strangers
-
‘అంకుల్ ప్రైజ్’: అతడేం పనిచేస్తాడో తెలుసా..!
పొగడ్తలను ఇష్టపడని వారు చాలా అరుదు. పూర్వం రాజులు కూడా కేవలం తమని పొగడటానికి ప్రత్యేకంగా కొంతమందిని నియమించుకునేవారు. తాజాగా ఇదే తరహాలో జపాన్(Japan)లోని ఒక వ్యక్తి ‘అంకుల్ ప్రైజ్(Uncle Praise)’ పేరుతో తన సొంత స్ట్రీట్ జాబ్‌ను ప్రారంభించాడు. ప్రతిరోజూ టోక్యో నగర వీథుల్లో నిల్చొని, అతని దగ్గరకు వచ్చిన అపరిచితులను పొగుడుతూ డబ్బు సంపాదిస్తున్నాడు. ఒకానొక సమయంలో జూదానికి బానిసగా మారి, తన ఉద్యోగం, కుటుంబం రెండింటినీ కోల్పోయి, చాలాకాలం పాటు ఖాళీగా ఉండేవాడు. ఆ సమయంలో తిరిగి ఎవరూ తనని పనిలో చేర్చుకోకపోవడంతో చాలా ఇబ్బందులు పడ్డాడు. అప్పుడే కొంతమంది స్ట్రీట్ ఆర్టిస్ట్‌లను చూసి, ‘అంకుల్ ప్రైౖజ్’ పేరుతో సొంత ఆలోచనతో ఇతరులను పొగిడే పనిని ప్రారంభించాడు. ఇతని కథనాన్ని ఈ మధ్యనే ఒక టీవీ షో ప్రసారం చేయటంతో ఫేమస్ అయ్యాడు. రోజుకు దాదాపు 150 యెన్ల నుంచి 10 వేల యెన్ల వరకు (రూ.82 నుంచి రూ. 5,500 వరకు) సంపాదించేవాడు. టీవీ షో ద్వారా ఫేమస్ అయిన తర్వాత ఇప్పుడు, విస్తృతంగా వ్యాపార పర్యటనలు చేస్తూ భారీగా సంపాదిస్తున్నాడు. (చదవండి: సర్వ ఆహార సమ్మేళనం -
డేంజర్.. మీరు ఏం చేస్తున్నా అవతలి వ్యక్తికి కనిపిస్తుంది..
ఎంవీపీ కాలనీ(విశాఖపట్నం): ఎనీ డెస్క్.. టీం వీవర్.. లాంటి డెస్క్ టాప్ యాప్‌లను మీ ఫోన్లో అపరిచిత వ్యక్తులు డౌన్లోడ్ చేయిస్తే నష్టపోయే పరిస్థితి ఉంది. అవతలి వ్యక్తి చెబుతున్న విధంగానే అన్నింటికీ మీరు క్లిక్ చేస్తూ పోతే మీకు తెలియకుండానే మీ ఫోన్ అవతలి వ్యక్తి కంట్రోల్లోకి వెళ్లిపోతుంది. మీరు ఏం చేస్తున్నా అవతలి వ్యక్తికి కనిపిస్తుంది. ఉదాహరణకు.. మీరు ఫోన్ పే, యూట్యూబ్, బ్యాంకింగ్ యాప్ వంటివి మీ ఫోన్లో ఏం తెరిచినా అన్నీ అవతలి వ్యక్తికి కనిపిస్తాయి. చదవండి: మీకు తెలుసా?.. విద్యుత్ శాఖ నుంచి మెసేజ్‌లు రావు దీంతో మీ బ్యాంక్ అకౌంట్, ఫోన్ పే అకౌంట్ పాస్వర్డ్లు, ఓటీపీలు వారికి తెలుస్తాయి. తరువాత ఆయా అకౌంట్స్‌లో నగదును సులువుగా స్వాహా చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇలాంటి యాప్‌లను డౌన్లోడ్ చేసుకోవాలంటూ వచ్చే సందేశాలు, మెసేజ్ లింక్‌లను పట్టించుకోకూడదు. విద్యుత్ బకాయిలు, ఈకేవైసీ పూర్తి, బ్యాంకు అనుసంధానం వంటి సేవల కోసం యాప్‌లను డౌన్లోడ్ చేసుకోవాలంటూ గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌ను కూడా నమ్మొద్దు. -
వాట్సాప్‌తో జాగ్రత్త
న్యూఢిల్లీ: వాట్సాప్‌లో అపరిచితులు పంపే వీడియో ఫైళ్లను తెరుస్తున్నారా? అయితే కొంచెం జాగ్రత్త అంటోంది కేంద్ర ప్రభుత్వ సైబర్ సెక్యురిటీ సంస్థ ‘ద కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్’ (సీఈఆర్టీ). ఎంపీ4 ఫైళ్ల సాయంతో సాఫ్ట్‌వేర్‌లోని లోపాల ఆధారంగా హ్యాకర్లు మీ ఫోన్లలోకి చొరబడవచ్చునని ఈ సంస్థ మూడు రోజుల క్రితం ఓ హెచ్చరిక జారీ చేసింది. మీ అనుమతులను కోరకుండానే సమాచారాన్ని సేకరించడంతోపాటు మీ ఫోన్‌ను పనిచేయకుండా చేయొచ్చని తెలిపింది. అయితే సాఫ్ట్వేర్ లోపంతో కలిగే ప్రభావం వినియోగదారులపై పడలేదని వాట్సాప్ చెబుతోంది. వందలాది మంది భారతీయ వినియోగదారులపై ఇజ్రాయెల్‌కు చెందిన ‘పెగాసస్’ నిఘా సాఫ్ట్వేర్ సాయంతో గుర్తుతెలియని సంస్థలు నిఘా పెట్టాయని వాట్సాప్ ఇటీవల భారతసర్కారుకు తెలిపిన నేపథ్యంలో ఈ ఘటనకు ప్రాధాన్యం ఏర్పడింది. హ్యాకింగ్, ఫిషింగ్ తదితర సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రభుత్వం సీఈఆర్టీని నోడల్ సంస్థగా ఏర్పాటు చేయడం తెల్సిందే. సమస్యను అధిగమించేందుకు వాట్సాప్ సాఫ్ట్‌వేర్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవడం మేలని సీఈఆర్టీ సూచించింది. విచారం వ్యక్తంచేసిన వాట్సాప్ పెగాసస్ నిఘా అంశంపై విచారం వ్యక్తంచేస్తూ భారత సర్కార్‌కు వాట్సాప్ లేఖ రాసింది. నిఘా వ్యవహారంపై అప్రమత్తంగా ఉండేందుకు తగు చర్యలు తీసుకుంటామని హామీనిస్తున్న లేఖలో పేర్కొంది. వాట్సాప్ సాఫ్ట్‌వేర్‌లో భద్రతా వ్యవస్థలను మరింత పటిష్టంచేయాలని, మరోసారి ఇలాంటి ఘటన పునరావృతమైతే సహించేదిలేదని ప్రభుత్వం వాట్సాప్‌ను మందలించిందని ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి వెల్లడించారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో చర్చ నిఘా అంశాన్ని చర్చించాలా వద్దా అన్న దానిపైనా పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుల మధ్య భేదాభిప్రాయాలొచ్చాయి. రెండు గంటలపాటు చర్చించినా దీనిపై సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని విశ్వసనీయవర్గాల సమాచారం. చర్చ అవసరంలేదని బీజేపీ సభ్యులు అభిప్రాయపడగా, లోక్‌జనశక్తి, వైఎస్సార్సీపీలు చర్చవైపునకు మొగ్గుచూపాయి. దీంతో ఓటింగ్‌కు వెళ్లారు. చర్చకు సరేనంటూ, కాదంటూ సరిసమానంగా ఓట్లు వచ్చాయి. దీంతో కమిటీకి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్ నేత శశిథరూర్.. చర్చించేందుకే ఓటేయడంతో సభ్యులు ఈ అంశాన్ని చర్చకు స్వీకరించారు. -
మత్తు మందుకు గురైన బాధితులకు పరామర్శ
ఎంజీఎం (వరంగల్) : సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో మత్తుమందుకు గురై సృహ కోల్పోయిన బాధితులను రైల్వే ఎస్పీ అశోక్‌కుమార్ పరామర్శించారు. ఈ సందర్భంగా వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని మెరుగైనా వైద్యచికిత్సలు అందించాలని వైద్యులకు సూచించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ శనివారం రాత్రి 10 గంటలకు సంపర్క్‌క్రాంతి ఎక్స్‌ప్రెస్ యశ్వంత్ పూర్ టూ న్యూఢిల్లీ వెళ్తుండగా ఆరుగురు రైలు ఎక్కారన్నారు. రైలు గంట ప్రయాణించిన తరువాత రైళ్లో ఇంకొందరు ఎక్కారు. వీరు ప్రయాణికులతో పరిచయం ఏర్పర్చుకుని సమోస, మజా, బిస్కెట్స్ తినిపించారు. వాటిని తినగానే ఆరుగురు వ్యక్తులు సృహ కోల్పోయినట్లు తెలిపారు. దాదాపు అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చినా వారు లేవకపోవడంతో తోటి ప్రయాణికులు మనించి రైల్వే కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించారు. స్పందించిన రైల్వే కంట్రోల్ రూమ్ ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు కాజీపేట స్టేషన్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. వెంటనే ఇక్కడి ఇన్స్పెక్టర్, వైద్యులు అప్రమత్తమై అంబులెన్స్‌లో ఎంజీఎంకు తరలించారు. వీరిలో ఐదుగురి పరిస్థితి బాగానే ఉందని, ఒక్క ప్రయాణికుడు మాత్రం సృహాలోకి రాలేదని తెలిపారు. -
మహిళపై ఆగంతకుల దాడి
సారవకోట: మండలంలోని మూగుపురం గ్రామానికి చెందిన బి.ఆదిలక్ష్మిపై గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రాత్రి తన కుమార్తెతో కలసి బహిర్భూమికి వెళ్లిన సమయంలో ఆమెపై గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి చంపేందుకు ప్రయత్నించారని, పక్కనే ఉన్న కుమార్తె కేకలు వేయడంతో వారు పారిపోయారనిట్లు స్థానికులు తెలిపారు. అనంతరం ఆదిలక్ష్మిని 108 వాహనంలో టెక్కలి ఆస్పత్రికి తరలించి పోలీస్‌స్టేషన్‌కు సమాచారమిచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఎస్ఐ సత్యనారాయణ మాట్లాడుతూ.. దర్యాప్తు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం పార్ధి గ్యాంగ్‌పై వస్తున్న వదంతుల్లో భాగంగా కొంతమంది ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారే తప్ప వాస్తవాలు లేవన్నారు. -
అపరిచితులను ఆదుకునే దేశాలివే!
న్యూయార్క్: ప్రపంచంలో ఏ దేశస్థులు అపరిచితులను ఆదరిస్తారు, వారు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుంటారు? అన్న అంశంపై ‘సీఏఎఫ్ వరల్డ్ గివింగ్ ఇండెక్స్’ జరిపిన సర్వేలో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. అభివద్ధి చెందిన దేశాలో, పేద దేశాలో లేదా మతవిశ్వాసం ఎక్కువగానున్న దేశాలో ఆపదలో ఉన్న ఆపరిచితులను ఆదుకుంటాయని మనం భావిస్తాం. కానీ ఎప్పుడూ యుద్ధాలు లేదా అంతర్యుద్ధాలతో, అస్థిర పరిస్థితులతో సతమతమవుతున్న దేశాల ప్రజలే అపరిచితులను ఎక్కువగా ఆదుకుంటారని సర్వేలో తేలింది. యుద్ధాలు, టెర్రరిస్టుల దాడులతో రక్తమోడుతున్న ఇరాక్ , లిబియా దేశస్థులే అపరిచితులను ఎక్కువగా ఆదుకుంటున్నారు. ఇలా గత నెల రోజుల్లో ఒక్కరినైనా ఆదుకున్నవారు ఇరాక్‌లో 81 శాతం మంది ఉండగా, లిబియాలో 79 శాతం మంది ఉన్నారు. 78 శాతంతో కువైట్, 77 శాతంతో సోమాలియా, 75 శాతంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, 74 శాతంతో మాలవి, 73 శాతంతో బోట్స్వాన, సియెర్రా లియోన్, అమెరికా, సౌదీ అరేబియాలు తర్వాత స్థానాల్లో నిలిచాయి. అత్యంత పేద దేశమైన సోమాలియా ప్రజలు కూడా అపరిచితులను ఆదుకోవడంలో ముందుండడం విశేషం. అస్థిర పరిస్థితుల్లో బతుకుతున్న వారిలో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని, ఆ ఒత్తిడి నుంచి బయటపడడంలో భాగంగా వారిలో పరస్పర సహకార గుణం పెరుగుతుందని, తద్వారా వారి మధ్య సామాజిక బంధం బలపడుతుందని ఇదివరకు నిర్వహించిన సర్వేల్లోనే తేలింది. ఇప్పుడు ఇక్కడ కూడా అదే సామాజిక కోణం ఉంటుందని సర్వే అధ్యయనకారులు తెలిపారు. -
ఒకే ఇంట్లో రెండోసారి చోరీకి యత్నం
నల్లబెల్లి : మండల కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు పొగాకు అచ్చయ్య ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు మరోసారి చొరబడి దొంగతనానికి పాల్పడ్డారు. ఈ సంఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితుల కథనం ప్రకారం.. మండల కేంద్రంలో నివసిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు పొగాకు అచ్చయ్య తన స్వగ్రామం నందిగామకు శనివారం సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాడు. సోమవారం రాత్రి ఒక్కడే ఇంటికి తిరిగొచ్చాడు. ఇంటి తాళం తీసి లోపలికి ప్రవేశించగా, తెరిచిన బీరువా, చిందరవందరగా పడేసిన దుస్తులు కనిపించాయి. ఆభరణాలు, నగదు కోసం వెతికిన దొంగలు ఏమీ దొరకకపోవడంతో మళ్లీ తాళం వేసి వెళ్లిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. గత 20 రోజుల వ్యవధిలో ఆ ఇంట్లో చోరీకి యత్నించడం ఇది రెండోసారి. అచ్చయ్య ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలాన్ని ఎస్సై మేరుగు రాజశేఖర్ సందర్శించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో గాలింపు చేపట్టారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అయితే పోలీస్ డాగ్ స్థానికంగా ఉన్న ఓ బెల్టుషాపు వద్దకు వెళ్లి ఆగడం గమనార్హం. -
ద్విచక్ర వాహనం చోరీ
కాజీపేట : ఇంటి ఎదుట పార్క్ చేసిన ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించిన ఘటన రహిమత్‌నగర్‌లో బుధవారం చోటుచేసుకుంది. కుడికాల సత్యనారాయణ అనే రైల్వే ఉద్యోగి కాలనీలో నివసిస్తున్నాడు. జూౖల 31న ఆయన తన బైక్‌ను ఇంటి ఎదుట నిలిపారు. మళ్లీ వెళ్లి చూడగా ద్విచక్రవాహనం కనిపించలేదు. అంతటా వెతికినా బైక్ దొరకలేదు. దీనిపై బుధవారం కాజీపేట పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. సీఐ రమేష్‌కుమార్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
పోలీసులమని బెదిరించి పుస్తెలతాడు చోరీ
శాయంపేట : ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తి నుంచి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు పోలీసులమంటూ బెదిరించి పుస్తెల తాడు (గోపితాడు) ఎత్తుకెళ్లిన ఘటన మండలంలోని కొత్తగట్టు సింగారంలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఎస్సై ప్రవీణ్‌కుమార్ కథనం ప్రకారం.. మండలంలోని కొత్తగట్టు గ్రామానికి చెందిన తోట శివకుమార్ తన భార్యకు చెందిన రెండు తులాల పుస్తెల తాడును హన్మకొండలోని ఓ బంగారం షాపులో కుదవ పెట్టి రూ. 35 వేలు అప్పు తీసుకున్నాడు. తిరిగి ఈ నెల 14న డబ్బు చెల్లించి పుస్తెలతాడు తీసుకుని హన్మకొండ నుంచి గుడెప్పాడ్ వరకు బస్సులో వచ్చాడు. అక్కడి నుంచి ద్విచక్రవాహనంపై ఇంటికి వెళ్తుండగా గ్రామశివారులోని నల్లాల బావి వద్ద హెల్మెట్ పెట్టుకున్న ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు శివకుమార్‌ను అపారు. తాము పోలీసులమంటూ.. లైసెన్స్, బండి కాగితాలు చూపించాలని అడిగారు. అందులో ఓ వ్యక్తి కత్తి తీసి శివకుమార్ మెడపై ఉంచి జేబుల్లో ఏమున్నాయో తీయాలని బెదిరించారు. అప్పుడే బంగారం షాపు నుంచి తెచ్చిన రెండు తులాల పుస్తెల తాడు తీసుకున్నారు. జేబులో ఉన్న రూ. 1000, మొబైల్‌ను శివకుమార్‌కే ఇచ్చి విషయం ఎక్కడైనా చెపితే చంపుతామని బెదిరించి ద్విచక్రవాహనంపై పారిపోయారు. దీంతో శివకుమార్ భయంతో బీపీ పడిపోయి ఆసుపత్రిలో చికిత్స పొందాడు. బుధవారం స్థానిక పోలీస్‌స్టేçÙన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లి విచారణ చేపట్టారు. -
సైకిల్ మెకానిక్.. ఐఏఎస్ అయ్యాడు!
చిన్న వయసులోనే తండ్రి తనువు చాలించడంతో తన చదువును ఆపేసిన ఓ బాలుడు... కష్టాలకు ఎదురీదాడు. పూట గడవని స్థితిలో ఫీజులు కట్టలేక ఎన్నోసార్లు విద్యాభ్యాసానికి ఫుల్ స్టాప్ పెట్టేశాడు. అయితే విరమించుకున్న ప్రతిసారీ ఏదో ఒకరూపంలో అతడికి ప్రోత్సాహం లభించడంతో పట్టువదలని విక్రమార్కుడిలా తిరిగి చదువును కొనసాగిస్తూ వచ్చాడు. అయితే చిన్నతనంలో డాక్టర్ అయ్యి.. అందరికీ సేవలు అందించాలనుకున్న తన కోర్కెను.. జీవితానుభవాలకు అనుగుణంగా మార్చుకొన్న ఆ బాలుడు.. ప్రజాసేవే లక్ష్యంగా ఐఏఎస్ ఆఫీసర్ అయి ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు. మహరాష్ట్ర పాల్ఘర్ జిల్లా, బైసర్ పట్టణానికి చెందిన వరుణ్ భరన్వాల్.. చిన్నతనంలో డాక్టర్ అవ్వాలని కలలుగనేవాడు. వరుణ్ తండ్రి సైకిల్ రిపేర్ షాపును నడిపిస్తూ.. వచ్చిన సంపాదనతో కుటుంబాన్ని పోషించేవాడు. వరుణ్ తోపాటు అతడి సోదరికి కూడ మంచి భవిష్యత్తును ఇవ్వాలన్నదే లక్ష్యంగా పనిచేసేవాడు. కానీ వరుణ్ 2006 సంవత్సరంలో పదోతరగతి పరీక్షలు రాశాడో లేదో తండ్రి ఉన్నట్లుండి గుండెజబ్బుతో మరణించాడు. అప్పటికి సైకిల్ షాపు లాభాల్లోనే కొనసాగుతోంది. కానీ తండ్రి ఆస్పత్రి బిల్లులు చెల్లించలేక వరుణ్ కుటుంబం అప్పులపాలైపోయింది. సోదరి టీచర్ అయినప్పటికీ ఆమె వేతనం ఇల్లుగడవడానికే చాలీ చాలకుండా ఉండేంది. దాంతో అప్పుల భారం పెరిగిపోయింది. ఇంటి పరిస్థితులను గమనించిన వరుణ్.. చదువుకు స్వస్తి చెప్పేసి, తండ్రి వ్యాపారాన్ని కొనసాగించేందుకు సిద్ధమయ్యాడు. షాపులో పని ప్రారంభించిన కొన్నాళ్ళకు పదోతరగతి పరీక్షల్లో పట్టణంలోనే రెండో అత్యధిక మార్కులతో పాసయ్యాడు. తోటి స్నేహితులు, టీచర్లు వరుణ్ మార్కులను చూసి ఎంతో సంతోషించడంతోపాటు అతడ్ని పై చదువులకు ప్రోత్సహించారు. దీంతో వ్యాపారాన్ని తల్లికి అప్పగించి వరుణ్ తిరిగి చదువును కొనసాగించేందుకు సిద్ధమయ్యాడు. కానీ ఆ పరిస్థితుల్లో కాలేజీ ఫీజు పదివేల రూపాయలు కట్టలేక తిరిగి వ్యాపారాన్ని కొనసాగించడం ప్రారంభించాడు. అదే సమయంలో వరుణ్ తండ్రికి చికిత్స అందించిన డాక్టర్ కంప్లి.. వరుణ్ అభీష్టాన్ని తెలుసుకొని ఫీజు కట్టేందుకు ముందుకొచ్చాడు. జేబునుంచి పదివేల రూపాయలు తీసివ్వడంతో కాలేజీలో చేరిన వరుణ్.. నెలవారీ ఫీజు కట్టేందుకు చదువుతోపాటు రేయింబగళ్ళు ఖాళీసమయాల్లో ట్యూషన్లు చెప్పేవాడు. వచ్చిన సంపాదనతో ఫీజులు కట్టేవాడు. ఇంటర్ పూర్తయిన తర్వాత తాను అనుకున్నట్లుగా ఎంబిబిఎస్ చదివేందుకు ఆర్థిక పరిస్థితులు అనుకూలించక, ఎంఐటీ కాలేజ్ పూనె లో ఇంజనీరింగ్ లో చేరాడు. మొదటి సంవత్సరం మంచి మార్కులతో పాసై... స్కాలర్ షిప్ తెచ్చుకొని ఇంజనీరింగి పూర్తయ్యే లోపే క్యాంపస్ సెలెక్షన్ లో 2012 లో మల్టీ నేషనల్ కంపెనీ డెలాయిట్ లో ఉద్యోగం సంపాదించాడు. ఇక జీవితం స్థిరపడిపోయినట్లే అనుకునే సమయంలో అతడి జీవితం మరో మలుపు తిరిగింది. అప్పట్లో అవినీతికి వ్యతిరేకంగా జనలోక్ పాల్ బిల్ కోసం అన్నా హజారే నిర్వహించిన ఉద్యమం వరుణ్ లో స్ఫూర్తిని నింపింది. ప్రజాసేవే పరమావధిగా భావించిన వరుణ్ ఐఏఎస్ ఆఫీసర్ కావాలని నిశ్చయించుకొని, మిత్రుల సహాయంతో ఆర్నెల్లపాటు యూపీఎస్ సీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యాడు. అందుకు పుస్తకాలు కొనడానికి కూడ ఎంతో ఇబ్బందులు పడి, చివరికి ఓ ఎన్జీవో సంస్థ సహాయంతో పుస్తకాలు కొని పట్టుదలతో చదివి 2014 యూపీఎస్ సీ పరీక్షల్లో 32వ ర్యాంకును సాధించాడు. ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రంలోని హిమ్మత్ నగర్ లో అసిస్టెంట్ కలెక్టర్ గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న వరుణ్.. ఎందరో విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాడు. -
మాయ మాటలతో లిఫ్ట్.. ఆపై చోరీ
- వరుస ఘటనలు - ఆందోళనలో ప్రజలు - అపరిచితులతో జాగ్రత్త: పోలీసులు - 100కు ఫోన్ చేయాలని సూచన నర్సాపూర్: బస్టాండ్‌లో బస్సు కోసం వేచి ఉన్నారా..? గుర్తు తెలియని వ్యక్తి బైక్‌పై వచ్చి మీకు లిఫ్టు ఇస్తానంటే సరేనంటూ వెళ్లబోతున్నారా..? మీరు రోడ్డుపై నడుస్తోంటే గుర్తు తెలియని వ్యక్తి లిఫ్ట్ ఇస్తానని ఆగితే గుడ్డిగా నమ్మి బయలుదేరబోతున్నారా..? అలాగైతే మీరు మోసపోవడానికి ఓ అడుగు ముందుకు వేసినట్టే.. ఎవరైనా లిఫ్టు ఇస్తామని మిమ్మల్ని పిలిచినా, బైక్‌పై సర్రున దూసుకొచ్చి మీ పక్కన ఆపి పద వెళదాం అన్నా .. మీరు చేయాల్సింది ఒక్కటే.. అదే 100 నెంబర్‌కి ఫోన్ చేయడం.. లిఫ్ట్ ఇస్తామంటూ, ఇచ్చి మోసం చేస్తున్న మాయగాళ్లు మీ చుట్టూనే తిరుగుతున్నారనే విషయం గుర్తుంచుకోండి. సరిగ్గా ఇలాంటి ఘటనలు గత నెల 26న నర్సాపూర్ పోలీస్ సర్కిల్ పరిధిలో జరిగాయి. నర్సాపూర్‌లో జరుగుతున్న సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్‌రెడ్డిని కలిసేందుకు చండూరుకు చెందిన మోహన్‌రెడ్డి స్థానిక బస్టాండులో బస్సు దిగాడు. అతను నడుస్తూ వస్తుండగానే వెనక నుంచి బైక్‌పై ఓ యువకుడొచ్చాడు. నేను సదస్సుకే వెళుతున్నానని చెప్పి అతన్ని బైక్‌పై ఎక్కించుకొని బయలుదేరాడు. హన్మంతాపూర్ గ్రామ శివారుకు చేరుకోగానే అక్కడికి మరికొందరు యువకులు వచ్చారు. వారంతా కలిసి మోహన్ రెడ్డిపై చేయి చేసుకుఇని అతడి వద్ద ఉన్న బంగారు ఉంగరం తీసుకుపోయారు. ఇదిలా ఉంటే.. అదే రోజు మరో ఘటన జరిగింది. నర్సాపూర్‌కు చెందిన వ్యాపారి నర్సింలు తన పనులు ముగించుకుని ఇంటికి వచ్చేందుకు కౌడిపల్లి మండలం వెంకట్రావ్పేట బస్టాండులో బస్సు కోసం వేచి చూస్తున్నాడు. ఒక అపరిచిత వ్యక్తి బైక్‌పై వచ్చి తాను నర్సాపూర్ వెళ్తున్నానని, లిఫ్టు ఇస్తానని చెప్పడంతో విఠనర్సింలు బైక్ ఎక్కాడు. అక్కడ్నించి నర్సాపూర్ మండలంలోని రెడ్డిపల్లి సమీపంలోకి రాగానే సదరు అపరిచిత వ్యక్తి బైక్ ఆపాడు. తనకు పొలాలు ఉన్నాయని, వాటిని చూసి వద్దామని చెప్పడంతో అతనితో పాటు నర్సింలు వెళ్లాడు. అప్పటికే అక్కడికి చేరుకున్న మరో ఇద్దరు వ్యక్తులు నర్సింలు నుంచి బంగా రు గొలుసు, తొమ్మిదిన్నర వేల రూపాయలు