Brazil Couple Terrified After Found Find Skeletal Alien Hand On Beach, See Scientists Reaction - Sakshi
Sakshi News home page

Brazil: వామ్మో ఇంత పెద్ద చెయ్యి.. కొంపతీసి ఏలియన్‌దా? బీచ్‌లో వణికిపోయిన ప్రేమ జంట..

Published Fri, Nov 25 2022 12:38 PM | Last Updated on Fri, Nov 25 2022 1:11 PM

Brazil Terrified Couple Find Skeletal Alien Hand On Beach - Sakshi

సముద్రతీరంలో హాయిగా నడుచుకుంటూ వెళ్తున్న ఓ ప్రేమ జంటకు ఇసుకలో ఓ పొడవాటి వస్తువులాంటింది కన్పించింది. వెంటనే దాన్ని బయటకు తీయగా.. అది అస్థిపంజరం చేతి. దాని పరిమాణం చూసి ఇద్దరూ కంగుతిన్నారు. ఇది కచ్చితంగా మనిషిది కాదని, భయాందోళన వ్యక్తం చేశారు.

బ్రెజిల్‌లో నవంబర్ 20న ఈ ఘటన జరిగింది. అస్థిపంజరం చూసి హడలిపోయిన లెటిసియా గోమ్స్, ఆమె బాయ్‌ఫ్రెండ్ డెవనీర్ సౌజ్‌ వెంటనే దాన్ని ఫొటో తీశారు. అది ఏ సైజులో ఉందో చెప్పేందుకు డెవనీర్ తన చెప్పును కొలమానంగా చూపాడు. దొరికిన అస్తిపంజరం చేతిలోని వేలు.. ఆ చెప్పు కంటే పెద్దగా ఉండటం చూసి నెటిజన్లు షాక్ అయ్యారు.
ఈ చేతి కచ్చితంగా సాధారణ మనుషులది కాదని, కొంపతీసి ఏలియన్స్‌ది అయి ఉంటుందా? అని ఈ ప్రేమికులు ఆందోళన చెందారు. మరోవైవు నెటిజన్లు దీనిపై భిన్నమైన కామెంట్లు చేశారు.

ఇది కచ్చతింగా ఏలియన్ చేతి అయి ఉంటుంది, వెంటనే దీన్ని పరిశోధనకు పంపించండి అని ఓ యూజర్ కామెంట్ చేశాడు. మరో యూజర్ అది జల కన్య చేతి అయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశాడు. మరో యూజర్ ఇది డైనోసార్ చేతి అయి ఉంటుందని పేర్కొన్నాడు.

మరోవైపు ఇది డాల్ఫిన్, తిమింగలం వంటి జాతికి చెందిన సముద్ర జీవి అస్థి పజరం అయి ఉంటుందని, 18 నెలల క్రితం అది ఆ ప్రాంతంలోనే చనిపోయిందని ఓ సముద్ర జీవ శాస్త్రవేత్త చెప్పుకొచ్చారు. అయితే దీన్ని ధ్రువీకరించేందుకు కచ్చితంగా పరీక్షలు చేయాల్సిందేని స్పష్టం చేశారు.
చదవండి: Guinness World Records: ఆ పిల్లి వయసు 26

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement