Ancient treasures
-
పురాతన నిధిలో గ్రహాంతర పదార్థాలు..!
గ్రహాంతరవాసులు నిజంగా ఉన్నారా, లేరా? అనేది నేటికీ మిలియన్ డాలర్ల ప్రశ్న. అయితే, వారి ఉనికికి ఊతమిచ్చేలా మరో అంశం తెరపైకి వచ్చింది. కాంస్యయుగం నాటి పురాతన నిధిలో గ్రహాంతర పదార్థాలు ఉన్నాయని పరిశోధకుల పరీక్షల్లో తేలింది. 1963లో ఐబీరియన్ ద్వీపకల్పంలో కాంస్యయుగం నాటి నిధి బయటపడింది. దీనిని ‘ట్రెజర్ ఆఫ్ విల్లెనా’ అని పిలిచేవారు. ఇందులో ఎంతో విలువైన రాతి యుగం నాటి కంకణాలు, గిన్నెలు, సీసాలు, వివిధ ఆభరణాలు వంటి 66 వస్తువులు ఉన్నాయి. ఇటీవల ఒక కొత్త పరిశోధన బృందం ఈ వస్తువులపై పరీక్షలు జరిపింది. ఈ పురాతన నిధిలోని ఒక కళాఖండం అంతరిక్ష పదార్థాలతో తయారు చేసినట్లు ఈ బృందంలోని శాస్త్రవేత్తలు వెల్లడించారు. మిగిలిన వస్తువులు చాలా వరకు బంగారం, వెండితో తయారు చేశారని, వీటిలోని కేవలం ఓ కళాఖండంలోని పదార్థం మాత్రం భూమ్మీద ఎక్కడా లభించదని, ఇది ఇతర గ్రహాల్లో లభించే అవకాశం ఉందని తెలిపారు. కొంతమంది పురావస్తు శాస్త్రజ్ఞులు ఈ నిధి కాంస్యయుగం తర్వాతి కాలానికి చెందినదని చెబుతున్నారు. మరికొందరు నిపుణులు ఈ వస్తువులలోని ఇనుము ఉల్కల నుంచి వచ్చినదని చెబుతున్నారు. ఈ లోహానికి గ్రహాంతర మూలాలను నిగ్గుతేల్చడానికి మరిన్ని పరీక్షలు అవసరమని అంటున్నారు. (చదవండి: సీట్బెల్ట్తో కిడ్నీలకూ రక్షణ!) -
గుప్తనిధులపై పెద్దల కన్ను
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కాదేదీ దోచుకునేందుకు అనర్హమనే రీతిలో ఇసుక, మట్టి నుంచి రాజధాని భూముల వరకూ చేతివాటం ప్రదర్శిస్తున్న ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ నేతలు ఇప్పుడు ఏకంగా చరిత్రాత్మకమైన కోటపై ఉన్న గుడి సంపదపైనా కన్నేశారు. ఆ సంపదను దిగమింగేందుకు ఏకంగా ప్రభుత్వ అధికారులనే రంగంలోకి దింపారు. కర్నూలు జిల్లాలో చెన్నంపల్లి కోటపై ఉన్న పీర్ల గుడికి సమీపంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపడుతుండడం పట్ల గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ కోటపై పెద్ద కడియాల స్వామికి చెందిన పీర్లు దొరికాయని, మొహర్రం సందర్భంగా కోటపైనే గ్రామస్తులంతా అలాయి గుంత తవ్వుకుని పీర్లస్వామిని ఎత్తుకోవడం ఆనవాయితీగా వస్తోందని చెబుతున్నారు. కోటపై అత్యంత విలువైన గుప్త నిధులు ఉన్నాయని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఈ గుప్త నిధులపై ప్రభుత్వ పెద్దలు కన్నేశారని, వాటిని దోచుకునేందుకు అధికారులను సైతం వాడుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. మా మనోభావాలను దెబ్బతీస్తున్నారు చెన్నంపల్లి కోటలో ఈ నెల 13న మొదలైన తవ్వకాలు 8 రోజులుగా అధికారుల పర్యవేక్షణ మధ్య కొనసాగుతున్నాయి. బంగారం, వజ్రాల కోసం అన్వేషిస్తున్నామని మొదట్లో చెప్పిన అధికారులు.. ఇప్పుడు విలువైన ఖనిజాల కోసం అంటూ మాట మారుస్తుండడం గమనార్హం. ఇక్కడ నిధులు వెలికితీస్తామని ఒక ప్రైవేట్ ఏజెన్సీ నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి (సీఎంవో) దరఖాస్తు చేసుకుందని, అక్కడి నుంచి కలెక్టర్‌కు ఆదేశాలు రావడంతో తవ్వకాలు సాగిస్తున్నామని బాహాటంగానే చెప్పారు. ఇప్పుడు మాత్రం ప్రభుత్వ ఆధ్వర్యంలోనే తవ్వకాలు చేపడుతున్నామని, ప్రైవేట్ ఏజెన్సీకి సంబంధం లేదని ప్రకటిస్తున్నారు. ఎనిమిది రోజులుగా సాగుతున్న తవ్వకాల్లో ఇప్పటిదాకా ఇటుకలు, ఎముకలు మినహా ఏమీ బయటపడలేదు. అయితే, కోటపై పవిత్రమైన గుడికి సమీపంలో ఇష్టారాజ్యంగా తవ్వేస్తుండడాన్ని గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది తమ మనోభావాలను దెబ్బతీయడమే అవుతుందని అంటున్నారు. గుప్త నిధుల కోసం కాదట! గుప్త నిధుల కోసం కాదు, విలువైన ఖనిజాల కోసమే చెన్నంపల్లి కోటలో తవ్వకాలు సాగిస్తున్నట్లు ఆదోని ఆర్డీవో బుధవారం చెప్పారు. మరికొన్ని రోజులు ఈ తవ్వకాలు చేపడతామన్నారు. వాస్తవానికి ఈ కోటలో విలువైన ఖనిజాలు ఉన్నాయని నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్ఎండీసీ) గానీ, రాష్ట్ర మైనింగ్ శాఖ అధికారులు గానీ గుర్తించలేదు. ఒకవేళ గుర్తించినా ఏయే ఖనిజాలు ఉన్నాయో ప్రభుత్వం బహిర్గతం చేయాలి. ఆ తర్వాతే తవ్వకాలు చేపట్టాలి. ముందస్తుగా ఏ విషయం చెప్పకుండానే తవ్వకాలు సాగించడం మైనింగ్ కన్సెషన్ నిబంధనలకు (ఎంసీఆర్) విరుద్ధమే. విమర్శలు, కేసుల నుంచి తప్పించుకునేందుకే గుప్త నిధుల కోసం కాదు, ఖనిజాల కోసమే అన్వేషణ అంటూ ప్రభుత్వ పెద్దలు నమ్మబలుకుతున్నట్లు తెలుస్తోంది. పవిత్రమైన గుడి పక్కన తవ్వకాలా? ‘‘మా గ్రామానికి సమీపంలోని చెన్నంపల్లి కోటపై పెద్ద కడియాల స్వామి పీర్లు దొరికాయి. కోటపైనే గుడి, అలాయి గుంత ఉంది. పవిత్రమైన ఈ గుడికి సమీపంలోనే తవ్వకాలు జరుపుతుండడం దారుణం’’ – మహమ్మద్, చెన్నంపల్లి చరిత్రక కట్టడంపై తవ్వకాలు వద్దు ‘‘మా ఊరి కోటపై అధికారులు తవ్వకాలు చేపట్టడం మంచిది కాదు. గతంలోనూ కొందరు ప్రైవేట్ వ్యక్తులు తవ్వకాలు జరిపేందుకు ప్రయత్నించారు. అప్పుడు మేం అధికారులకు ఫిర్యాదు చేసి అడ్డుకున్నాం. ఇప్పుడు నేరుగా ప్రభుత్వ అధికారులే దగ్గరుంచి మరీ తవ్వకాలు జరిపిస్తున్నారు. చరిత్రక కట్టడమైన కోటపై, పీర్లగుడి పక్కన తవ్వకాలు జరపడం తగదు’’ – సుధాకర్‌రెడ్డి, చెన్నంపల్లి -
పురా‘వస్తు’ పంపకమెలా?
హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లోని పురావస్తు ప్రదర్శనశాలలో వెలకట్టలేని ప్రాచీన సంపద ఆ పంపిణీకి జనాభా ప్రాతిపదికా? సంపద లభ్యత ప్రాదిపదికా? అధికారవర్గాల్లో ఆసక్తికర చర్చ విలువైన సంపదకు నెలవైన మ్యూజియం హైదరాబాద్: రాష్ట్ర విభజనలో భాగంగా హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్‌లో ఉన్న పురావస్తు శాలలోని వెల కట్టలేని పురాతన సంపదను ఎలా పంపిణీ చేయాలన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. పునర్వ్యవస్థీకరణ చట్టం తొమ్మిది, పది షెడ్యూళ్లలోని సంస్థల విభజనపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య సయోధ్య కుదరడం లేదు. ఈ పరిస్థితుల్లో వెల కట్టలేని ప్రాచీన సంపదను ఇరు రాష్ట్రాలు ఎలా పంపిణీ చేసుకుంటాయి. ఇందుకు ఏ ప్రాతిపదికను అనుసరిస్తాయన్నది ఉన్నతాధికార వర్గా ల్లో చర్చనీయాశంగా ఉంది. ఇతర సంస్థల విభజనలా పురావస్తు శాల విభజన సాధ్యం కాదు. ఇది పురావస్తు శాఖ కింద ఉండటంతో రాష్ట్ర విభజన చట్టంలోని ఏ షెడ్యూల్లోనూ దీనిని చేర్చలేదు. పురావస్తు శాలలో ఉన్న ప్రాచీన సంపదను జనాభా ప్రాతిపదికన పంపిణీ చేస్తారా? లేక ఏ ప్రాంతంలో సంపద లభ్యమైందో అధ్యయనం చేసి అందుకు అనుగుణంగా పంపిణీ చేస్తారా? అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. తెలంగాణ ప్రభుత్వం గాని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గాని ఈ సంపద పంపిణీపై ఇంకా దృష్టి సారించలేదు. అత్యంత విలువైన ఆ సంపద పంపిణీ జరగాలంటే ఆ రంగంలో నిష్ణాతులైన వారితో కమిటీ ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ఉన్నతాధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఆ పురావస్తుశాలలో బుద్ధుని అవశేషాలు దగ్గర నుంచి నాటి యుద్ధాల్లో రాజులు వినియోగించిన పరికరాలు, ఎంతో విలువైన ఒరిజనల్ పెయిం టింగ్స్, బంగారు, వెండి, రాగి నాణేలు, వెలకట్టలేని బంగారు ఆభరణాలు ఉన్నాయి. సంపద లభించిన ప్రాంతం, ఆ సంపదకు విలువ కట్ట డం అంత సులభతరం కాదని అధికారులు అం టున్నారు. అధికార వర్గాలు ప్రాథమిక అంచనా మేరకు పబ్లిక్ గార్డెన్స్ పురావస్తుశాలలో ఉన్న ప్రాచీన సంపద ఈ విధంగా ఉంది. నాలుగు వేల బంగారు, 14 వేల వెండి, 30 వేల రాగి మూల నాణేలు, అలాగే ఉమ్మడి రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో లభ్యమైన ఎంతో విలువైన పలు బంగారు ఆభరణాలున్నాయి. నాటి మహారాజులకు చెందిన ప్రాచీన కాలంనాటి 2,500 ఒరిజినల్ పెయింటింగ్స్‌తో పాటు బుద్ధుడి ఎముక ముక్క ఉంది. ఆ ఎముక ముక్క కోసం గతంలో చైనా రూ. 57 కోట్లు చెల్లించడానికి ముందుకొచ్చింది. దశాబ్దాల నుంచి భద్రపరిచిన మమ్మీ కూడా అందులో ఉంది. ప్రాచీన కాల యుద్ధాల్లో వాడిన కవచాలు, కిరీ టాలు, బల్లేలు,ఇతర యుద్ధ పరికరాలున్నాయి.