపైగా బరువు ఉండటం గమనా ర్హం. మొత్తం టిటనోసార్ ఎముకలను లండన్‌కు తరలించేందుకు రెండు విమానాలు కావాల్సి వచ్చాయి. దీన్ని నేచురల్ హిస్టరీ మ్యూజియంలో మార్చి 31 నుంచి వచ్చే ఏడాది జనవరి వరకు ప్రదర్శించనున్నారు. రోజుకు 130 కిలోల ఆకులు, కొమ్మలు.. ♦ శాస్త్రవేత్తలు చెప్పిన వివరాల మేరకు.. ఈ టిటనోసార్ పొడవు 121 అడుగులు, ఎత్తు 40 అడుగులు, బరువు 57 టన్నులకుపైగా ఉంటుందని అంచనా. భూమ్మీద తిరుగాడిన అత్యంత బరువైన, పెద్దదైన జంతువు ఇదే. ♦ ఇది శాఖాహారి. రోజుకు 130 కిలోలకుపైగా చెట్ల ఆకులు, కొమ్మలను తినేస్తుంది. ♦ ఒకసారికి 40 వరకు గుడ్లను పెడుతుంది. అయితే మాంసాహార డైనోసార్లు, ఇతర జంతువులు, ప్రమాదాల కారణంగా ప్రతి వంద టిటనోసార్ పిల్లల్లో ఒక్కటే పూర్తిస్థాయి వరకు ఎదుగుతుందని అంచనా. ♦ అంతపెద్ద డైనోసార్ అయినా.. గుడ్డులోంచి బయటికి వచ్చేప్పుడు బరువు నాలుగైదు కిలోలు మాత్రమే. కానీ ఎదిగే వేగం చాలా ఎక్కువ. పుట్టాక రెండు నెలల్లోనే ఏకంగా 40–50 కిలోల వరకు పెరుగుతాయట. ఇదే మనుషులకు అయితే పది పదిహేనేళ్లు పడుతుంది మరి. ♦ ఆరున్నర కోట్ల ఏళ్ల కింద భూమిని గ్రహశక లం ఢీకొట్టడంతో డైనోసార్లు అంతరించిపోయాయి. ప్రస్తుతం ప్రదర్శనకు పెట్టిన అతిభారీ డైనోసార్.. అంతకు మరో మూడున్నర కోట్ల ఏళ్ల ముందు బతికినది కావడం విశేషం. – సాక్షి, సెంట్రల్ డెస్క్ -
ఆరు నెలల క్రితం అదృశ్యం! చివరికి అస్థిపంజరంగా ఆచూకీ లభ్యం
సాక్షి, బనశంకరి: ఆరు నెలల క్రితం అదృశ్యమైన నేపాలీ మహిళ నిర్జీన ప్రాంతంలో అస్థిపంజరంగా కనిపించింది. హుళిమావు పోలీస్‌స్టేషన్ పరిధిలోని అక్షయనగర అపార్టుమెంట్ వెనుకభాగంలో పొదల మధ్య చెట్టుకు వేలాడుతున్న స్థితిలో ఉన్న అస్థి పంజరం నేపాలీకి చెందిన పుష్పదామి (22)గా పోలీసులు గుర్తించారు. భర్తతో గొడవ పడి... నేపాల్‌కు చెందిన పుష్పాదామి, భర్త అమర్దామి అక్షయనగరలో నివాసం ఉంటున్నారు. భర్త మద్యానికి బానిస. దీంతో అతన్ని భరించలేక నేపాల్‌కు వెళ్లాలని నిర్ణయించుకుంది. ఇదే విషయంపై ఇద్దరి మధ్య గొడవలు తలెత్తాయి. గత ఏడాది జులై 8న భర్తపై కోపంతో ఇంటి నుంచి పుష్పదామి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. భార్య కనిపించకపోవడంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు పలు ప్రాంతాల్లో గాలించినప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు. ఈ ఘటనపై ఆగ్నేయ విభాగ డీసీపీ సీకే.బాబా శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ... ఉరి వేసుకున్న స్థితిలో గురువారం ఉదయం 9.30 గంటల సమయంలో హుళిమావు పరిధిలోని అపార్టుమెంట్ వెనుక భాగంలోని పొదల్లో మనిషి తలపుర్రె,అస్థి పంజరం లభ్యమైంది. అస్థిపంజరం పైన పాదరక్షలు, మెడలో ఉన్న నెక్లెస్, ఇతర వస్తువులు అక్కడ పక్కనే లభించాయి. అక్కడ ఎక్కువగా సంచారం లేకపోవడం నిర్జీన ప్రదేశం కావడంతో ఆ వస్తువులు ఎవరూ తీసుకోలేదు. ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసిందని సీకే బాబా తెలిపారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. (చదవండి: మొబైల్ చూడొద్దని మందలించారని...) -
వామ్మో ఇంత పెద్ద చెయ్యి.. కొంపతీసి ఏలియన్‌దా?
సముద్రతీరంలో హాయిగా నడుచుకుంటూ వెళ్తున్న ఓ ప్రేమ జంటకు ఇసుకలో ఓ పొడవాటి వస్తువులాంటింది కన్పించింది. వెంటనే దాన్ని బయటకు తీయగా.. అది అస్థిపంజరం చేతి. దాని పరిమాణం చూసి ఇద్దరూ కంగుతిన్నారు. ఇది కచ్చితంగా మనిషిది కాదని, భయాందోళన వ్యక్తం చేశారు. బ్రెజిల్లో నవంబర్ 20న ఈ ఘటన జరిగింది. అస్థిపంజరం చూసి హడలిపోయిన లెటిసియా గోమ్స్, ఆమె బాయ్‌ఫ్రెండ్ డెవనీర్ సౌజ్ వెంటనే దాన్ని ఫొటో తీశారు. అది ఏ సైజులో ఉందో చెప్పేందుకు డెవనీర్ తన చెప్పును కొలమానంగా చూపాడు. దొరికిన అస్తిపంజరం చేతిలోని వేలు.. ఆ చెప్పు కంటే పెద్దగా ఉండటం చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. ఈ చేతి కచ్చితంగా సాధారణ మనుషులది కాదని, కొంపతీసి ఏలియన్స్ది అయి ఉంటుందా? అని ఈ ప్రేమికులు ఆందోళన చెందారు. మరోవైవు నెటిజన్లు దీనిపై భిన్నమైన కామెంట్లు చేశారు. ఇది కచ్చతింగా ఏలియన్ చేతి అయి ఉంటుంది, వెంటనే దీన్ని పరిశోధనకు పంపించండి అని ఓ యూజర్ కామెంట్ చేశాడు. మరో యూజర్ అది జల కన్య చేతి అయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశాడు. మరో యూజర్ ఇది డైనోసార్ చేతి అయి ఉంటుందని పేర్కొన్నాడు. మరోవైపు ఇది డాల్ఫిన్, తిమింగలం వంటి జాతికి చెందిన సముద్ర జీవి అస్థి పజరం అయి ఉంటుందని, 18 నెలల క్రితం అది ఆ ప్రాంతంలోనే చనిపోయిందని ఓ సముద్ర జీవ శాస్త్రవేత్త చెప్పుకొచ్చారు. అయితే దీన్ని ధ్రువీకరించేందుకు కచ్చితంగా పరీక్షలు చేయాల్సిందేని స్పష్టం చేశారు. చదవండి: Guinness World Records: ఆ పిల్లి వయసు 26 -
డైనోసార్ అస్థిపంజరానికి 49 కోట్లు..
కొనుక్కోవాలి అనుకోవాలి గానీ.. మనం రాక్షసబల్లి అస్థిపంజరాన్ని కూడా కొనుక్కోవచ్చు. ఈ గార్గోసారస్ డైనోసార్ అస్థిపంజరాన్ని రూ.49 కోట్లకు సొంతం చేసుకున్నాడో వ్యక్తి. న్యూయార్క్‌లో సదబీస్ సంస్థ నిర్వహించిన వేలంలో అస్థిపంజరంతోపాటు దానికి పేరుపెట్టే హక్కులు కూడా ఆయనకు లభించాయి. ఇది 7.7 కోట్ల సంవత్సరాల కిందటిదట. ఈ డైనోసార్ 10 అడుగుల ఎత్తు, 20 అడుగుల పొడవుంది. ఓ డైనోసార్ అస్థిపంజరం ఇంత ఎక్కువ ధరకు అమ్ముడవ్వడం ఇదే తొలిసారట. అది బతికున్నప్పుడు రెండు టన్నుల బరువు ఉండొచ్చని అంచనా. -
కాసుల వర్షం కురిపించిన డైనోసర్ అస్థిపంజరం.. ఏకంగా రూ. 96 కోట్లు..
11 కోట్ల ఏళ్ల నాటి ఓ డైనోసార్ అస్థిపంజరం ఇటీవల ఓ వేలంలో దాదాపు రూ. 96 కోట్లు పలికిందంటే నమ్ముతారా! వేలం వేసిన వాళ్లే ఎక్కువలో ఎక్కువగా రూ. 50 కోట్ల వరకు వస్తాయనుకుంటే.. వాళ్ల అంచనాలను తలకిందులు చేసిందీ ఈ అస్థిపంజరం. కాసుల వర్షం కురిపించింది. ఇంతకీ అంత ప్రత్యేకత ఏముంది ఇందులో అనుకుంటున్నారా? ఇప్పటివరకు దొరికిన డైనోసార్ అస్థిపంజరాల్లో అతి పెద్దది, పూర్తి ఆకారంలో లభించింది ఇదే మరి. అంతేకాదు.. టీరెక్స్ తరహాలో ఇది బాగా ఫేమస్.. పేరు డైనానుకస్ యాంటిరోపస్. జురాసిక్ పార్క్ చిత్రంలో కిచెన్‌లో పిల్లలను వెంటాడే రాక్షస బల్లి ఇదే. చదవండి: బట్టతల ఉన్నవారికి ఊరటనిచ్చే వార్త.. ఇక ఎగతాళి చేశారో అంతే! 2012 నుంచి 2014 మధ్య అమెరికాలోని మోంటానాలో ఉన్న వూల్ఫ్ లోయలో పురావస్తు శాస్త్రవేత్తలు రాక్, రాబర్ట్ ఓవన్ జరిపిన తవ్వకాల్లో ఇది బయటపడింది. దీని ఎత్తు 4 అడుగులు, పొడవు 10 అడుగులు. ఆ సమయంలో అస్థిపంజరంలో 126 ఎముకలున్నాయి. ఆ తర్వాత పురాతత్వ శాస్త్రవేత్తలు దీనికి తుది రూపును తీసుకొచ్చారు. ఇందులో పుర్రె భాగంలో చాలా వరకు, ఎముకల్లో కొన్నింటిని మళ్లీ కొత్తగా రూపొందించారు. ప్రపంచంలో ప్రైవేట్ వ్యక్తుల వద్ద ఉన్న ఒకే ఒక డైనోసార్ అస్థిపంజరం ఇదే. అయితే ఇంత ధర పెట్టి ఈ అస్థిపంజరాన్ని ఎవరు కొన్నారో మాత్రం చెప్పలేదు. – సాక్షి, సెంట్రల్ డెస్క్ -
150ఏళ్ల నాటి మానవ అస్తిపంజరం అక్కడ చూడొచ్చు!
డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ): మారుతున్న జనరేషన్..నానాటికీ అభివృద్ధి చెందుతున్న శాస్త్ర సాంకేతిక రంగానికి ప్రయోగం అనేది అత్యంత కీలకం. మనిషి పుట్టుక ఎలా? తల్లి గర్భంలో శిశువు.. వందల ఏళ్ల నాటి జంతు కలేబరాలు.. వివిధ రకాల జలచరాలు. శతాబ్దంన్నర నాటి మానవ అస్తిపంజిరం. ఇలా.. మానవ.. జంతు పుట్టుకలతో కూడుకున్న ప్రయోగశాల విశాఖ మహానగరంలో ఒకే ఒక కళా శాలలో ఉంది. అదే ఏళ్ల చరిత్ర గల ఏవీఎన్ కళాశాల. ఏవీఎన్ కళాశాలలో స్వాతంత్య్రం రాకముందు జువాలజీ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. ల్యాబ్‌తో పాటు మ్యూజియంను కూడా ఏర్పాటు చేశారు. ఈ ప్రయోగశాల/మ్యూజియంలో విశాఖలో మరెక్కడా దొరకని.. లభించని అనేక వస్తువులు పొందుపరిచారు. ఈ మ్యూజియంలో వేలాది స్పెసిమెన్స్, 100కు పైగా ఓస్టీయాలజీ స్పెసిమెన్స్, 75 రకాల మోడల్ స్పెసిమెన్స్తో పాటు 878 బాటిల్ స్పెసిమెన్స్, 700 పర్మినెంట్ స్లైడర్స్ ఉన్నాయి. మానవుని పూర్తి అస్తిపంజిరం (ఒరిజనల్), డాల్ఫిన్ అస్తిపంజిరం, ఏనుగు పుర్రె, హ్యూమన్ బ్రెయిన్, 6,7,8 నెలల మానవ పిండాలు, మానవుని గుండె, రెండు తలల బాతుపిల్ల, ఫైవ్ లెగ్డ్ ఫ్రాగ్, తొండం గల పంది పిండం..ఇలా ఎన్నెన్నో మానవుని..జంతువుల అవయవాలు సేకరించారు. అంతేగాక మైక్రోస్కోప్స్..మోనుక్యులర్ అండ్ బైనాక్యులర్, ఆటోక్లేవ్స్, సెంట్రిఫూగ్స్, ఎపిడయోస్కోప్, ఫొటోగ్రఫి ఎక్విప్మెంట్, రోటరీ మైక్రోటోమ్, డైనోసర్,హిమోగ్లోబిన్మీటర్స్, హిమోసైటోమీటర్స్, వాటర్ బాత్..సెవరల్ బయాలజికల్ చార్ట్స్ ఉన్నాయి. వీరంతా ఇక్కడి వారే.. ఏయూ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్, మెరైన్ లివింగ్ రిసోర్స్ విభాగాధిపతి ప్రొఫెసర్ కేవీ రమణమూర్తి, ఏయూ జువాలజీ విభాగ ఫ్యాకల్టీ మెంబర్ డాక్టర్ లలితకుమారి, ఆంధ్రా మెడికల్ కళాశాల ఆర్థోపెడిక్ సర్జన్, ఆర్థోపెడిక్ విభాగాధిపతి డాక్టర్ బి.దాలినాయిడుతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపాల్ సెక్రటరీగా పనిచేసిన కేవీ రావు, తమిళనాడు ప్రభుత్వ ప్రిన్సిపాల్ సెక్రటరీ కె.సత్యగోపాల్, న్యూఢిల్లీ డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ పి.రమేష్‌నాయుడు, సినీ ప్రముఖుడు ఎస్వీ రంగారావు, మాజీ కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజు, మాజీ మేయర్ రాజాన రమణి, శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డు గ్రహీత, సైంటిస్ట్ డాక్టర్ శొంటి రమేష్‌తో పాటు ఎందరో ఇదే కళాశాలలో..ఇదే విభాగంలో విద్యనభ్యసించి ఉన్నత స్థానాలకు వెళ్లారు. కళాశాల జువాలజీ.. ఫిషరీస్ విభాగాధిపతులు వీరే.. 1940లో కళాశాలలో జువాలజీ విభాగం ఏర్పాటు చేశారు. అప్పట్లో ఎ.శ్రీనివాస్ విభాగాధిపతిగా సేవలందించారు. అనంతరం 1945 నుంచి 1975వరకు వీఎస్ వేంకటేశ్వర్లు, 1975 నుంచి 1990 వరకు బీహెచ్‌వీ సీతారామస్వామి, 1990 నుంచి 1993 వరకు డాక్టర్ బి.నాగేశ్వరరావు, 1993 నుంచి 2002 వరకు డాక్టర్ జి.శివరామకృష్ణ, 2002 నుంచి 2010 వరకు బి.విజయభాస్కరరావు విభాగాధిపతులుగా సేవలందించగా 2010 నుంచి ఇప్పటి వరకు డాక్టర్ కె.పుష్పరాజు విభాగాధిపతిగా కొనసాగుతున్నారు. ఇటువంటి మ్యూజియం మరెక్కడా లేదు.. గ్రేటర్ విశాఖ పరిధిలోనే గాక ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మరెక్కడా లేని ప్రయోగశాల/మ్యూజియం ఏవీఎన్లోనే ఉంది. ఎంతో మంది ఈ కళాశాల నుంచే ఉన్నత పదవులు అధిరోహించారు. మానవ పిండాలకు సంబంధించి ఆంధ్రా మెడికల్ కళాశాల విద్యార్థులు కూడా తరచూ ఇక్కడకే వస్తుంటారు. –ఆచార్య డి.విజయప్రకాష్, ప్రిన్సిపాల్, ఏవీఎన్ కాలేజ్ చాలా అరుదైనది ఏవీఎన్ కళాశాల జువాలజీ నుంచి సినీ నటుడు ఎస్వీ రంగారావు, ఐఏఎస్ అధికారి కేవీ రావు వంటి వారు ఎందరో ఇక్కడే విద్యనభ్యసించారు. ఏవీఎన్ కళాశాల జువాలజీ మ్యూజియంలో అరుదైన స్పెసిమెన్లలో సహజ మానవ అస్తిపంజిరం, డాల్ఫిన్ అస్తి పంజిరం, 6,7,8 నెలల మానవ పిండాలు, రెండు తలల బాతు పిల్ల, తొండం గల పంది పిండం వంటివి ఎన్నో సేకరించాం. –రాంకుమార్, జువాలజీ ఇన్చార్జి -
చనిపోయిన సోదరుడి అస్థిపంజరంతోనే కలిసి ఉంటున్న సోదరులు
వాషింగ్టన్: టెక్సాస్‌లో ఓ తల్లి తన నలుగురి పిల్లల్ని హ్యస్టన్ అపార్ట్మెంట్లో వదిలేసి తన భాగస్వామితో కలిసి ఉంటోంది. పైగా ఆమె తన భాగస్వామితో కలిసి ఒక కొడుకుని హత్య చేసి చంపేసిందనే అనుమానంతో ఆమెను అరెస్టు చేసినట్లు టెక్సాస్ పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె కొడుకులు ముగ్గురు హ్యుస్టన్ అపార్ట్మెంట్లో చనిపోయిన తమ సోదరుడి అస్థిపంజర అవశేషాలతో కలిసి ఉంటున్నట్లు వెల్లడించారు. (చదవండి: నా భార్య బాధ తట్టుకోలేకపోతున్నా.. నన్ను జైల్లో పడేయండి!) ఈ క్రమంలో ఆ పిల్లలు తల్లి 35 ఏళ్ల గ్లోరియా విలియమ్స్ సాక్ష్యాలను తారుమారు చేసే నిమిత్తం ఆ పిల్లలను గాయపరిచినట్లు తెలిపారు. అంతేకాదు ఆ పిల్లలు ముగ్గురే ఆ అపార్ట్మెంట్లో ఉంటున్నారని, చాలా కాలంగా తలితండ్రులిద్దరూ అక్కడ నివశించటం లేదని పేర్కొన్నారు. అయితే ఆ పిల్లలు చాలా భయంకరమైన దయనీయమైన పరిస్థితుల్లో జీవిస్తున్నారన్నారు. అంతేకాదు ఆ ముగ్గురి పిల్లల్లో ఇరుగు పొరుగు వారి నుంచి ఆహారం తెచ్చుకుని జీవించేవారిని చెబుతున్నారని పోలీసులు అన్నారు. (చదవండి: చూడటానికి పంది రూపు... కానీ అది దూడ) -
24 ఏళ్ల తర్వాత తెరిచిన లిఫ్ట్.. భయపెట్టిన దృశ్యం
లక్నో: ఓ ఆస్పత్రిలో దాదాపు 24 ఏళ్లుగా మూసి ఉన్న ఎలివేటర్‌ని రెండు మూడు రోజుల క్రితం తెరిచారు. అయితే అనూహ్యంగా దానిలో వారికి ఓ అస్థిపంజరం కనిపించి భయభ్రాంతులకు గురి చేసింది. విషయం పోలీసులు తెలియడంతో వారు అక్కడకు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. ఉత్తరప్రదేశ్ బస్తి జిల్లా కైలీ ప్రాంతంలో 1991 సంవత్సరంలో 500 పడకలతో ఓపెక్ ఆస్పత్రిని ప్రారంభించారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో ఉన్న ఎలివేటర్ పాడు కావడంతో ఆరు సంవత్సరాల తర్వాత అనగా 1997లో మూసి వేశారు. అప్పటి నుంచి క్లోస్ చేసి ఉన్న ఈ ఎలివేటర్‌ని 24 ఏళ్ల తర్వాత అనగా ఈ ఏడాది సెప్టెంబర్ 1న తెరిచారు. ఈ క్రమంలో దానిలో వారికి ఓ అస్థిపంజరం దర్శనమిచ్చి భయభ్రాంతులకు గురి చేసింది. (చదవండి: ‘దృశ్యం’ సీన్: పోలీస్‌స్టేషన్‌లో అస్థిపంజరం) ఈ విషయం పోలీసులకు తెలియడంతో వారు ఆస్పత్రి వద్దకు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఫోరెన్సిక్ సిబ్బంది ఈ మిస్టరీని ఛేదించే పనిలో ఉన్నారు. ఈ అస్థిపంజరం పురుషుడిదిగా గుర్తించారు. ఇక పోలీసులు గత 24 ఏళ్లుగా ఈ ప్రాంతంలో నమోదైన మిస్సింగ్ పర్సన్స్ ఫిర్యాదులను పరిశీలిస్తున్నారు. (చదవండి: ముగ్గురు భార్యలు.. 3 అస్థిపంజరాలు: వీడిన మిస్టరీ) ప్రస్తుతం పోలీసులు పని చేయని లిఫ్ట్‌లోకి ఈ వ్యక్తి ఎందుకు వెళ్లాడు... అతడే లోపలికి వెళ్లాడా.. లేక ఎవరైనా అతడిని హత్య చేసి ఆ తర్వాత మృతదేహాన్ని తీసుకువచ్చి.. దీనిలో పడేశారా.. లేక పొరపాటున సదరు వ్యక్తి లిఫ్ట్‌లో ఇరుక్కుపోయి.. ఊపిరాడక చనిపోయి ఉంటాడా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. డీఎన్ఏ రిపోర్ట్ వస్తే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుస్తాయంటున్నారు పోలీసులు. (చదవండి: ఈ బుడ్డోడు సూపర్.. అస్థిపంజరంతో కలిసి) ఈ సందర్భంగా బస్తి జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. దీనికి సంబంధించి ఎవరైనా రాతపూర్వక ఫిర్యాదు ఇస్తే.. మేం కేసు నమోదు చేస్తాం. ప్రస్తుతం పోలీసులు పలు కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ మగ అస్థిపంజరం వెనక ఉన్న మిస్టరీని పరిష్కరించడానికి జిల్లాలోని 24 పోలీసు స్టేషన్ల పోలీసులు పని చేస్తున్నారు అని తెలిపారు. -
ఇంటి వరండాలో అస్థి పంజరం.. ఒక్కసారిగా షాక్..
తిరువొత్తియూరు (తమిళనాడు): చెన్నై అమింజికరైలో చాలా రోజులుగా తాళం వేసి ఉన్న ఇంటిలో అస్థిపంజరం బయటపడింది. రైల్వే కాలనీ 3వ వీధికి చెందిన మహేష్ (45)కు అదే ప్రాంతంలో సొంత ఇల్లు ఉంది. అది శిథిలం కావడంతో తాళం వేశారు. శుక్రవారం ఇంటిని శుభ్రం చేయడానికి తాళం తీశారు. ఆ ఇంటి వరండాలో అస్థిపంజరం ఉండడాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఇన్స్పెక్టర్ కృపానిధి విచారణ చేపట్టారు. మృతి చెందిన వ్యక్తి మహేష్ అన్న రమేష్ (49)గా తేలింది. రమేష్ కారు డ్రైవర్ అని, అతనికి పెళ్లి కాకపోవడంతో ఆ ఇంటిలో ఒంటరిగా ఉన్నట్టు గుర్తించారు. ఎముకల గూటిని ఫోరెన్సిక్ పరీక్ష కోసం ల్యాబ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
Dinosaur: డైనోసార్ వెంట పడితే?
ఓ పేద్ద డైనోసార్ వెంటపడుతోంది.. ముందు జీపులో ముగ్గురు వ్యక్తులు.. స్పీడుగా పోనీయ్ అంటూ భయంతో అరుస్తున్నారు.. డైనోసార్ ఇంకా వేగంగా దగ్గరికి వచ్చేసింది.. నోరు తెరిచి జీపులోని ఒకరిని అందుకోబోయింది.. సరిగ్గా అప్పుడే జీపు వేగం పెరిగింది.. వారు డైనోసార్ నుంచి తప్పించుకున్నారు. జురాసిక్ పార్క్–1 సినిమాలోని ఒళ్లు గగుర్పొడిచే సీన్ ఇది. అంతసేపూ ఊపిరిబిగబట్టి చూస్తున్న మనం కూడా ఒక్కసారిగా హమ్మయ్య అని రిలాక్స్ అవుతాం. ఆ సీన్లో జీపు వెంటపడే డైనోసార్ టి–రెక్స్. డైనోసార్లలో అన్నింటికన్నా ప్రమాదకరమైనది అది. మరి ఇప్పుడు నిజంగానే ఓ పెద్ద టీ–రెక్స్ కనిపించి మన వెంట పడిందనుకోండి. అప్పుడెట్లా.. అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదంటున్నారు శాస్త్రవేత్తలు. సినిమాలో టి–రెక్స్ అలా వేగంగా జీపు వెంటపడినట్టు చూపించారుగానీ.. నిజానికి ఆ డైనోసార్ అంత వేగంగా పరుగెత్తలేదట. అది నడిచే వేగం మహా అయితే గంటకు 4.5 కిలోమీటర్ల వరకే ఉంటుందట. అంటే మనుషులు కాస్త వేగంగా నడవడంతో సమానం అన్న మాటే. ఒకవేళ దానికి మరీ కోపం వచ్చి మన వెంట పడినా గంటకు 27 కిలోమీటర్ల వేగంతో పరుగెత్తగలవని మరికొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మనుషులు అంతకన్నా వేగంగా పరుగెత్తగలరని అంటున్నారు. డైనోసార్ అస్థి పంజరంపై పరిశోధనతో అమెరికాలోని మోంటానా స్టేట్‌లో 2013లో ఒక డైనోసార్ పూర్తి శిలాజాన్ని గుర్తించారు. 13 మీటర్ల పొడవు, సుమారు 6 టన్నుల బరువైన ఆ ఆడ టి–రెక్స్ అస్థి పంజరంపై నెదర్లాండ్స్‌కు చెందిన శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. ఆ డైనోసార్ తోక ఒక్కటే సుమారు వెయ్యి కిలోల బరువు ఉండి ఉంటుందని, డైనోసార్ నడిచినప్పుడు అది పైకి, కిందికి ఊగుతుందని తేల్చారు. దాని మొత్తం శరీరం, తోక, బరువు ఆధారంగా పరిశీలించి.. టి–రెక్స్ గంటకు 2.8 మైళ్లు (4.5 కిలోమీటర్ల) వేగంతో కదిలేదని నిర్ధారించారు. ఈ లెక్కన మనుషులు కాస్త వేగంగా పరుగెడితే టి–రెక్స్ నుంచి తప్పించుకోవచ్చన్న మాట. అయితే కథ అప్పుడే అయిపోలేదు. తోడేళ్లలా.. గుంపుగా.. టి–రెక్స్ మెల్లగా కదిలినా దాని నుంచి తప్పించుకోవడం కష్టమేనట. టి–రెక్స్‌లు మనం ఊహించినదాని కంటే మరింత ప్రమాదకరమైనవని.. అవి తోడేళ్లలాగా గుంపులుగా మాటేసి, వేటాడేవని అమెరికాలోని సదరన్ ఉటా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. 2014లో అమెరికాలో ఒకే చోట పెద్ద సంఖ్యలో డైనోసార్ల శిలాజాలను కనుగొన్నారు. దానిపై శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. అక్కడ డైనోసార్లతోపాటు తాబేళ్లు, మొసళ్లు, చేపల శిలాజాలను కూడా గుర్తించారు. డైనోసార్లు గుంపులుగా వేటాడి, ఆహారాన్ని పంచుకు తినేవని తేల్చారు. -
ముగ్గురు భార్యలు.. 3 అస్థిపంజరాలు: వీడిన మిస్టరీ
చండీగఢ్: కొద్ది రోజుల క్రితం హర్యానా పానిపట్‌లోని ఓ ఇంట్లో మూడు అస్థిపంజరాలు కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసును చాలెంజ్‌గా తీసుకున్న పానిపట్ పోలీసులు నాలుగు రోజుల్లోనే ఈ మిస్టరీని చేధించారు. దీనికి సంబంధించి యూపీకి చెందిన అశాన్ సైఫీ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అసలు ఈ కేసు ఎలా వెలుగులోకి వచ్చింది అంటే నాలుగు రోజుల క్రితం సరోజ్ అనే మహిళ పానిపట్ శివ్ నగర్లో తాను గతంలో కొన్న ఇంటిని రెన్నోవేషన్ చేస్తుండగా మూడు అస్థిపంజరాలు బయపటడ్డాయి. సరోజ్ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించి నిందితుడిని అశాన్ని అరెస్ట్ చేశారు. అతడు గతంలో ఈ ఇంటి ఓనర్. అశాన్ పవన్ అనే వ్యక్తికి తన ఇంటిని అమ్మాడు. ఆ తర్వాత 2017లో పవన్ వద్ద నుంచి సరోజ్ ఈ ఇంటిని కొనుగోలు చేసింది. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ఇంటి పాత యజమానుల గురించి చట్టు పక్కల వారిని ప్రశ్నించగా.. అశాన్ ప్రవర్తన సరిగా ఉండేది కాదని తెలిపారు. దాంతో అతడి మీద అనుమానంతో అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేయగా.. అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఐదేళ్ల క్రితం తానే ఈ ముగ్గురిని హత్య చేసి పానిపట్‌లోని తన పాత ఇంటిలో పూడ్చి పెట్టానని.. సరోజ్‌కు కనిపించిన అస్థి పంజరాలు అవేనని తెలిపాడు. ఈ ముగ్గురు వ్యక్తులు ఎవరంటే తన రెండో భార్య, ఆమె కుమారుడు.. మరో బంధువు 15 ఏళ్ల కుర్రాడు అని వెల్లడించాడు అశాన్. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. ‘‘కార్పెంటర్‌గా పని చేసే అశాన్ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉండేవాడు. మ్యాట్రిమోనియల్ సైట్ల ద్వారా మహిళలతో పరిచయం పెంచుకుని పెళ్లి చేసుకుంటానని నమ్మించి వారిని మోసం చేసేవాడు. ఈ క్రమంలో అశాన్‌కు కొన్ని సంవత్సరాల క్రితం ముంబైకి చెందిన నజ్నీన్‌తో పరిచయం ఏర్పడింది. అయితే అప్పటికే అతడికి వివాహం అయ్యి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. మొదటి భార్య, ఆమె సంతానం యూపీలో నివసిస్తుండేవారు. ఈ క్రమంలో అశాన్ తనకు పెళ్లి అయిందనే విషాయన్ని దాచి నజ్నీన్‌ను రెండో వివాహం చేసుకున్నాడు. అనంతరం అశాన్ పానిపట్‌కు తన మకాం మార్చాడు. ఆ తర్వాత అప్పుడప్పుడు మొదటి భార్య వద్దకు వెళ్లి వస్తుండేవాడు’’ అని తెలిపారు పోలీసులు. ‘‘ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే అశాన్ మొదటి వివాహం గురించి నజ్నీన్కు తెలిసింది. ఇక అప్పటి నుంచి ఆమె మొదటి భార్య వద్దకు వెళ్లనివ్వలేదు. దాంతో ఆగ్రహానికి గురైన అశాన్ రెండో భార్య, ఆమె కుమారుడు, మరో 15 ఏళ్ల పిల్లాడిని చంపాలని డిసైడ్ అయ్యాడు. వారికి విషం పెట్టాడు. మరణించిన అనంతరం వారిని పానిపట్‌లో తాను నివాసం ఉన్న ఇంట్లో పూడ్చి పెట్టాడు. ఆ తర్వాత ఈ ఇంటిని పవన్‌కు అమ్మాడు. అనంతరం ముచ్చటగా మూడో సారి పెళ్లి చేసుకుని ప్రస్తుతం యూపీ భదోహిలో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో అస్థిపంజరాలు వెలుగు చూడటం.. ఇరుగుపొరుగు వారు చెప్పిన దాని ప్రకారం అశాన్ మీద అనుమానం రావడంతో యూపీ వెళ్లి అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి’’ అని పోలీసులు తెలిపారు. చదవండి: ‘దృశ్యం’ సీన్: పోలీస్‌స్టేషన్‌లో అస్థిపంజరం యువకుడిని రాడ్డుతో కొడుతూ చిత్ర హింసలు పెట్టి.. -
‘దృశ్యం’ సీన్: పోలీస్‌స్టేషన్‌లో అస్థిపంజరం
సూరత్: దృశ్యం సినిమా గుర్తుందా! దాదాపు అలాంటి సంఘటన గుజరాత్‌లోని సూరత్ జిల్లాలో జరిగింది. జిల్లాలోని ఖటోదర పోలీసు స్టేషన్ ప్రాంగణంలో మానవ అస్థిపంజర అవశేషాలు కనిపించడంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. స్టేషన్లో నిలవ ఉంచిన సీజ్ చేసిన వాహనాలను తొలగించే క్రమంలో ఈ అస్థిపంజరం కనిపించిందని అధికారులు చెప్పారు. రెండేళ్లుగా వాహనాల తొలగింపు జరగలేదని, దీంతో తాజాగా ఈప్రక్రియను చేపట్టామని తెలిపారు. ఈ క్రమంలో ఒక పుర్రె, దిగువ అస్థి అవశేషాలు కనిపించాయని, వీటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామని, పోలీసులు విచారణ జరుపుతున్నామని తెలిపారు. (చదవండి: ఒక్క రేషన్ కార్డులో 68 మంది సభ్యులు) -
షాకింగ్.. అంకుల్ అస్థిపంజరాన్నే గిటార్‌గా చేసి..
ఓ వ్యక్తి గిటారు వాయించడం ప్రస్తుతం వైరల్‌గా మారింది. అయితే ఆయన గిటార్ వాయించడంలో దిట్ట కాదు, లేదా మైమరిపించే సంగీతాన్ని అందించి రికార్డులు సృష్టించిన వ్యక్తి కాదు. మరి ఎందుకు అంత వైరల్ అయిందనే కదా మీ డౌటనుమానం? ఆయన సంగీత విద్యలో వైవిధ్యం లేదు కానీ.. ఆయన వాయించే గిటారు పరికరంలో మాత్రం ఉంది. ఆ గిటారు చెక్కతోనో, తేలికైన లోహాలతోనో తయారు చేసిందో కాదు..మనిషి అస్థిపంజరంతో తయారు చేసింది. ఏంటి షాకవుతున్నారా? నిజమండి బాబు.. తన అంకుల్ అస్థిపంజరంతో గిటారు తయారు చేసి.. దానితో మ్యూజిక్ వాయిస్తున్నాడు నార్వేకు చెందిన ప్రిన్స్ మిడ్నైట్ అనే యువకుడు. తన అంకుల్ మరణించాక తన అస్థిపంజరంలోని చాతి నుంచి నడుము భాగం వరకు ఉండే ఎముకల గూడును ఉపయోగించి ఆరు ఎలక్ట్రిక్ స్ట్రింగ్స్ గల గిటారు తయారు చేశాడు. దాన్ని లయబద్ధంగా వాయిస్తూ ఆ వీడియోలను యూట్యూబ్‌లోనూ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియోలు వైరల్‌గా మారాయి. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. తన అంకుల్ ఫిలిప్ గౌరవార్థం ఈ గిటారు తయారు చేశానని తెలిపాడు. ‘కొన్నేళ్ల కిందట మా అంకుల్ ఫిలిప్ చనిపోయాడు. ఆయన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు జరపకుండా.. భౌతిక కాయాన్ని మెడికల్ కాలేజ్‌కు దానమిచ్చారు. ఇటీవల మెడికల్ కాలేజ్ ఆయన అస్థిపంజరాన్ని ఖననం చేయాలని నిర్ణయించుకొని ఆ విషయాన్ని మా అంకుల్ కుటుంబానికి తెలియజేశారు. కానీ వారి తిరస్కరించారు. దీంతో ఆ అస్థిపంజరాన్ని నేను తీసుకొని గిటారు తయారు చేశాను. నా నిర్ణయాన్ని ఆయన కుటుంబ సభ్యులు కూడా స్వాగతించారు. ప్రస్తుతం ఈ గిటారు చక్కగా పని చేస్తుంది’అని ప్రిన్స్ మిడ్నైట్ తెలిపాడు. -
కార్పెంటర్ షాప్‌లో అస్థిపంజరం
అమీర్‌పేట(హైదరాబాద్): బోరబండ ఇందిరానగర్ ఫేజ్–2లో బుధవారం దారుణ సంఘటన వెలుగుచూసింది. కార్పెంటర్ షాపులో ఓ వ్యక్తి అస్థి పంజరం బయటపడింది. షాపు యజమానే ఎవరినో హత్య చేసి పెట్టెలో పెట్టి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన పలాష్ పాల్ అనే వ్యక్తి గాయత్రీనగర్‌లో ఉంటూ కార్పెంటర్‌గా పనిచేసేవాడు. ఇందిరానగర్‌లోని కనకదుర్గా భవానీ, షిరిడీ సాయిబాబా ఆలయం కింద ఉన్న సెల్లార్‌ను 2017లో అద్దెకు తీసుకుని కార్పెంటర్ షాపు నిర్వహిస్తున్నాడు. సంవత్సరంపాటు ప్రతినెలా అద్దెను చెల్లిస్తూ వచ్చిన పాల్ ఆ తరువాత వాటిని సకాలంలో ఇవ్వడం లేదు. పాల్ ప్రతినెలా అద్దె ఇవ్వని కారణంగా షాపు ఖాళీ చేయించాలన్న నిర్ణయానికి వచ్చి రెండురోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మంగళవారం వచ్చి ట్రస్టు సభ్యుల సమక్షంలో షాపు తాళాలు తెరిచి అందులోని సామాన్లను ఓ చోట భద్రపరిచాలని సూచించారు. అనంతరం గోవర్ధన్ అనే వ్యక్తికి షాపును అద్దెకు ఇచ్చారు. బుధవారం ఉదయం షాపులో ఓ పక్కకు కనిపించిన పెట్టెను గోవర్ధన్ తెరిచి చూడగా అస్థిపంజరం బటయపడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి వచ్చి పెట్టెలోని అస్థిపంజరాన్ని బయటకుతీశారు. హత్యకు గురైన వ్యక్తి ఎవరన్నది తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. కార్పెంటర్ పలాష్ పాల్‌కు ఓ మహిళతో అక్రమ సంబంధం ఉండేదని తెలుస్తోంది. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. -
ఈ బుడ్డోడు సూపర్.. అస్థిపంజరంతో కలిసి
పిల్లలు దెయ్యాల కథల వింటే చాలు భయపడిపోతారు. అలాంటిది ఇక్కడ ఒక బుడ్డోడు మాత్రం ఏకంగా అస్థిపంజరాన్ని వెంటపెట్టుకొని తిరుగుతున్నాడు. రోజు అస్థిపంజరం చూడకుండా కనీసం బాత్రూమ్కు కూడా వెళ్లడు. అయితే ఈ పిల్లాడికి అస్థిపంజరం ఎక్కడ దొరికంది.. దానితో ఎలా స్నేహం చేశాడనేది కాస్త ఆసక్తికరంగా మారింది. అసలు విషయంలోకి వెళితే.. అమెరికాలోని ఉటాకు చెందిన అబిగైల్ బ్రాడికి రెండేళ్ల కొడుకు ఉన్నాడు. ఒకరోజు పెద్ద వర్షం పడడంతో డ్రైనేజీలు పొంగి పొర్లాయి. (చదవండి : 'ఒక్క పనితో మా మనసులు దోచేసింది') దీంతో వీరి ఇంటి కింద ఉన్న వస్తువులు తడిసిపోతుండటంతో వాటిని పైకి తీసుకొచ్చి పెట్టారు. ఆ వస్తువులలో హాలోవీన్ సందర్భంగా ఇంటి బయట తగిలించే అస్థిపంజరం కూడా ఉంది. ఆ అస్థిపంజరాన్ని చూసి థియో మనసు పారేసుకున్నాడు. అంతే అప్పటినుంచి ధియో ఎక్కడికి వెళ్లినా దాన్ని తీసుకెళ్లేవాడు. ఆఖరికి ఏదైనా తినాలన్నా అస్థిపంజరాన్ని పక్కనే పెట్టుకొని తింటాడు.. లేదంటే ఇల్లు పీకి పందిరేస్తాడు. ఈ అస్థిపంజరం పేరు బెన్నీ. అయితే అది అసలు అస్థిపంజరం కాదు.. కేవలం బొమ్మ మాత్రమే. అందుకే థియో తల్లిదండ్రులు కూడా అంతగా భయపడటం లేదు. కానీ కొడుకు వింత టేస్ట్‌ని అందరికీ తెలియజేయడానికి థియో అస్థిపంజరంతో ఆడుకుంటున్న వీడియోలను తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. (చదవండి : బాబోయ్ చెట్టును ఇలా కట్ చేస్తారా?) View this post on Instagram Benny and Theo’s Excellent Adventure at the grocery store #bennytheskeleton #toddler A post shared by Abby//Abigail (@abigailkbrady) on Sep 23, 2020 at 1:42pm PDT -
