alien
-
ఇదేందయ్యా ఇది.. ఏలియన్ కే గుడి కట్టేశాడు
-
‘నేను ఏలియన్ని’..మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు
నేను ఏలియన్ అని చెబుతూనే ఉన్నా కానీ నా మాటల్ని ఎవరూ నమ్మడం లేదని టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. పారిస్ వేదికగా జరిగిన వివా టెక్ ఈవెంట్లో మస్క్ వెబ్‌క్యామ్ ద్వారా రిమోట్‌గా పాల్గొన్నారు. వివా టెక్ ఈవెంట్ ప్రతినిధులు మస్క్‌తో కొంతమంది మీరు ఏలియన్ అని నమ్ముతున్నారు. మస్క్ నవ్వుతూ ‘అవును, నేను గ్రహాంతరవాసిని అని చెబుతూనే ఉంటాను, కానీ ఎవరూ నన్ను నమ్మడం లేదని అన్నారు.’ అంతేకాదు ఏలియన్స్ గురించి సమాచారం ఏదైనా తెలిస్తే నేను వెంటనే ఎక్స్ వేదికగా ఆ విషయాల్ని వెల్లడిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎలోన్ మస్క్ కృత్రిమ మేధస్సు (ఏఐ)పై తన అభిప్రాయాల్ని పంచుకున్నారు. ఏఐ అన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తుందని, అయితే దాని అంతగా భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. 🚨IS ELON AN ALIEN? Host: "Some people believe that you are an alien."Elon: "I am an alien."Host: "Now you've been uncovered."Elon: "Yes, I keep telling people I'm an alien, but nobody believes me."😂Source: Viva Tech https://t.co/9ie5KFn6GE pic.twitter.com/ZDU4ovA82I— Mario Nawfal (@MarioNawfal) May 23, 2024 -
Peru: ఏలియన్ మమ్మీల గుట్టు రట్టు.. అసలు కథేంటంటే..
లిమా: పెరూ రాజధాని లిమా ఎయిర్‌పోర్టులో గత ఏడాది దొరికిన ఏలియన్ మమ్మీల మిస్టరీ వీడింది. ఇవి ఏలియన్ మమ్మీలనేది పెద్ద జోక్ అని ఆర్కియాలజిస్టులు తేల్చారు. లిమా ఎయిర్‌పోర్టులో దొరికిన రెండు బొమ్మలు మనుషులు లేదా జంతువుల ఎముకల నుంచి తయారు చేసినవి అయి ఉండొచ్చని సైంటిస్టులు వెల్లడించారు. ‘అవి ఏలియన్ మమ్మీలు కానే కావు. జంతువుల ఎముకలను మోడ్రన్ గ్లూతో అతికించి తయారు చేసిన బొమ్మలు’అని పెరూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లీగల్ మెడిసిన్‌లో పనిచేసే ఆర్కియాలజిస్ట్ ఒకరు తెలిపారు. కాగా, గత ఏడాది అక్టోబర్‌లో లిమా ఎయిర్‌పోర్టులోని డీహెచ్ఎల్ కొరియర్ సంస్థకు చెందిన కార్డ్‌బోర్డు బాక్సులో ఏలియన్ మమ్మీలుగా తొలుత అందరూ భావించిన రెండు బొమ్మలు దొరికాయి. అప్పటి నుంచి ఏలియన్లు ఉన్నారని, అవి భూమి మీదకు వచ్చాయన్న పుకార్లు ఊపందుకున్నాయి. తాజాగా సైంటిస్టులు పరిశోధన చేసి క్లారిటీ ఇవ్వడంతో ఏలియన్ మమ్మీల గుట్టురట్టయింది. ఇదీచదవండి.. ఉక్రెయిన్‌పై యూఎన్ కీలక ప్రకటన -
వీటి ముందు కిలికిలి భాష బేకార్!
బాహుబలి సినిమాలో కాలకేయుల భాష గుర్తుందా? ‘కిలి కిలి’ భాష. అర్థం కాక మనమందరం కాసేపు జట్టుపీక్కున్న వాళ్లమే! కానీ.. కింది భాషల గురించి తెలుసుకుంటే.. అబ్బే.. ‘కిలి కిలి’ చాలా సుందరమైన, సులువైన భాష అని అనక మానరు మీరు! ఇంకో విషయం.. ఈ భాషలను అప్పుడు.. ఇప్పడు.. ఎవరూ మాట్లాడలేదు! ఏమిటీ విచిత్రం అనుకోక ముందే... చదవడం మొదలుపెట్టేయండి! గ్రహాంతర వాసలు గురించి మీరిప్పటికే కథలు కథలుగా విని ఉంటారు కాబట్టి.. మనం వాటిజోలికి పోవద్దు. ఇప్పటివరకూ మనిషి గ్రహాంతర వాసిని ప్రత్యక్షంగా చూసింది లేదు.. మాట్లాడింది అంతకంటే లేదు. కానీ.. ఎప్పుడో.. రేప్పొద్దున అంటే భవిష్యత్తులో వారితో మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే...?? ఏం మాట్లాడతాం? ఎలా మాట్లాడతాం? తెలుగు, హిందీ, ఇంగ్లీషులు వారికి వస్తాయో రావో మనకు తెలియదు కదా! ఈ సమస్యను గుర్తించే కొందరు భాషా శాస్త్రవేత్తలు గ్రహాంతర వాసులను కలిస్తే మాట్లాడేందుక ఏకంగా ఆరు భాషలను సిద్ధం చేశారు. కిలికిలి భాష మాదిరే ఈ భాషలను కూడా ఉద్దేశపూర్వకంగా నిర్మించారు కాబట్టి వీటిని కన్స్ట్రక్టెడ్ లాంగ్వేజెస్ క్లుప్తంగా కాన్లాంగ్స్ అని పిలుస్తున్నారు. ఎక్సోలాంగ్స్ అని కూడా వీటికి పేరు! ఒక్కో దాని గురించి స్థూలంగా... 1. ఫిథ్ (Fith): గ్రహాంతర వాసుల కోసం సిద్ధం చేసిన చాలా భాషలు మానవ భాషలు అన్నింటికీ వర్తించే వ్యాకరణ సూత్రాలను ఉపయోగిస్తాయి. జెఫ్రిహెన్నింగ్స్ అనే భాష శాస్త్రవేత్త ఒక అడుగు ముందుకేసి ఈ సామాన్య వ్యాకరణ సూత్రాలన్నింటినీ అతిక్రమించేలా ఒక భాషను రూపొందిచాడు. Forth అనే కంప్యూటర్ లాంగ్వేజ్, పోస్ట్‌ఫిక్స్ నొటేషన్ కాలిక్యులేటర్లు (వీటిల్లో 2 + 4 అని రాసేందుకు బదులు 2 4 + అని రాస్తారు) స్ఫూర్తిగా తాను ఫిథ్ను రూపొందించినట్లు జెఫ్రీ చెబుతున్నారు. అంటే తెలుగులో మనం ‘రాముడు మంచి బాలుడు’ అని రాస్తే... ఫిథ్లో ‘రాముడు బాలుడు మంచి’ అని రాయాల్సి ఉంటుందన్నమాట. సంసృ్కతంలో పదకొండును ఏకాదశి (ఏక అంటే ఒకటి, దశ అంటే పది) అని పిలిచినట్టు అన్నమాట. ఫిథ్ కానీ.. సంసృ్కతం కానీ.. మాట్లాడేటప్పుడు అర్థం చేసుకోవడం సులువే కానీ... రాతలో ఉంటే మాత్రం చాలా కష్టం! ఇలాంటి క్లిష్టమైన భాషలో రెండు చేతి గుర్తులు కూడా భాగంగా ఉంటే.. మానవ మెదడు హీటెక్కాల్సిందే! ఫిథ్ మాట్లాడే గ్రహాంతర వాసుల ఒక్కో చేతికి రెండు అంగుష్టాలు ఉంటాయన్నది జెఫ్రీ ఊహ) ఫిథ్లో ఒక ఉదాహరణ... Zhong hong lin lo, అన్న పదాలను ఇంగ్లీషులోకి తర్జుమా చేస్తే “nation man loyal of.” అని వస్తుంది. పదాలు తారుమారైనట్లుగా ఉంది కదా? అవును. ఈ వాక్యం అర్థం దేశానికి నమ్మకమైన వ్యక్తి అని. ఇంకోలా చెప్పాలంటే దేశభక్తుడూ అని!. 2. రిక్‌చిక్... పేరు భలే చిత్రంగా ఉందే అనుకుంటున్నారా? భాష మరింత విచిత్రంగా ఉంటుంది. డెనిస్ మోస్కోవిట్జ్ సిద్ధం చేశాడు దీన్ని. పచ్చ రంగులో ఉండే ఒంటి కన్ను గ్రహాంతర వాసులు ఈ భాష మాట్లాడాతరన్నది డెనిస్ కల్పన. ఆల్ఫా సెంటూరైలో ఉంటారీ గ్రహాంతర వాసులన్నదీ ఆయన ఊహల్లోని విషయమే. రిక్చిక్స్ వినలేరు! కానీ.. ఒక్కో రిక్‌చిక్ శరీరంపై 49 తోకల్లాంటివి వేలాడుతూంటాయి. వీటిల్లో ఏడింటిని చేతులుగా వాడుకుంటూంటాయి. వీటితో చేసే సంకేతాలే రిక్‌చిక్ భాష అన్నమాట. ఇదంతా డెనిస్ సృష్టేనండోయ్! రిక్చిక్ల మాదిరిగా బోలెడన్ని చేతుల్లేని కారణంగా మనం వాటితో రాతపూర్వకమైన భాష ద్వారా మాత్రమే మాట్లాడగలం. లోగోలత కూడిన రిక్‌చిక్ భాషలో ఒక్కో పదంలో నాలుగు భాగాలుంటాయి. మధ్యలో పదం ప్రాథమిక అర్థం. ఉంటే ఆ పదం క్రియ? ప్రాంతం, ప్రాణమున్నదా? లేనిదా? అన్న వివరాలు చెబుతుంది. ఇది దిగువన ఎడమవైపున ఉంటుంది. ఇతర పదాలతో ఉన్న సంబంధాన్ని సూచించే గుర్తు కుడివైపు... చిన్న అక్షరమా? పెద్ద అక్షరమా అని చెప్పే భాగం పైన ఉంటుంది. రిక్‌చిక్ భాష 2012లో స్మైలీ అవార్డును గెలుచుకుంది కూడా. 3. ద్రిటోక్: డాన్ బూజర్ అనే శాస్త్రవేత్త సిద్ధం చేసిన ఏలియన్ లాంగ్వేజ్ ఇది. ఎలుక కిచకిచలను పోలినట్టు ఓ భాషను తయారు చేయవచ్చా? అన్న సింపుల్ ఆలోచన నుంచి ద్రిటోక్ పుట్టుకొచ్చిందని డాన్ చెబుతారు. అయితే ఈ భాషను సిద్ధం చేయడం ఏమంత ఆషామాషీ వ్యవహారమేమీ కాదు. ఈ భాషలో అచ్చులూ ఉండవు. పాము బుసలు, క్లిక్ శబ్దాలతో కూడి ఉంటుందీ భాష. స్వరపేటికలోని తంత్రుల ప్రకంపనాలతో ఏర్పడుతుందన్నమాట. ద్రుషెక్ అనే గ్రహాంతర వాసుల భాష ఈ ద్రిటోక్. వీరికి వోకల్ కార్డ్స్' ఉండవు. పొడవైన తోకలుంటాయి. బాగా గెంతగలవు. ద్రిటోక్లో 50 వరకూ తేడాలతో చేతి సంజ్ఙలూ ఉంటాయి. ఒక ఉదాహరణ చూడండి.. అర్థం చేసుకోవాల్సిన పనేమీ లేదు.. ద్రిటోక్ భాషలో “tr’w.cq.=P4=C3^Q3-pln.t’.” అంటే.. ‘‘The Drushek, he holds a cloak’’ అని అర్థం. ఈ భాషను ఎలా మాట్లాడతారో తెలుసుకోవాలంటే.. ఈ ఆడియో ఫైల్స్ వినండి. 4.లింకోస్: గ్రహాంతర వాసులను వెతికేందుకు ఏర్పాటు చేసుకున్న సంస్థ సెటీ శాస్త్రవేత్తలు రూపొందించారీ భాషను. భాష రాని వారికి కూడా అర్థమయ్యేలా చెప్పేందుకు ఉద్దేశించిన లింగ్వా ఫ్రాంకా భాషలు (ప్లెయిన్స్ ఇండియన్ సైన్ లాంగ్వేజ్, వంటివి)లను ఖగోళానికి వర్తింపజేసి హాన్స్ ఫ్రాయిడెథాల్ లింగ్వా కాస్మికా అనే భాషను తయారు చేస్తే.. సెటీ శాస్త్రవేత్తలు దాన్ని మరింత అభివృద్ధి చేశారు. లింగ్వా కాస్మికా కాస్తా లింకోస్ అయ్యిందన్నమాట. 1960లోనే హాన్స్ ఫ్రాయిడెథాల్ ఈ భాషను తన పుస్తకం ‘లింకోస్’లో విశదీకరించారు. మనుషులు ప్రపంచాన్ని ఎలా చూస్తారో గ్రహాంతర వాసులకు వివరించేలా ఉంటుందీ భాష. అంకెలకు తగ్గ కాంతి పుంజాలు పంపడం. ప్రాథమిక గణిత శాస్త్ర గురుతులతో మొదలుపెట్టి... అతి సంక్లిష్టమైన ‘ప్రేమ’ అన్న భావనను వివరించే వరకూ సాగుతుంది లింకోస్. సెటీ శాస్త్రవేత్తలు ఇప్పటికే లింకోస్ ఆధారంగా గ్రహాంతర వాసులను ఉద్దేశించి కొన్ని సందేశాలు పంపారు కూడా. 5. లిజెనా: పీటర్ బ్లీక్‌లీ సిద్ధం చేసిన గ్రహాంతర వాసుల భాష ఈ లిజెనా. స్లైవియా సోటోమేయర్ తాలూకూ గ్రహాంతర భాష ‘క్లెన్’ స్ఫూర్తితో తయారైంది ఇది. క్రియల్లేని భాషగా దీనికి పేరు. కాకపోతే బ్లీక్‌లీ లిజెనాలో ప్రతి నామవాచకం క్రియగానూ పనిచేస్తుంది. 2015లో జరిగిన లాంగ్వేజ్ క్రియేషన్ కాన్ఫరెన్స్‌లో బ్లీక్‌లీ మాట్లాడుతూ లిజెనా మాట్లాడే గ్రహాంతర వాసుల గురించి తన ఆలోచనలను ఇలా పంచుకున్నారు. ‘‘లిజెనా మాట్లాడే వారు లీయెన్లు. పిల్లులకు మూతిమీద స్పర్థను గుర్తించగలిగే వెంట్రుకల్లాంటివి ఉంటే లీయెన్లకు అలాంటివి శరీరం మొత్తమ్మీద ఉంటాయి. ఈ లక్షణం వల్ల పరిసరాల్లో జరిగే అతిసూక్ష్మమైన మార్పులను కూడా ఇవి గుర్తించగలవు. దీనికి తగ్గట్టుగానే వారి లిజెనా కూడా ఉంటుంది’’ అని వివరించారు. 6. ఏయూఐ: ఆస్ట్రియా సైకోఅనలిస్ట్ వూల్ఫ్‌గ్యాంగ్ జాన్ వీల్గార్ట్ రూపకల్పన ఈ ‘ఈయూఐ’ భాష. చిన్నప్పుడు ఓ గ్రహాంతర వాసి తన కలల్లో వచ్చి మాట్లాడిందన్న నమ్మకం ఆధారంగా వూల్ఫ్‌గ్యాంగ్ ఈ భాషను సిద్ధం చేశారు. 1930 40లలో నాజీల ప్రచారం హోరెత్తుతున్న తరుణంలో వూల్ఫ్‌గ్యాంగ్ ఆ నినాదాలను తీవ్రంగా వ్యతిరేకించేవాడు. మనిషి మనసులను సబ్కాన్షస్ స్థాయిలో ప్రభావితం చేస్తాయీ నినాదాలని నమ్మేవాడు. ఈ నేపథ్యంలోనే 1958లో ఆయన ఈ ‘ఏయూఐ’ భాషను రూపొందించారు. కొన్ని గంటల్లో నేర్చుకోగల ఈ భాషను వూల్ఫ్‌గ్యాంగ్ ‘అంతరిక్ష భాష’గా అభివర్ణించడం గమనార్హం. ఈ ఏయూఐ భాషలో 31 సంకేతాలు ఉంటాయి. వీటి మేళవింపుతో కొత్త అర్థాలను సృష్టించవచ్చు. -
ఏలియన్లకు కూడా భాషలు ఉన్నాయని తెలుసా?
-
ఏలియన్ తో శివకార్తికేయన్..ప్రయోగం సక్సెస్ అవుతుందా..
