
పొగడ్తలను ఇష్టపడని వారు చాలా అరుదు. పూర్వం రాజులు కూడా కేవలం తమని పొగడటానికి ప్రత్యేకంగా కొంతమందిని నియమించుకునేవారు. తాజాగా ఇదే తరహాలో జపాన్(Japan)లోని ఒక వ్యక్తి ‘అంకుల్ ప్రైజ్(Uncle Praise)’ పేరుతో తన సొంత స్ట్రీట్ జాబ్‌ను ప్రారంభించాడు. ప్రతిరోజూ టోక్యో నగర వీథుల్లో నిల్చొని, అతని దగ్గరకు వచ్చిన అపరిచితులను పొగుడుతూ డబ్బు సంపాదిస్తున్నాడు.
ఒకానొక సమయంలో జూదానికి బానిసగా మారి, తన ఉద్యోగం, కుటుంబం రెండింటినీ కోల్పోయి, చాలాకాలం పాటు ఖాళీగా ఉండేవాడు. ఆ సమయంలో తిరిగి ఎవరూ తనని పనిలో చేర్చుకోకపోవడంతో చాలా ఇబ్బందులు పడ్డాడు. అప్పుడే కొంతమంది స్ట్రీట్ ఆర్టిస్ట్‌లను చూసి, ‘అంకుల్ ప్రైౖజ్’ పేరుతో సొంత ఆలోచనతో ఇతరులను పొగిడే పనిని ప్రారంభించాడు.
ఇతని కథనాన్ని ఈ మధ్యనే ఒక టీవీ షో ప్రసారం చేయటంతో ఫేమస్ అయ్యాడు. రోజుకు దాదాపు 150 యెన్‌ల నుంచి 10 వేల యెన్‌ల వరకు (రూ.82 నుంచి రూ. 5,500 వరకు) సంపాదించేవాడు. టీవీ షో ద్వారా ఫేమస్ అయిన తర్వాత ఇప్పుడు, విస్తృతంగా వ్యాపార పర్యటనలు చేస్తూ భారీగా సంపాదిస్తున్నాడు.
(చదవండి: సర్వ ఆహార సమ్మేళనం
Comments
Please login to add a commentAdd a comment