విచిత్రంగా అస్థిపంజరంతో కారులో ప్రయాణం
వాషింగ్టన్: ట్రాఫిక్ నిబంధనలు పాటించడం పక్కనపెడితే... వాటిని ఎలా తప్పించుకోవాలన్నదానిపైనే ఆసక్తి చూపిస్తారు చాలామంది. అయితే ఇక్కడ చెప్పుకునే వ్యక్తి ఈ రెండింట్లో ఏ కోవకు చెందుతాడనేది అంతు చిక్కకుండా ఉందంటూ నెటిజన్లు తలలు పట్టుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని అరిజోనాకు చెందిన ఓ 65 ఏళ్ల వ్యక్తి కారు నడుపుకుంటూ వెళుతున్నాడు. అలా అతను కొన్ని ప్రత్యేక నిబంధనలు ఉండే హెచ్ఓవీ ప్రదేశానికి వచ్చాడు. అయితే ఆ ప్రదేశంలోకి ఎంటర్ అవాలంటే వాహనం నడిపే వ్యక్తితో పాటు మరొకరు ఉండాల్సిందే. ఒక్కరు ఉంటే మాత్రం ఆ రోడ్డు గుండా వెళ్లడానికి ఆ వాహనాలను అనుమతించరు. దీంతో అతను తనతోపాటు మనిషిని వెంట తీసుకెళ్లకుండా ఓ అస్థిపంజరాన్ని పట్టుకెళ్లాడు. దాన్ని కారులో ముందు సీటులో కూర్చోబెట్టి సీట్బెల్ట్కు బదులు తాడు కట్టి, తలకు.. కాదుకాదు.. పుర్రెకు టోపీ పెట్టి ఎంచక్కా వెళ్లాడు. ఇది అక్కడి అధికారుల కంట పడింది. అంతే.. అతని వాహనాన్ని అడ్డుకున్నారు. ఇక అస్థిపంజరాన్ని చూసి నోరెళ్లబెట్టిన అధికారులు దాన్ని ఫొటోతో సహా ట్విటర్లో షేర్ చేసి ఈ విషయాన్నంతా పూసగుచ్చినట్లుగా చెప్పారు. కాగా ప్రయాణికుడిలా కారులో దర్జాగా కూర్చొన్న అస్థిపంజరం ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు ఎవరికి తోచినట్లుగా వారు కామెంట్లు పెడుతున్నారు. -
హత్యకు గురైన మహిళ తల లభ్యం
సాక్షి, కామారెడ్డి: జిల్లా కేంద్రంలోని పెద్ద చెరువు మత్తడి వాగు వద్ద గత నెల 25న జరిగిన మహిళ దారుణ హత్య సంఘటన తెలిసిందే. వారం రోజుల క్రితం ఈ సంఘటన వెలుగు చూసింది. అయితే మృతదేహానికి తల లేకుండా పడి ఉండడాన్ని పోలీసులు గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో అదే ప్రాంతంలోని కొద్దిదూరంలో ఉన్న ఓ చెట్టు కింద పడి ఉన్న తల భాగాలను ఆదివారం గుర్తించారు. పూర్తిగా కుళ్లిపోయి ఎముకలు మాత్రమే మిగిలాయి. పట్టణ ఎస్హెచ్ఓ జగదీశ్ ఆధ్వర్యంలో అక్కడికి చేరుకుని విచారణ జరిపారు. హత్యకు గురైన మహిళదే ఈ తల కావచ్చని భావిస్తున్నారు. తల భాగాలను ఏరియా ఆస్పత్రిలోని పోస్టుమార్టం గదికి తరలించారు. తదుపరి వైద్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపించనున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. హంతకులు మహిళను మరో ప్రదేశంలో హత్య చేసి ఇక్కడకు తీసుకువచ్చి పడవేసి ఉండవచ్చని భావిస్తున్నారు. -
హరప్పా సమాధుల్లో చరిత్ర
అతి ప్రాచీనమైన సింధు నాగరికతలో అత్యంత ముఖ్యపట్టణం రాఖీఘరీ. ప్రస్తుతం మన దేశంలోని హరియాణా రాష్ట్రంలో ఉంది. 4,500 ఏళ్ల క్రితం ఆ పట్టణ శివార్లలోని ఒక పురుషుడు, ఒక మహిళని ఉమ్మడిగా సమాధి చేశారు. ఇçప్పుడు ఇన్నేళ్ల తర్వాత వారిద్దరి అస్తిపంజరాలు భారతదేశం, దక్షిణ కొరియాకు చెందిన పురావస్తు శాస్త్రవేత్తలకు లభ్యమయ్యాయి. 2016వ సంవత్సరం లోనే ఆ అస్థి పంజరాలను గుర్తించిన శాస్త్రవేత్తలు వాటిపై విస్తృతంగా పరిశోధన చేసి హరప్పా కాలం నాటి పరిస్థితుల్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. వాటి వివరాలను ఒక అంతర్జాతీయ జర్నల్‌లో ప్రచురించారు. ‘‘ఒక పురుషుడు, మహిళకు చెందిన ఆ అస్థిపంజరాలు ఒకరికొకరు అభిముఖంగా, అత్యంత సన్నిహితంగా ఉన్నాయి. వాళ్లిద్దరూ భార్యాభర్తలు అయి ఉంటారు. ఒకేసారి వారిద్దరూ మరణించారు. అతని వయసు దాదాపుగా 35 ఏళ్లు ఉంటే, ఆమె వయసు 25 ఉంటుంది. ఇద్దరూ మంచి పొడగరులు. అతను 5 అడుగుల 8 అంగుళాలు ఉంటే, ఆమె 5 అడుగుల 6 అంగుళాలు ఉంటుంది. వాళ్లు మరణించే సమయంలో ఆరోగ్యకరంగానే ఉన్నారు. వారి ఎముకల్ని పరీక్షించి చూశాం. ఎవరూ వారిని హత్య చెయ్యలేదు. బ్రెయిన్ ఫీవర్ వంటి అనారోగ్యాలు కూడా వారికి లేవు. మరి వారి మరణానికి కారణమేమై ఉంటుందో ఇంకా అంతు పట్టడం లేదు‘ అని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన పురావస్తు శాస్త్రవేత్త , పుణేలోని డెక్కన్ కాలేజీకి చెందిన వసంత్ షిండే వెల్లడించారు. ఇలా జంటగా అస్తిపంజరాలు బయటపడడం అరుదైన విషయమని, దీనిని బట్టి భారతీయ వివాహ వ్యవస్థ అత్యంత ప్రాచీనమైనదని తెలుస్తోందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ఇదే మొదటిది కాదు హరప్పాలో ఇలా జంటగా పాతిపెట్టిన సమాధులు బయటపడడం ఇది తొలిసారేం కాదు. 