-
సంక్రాంతికి అయలాన్
శివ కార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా ఆర్.రవికుమార్ దర్శకత్వంలో రూపొందిన సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ‘అయలాన్ ’. కోటపాడి జె.రాజేష్, ఆర్డీ రాజా నిర్మించిన ఈ సినిమాను సంక్రాతికి విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. ‘‘అయలాన్ అంటే ఏలియన్ అని అర్థం. ఈ ప్రయాణంలో మాకు కొన్ని కష్టాలు ఎదురైనప్పటికీ ధైర్యం కోల్పోకుండా, పట్టుదలతో ఈ సినిమా చేశాం. నాణ్యతా ప్రమాణాల్లో రాజీ పడాలనుకోవడం లేదు. అందుకే సినిమా విడుదల కొంత ఆలస్యం అవుతోంది. మా మూవీలో 4500 సీజీ షాట్స్ ఉన్నాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో మా మూవీ రిలీజ్ కానుంది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. -
ఏలియన్ అవశేషాల పరిశోధనలో సంచలన విషయాలు
మెక్సికో సిటీ: మెక్సికో పార్లమెంట్లో మానవేతర అవశేషాల(ఏలియన్)ను ప్రదర్శించిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా వైద్యుల పరిశోధనలో వీటిపై ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఈ ఏలియన్లు భూమిపై జీవించి ఉన్నవేనని పరిశోధనల్లో తేలింది. అంతేకాకుండా ఓ ఆడ ఏలియన్ కడుపులో గుడ్లు కూడా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. దాదాపు వెయ్యి ఏళ్ల క్రితంనాటి అవశేషాలుగా కార్బన్ డేటింగ్ విధానంలో కనుగొన్నారు. మెక్సికో శాస్త్రవేత్తలు గ్రహాంతర శవాలపై ప్రయోగశాలలో విస్తృతమైన అధ్యయనాలు నిర్వహించారు. సోమవారం నూర్ క్లినిక్‌లో నౌకాదళానికి చెందిన ఫోరెన్సిక్ వైద్యుడు జోస్ డి జీసస్ జల్సే బెనితేజ్ పరీక్షలు పూర్తి చేశారు. ఈ ఏలియన్ల పుర్రెలు అతికించినట్లు ఎలాంటి ఆధారాలు కనిపించలేదని చెప్పారు. భూమిపై ఏ ఇతర జంతువుతో పోలి లేవని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఒకదాని కడుపులో గుడ్లు ఉన్నట్లు కనుగొన్నారు. ఆ రెండు అవశేషాలు ఒకే అస్థిపంజరానికి చెందినవని మెక్సికన్ జర్నలిస్ట్ ధీర్ఘకాల UFO ఔత్సాహికుడు జైమ్ మౌసన్ పేర్కొన్నారు. ఒక్కోదాని చేతికి మూడు వేళ్లు ఉన్నట్లు వెల్లడించారు. Mexico's Congress just unveiled two dead aliens estimated to be around 1,000 years old. What do you think? pic.twitter.com/Zr7z4FKenS — Kage Spatz (@KageSpatz) September 13, 2023 నేషనల్ అటానమస్ యూనివర్శిటీ ఆఫ్ మెక్సికోలోని శాస్త్రవేత్తలు ఆ అవశేషాలపై కార్బన్ డేటింగ్ విధానంలో పరిశోధనలు చేశారు. అవి 1000 ఏళ్లనాటివని తేలినట్లు తమ పరిశోధనలో తేలినట్లు వెల్లడించారు. భూమిపై ఒకప్పుడు జీవం ఉన్న, జీవ సంబంధమైన, గర్భధారణ కలిగి ఉన్నాయని తమ పరిశోధనలో తేలినట్లు పరిశోధకులు తెలిపారు. ఇదీ చదవండి: ఏలియన్ అవశేషాలు.. నాసా స్పందన ఇది -
పుట్టాడు ఏలియన్ లాంటి పిల్లోడు.. చేస్తున్నాడు వింతవింత శబ్ధాలు!
ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఏలియన్ లాంటి పిల్లోడు పుట్టాడు. ఆ పిల్లాడిని చూడగానే తల్లితో పాటు కుటుంబ సభ్యులు, స్థానికులు హడలెత్తిపోయారు. పిల్లాడి చర్మం తెలుపురంగులో ఉంది. చర్మంపై పలు చోట్లు పగుళ్లు కనిపిస్తున్నాయి. కళ్లు చాలా పెద్దగా ఉన్నాయి. ఈ వింత శిశు జననం స్థానికంగా సంచలనం కలిగించింది. కాగా ఇటువంటి శిశువును హాలోక్విన్ ఇథియోసిస్ బేబీ అని అంటారని వైద్యులు తెలిపారు. కాగా ఈ పిల్లాడు పుట్టినప్పటి నుంచి వింతవింత శబ్ధాలు చేస్తున్నాడు. సాధారణంగా ఇటువంటి శిశువులు జన్మించిన వెంటనే చనిపోతారని వైద్యులు తెలిపారు. అయితే ఈ శిశువు ఇంకా ఊపిరి తీసుకుంటున్నాడు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం బేహడీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామానికి చెందిన మహిళ కొన్ని రోజుల క్రితం పురిటి నొప్పులతో ఒక ఆసుపత్రిలో చేరింది. ఆగస్టు 30న ఆమెకు నార్మల్ డెలివరీ జరిగింది. అప్పుడే జన్మించిన శిశువును చూడగానే తల్లి హడలెత్తిపోయింది. పిల్లాడు ఏలియన్ మాదిరిగా ఉన్నాడని స్థానికులు చెబుతున్నారు. కాగా డాక్టర్ వినోద్ పాగ్రానీ మాట్లాడుతూ ఇలా జన్మించే శిశువును హాలోక్విన్ ఇథియోసిస్ బేబీ అని అంటారని, ఈ స్థితిలో జన్మించే శిశువుల చర్మంలో తైలగ్రంథులు ఉండవని, ఫలితంగా చర్మం పగిలిపోతుందన్నారు. మూడు లక్షల శిశు జననాలలో ఒకటి ఈ విధంగా ఉండవచ్చన్నారు. ఇటువంటి శిశువు ఎక్కువకాలం జీవించదని తెలిపారు. కొన్ని సందర్భాల్లో ఇటువంటి శిశువులు ఐదారురోజుల వరకూ జీవిస్తారని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: ప్రాణం తీసిన పిండిమర.. నలుగురు దుర్మరణం! -
సైన్స్‌ఫిక్షన్ సినిమాలు చేస్తున్న స్టార్స్!
