ఈ బుడ్డోడు సూపర్‌.. అస్థిపంజరంతో కలిసి | 2Year Old Boy Bringing Skeleton everywhere He Goes Become Viral | Sakshi
Sakshi News home page

ఈ బుడ్డోడు సూపర్‌.. అస్థిపంజరంతో కలిసి

Published Tue, Sep 29 2020 9:53 PM | Last Updated on Tue, Sep 29 2020 9:54 PM

2Year Old Boy Bringing Skeleton everywhere He Goes Become Viral - Sakshi

పిల్లలు దెయ్యాల కథల వింటే చాలు భయపడిపోతారు. అలాంటిది ఇక్కడ ఒక బుడ్డోడు మాత్రం ఏకంగా అస్థిపంజరాన్ని వెంటపెట్టుకొని తిరుగుతున్నాడు. రోజు అస్థిపంజరం చూడకుండా కనీసం బాత్‌రూమ్‌కు కూడా వెళ్లడు. అయితే ఈ పిల్లాడికి అస్థిపంజ‌రం ఎక్కడ దొరికంది.. దానితో ఎలా స్నేహం చేశాడనేది కాస్త ఆసక్తికరంగా మారింది. అసలు విషయంలోకి వెళితే.. అమెరికాలోని ఉటాకు చెందిన అబిగైల్ బ్రాడికి రెండేళ్ల కొడుకు ఉన్నాడు. ఒకరోజు పెద్ద వ‌ర్షం ప‌డడంతో డ్రైనేజీలు పొంగి పొర్లాయి. (చదవండి : 'ఒక్క పనితో మా మనసులు దోచేసింది')

దీంతో వీరి ఇంటి కింద ఉన్న వ‌స్తువులు త‌డిసిపోతుండ‌టంతో వాటిని పైకి తీసుకొచ్చి పెట్టారు. ఆ వ‌స్తువుల‌లో హాలోవీన్ సంద‌ర్భంగా ఇంటి బ‌య‌ట త‌గిలించే అస్థిపంజ‌రం కూడా ఉంది. ఆ అస్థిపంజరాన్ని చూసి థియో మ‌న‌సు పారేసుకున్నాడు. అంతే అప్పటినుంచి ధియో ఎక్కడికి వెళ్లినా దాన్ని తీసుకెళ్లేవాడు. ఆఖ‌రికి ఏదైనా తినాలన్నా అస్థిపంజరాన్ని పక్కనే పెట్టుకొని తింటాడు.. లేదంటే ఇల్లు పీకి పందిరేస్తాడు. ఈ అస్థిపంజ‌రం పేరు బెన్నీ. అయితే అది అస‌లు అస్థిపంజ‌రం కాదు.. కేవలం బొమ్మ మాత్రమే. అందుకే థియో త‌ల్లిదండ్రులు కూడా అంత‌గా భ‌య‌ప‌డ‌టం లేదు. కానీ కొడుకు వింత టేస్ట్‌ని అంద‌రికీ తెలియ‌జేయ‌డానికి థియో అస్థిపంజరంతో ఆడుకుంటున్న వీడియోలను తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. (చదవండి : బాబోయ్ చెట్టును ఇలా కట్‌ చేస్తారా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement