ఏం టూత్‌పేస్టు వాడాడో తెలియదుగానీ.. ఇతడి పళ్లు చూశారూ.. తళతళలాడిపోతున్నాయి కదూ.. ఈ తళతళలు 6 వేల ఏళ్ల క్రితం నాటివి. ఎందుకంటే.. ఈ అస్థిపంజరం అప్పటిది కాబట్టి.. బ్రెజిల్‌లోని శాంటా కాటరీనాలో ఇటీవల పురావస్తు పరిశోధకులు జరిపిన తవ్వకాల్లో ఇది లభ్యమైంది. పళ్లు ఒక్కటి కూడా ఊడకుండా అలా 32 పళ్లూ దొరకడం అరుదేనని పరిశోధకులు చెబుతున్నారు. ఈ అస్థిపంజరం జికుబు తెగకు చెందినవారిదై ఉండొచ్చని చెబుతున్నారు. ఈ తెగ వాళ్లు 10 వేల ఏళ్ల క్రితం బ్రెజిల్‌కు వలస వచ్చారట.
Comments
Please login to add a commentAdd a comment