ప్రయోగం, పరిశోధన, భవిష్యత్ కాల ప్రయాణం, మరమనిషి, ఇలా సైంటిఫిక్ ఎలిమెంట్స్‌తో ముడిపడిపోయారు కొందరు నటీనటులు. సైన్స్‌ఫిక్షన్ చిత్రాలకు సై అంటూ సైన్ చేశారు. ఈ స్టార్స్ చేస్తున్న వెండితెర సైన్స్ ప్రాజెక్ట్ వివరాలు తెలుసుకుందాం.. 28వ శతాబ్దంలో... ఉన్నట్లుండి కొన్ని వందల సంవత్సరాలు ముందుకు వెళితే ఎలా ఉంటుంది? అసలు.. 28వ శతాబ్దంలో ప్రపంచం ఎలా ఉంటుంది? అనే ఓ ఊహాత్మక కథ వెండితెరపైకి వస్తే అదే ‘కల్కి 2898 ఏడీ’ చిత్రమట. ప్రభాస్, కమల్‌హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్, దిశా పటానీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ అండ్ టైమ్ ట్రావెల్ ఫిల్మ్ ‘కల్కి 2898 ఏడీ’. ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 18వ శతాబ్దంలో మొదలై 28వ శతాబ్దంలోకి ఈ కథ వెళ్తుందని ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపి స్తోంది. ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజయ్యే చాన్స్ ఉందని టాక్. అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. చారిత్రాత్మక కంగువా ఇటీవల విడుదలైన ‘కంగువా’ సినిమా వీడియో గ్లింప్స్‌ను బట్టి ఇది పూర్తి చారిత్రాత్మక నేపథ్యం ఉన్న సినిమా అనేది కొందరి ఊహ. కానీ చారిత్రాత్మక భాగం కొంతవరకే ఉంటుందని, ఎక్కువ శాతం సమకాలీన కాలంలోనే జరుగుతుందని తెలిసింది. అలాగే కొంత భాగం 18వ శతాబ్దంలో ఉంటుందని, పరాక్రమవంతుడైన ఓ యోధుడు అంతు చిక్కని వ్యాధితో మరణించి, అతనే మళ్లీ జన్మించి, గత జన్మలో తాను ఎలా మరణించాడో తెలుసుకునే అంశాల సమాహారంగా సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్‌తో ‘కంగువా’ కథనం ఉంటుందని భోగట్టా. సూర్య హీరోగా శివ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో దిశా పటానీ హీరోయిన్. కాగా ‘కంగువా’ సినిమాలోని తొలి భాగం 2024 ఏప్రిల్ 12న విడుదల కానున్నట్లు సమాచారం. ఫిక్షనల్ గ్యాంగ్‌స్టర్ సాధారణంగా సైన్స్ ఫిక్షన్ సినిమాలంటే.. విభిన్నమైన పేర్లతో ఆపరేషన్స్ చేయడం, పరిశోధనలు, ఆవిష్కరణలు వంటి అంశాలు మిళితమై ఉంటాయి. కానీ గ్యాంగ్‌స్టర్ యాక్షన్‌కు సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెల్ అంశాలను జోడించి ఓ కొత్త ప్రయత్నం చేశారు అధిక్ రవిచంద్రన్. విశాల్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘మార్క్ ఆంటోనీ’ టైమ్‌ట్రావెల్ బేస్డ్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా రూపొందింది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో విశాల్ డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తారు. విశాల్‌కు జోడీగా రీతూ వర్మ నటించిన ఈ చిత్రం సెప్టెంబరు 15న రిలీజ్ కానుంది. ఓ గ్రహాంతరవాసి కథ ఓ గ్రహాంతరవాసి భూగ్రహంపై నివాసం ఉండాల్సి వస్తే ఏం జరుగుతుంది? అనే అంశం నేపథ్యంలో బాలీవుడ్లో గతంలో హృతిక్ రోషన్ ‘కోయీ.. మిల్ గయా’, ఆమిర్ ఖాన్ ‘పీకే’ వంటి సినిమాలు వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. కాస్త అటూ ఇటూగా ఈ చిత్రాల తరహాలోనే తమిళ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘అయలాన్’ ఉంటుందట. శివ కార్తికేయన్ హీరోగా ఆర్. రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్‌సింగ్ హీరోయిన్. ఈ సినిమాలో ఓ ఏలియన్ పాత్ర ఉన్నట్లు పోస్టర్స్ స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది దీపావళికి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇండియాలో ఏలియన్స్ ఉంటే.. ఇండియాలో ఏలియన్స్ నివాసం ఏర్పాటు చేసుకోవాలను కుంటే ఏం జరుగుతుంది? అనే పాయింట్‌తో తమిళ చిత్రం ‘ఏలియన్’ రూపొందుతోందట. తాప్సీ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ఇది. భరత్ నీలకంఠన్ దర్శకత్వం వహిస్తున్నారని తెలిసింది. ఆల్రెడీ షూటింగ్ జరుగుతోంది. రోబోలుగా హీరోయిన్లు ఓ మనిషిని రోబో ప్రేమిస్తే ఎలా ఉంటుంది? అనే పాయింట్ రజనీకాంత్ ‘రోబో’లో చూశాం. అయితే ఓ రోబోటిక్స్ ఎక్స్పర్ట్ రోబోతో ప్రేమలో పడితే, రోబోలు ప్రేమించుకుంటే.. అనే అంశాలతో హిందీలో ఓ సినిమా తెరకెక్కుతోందని టాక్. షాహిద్ కపూర్, కృతీ సనన్ జంటగా నటిస్తున్న ఓ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ కథ ఇది అని సమాచారం. అమిత్ జోషి, ఆరాధన షా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రోబోగా కృతీ సనన్, రోబోటిక్ ఎక్స్పర్ట్ పాత్రలో షాహిద్ కపూర్ నటిస్తున్నారట. మరోవైపు ‘ఎంవై 3’ అనే సైన్స్ ఫిక్షన్ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు హన్సిక. ఇందులో హన్సిక చేస్తున్న రెండు పాత్రల్లో రోబో పాత్ర ఒకటి. - శ్రీశ్రీ -
ఏలియన్ని కాను!
ఏలియన్స్‌తో సావాసం చేస్తున్నారు హీరోయిన్ తాప్సీ. ఎందుకంటే ఏలియన్స్‌తో కలిసి తాప్సీ ఓ మిషన్‌లో భాగమయ్యారు. ఈ మిషన్ తాలూకు వివరాలు తెలియడానికి కాస్త టైమ్ పడుతుంది. ఇటీవల హిందీప్రాజెక్ట్స్తో బిజీగా ఉంటున్న తాప్సీ ఓ తమిళ సినిమాకు సైన్ చేశారు. ‘‘తమిళంలో నేను చేస్తున్న తాజా సినిమా ‘ఏలియన్’. కాన్సెప్ట్ కొత్తగా ఉంటుంది. కానీ ఈ చిత్రంలో నేను ఏలియన్‌గా నటించడం లేదు. తమిళంలో నేను చేసిన ‘గేమ్ ఓవర్’ (2019) మూవీ నచ్చినవారికి ఈ సినిమా మరింత బాగా నచ్చుతుందనే నమ్మకం నాకుంది. ఈ సినిమా ప్రయాణం నాకు ఓ కొత్త అనుభూతిని ఇస్తోంది’’ అని తాప్సీ పేర్కొన్నారు. 2021లో వచ్చిన ‘అన్నాబెల్లె సేతుపతి’ తర్వాత తాప్సీ అంగీకరించిన తమిళ చిత్రం ఇదే. ఇక హిందీలో ‘ఓ లడ్కీ హై కహా’, ‘ఫిర్ ఆయీ హసీన్ దిల్రుబా’, ‘డంకీ’ చిత్రాలు చేస్తున్నారు తాప్సీ. -
మనిషి హస్తాన్ని పోలిన భారీ హస్తం.. అది గ్రహాంతరవాసిదా!
రియో డీ జెనీరో: బ్రెజిల్ తీరంలో మనిషి హస్తాన్ని పోలిన భారీ హస్తం బయటపడడం కలకలం రేపింది. ఇది మరో గ్రహానికి చెందిన జీవి చెయ్యి కావొచ్చని స్థానికులు అనుమానించారు. భయాందోళనకు గురయ్యారు. ఈ నెల 20న సో పౌలో స్టేట్‌లో లభించిన పొడవైన ఎముకలు మనిషి చేతి వేళ్లను పోలి ఉన్నాయి. అచ్చంగా చెయ్యి ఆకారంలోనే ఉండడం గమనార్హం. నిజానికి ఇది గ్రహాంతరవాసి హస్తం కాదని, భారీ తిమింగలం లేదా డాల్ఫిన్‌కు చెందిన ఎముకలని మెరైన్ బయాలజిస్ట్ ఎరిక్ కోమిన్ వెల్లడించారు. ఇది 18 నెలల క్రితం మరణించి ఉండొచ్చని అంచనా వేశారు. ఈ ఎముకలు సముద్ర జీవి శరీరం చర్మం కింద ఉండే ఫ్లిప్సర్స్ అని తెలిపారు. ఈ ఫ్లిప్పర్స్‌కు ఐదు వేళ్ల లాంటి ఎముకలు ఉంటాయన్నారు. -
వామ్మో ఇంత పెద్ద చెయ్యి.. కొంపతీసి ఏలియన్‌దా?
సముద్రతీరంలో హాయిగా నడుచుకుంటూ వెళ్తున్న ఓ ప్రేమ జంటకు ఇసుకలో ఓ పొడవాటి వస్తువులాంటింది కన్పించింది. వెంటనే దాన్ని బయటకు తీయగా.. అది అస్థిపంజరం చేతి. దాని పరిమాణం చూసి ఇద్దరూ కంగుతిన్నారు. ఇది కచ్చితంగా మనిషిది కాదని, భయాందోళన వ్యక్తం చేశారు. బ్రెజిల్లో నవంబర్ 20న ఈ ఘటన జరిగింది. అస్థిపంజరం చూసి హడలిపోయిన లెటిసియా గోమ్స్, ఆమె బాయ్‌ఫ్రెండ్ డెవనీర్ సౌజ్ వెంటనే దాన్ని ఫొటో తీశారు. అది ఏ సైజులో ఉందో చెప్పేందుకు డెవనీర్ తన చెప్పును కొలమానంగా చూపాడు. దొరికిన అస్తిపంజరం చేతిలోని వేలు.. ఆ చెప్పు కంటే పెద్దగా ఉండటం చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. ఈ చేతి కచ్చితంగా సాధారణ మనుషులది కాదని, కొంపతీసి ఏలియన్స్ది అయి ఉంటుందా? అని ఈ ప్రేమికులు ఆందోళన చెందారు. మరోవైవు నెటిజన్లు దీనిపై భిన్నమైన కామెంట్లు చేశారు. ఇది కచ్చతింగా ఏలియన్ చేతి అయి ఉంటుంది, వెంటనే దీన్ని పరిశోధనకు పంపించండి అని ఓ యూజర్ కామెంట్ చేశాడు. మరో యూజర్ అది జల కన్య చేతి అయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశాడు. మరో యూజర్ ఇది డైనోసార్ చేతి అయి ఉంటుందని పేర్కొన్నాడు. మరోవైపు ఇది డాల్ఫిన్, తిమింగలం వంటి జాతికి చెందిన సముద్ర జీవి అస్థి పజరం అయి ఉంటుందని, 18 నెలల క్రితం అది ఆ ప్రాంతంలోనే చనిపోయిందని ఓ సముద్ర జీవ శాస్త్రవేత్త చెప్పుకొచ్చారు. అయితే దీన్ని ధ్రువీకరించేందుకు కచ్చితంగా పరీక్షలు చేయాల్సిందేని స్పష్టం చేశారు. చదవండి: Guinness World Records: ఆ పిల్లి వయసు 26 -
Mystery: డ్యానీని హెచ్చరించింది ఎవరు? అది ఏలియన్స్ పనా? లేదంటే..
ఆసక్తిని రేపే వింతలు.. అనుకోకుండా తారసపడినప్పుడు.. శోధించాలనే జిజ్ఞాస మనిషిని నిమిషం కూడా కుదురుగా నిలువనివ్వదు. కునుకు పట్టనివ్వదు. ఈ కథలో జరిగిందీ అదే. ఓ పక్క నిజం కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నా నిరూపించలేని నిస్సహాయత వెక్కిరిస్తుంటే.. మరోపక్క విశ్లేషించే క్రమంలో ఉద్దేశపూర్వకంగా అవాంతరాలు అడుగడుగునా హెచ్చరిస్తుంటే సాహసంతో ముందుకు నడిచాడు ఓ జర్నలిస్ట్. అది 1987.. అమెరికాలోని వర్జీనియాలో వైథెవిల్ అనే ప్రాంతవాసులు రాత్రి అయితే చాలు భయంతో గజగజా వణికేవారు. ఆ భయానికి కారణం ఆకాశంలో ఎగిరే ఓ వింత ఆకారం (ఎగిరే పళ్లెం, ‘యూఎఫ్ఓ–అన్ ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్’). ఏ ఇద్దరు మాట్లాడుకున్నా అదే కలకలం. ఆనోటా ఈనోటా ఆ వింత.. ‘వేవ్ రేడియో’ రిపోర్టర్ డ్యానీ చెవినా పడింది. అక్టోబర్ 7న అదే విషయాన్ని పెద్ద జోక్‌గా శ్రోతలతో షేర్ చేసుకున్నాడు డ్యానీ. విన్నవారు మాత్రం జోక్‌గా తీసుకోలేదు. నిజమేనంటూ సీరియస్ అయ్యారు. ఆ వింతను మేమూ చూశామనే ఫోన్‌కాల్స్ పెరిగాయి. రోజులు గడుస్తున్నాయి. అక్టోబర్ 17న నైట్ డ్యూటీలో ఉన్న డ్యానీకి.. వైథెవిల్ చుట్టుపక్కల ప్రజల నుంచి ఫోన్‌కాల్స్ పోటెత్తాయి. ‘ఆకాశంలో ఓ వింత ఆకారం కనిపించింది. శబ్దం రావట్లేదు కానీ మెరుస్తోంది. చూడటానికి చాలా పెద్దగా ఉంది. దానికి రంగురంగుల లైట్స్ ఉన్నాయి.. మాకు భయంగా ఉంది’ అని చెప్పారు ఫోన్ చేసినవాళ్లంతా. దాంతో డ్యానీ.. ‘అమెరికా ప్రయోగాత్మకంగా యుద్ధ విమానాలను పరీక్షిస్తుండొచ్చు, కంగారు పడాల్సిన పనిలేదు’ అంటూ ధైర్యం చెప్పుకొచ్చాడు. అయితే డ్యానీ ఆ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోలేదు. పెంటగాన్ అధికారుల దగ్గర ఆరా తీశాడు. వాళ్లేమో ‘ప్రభుత్వం ఎలాంటి ప్రయోగాలు చెయ్యడం లేదని.. జనావాసం మధ్యలో అలాంటి ప్రయోగాలు ఎందుకు చేస్తామ’ని ఎదురు ప్రశ్నించారు. దాంతో డ్యానీకి యూఎఫ్ఓల రాక నిజమేనన్న అనుమానం మొదలైంది. నాలుగు రోజుల తర్వాత డ్యానీ తన స్నేహితుడు రోజర్ హాల్‌తో కలసి కారులో.. వైథెవిల్కి దక్షిణ దిశగా బయలుదేరారు. తీరా అక్కడికి వెళ్లాక ఎంతసేపు ఎదురు చూసినా ఎలాంటి అలజడి లేదు. ప్రజలు అనవసరంగా భయపడుతున్నారని తీర్మానించుకుని వెనుదిరిగారు ఇద్దరూ. కారు స్టార్ట్ చేసి కాస్త ముందుకు వెళ్లేసరికి.. కారు అద్దంలోంచి మెరుపులు విరజిమ్మడం చూసి ఆశ్చర్యపోయారు. కారు దిగి, ఆ వింతని కళ్లారా చూశారు. విశాలమైన ఆకాశంలో ఓ పెద్ద క్రాఫ్ట్ గిర్రున తిరుగుతూ.. మరో గుండ్రటి ప్లేట్‌ని తనలో కలుపుకుని ఒక్కసారిగా అంతర్ధానమైపోయింది. ఆ షాక్‌లో ఇద్దరూ ఫొటోలు తియ్యలేకపోయారు. అందుకే మరునాడు రాత్రి అదే సమయానికి అదే చోటికి వెళ్లి.. ఆ దృశ్యాలను కెమెరాలో బంధించారు. ఆధారాలు ఉన్నాయనే నమ్మకంతో యూఎఫ్ఓ ఫొటోలు తీశామని తెలుపుతూ.. ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుందని ప్రకటించాడు డ్యానీ. అయితే అదే రోజు రాత్రి డ్యానీకి రెండు ఫోన్ కాల్స్ వచ్చాయి. దాదాపుగా బెదిరింపు కాల్స్ లాంటివి. ముందు కాల్ చేసిన వ్యక్తి.. ‘అమెరికా సీక్రెట్ సర్వీస్ సంస్థ(సీఐఏ)కీ, అమెరికా ప్రభుత్వానికి యూఎఫ్‌ఓపై చాలా ఆసక్తి ఉంది’ అని చెప్పగా.. తర్వాత కాల్ చేసిన వ్యక్తి.. ‘యూఎఫ్ఓలపై ప్రయోగాలొద్దు. అదంతా ప్రభుత్వ వ్యవహారం. ఈ విషయంలో గోప్యత చాలా అవసరం. అదే అందరికీ మంచిది’ అంటూ హెచ్చరించాడు. దాంతో మరునాడు(అక్టోబర్ 23న) ప్రెస్ కాన్ఫరెన్స్‌లో నోరు విప్పలేకపోయాడు డ్యానీ. ‘పూర్తి సమాచారం రాగానే యూఎఫ్‌ఓపై మాట్లాడతాను’ అంటూ కాన్ఫరెన్స్ని ముగించాడు. తీరా ఇంటికి వచ్చి చూస్తే ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నాయి. ఎక్కడి వస్తువులు అక్కడే ఉన్నాయి కానీ యూఎఫ్ఓ ఫొటోలు మాత్రం కనిపించలేదు. డ్యానీకి అర్థమైంది.. ఇదంతా రాత్రి కాల్ చేసినవాళ్ల పనేనని. డిసెంబర్ చివరి నాటికి యూఎఫ్ఓ చూసిన సాక్ష్యుల సంఖ్య పెరగసాగింది. దాంతో ఈ విషయంపై మాట్లాడటానికి.. డ్యానీ పెంటగాన్‌లోని రక్షణశాఖ అధికారులని కలిశాడు. ‘యూఎఫ్ఓలు ఉన్నట్లు ప్రభుత్వం నమ్ముతోంది. కానీ ప్రజలకు ఎలాంటి నష్టం జరగదనేది ప్రభుత్వాభిప్రాయం’ అని చెప్పారు. దాంతో డ్యానీ సమాధానపడలేదు. యూఎఫ్ఓలపై దూకుడు పెంచాడు. మరో రెండు నెలలు దాటింది. 1988 మార్చి 19న వర్జీనియా బీచ్‌లో బ్రాడ్‌కాస్టర్స్ కాన్ఫరెన్స్ కోసం వెళ్లాడు డ్యానీ. ‘డ్యానీని పిలుస్తారా?’ అంటూ అక్కడికో ఫోన్ వచ్చింది. కాసేపటికి రిసీవర్ అందుకున్న డ్యానీ.. ‘ఐయామ్ డ్యానీ.. హూ ఈజ్ దిస్’ అనగానే ఓ వృద్ధ స్వరం గంభీరంగా పలికింది. ‘నేను రిటైర్డ్ మిలిటరీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ని. కావాలంటే నా మాటలను రికార్డ్ చేసుకో. నేను నీకు వార్నింగ్ ఇస్తున్నట్లు నిరూపించేందుకు ఈ వాయిస్ టేప్ నీకు ఉపయోగపడుతుంది. నీలాగే యూఎఫ్ఓలపై పరిశోధనలు చేసిన నా కొడుకు ల్యుకీమియాతో చనిపోయాడు. నీకు అదే గతిపడుతుంది. ఎందుకంటే అమెరికా ప్రభుత్వానికి నీలాంటి వాళ్ల ధోరణి నచ్చదు. నా మాట విని ఈ విషయాన్ని ఇక్కడితో వదిలెయ్. విడిచిపెట్టకపోతే నీపైన, నీ కుటుంబం పైనా రసాయన ప్రయోగాలు జరిగే ప్రమాద ముంది’ అని హెచ్చరించాడు ఆ పెద్దాయన. ‘డోంట్ లుక్ అప్’ పుస్తకం విడుదల ‘రోనోకే టైమ్స్’ బ్యూరో రిపోర్టర్ పాల్ డెల్లింగర్ 1866 నుంచి వైథెవిల్లోనే నివాసముండేవాడు. 1988లో అతడు కూడా డ్యానీలానే యూఎఫ్ఓని ప్రత్యక్షంగా చూసి పలు కథనాలు రాశాడు. ఆ వింతను ప్రత్యక్షంగా చూసినవారినెందరినో ఇంటర్వ్యూలూ చేశాడు. ఈ క్రమంలోనే డ్యానీతో జతకట్టాడు. రోనోకే టైమ్స్, వేవ్ రేడియో ఒకే బిల్డింగ్‌లో ఉండటంతో డ్యానీకి, పాల్కి స్నేహం కుదిరింది. దాంతో ఇద్దరూ కలసి యూఎఫ్‌ఓకి సంబంధించిన వాస్తవ సంఘటనలతో ‘డోంట్ లుక్ అప్’ అనే పుస్తకాన్ని రచించి, ప్రచురించారు. 208 పేజీలతో నిండిన ఈ పుస్తకంలో కేవలం వైథెవిల్ యూఎఫ్ఓ సంఘటనలే కాకుండా కామన్వెల్త్ అంతటా ఉన్న రహస్యాల గురించి ప్రస్తావించారు. ఈ పుస్తకం వేల కాపీల్లో అమ్ముడుపోయినప్పటికీ ఆ మిస్టరీలు నాటికీ, నేటికీ మిస్టరీలుగానే మిగిలిపోయాయి. అదే పనిగా వాటి గురించి ఆలోచిస్తూ.. యూఎఫ్ఓ స్ట్రెస్‌కు లోనయ్యాడు డ్యానీ. అతడి పరిస్థితి చూసి, కుటుంబ సభ్యులు.. ఇదంతా వదిలిపెట్టేయమంటూ ఒత్తిడి తెచ్చారు. 1990 డిసెంబర్ తర్వాత డ్యానీకి యూఎఫ్ఓలు కనిపించలేదు. 1992లో ‘అన్ సాల్వ్డ్ మిస్టరీస్’ అనే పలు సిరీస్‌లు ప్రేక్షకుల్ని అలరించాయి. అయితే పుస్తకంలో చెప్పినట్లు ‘నేను పైకి చూడను.. నేను దేనికోసం వెతకను.. కానీ నిజంగా ఆ రోజు నేను ఈ బుక్ రాయకుండా ఉండి ఉంటే ప్రపంచానికి తెలిసేదే కాదు. కథ అనేది ఎప్పటికీ నిలిచిపోతుందని నేను నమ్ముతాను’ అంటారు డ్యానీ. 2022 జనవరిలో డ్యానీ మరో పోరాటం మొదలుపెట్టాడు. నెట్‌ఫ్లిక్స్‌లో 2021లో విడుదలైన ‘డోంట్ లుక్ అప్’ సినిమా టైటిల్‌ను తమ బుక్ నుంచే తీసుకున్నారని.. కేవలం ఆశ్చర్యార్థకాన్ని తొలగించి.. ఆ పేరును యథాతథంగా వాడుకున్నారని, దానికి తన అనుమతి తీసుకోలేదంటూ బాధ్యుల మీద దావా వేశాడు డ్యానీ. అదలా ఉండగా ఆనాటి యూఎఫ్ఓలు ప్రభుత్వం పనా? లేక ఏలియన్స్ పనా? మరి డ్యానీని హెచ్చరించింది ఎవరు? ఇలా పలు ప్రశ్నలతోనే మిస్టరీగా చరిత్రలో చేరింది ఈ కథ. -సంహిత నిమ్మన చదవండి: టేస్టీ ఐలాండ్.. అక్కడ మట్టిని కూరల్లో మసాలాగా వాడతారు! -
హిందూ మహాసముద్రంలో వింత జీవి
మహాసముద్ర గర్భంలో మనకు తెలియని ఎన్నో రకమైన సముద్ర జీవులు, రకరకాల జంతు జాతులు ఉంటాయి. ఇలాంటి మహాసముద్ర గర్భంలో ఏముందో తెలుసుకోవడానికి కొందరు ఔత్సహికులు ప్రయత్నిస్తారు. కానీ, కొన్నిసార్లు వారి అన్వేషణలో సైతం తెలియని మిస్టీరియస్ వండర్స్ ఎన్నో ఉంటాయి. రీసెర్చర్లకు, జంతు నిపుణులకు సైతం ఇవి అంతు బట్టవు. తాజాగా హిందూ మహాసముద్రంలో సుమారు 3,700 అడుగుల లోతున కనీవినీ ఎరుగని ఒక విచిత్ర జీవి కనబడి అందరిని ఒకింత ఆశ్చర్యాన్ని గురిచేసింది. ఈ వింత జీవి కదిలికలు అన్ని కెమెరాలో రికార్డు అయ్యాయి. ఇది పలు రకాల షేపులు మారుస్తూ, అతి వేగంగా లోతుగా నీటి అడుగు భాగానికి వెళ్లి అక్కడ తన ఆకారాన్ని మార్చుకుని అకస్మాత్తుగా ఒక చిన్న నల్ల బంతి ఆకారంలో మళ్ళీ పైకి వచ్చిన వెంటనే తన షేపు మారుస్తూ కనిపించింది. కొందరు దీన్ని సముద్ర ‘ఏలియన్’ అని అంటే మరికొందరు ఇది చేప లేదా తిమింగలం జాతికి చెందిన కొత్తరకం జీవి అంటున్నారు. కొంతమంది జేమ్స్ కేమరూన్ మూవీ ‘ఏలియన్’ని గుర్తు చేస్తున్నారు. ఇది రకరకాల విన్యాసాలు చేయడాన్ని ఇంత లోతున రీసెర్చర్లు అమర్చిన రిమోట్ కెమెరా క్యాప్చర్ చేసింది. ఈ క్లిప్ ను 2013లో ఆన్లైన్లో ప్రసారం చేసినప్పటికీ ఇది బాగా వైరల్ అవుతుంది. ఈ వీడియో ఆఫ్రికా తూర్పు తీరంలో తీయబడింది. ఇప్పుడు యూట్యూబ్‌లో దీనిని 1.5 మిలియన్లకు పైగా చూశారు. నాటి నుంచి నేటి వరకు ఈ విచిత్ర జీవి ఏమిటో అనేది ఎవరు చెప్పలేక పోతున్నారు. చదవండి: గడ్డకట్టే చలిలో డాన్స్ అంటే మాటలా... -
జనాన్ని హడలెత్తించిన ఏలియన్!?
నోయిడా : ఐరన్ మ్యాన్ సూట్‌ను పోలిన ఓ బెలూన్ నోయిడా ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసింది. అది ఏలియన్‌లాగా గాల్లోంచి నేలపై దిగటంతో జనం బిక్కచచ్చిపోయారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రేటర్ నోయిడాలోని దాన్‌కౌర్ ప్రాంతంలో నిన్న ఉదయం ఓ వింత ఆకారం గాల్లో ఎగురుతూ కనిపించింది. కొంతసేపటి తర్వాత ఓ కాలువలోకి దిగి, అక్కడే కొద్దిసేపు కదులుతూ కనిపింది. దాని చూసిన జనం అది అచ్చం ఏలియన్ లాగానే ఉందంటూ.. కాదు, కాదు ఏలియనే అంటూ భయభ్రాంతులకు గురయ్యారు. ( స్వాతంత్య్ర సమర యోధుడికి తీవ్ర అవమానం ) ఆ వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. దాన్‌కౌర్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ అనిల్‌కుమార్ పాండే అక్కడికి చేరుకున్నాక అసలు విషయం బయటపడింది. అది ఏలియన్ కాదని.. ఐరన్ మ్యాన్‌ను పోలి ఉన్న బెలూన్ అని ఆయన స్థానికులకు వివరించారు. బెలూన్ గాల్లోకి ఎగరటానికి ఆధారమైన గ్యాస్ తగ్గుతుండటంతో అది నేలపై పడిందని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. -
సార్ మా ఇంటి దగ్గర ఎలియన్ ఉంది!
పూణె : ఎలియన్స్ భూమికి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని వాటి గ్రహానికి పంపుతున్నాయి. దానిలో భాగంగా అవి మా ఇంటి చుట్టూ తిరుగుతున్నాయి. అదేంటో కనుక్కోండి సార్ అంటూ ప్రధాని కార్యాలయానికి ఈ మెయిల్ చేసాడో వ్యక్తి. ఈ విషయం గురించి విచారణ చేసిన పోలీసులు సదరు వ్యక్తి మానసిక స్థితి సరిగా లేకపోవడంతో ఇలా చేశాడని తేల్చారు. ఆసక్తి రేపిన ఈ సంఘటన వివరాలు.. కొథ్రూడ్ ప్రాంతానికి చెందిన ఓ 47 ఏళ్ల వ్యక్తి కొన్నేళ్లుగా బ్రెయిన్ హ్యామరేజ్‌తో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో అతను మానసిక పరిస్థితి క్షీణించింది. కొన్ని రోజుల క్రితం తన ఇంటి బయట మూడు లైట్లు వెలుగుతుండటం చూశాడు. దాంతో అవి ఎలియన్స్‌కు సంబంధించిన వస్తువులగా భావించాడు. ఈ విషయం గురించి విచారణ చేయాల్సిందిగా ప్రధాని ఆఫీస్‌కు ఈ- మెయిల్ చేశాడు. ‘ఎలియన్స్‌కు సంబంధించిన వస్తువు ఒకటి నా ఇంటి సమీపంలో తిరగుతుంది. అది భూమికి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని వాటి గ్రహానికి చేరవేస్తుంది. దీని వల్ల మనకు అపాయం కల్గుతుంది. కాబట్టి వెంటనే ఈ విషయం గురించి విచారణ చేపట్టండి’ అంటూ ప్రధాని ఆఫీస్‌కు ఈ మెయిల్ చేశాడు. పీఎంఓ అధికారులు దీన్ని మహారాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేశారు. ప్రభుత్వ ఆదేశం మేరకు విచారణ చేపట్టిన పోలీసులు సదరు వ్యక్తి మానసిర స్థితి సరిగా లేకపోవడంతో ఇలా చేశాడని తేల్చారు. అతను ఇలా మెయిల్ చేసిన విషయం ఇంట్లో కుటుంబ సభ్యులేవరికి తెలియదన్నారు. -
కర్ణాటకలో వింతజీవి.. కలకలం
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో వింతజీవి సంచరిస్తోందన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో జనసంచారం తక్కువగా ఉన్న మారుమూల ప్రాంతాల్లో వింతజీవి సంచరిస్తున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వింతజీవి బారిన పడిన పశువులు రాత్రికి రాత్రే తీవ్ర గాయాలపాలవుతున్నాయి. అలా గాయాలపాలైన పశువులు రెండు మూడు రోజుల తరువాత మృత్యువాత పడుతున్నట్టు వదంతులు వినిపిస్తున్నాయి. వింత జంతువు గ్రహాంతర వాసి అయివుండొచ్చని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇదంతా ఉత్తిదేనని కొంత మంది కొట్టిపారేస్తున్నాయి. ఈ వీడియోలు పాతవని అంటున్నారు. కోతి ముఖానికి రంగులు వేసి వింతజీవిగా తయారు చేశారని అంటున్నారు. తాడుతో కోతిని కట్టేసి ఈ వీడియో తీసివుంటారన్న అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ఈ వీడియో కర్ణాటకలోనే తీశారా, మరెక్కడైనా చిత్రీకరించారా అనేది స్పష్టం కాలేదు. -
ఏలియన్ డ్యాన్స్.. పీక్స్‌కి చేరింది!
న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో ఏదైనా ట్రెండయితే చాలు.. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా వాటిని అనుసరించేస్తున్నారు. ఈ మధ్య ఏలియన్ డ్యాన్స్ పేరిట ఓ వీడియో విపరీతంగా హల్చల్ చేస్తోంది. ఓ మ్యూజిక్ యాప్ సాయంతో సెలబ్రిటీలు ఆ వీడియోకు స్టెప్పులేస్తున్నారు. తాజాగా నటి యామీగౌతమ్ ఏలియన్‌తో డ్యాన్స్ చేశారు. ఓవైపు ఏలియన్ డ్యాన్స్ , మరోవైపు తన బృందంతో కలిసి యామీ లయబద్ధంగా ఆ వీడియోకు స్టెప్పులేశారు. దానిని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా 7.7 లక్షల మంది వీడియో వీక్షించగా, మరో లక్షమంది నెటిజన్లు లైక్ చేశారు. ఇక ఈ మధ్యే ఈ గ్రహంతర వాసి డాన్సులకు క్రికెటర్ రోహిత్ శర్మ, కమెడియన్ మలైకా దువా, నటి దివ్యాంక త్రిపాఠిలు స్టెప్పులేసిన సంగతి తెలిసిందే. వీరి వీడియోలకు విశేష స్పందన రావడంతో యామీ కూడా ట్రై చేశారు. ఫిట్నెస్ను చూపిస్తూ ఇటీవల ఆమె చేసిన విన్యాసాల వీడియో, ఫొటోల కంటే కూడా మ్యూజికల్ యాప్‌తో ఏలియన్ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇన్‌స్టాగ్రమ్‌లో ఆమెకు 67 లక్షల మంది ఫాలోయర్లున్నారు. -
ఆ వింత అస్తిపంజరం ఏలియన్‌దేనా?
-
ఆ వింత అస్తిపంజరం ఏలియన్‌దేనా?
న్యూయార్క్ : చిలీ ఏడారిలో దొరికిన ఓ అస్తిపంజరం ఆర్కియాలజిస్టులను, శాస్త్రవేత్తలను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బహుశా అది ఏలియన్ అస్తిపంజరం అయి ఉంటుందని కొందరు చెబుతుండగా ఇంకొందరు మాత్రం అది మనిషిదేనని, అది కూడా కొన్ని దశాబ్దాల కిందటిది మాత్రమే అని చెబుతున్నారు. అసలు ఆ అస్తిపంజరం ఏమిటో? అది ఎక్కడ దొరికిందో? ఇప్పుడు ఏం చేయబోతున్నారో పరిశీలిస్తే.. చిలీ ఏడారిలో విడిచివేయబడిన ఓ గ్రామంలోని పాడుబడిన చర్చి వద్ద అటకామా (అటా) అనే అస్తిపంజరం ఓ వ్యక్తికి 2003లో దొరికింది. దానిని ప్రస్తుతం ఓ వ్యక్తి ఆర్కియాలజికల్ వస్తువులు దొరికే బ్లాక్ మార్కెట్లో కొన్నాడు. ఆ అస్తిపంజరం చెక్కుచెదరకుండా ఉంది. అయితే, దాని పుర్రె మాత్రం ఏలియన్ మాదిరిగా ఉండగా దానికి ఆశ్చర్యకరంగా పక్కటెముకలు 10 ఉన్నాయి. సహజంగా మనుషులకు 12 ఉంటాయి. అలాగే, చూడ్డానికి 6 నుంచి 8 ఏళ్ల మధ్య ఉన్న చిన్నారిదిలాగా కనిపిస్తున్నా పరిమాణం, ఎత్తు మాత్రం షాకయ్యేలా ఉంది. ఆ అస్తిపంజరాన్ని నిలబెడితే ఆరు అంగుళాలు మాత్రమే ఉంది. దీని లక్షణాలు అన్ని కూడా ఏలియన్ల గురించి శోధించేవారిని అమితంగా ఆకట్టుకుంటున్నాయి. దీనిని ప్రత్యేకంగా పరిశీలించిన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ జెనిటిస్ట్ గ్యారీ నోలాన్ ఓ నివేదిక వెల్లడించారు. దాని ప్రకారం కొన్ని మార్పులతో ఎవరు ఎప్పుడైనా జన్మించవచ్చని తెలిపారు. అలాగే, ఈమె కూడా ఏలియన్‌లాంటి తలతో, పాములాంటి కళ్లతో జన్మించి ఉంటాడని తెలిపారు. అస్తిపంజరాన్ని పరిశీలించినప్పుడు దాని డీఎన్ఏ మనిషే అని చెబుతోందని, అది కూడా కొన్ని దశాబ్దకాలంనాటిదే అయుంటుందని గుర్తించినట్లు వెల్లడించారు. ఈ వివరాలను జినోమ్ రిసెర్చ్ అనే జర్నల్‌లో పేర్కొన్నారు. మిగితా వ్యక్తుల జన్యువులతో పోలిస్తే అటాలోనికి కొంత భిన్నంగా ఉన్నట్లు తెలిపారు. ఈ అస్తి పంజరం ఒక అమ్మాయిదని, దక్షిణ అమెరికాలో ఆమె మూలవాసులు ఉండొచ్చని, ఆమె ఒక చిలియన్ అయి ఉండొచ్చని చెప్పారు. -
సంచలనం.. ఆ రోజు స్ట్రెచర్‌పై ఉంది ఏలియన్
-
సంచలనం.. ఆ రోజు స్ట్రెచర్‌పై ఉంది ఏలియన్
మెక్సికో : సరిగ్గా 1947లో అమెరికా, మెక్సికోలోని పత్రికలన్నీ వేర్వేరు కథనాలతో నిండిపోయాయి. ప్రపంచ దృష్టి సైతం కూడా ఆ వైపుగా పడింది. ఏలియన్ల ప్రస్తావన కూడా అప్పటి నుంచే ఊపందుకొంది. ఎందుకంటే ఆ ఏడాదిలో మెక్సికోలోని రోస్వెల్ అనే ప్రాంతానికి సమీపంలోని 51 అనే ప్రాంతంలో ఓ భారీ పేలుడు సంభవించింది. భారీ బెలూన్ వల్ల ఆ ప్రమాదం చోటు చేసుకుందని అమెరికా బలగాలు చెప్పాయి. అయితే, కొందరు మాత్రం ఓ ప్లైయింగ్ సాసర్ పేలిపోయిందని, అది ఏలియన్ల అంతరిక్ష నౌక అని మరికొందరు చెప్పారు. మరోపక్క, రష్యా అణుబాంబు పరీక్ష వివరాలు తెలుసుకునేందుకు సీక్రెట్‌గా ఏర్పాటుచేసిన ప్రయోగంలో ఆ బెలూన్ పేలిపోయిందంటూ మరిన్న కథనాలు వినిపించాయి. దాని అనంతరం ఎన్నో పరిశోధనలు, ఎన్నో సైద్ధాంతిక గ్రంథాలు ఆఖరికి సినిమాలు, సీరియల్స్ కూడా వచ్చాయి. అయితే, వాటన్నింటిని పటాపంచలు చేసేలా ఓ సంచలనాత్మక వీడియో వెలుగులోకి వచ్చింది. ఆ పేలుడు సంభవించిన సమయంలో అక్కడికి చేరుకున్న యూఎస్ బలగాలు ఓ స్ట్రెచర్‌పై ఏలియన్ బాడీని తీసుకెళుతున్నట్లు అందులో ఉంది. యూఎఫ్ఓ స్పేస్ షిప్ అక్కడే కూలిపోయిందని దాంతో అందులోని ఏలియన్ గాయపడిందని, దానిని స్ట్రెచర్‌పై స్వయంగా తరలించారని ఆ వీడియో చూస్తే తెలుస్తోంది. తాజాగా యూట్యూబ్‌లో దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. భిన్నకథనాలు పుట్టుకొచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా మంది కచ్చితంగా ఆరోజు ప్లైయింగ్ సాసర్ పేలిపోయిందని, అందులో ఓ ఏలియన్‌ను కూడా తాము చూశామని చెప్పేవాళ్లు ఇప్పటికీ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియో ఏ చర్చకు దారి తీస్తుందో చూడాలి. -
పుట్టిన బిడ్డ ఏలియన్స్‌లా ఉన్నాడని..
లక్నో: పండంటి బిడ్డ పుడతాడని ఆశించిన తల్లిదండ్రులు పుట్టిన బిడ్డను చూసి షాక్‌తిన్నారు. శారీరక వైకల్యంతో జన్మించిన పిల్లలను పెంచిపెద్ద చేయడం కత్తి సాము లాంటిదే. అలాంటి పిల్లలు ఆరోగ్యకరమైన సాధారణ జీవితం గడపాలంటే అటు కుటుంబ సభ్యులనుంచి ఇటు సమాజం నుంచి సంపూర్ణ మద్దతు చాలా అవసరం. ఉత్తరప్రదేశ్‌లోని అలీగడ్‌కు కు చెందిన దంపతులు వింత ఆకారంతో పుట్టిన బిడ్డపట్ల బాధ్యతగా వ్యవహరించి, అక్కున చేర్చుకుని ఆదర్శంగా నిలిచారు. అలీగడ్‌కు చెందిన దంపతులు తమ బిడ్డను చూసి భయపడిపోయారు. ముక్కు చెవులు లేకుండా.. కళ్లు పెద్దవిగా బయటకు పొడుచుకు వచ్చినట్టుగా ఉన్న పిల్లవాడి ఆకారాన్ని చూసి చలించిపోయారు. కానీ ఇది భగవంతుడి దయ అంటూ బిడ్డను స్వీకరించారు. ఏదో ఒక అద్భుతం జరిగి తమ కొడుకు జీవితం బాగు పడుతుందని ఆశతో ఇంటికి తీసుకెళ్లారు. అటు గ్రామస్తులు మాత్రం గ్రహాంతరవాసి (ఏలియన్స్) లా వింతగా ఉన్నాడంటూ బిడ్డను చూడడానికి తరలివచ్చారు. కాగా 2 కేజీల బరువుగా పిల్లవాడు ఆరోగ్యంగా ఉన్నాడని, ప్రమాదమేమీలేదని వైద్యులు తెలిపారు. కాగా ఈ దంపతులకు ఇప్పటికే రెండు సంవత్సరాల కుమార్తె ఉంది. -
కపాలం ఏలియన్ది కాదు.. పిల్లవాడిదే!
యుద్ధరంగంలో పోరాడిన ఓ పిల్లవాడికి చెందిన కపాలాన్ని రష్యాకు చెందిన పురావస్తు శాస్త్రజ్ఞులు వెలికితీశారు. క్రిమియాలోని ఓ శ్మశానవాటికలో తవ్వకాలు జరుపుతున్న సమయంలో వారికి ఓ అస్తిపంజరం కాలి ఎముకలు తగిలాయి. దాంతో పూర్తిగా అస్ధిపంజరాన్ని వెలికితీసేందుకు సున్నితమైన బ్రష్‌లను ఉపయోగించారు. పూర్తిగా బయటపడిన అస్ధిపంజరాన్ని చూసిన వారు షాక్‌కు గురయ్యారు. అందుకు కారణం అస్ధిపంజరం తల ఏలియన్ తలను పోలి ఉండటమే. అయితే, దీనిపై మాట్లాడిన పురావస్తు శాస్త్రజ్ఞుల బృందం కపాలం ఏలియన్ది కాదని అన్నారు. ఇదొక పిల్లవాడి కపాలమని చెప్పారు. పిల్లవాడి కపాలం అంత పొడవుగా ఎలా మారిందని ప్రశ్నించగా.. 2 వేల సంవత్సరాల క్రితం పిల్లలను యుద్ధానికి పంపేవారని తెలిపారు. యుద్ధంలో గెలుపు కోసం.. కృత్రిమ పద్ధతుల్లో వారి కపాలాన్ని సాగదీసేవారని వెల్లడించారు. ఈ ప్రక్రియలో భరించరాని బాధను పిల్లలు అనుభవించేవారని తెలిపారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శ్మశాన ప్రాంతం గుండా బ్రిడ్జిని నిర్మించాలని ఆదేశించడంతో ఇక్కడ తవ్వకాలు ప్రారంభమయ్యాయి. అయితే, ఈ కపాలం గ్రహాంతరవాసులదేనని కొందరు వాదిస్తున్నారు.