1950లో గుజరాత్‌లోని లోథల్‌లో కూడా ఇలాంటి సమాధి బయటపడింది. అందులో మహిళ అస్థిపంజరం తలపై గాయాలు కనిపించాయి. భర్తని ఎవరో చంపేస్తే, దానిని తట్టుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకుందని పురావస్తు శాస్త్రవేత్తలు తేల్చారు. రఖీఘరీలో ఇప్పటికే పురావస్తు శాస్త్రవేత్తలు 70 సమాధుల్ని గుర్తించారు. వాటిలో 40ని తవ్వి వాటిల్లో దాగి ఉన్న రహస్యాలను వెలికితీసే పనిలో ఉన్నారు. ఇలా జంట అస్తిపంజరాలు బయల్పడడం మాత్రం ఉత్సుకతనే నింపింది. హరప్పాలో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇలా ఎన్నో సమాధుల్లో స్త్రీ, పురుషుల అస్థిపంజరాలు ఉమ్మడిగా దర్శనమిచ్చాయి. ఇటలీ, రష్యా వంటిదేశాల్లో స్త్రీ, పురుషుల అస్థిపంజరాలు అత్యంత సన్నిహితంగా, చేతిలో చెయ్యి వేసుకున్నట్టు కనిపించింది. ఇక గ్రీస్‌లో 6 వేల ఏళ్ల క్రితం నాటి జంట అస్థిపంజరాలు ఒకరినొకరు విడిచి ఉండలేనంతగా కౌగిలించుకొని కనిపించాయి. సమాధుల్లో సంగతులెన్నో హరప్పా, మొహంజదారో సమాధుల్లో ఎక్కడా ఆడంబరాలు కనిపించవు. పశ్చిమాసియా రాజుల మాదిరిగా అంత్యక్రియలు వాళ్లు ఆడంబరంగా జరుపుకోరు అని ఎర్లీ ఇండియన్స్, ది స్టోరీ ఆఫ్ అవర్ ఏన్సెస్టర్స్ అండ్ వేర్ వి కేమ్ ఫ్రమ్ పుస్తక రచయిత టోని జోసెఫ్ అభిప్రాయపడ్డారు. మోసొపొటేమియా నాగరికత కాలం నాటి సమాధుల్లో అత్యంత విలువైన నగలు, కళాఖండాలు దర్శనమిస్తాయి. విశేషమేమిటంటే హరప్పా నుంచి ఎగుమతి అయిన అత్యంత విలువైన నవరత్నాలు, నీలాలు, గోమేధికాలతో తయారు చేసిన నగలతోనే అప్పట్లో రాజుల్ని పూడ్చి పెట్టేవారని చరిత్రకారుల అంచనా. అదే హరప్పా సమాధుల్లో ఆహారంతో నింపిన కుండలు, కొన్ని పూసల నగలు కనిపిస్తాయి. మరణించిన వారికి పునర్జన్మ ఉంటుందన్న నమ్మకంతో అప్పట్లో ఆహారంతో నింపిన కుండలు సమాధుల్లో ఉంచేవారని చరిత్రకారుల అభిప్రాయం. -
స్నేహితున్ని చంపి.. పూలతొట్టెలో పాతి..
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు రెండేళ్ల మిస్టరీ వీడింది. అనుమానమే పెనుభూతమై స్నేహాన్ని అంతం చేసింది. బంధువని కూడా చూడకుండా ఓ వ్యక్తిని చంపేసింది. మెదక్‌కు చెందిన జయప్రకాశ్(27), విజయ్‌కుమార్(30) సమీపబంధువులు, స్నేహితులు. బతుకుదెరువు కోసం ఢిల్లీకి వెళ్లి ఓ అద్దె ఇంట్లో నివసించారు. అపార్థంతో జయప్రకాశ్‌పై కక్షకట్టిన విజయ్ మూడేళ్ల క్రితం అతడిని అంతం చేశాడు. మిస్సింగ్ అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి హైదరాబాద్‌కు పారిపోయి వచ్చాడు. యాదృచ్ఛికంగా జయప్రకాశ్ అస్థిపంజరం బయటపడటంతో ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేసిన అధికారులు బుధవారం విజయ్ను హైదరాబాద్‌లో అరెస్టు చేసి తీసుకువెళ్లారు. బతుకుదెరువు కోసం వలస వెళ్లి... జయప్రకాశ్, విజయ్‌కుమార్ విద్యాభ్యాసం తర్వాత ఉద్యోగాన్వేషణ మొదలెట్టారు. ఈ నేపథ్యంలోనే 2015లో ఢిల్లీకి వలసవెళ్లి దాబ్రీ ప్రాంతంలో ఉన్న చాణక్యప్లేస్‌లో విక్రమ్‌సింగ్ అనే వ్యక్తికి చెందిన అపార్ట్మెంట్లో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు. అనేక ప్రయత్నాల తర్వాత ఇద్దరూ ప్రైవేట్ ఉద్యోగాలు పొందారు. విజయ్ తన ప్రేయసికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు జయప్రకాశ్‌కు చెప్తుండేవాడు. అనేకసార్లు జయప్రకాశ్ ఆమెతో ఫోన్ ద్వారా, నేరుగా మాట్లాడాడు. దీంతో జయప్రకాశ్‌పై విజయ్ అనుమానం పెంచుకున్నాడు. తన ప్రేయసితో సన్నిహితంగా ఉంటూ దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని భావించి జయప్రకాశ్‌ను అంతం చేయడానికి పథకం వేశాడు. మరమ్మతుల నేపథ్యంలో వెలుగులోకి... జయప్రకాశ్, విజయ్‌లు నివసించిన తర్వాత ఆ గదిలో మరికొందరు అద్దెకు ఉండి వెళ్లారు. అధ్వానంగా మారడంతో గత ఏడాది అక్టోబర్ 8న ఆ గదికి యజమాని మరమ్మతులు చేపట్టారు. అందులో భాగంగా పూలకుండీల తొట్టెను కూలీలు తొలగిస్తుండగా ఓ అíస్థిపంజరం బయటపడింది. యజమాని ఇచ్చిన సమాచారం మేరకు అక్కడి పోలీసులు గత ఏడాది అక్టోబర్ 9న హత్య కేసు నమోదైంది. అస్థిపంజరం నుంచి డీఎన్ఏ నమూనాలు సేకరించిన పోలీసులు మెదక్ నుంచి జయప్రకాశ్ కుటుంబీకుల్ని రప్పించి నమూనాలు తీసుకున్నారు. ఒకటేనంటూ నివేదిక రావడంతో... డీఎన్ఏ నమూనాలనూ విశ్లేషించిన ఫోరెన్సిక్ నిపుణులు ఆ అస్థిపంజరం జయప్రకాశ్‌దేనంటూ ఇటీవల నిర్ధారించారు. దీంతో ఈ కేసులో విజయ్ను ప్రధాన అనుమానితుడిగా చేర్చిన ఢిల్లీ పోలీసులు అతడి కోసం ముమ్మరంగా గాలించారు. హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించి, వచ్చి అరెస్టు చేసి తీసుకువెళ్లారు. విచారణ నేపథ్యంలో హత్యకు కారణాలను బయటపెట్టాడు. చంపేసిన తర్వాత తానే ఉద్దేశపూర్వకంగా జయప్రకాశ్ సెల్‌ఫోన్‌ను ధ్వంసం చేసి పారేశానని, ఆపైనా పదేపదే అతడి సెల్‌ఫోన్‌కు కాల్స్ చేయడం, ఎస్సెమ్మెస్‌లు పెట్టానని చెప్పాడు. వాటికి స్పందించట్లేదంటూ అందరినీ నమ్మించే ప్రయత్నం చేశానని వెల్లడించాడు. ఫ్యాన్ మోటార్‌తో కొట్టి హత్య... అదను కోసం ఎదురు చూసిన విజయ్ 2016 ఫిబ్రవరి 12న తన పథకాన్ని అమలు చేశాడు. ఉద్దేశపూర్వకంగా జయప్రకాశ్‌తో వాగ్వాదానికి దిగి తమ గదిలో ఉన్న ఫ్యాన్ మోటారు భాగంతో తలపై మోది హత్య చేశాడు. మూడో అంతస్తు బాల్కనీలో ఓ తొట్టె లాంటిది నిర్మించి శవాన్ని అందులో పూడ్చేశాడు. అదేరోజు స్థానిక పోలీసుస్టేషన్‌కు వెళ్లి జయప్రకాశ్ అదృశ్యమయ్యాడంటూ ఫిర్యాదు చేశాడు. ఇంటి యజమానికీ ఇదే విషయం చెప్పిన విజయ్ కొన్నిరోజులకు ఢిల్లీ వదిలి హైదరాబాద్ వచ్చి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. -
స్మైల్ ప్లీజ్..
