గ్రహాంతరవాసులు నిజంగా ఉన్నారా, లేరా? అనేది నేటికీ మిలియన్ డాలర్ల ప్రశ్న. అయితే, వారి ఉనికికి ఊతమిచ్చేలా మరో అంశం తెరపైకి వచ్చింది. కాంస్యయుగం నాటి పురాతన నిధిలో గ్రహాంతర పదార్థాలు ఉన్నాయని పరిశోధకుల పరీక్షల్లో తేలింది. 1963లో ఐబీరియన్ ద్వీపకల్పంలో కాంస్యయుగం నాటి నిధి బయటపడింది. దీనిని ‘ట్రెజర్ ఆఫ్ విల్లెనా’ అని పిలిచేవారు.
ఇందులో ఎంతో విలువైన రాతి యుగం నాటి కంకణాలు, గిన్నెలు, సీసాలు, వివిధ ఆభరణాలు వంటి 66 వస్తువులు ఉన్నాయి. ఇటీవల ఒక కొత్త పరిశోధన బృందం ఈ వస్తువులపై పరీక్షలు జరిపింది. ఈ పురాతన నిధిలోని ఒక కళాఖండం అంతరిక్ష పదార్థాలతో తయారు చేసినట్లు ఈ బృందంలోని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
మిగిలిన వస్తువులు చాలా వరకు బంగారం, వెండితో తయారు చేశారని, వీటిలోని కేవలం ఓ కళాఖండంలోని పదార్థం మాత్రం భూమ్మీద ఎక్కడా లభించదని, ఇది ఇతర గ్రహాల్లో లభించే అవకాశం ఉందని తెలిపారు. కొంతమంది పురావస్తు శాస్త్రజ్ఞులు ఈ నిధి కాంస్యయుగం తర్వాతి కాలానికి చెందినదని చెబుతున్నారు. మరికొందరు నిపుణులు ఈ వస్తువులలోని ఇనుము ఉల్కల నుంచి వచ్చినదని చెబుతున్నారు. ఈ లోహానికి గ్రహాంతర మూలాలను నిగ్గుతేల్చడానికి మరిన్ని పరీక్షలు అవసరమని అంటున్నారు.
(చదవండి: సీట్‌బెల్ట్‌తో కిడ్నీలకూ రక్షణ!)
Comments
Please login to add a commentAdd a comment