ఏం టూత్‌పేస్టు వాడాడో తెలియదుగానీ.. ఇతడి పళ్లు చూశారూ.. తళతళలాడిపోతున్నాయి కదూ.. ఈ తళతళలు 6 వేల ఏళ్ల క్రితం నాటివి. ఎందుకంటే.. ఈ అస్థిపంజరం అప్పటిది కాబట్టి.. బ్రెజిల్‌లోని శాంటా కాటరీనాలో ఇటీవల పురావస్తు పరిశోధకులు జరిపిన తవ్వకాల్లో ఇది లభ్యమైంది. పళ్లు ఒక్కటి కూడా ఊడకుండా అలా 32 పళ్లూ దొరకడం అరుదేనని పరిశోధకులు చెబుతున్నారు. ఈ అస్థిపంజరం జికుబు తెగకు చెందినవారిదై ఉండొచ్చని చెబుతున్నారు. ఈ తెగ వాళ్లు 10 వేల ఏళ్ల క్రితం బ్రెజిల్‌కు వలస వచ్చారట. -
మహిళ అస్థిపంజరం లభ్యం
పెద్దశంకరంపేట(మెదక్) : మండల పరిధిలోని జూకల్ శివారులో గుర్తుతెలియని మహిళ అస్థిపంజరం లభ్యమైనట్లు ఎస్ఐ విజయరావ్ శుక్రవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ శివారులో మహిళ మృత దేహం ఉన్నట్లు గ్రామస్థుల సమాచారం మేరకు సంఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించామన్నారు. సుమారు 35 నుంచి 40 ఏళ్ల లోపు మహిళ అస్థిపంజరంగా గుర్తించామన్నారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఉంది. మృతదేహంపై ఎరుపురంగు చీర, ఎరుపు,తెలుపు జాకెట్ ధరించి ఉన్నట్లు ఆయన తెలిపారు. వీఆర్వో అశోక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చెప్పారు. -
పక్కింట్లో పిల్లాడి శవం.. ఏడాదిగా ఆక్రందన
ఘజియాబాద్: రెండేళ్ల క్రితం ఓ బాలుడు కిడ్నాప్‌కి గురయ్యాడు. డబ్బు డిమాండ్ చేసిన నిందితులను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. వారిని విచారణ చేపట్టినా లాభం లేకపోయింది. ఆ బాలుడి ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. కానీ, 18 నెలల తర్వాత ఆ బాలుడి పక్కంటి మేడపై ఎముకల గూడుగా దర్శనమిచ్చాడు. సస్పెన్స్ థ్రిల్లర్ తరహాలో జరిగిన ఘటన దేశ రాజధాని శివారులో కలకలం రేపింది. అసలేం జరిగింది... సహిబాబాద్‌లోని శంషద్ గార్డెన్ ప్రాంతంలో బార్బర్ పని చేసుకునే నజర్(38) కుటుంబం నివసిస్తోంది. ఈ నెల 1వ తేదీన అతని పెద్ద కొడుకు జునైద్(9) బంతి కోసం పక్కింటి డాబాపైకి వెళ్లాడు. అక్కడ ఓ చెక్కపెట్టె కనిపించటంతో మూతను తెరిచి చూశాడు. రెండడుగుల పెద్ద బొమ్మలాంటిది ఒకటి బయటపడింది. అది భయంకరంగా ఉండటంతో పరిగెత్తి తండ్రికి విషయం తెలియజేశాడు. అయితే వారు అతని మాటలను తేలికగా తీసుకోవటంతో సెల్ ఫోన్లో ఫోటోలు తీశాడు. రెండు రోజుల తర్వాత ఆ ఫోటోలను చూసిన కుటుంబ సభ్యులు అదొక అస్థిపంజరంగా గుర్తించి ఆ పెట్టెను తెరిచి చూశారు. అయితే అదే పెట్టెలో స్కూల్ యూనిఫామ్ బయటపడటంతో అది రెండేళ్ల క్రితం కనిపించకుండా పోయిన తమ కొడుకుదేనని నజర్ గుర్తించారు. ...2016 డిసెంబరు 1వ తేదీన మహమ్మద్ జైద్(4) అనే బాలుడు కనిపించకుండా పోయాడు. పిల్లాడి కోసం చుట్టుపక్కల వెతికిన నజర్, కుటుంబ సభ్యులు చివరకు మసీదుల్లోని మైకుల ద్వారా చాటింపు వేయించారు. దీంతో కొందరు యువకులు అక్కడున్న అన్ని ఇళ్లలో జల్లెడ పట్టారు. కానీ, ఫలితం లేకుండా పోయింది. వారం తర్వాత కొందరు దుండగులు జైద్ తండ్రికి ఫోన్ చేసి తామే కిడ్నాప్ చేశామంటూ రూ.8 లక్షలు డిమాండ్ చేశారు. బాలుడి తండ్రి ఈ విషయాన్ని పోలీసులకు చెప్పటంతో వారు ప్రణాళిక రచించి నిందితుడు అఫ్తాబ్‌ను అరెస్ట్ చేశారు. అసలు నిందితుడు ఇర్ఫాన్ అని, వీరిద్దరూ జైద్ ఉంటున్న ప్రాంతంలోనే ఉంటారని దర్యాప్తులో వెల్లడైంది. వార్త తెలియగానే కుప్పకూలిన జైద్ తల్లి అసలు ట్విస్ట్.. అయితే బాలుడి అదృశ్యం, కిడ్నాపర్ల కాల్స్ విషయం తెలుసుకున్న నిందితులు.. కేవలం డబ్బు కోసమే బాలుడి తండ్రిని బ్లాక్ మెయిల్ చేసినట్లు వెల్లడించటంతో నిర్ఘాంతపోవటం పోలీసుల వంతు అయ్యింది. అసలు కిడ్నాపర్లు ఎవరన్న దానిపై చిన్న క్లూ కూడా లభ్యం కాకపోవటంతో చుట్టు పక్కల రాష్ట్రాల్లోనూ పోలీసులను ఈ కేసులో సాయం చేయాల్సిందిగా ఘజియాబాద్ పోలీసులు కోరారు. తమ కొడుకు తిరిగి రాకపోతాడా అని ఆశగా ఎదురు చూసిన ఆ తల్లిదండ్రులకు చివరకు గుండెకోతే మిగిలింది. దాదాపు 18 నెలల తర్వాత బాలుడి అస్థిపంజరం ఇలా బయటపడింది. ఘటనా స్థలంలో పోలీసులు పోలీసుల అనుమానాలు... సమాచారం అందుకున్న పోలీసులు అస్థి పంజరాన్ని పోస్టు మార్టం కోసం తరలించారు. అయితే ఏ ప్రయోజనం లేకపోవటంతో ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పరీక్షల నిమిత్తం పంపించారు. బెయిల్‌పై బయట ఉన్న నిందితులను మరోసారి ప్రశ్నించిన పోలీసులు వారి నుంచి ఎలాంటి సమాచారం రాకపోవటంతో వేరే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఆ గదిలో పాత సామాన్లు దాస్తామని, రెండేళ్ల క్రితం తన కూతురి వివాహ సమయంలో ఆ పెట్టెను పైన పడేసినట్లు పక్కింటి యాజమాని మోమీన్ చెబుతున్నారు. ఒకవేళ కిడ్నాపర్లు బాలుడిని అక్కడే బంధించి ఉంటే కనీసం కుళ్లిన వాసన అయినా వచ్చి ఉండాలన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఎక్కడో చంపి ఇక్కడ తీసుకొచ్చి పెట్టారా? లేక బాలుడ్ని ఇక్కడే బంధించారా? డబ్బు కోసం కుటుంబ సభ్యులెవరైనా ఈ పని చేసి ఉంటారా? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఫోరెన్సిక్ నివేదిక వస్తేనే ఈ కేసులో కొంత పురోగతి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.