తీసుకుని పరారయ్యారు. కాగా వృద్ధులను టార్గెట్ చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు. ఆ రెండు ముఠాల పనేనా..! ఇటీవల జరిగిన రెండు ఘటనలు జిల్లాకు చెందిన సిద్దిపేట, హైదరాబాద్‌లోని మోతీనగర్లకు చెందిన రెండు ముఠాల పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ ఘటనల్లో మోసాలు చేసింది ఆ రెండు ముఠాల్లో ఏదో ఒక వర్గం పనేనని అనుమానిస్తున్నారు. అందులో భాగంగా బాధితుల నుంచి పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. అంతేగాక ఈ ముఠాల ఆచూకీకోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు తెలిసింది. అపరిచితులతో జాగ్రత్త: నర్సాపూర్ ఎస్ఐ గోపీనాథ్ అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని స్థానిక ఎస్ఐ గోపీనాథ్ సూచించారు. మోసాలకు పాల్పడుతున్న వారిని పట్టుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఎప్పుడైనా అపరిచితులను అంత సులభంగా నమ్మవద్దని, వారు ఇచ్చే ఆహార పదార్థాలు తీసుకోవద్దని, ఉచితంగా లిఫ్టు ఇస్తామని చెప్పినా అంగీకరించవద్దని చెప్పారు. అలాంటి వ్యక్తుల వాహనాల నెంబర్లు గుర్తుంచుకోవాలన్నారు. తాము మోసపోయామని భావిస్తే వెంటనే 100 నంబరుకు ఫోన్ చేయాలని సూచించారు. కాగా తాము పోలీసులమని ఎవరైనా చెప్పినా నమ్మవద్దని, పోలీసులు ఎప్పుడైనా వాహనాలను జన సమర్థమైన ప్రదేశాల్లోనే తనిఖీలు చేస్తారని, నిర్జన ప్రదేశాల్లో తనిఖీలు చేయరని స్పష్టం చేశారు. అలా తనిఖీలు చేయాల్సి వస్తే యూనిఫాంలో ఉంటారని ఆయన చెప్పారు. -
పిలవని అతిథులతో పెళ్లికొడుకు అవాక్కు
కాబూల్: సాధారణంగా పెళ్లి వేడుకలంటే అమ్మాయి తరుపు వారు, అబ్బాయితరుపువారు, స్నేహితులు, పెళ్లి పనులు చేసే వారుంటారు. కొన్ని పెళ్లి వేడుకల్లో పిలవకపోయినా వచ్చే అతిథులు సరాసరే! అలాంటి వారు ఒక్కరో ఇద్దరో ఆపై ముగ్గురో.. కానీ ఊహించని విధంగా ఏకంగా ఆరు వందలమంది అమ్మాయి తరుపు, అబ్బాయి తరుపు కానీ అథిధులు పెళ్లి వేడుకకు వస్తే ఎలా ఉంటుంది అవాక్కయిపోరూ.. ఇలాంటి పరిస్థితే అప్ఘానిస్థాన్లో షాఫికుల్లా ఓ కార్ల వ్యాపారికి ఎదురైంది. తాను ఎంతో ఇష్టపడి ఏర్పాటుచేసుకున్న పెళ్లి వేడుకకు అనుకోని అతిథులు 600 మంది వచ్చారు. వాళ్లలో ఏ ఒక్కరూ కూడా తెలిసినవారు లేకపోవడంతో అవాక్కయ్యాడు. పోనీ ఏదైనా అందామంటే పెళ్లిలో భోజనం పెట్టేందుకు కూడా కకృతి పడ్డావా అని అంటారేమోనని, చులకనగా చూస్తారేమోనని మదనపడ్డాడు. చివరికి వేరే దారేం లేక అప్పటికప్పుడు 600మందికి సరిపోయే భోజనానికి ఆర్డరిచ్చి తెప్పిచ్చాడు. ఆ విషయంపై స్వయంగా తానే ఓ మీడియాకు వెల్లడిస్తూ ఎంతో ఆనందంగా జరుపుకుంటున్న తన పెళ్లి వేడుక గందరగోళానికి, రచ్చరచ్చకు తావివ్వకూడదనే ఊరుకున్నానని, అందరికీ విందు వడ్డించానని తెలిపాడు. ఈ ప్రాంతంలో ఒకరి భోజనం భరించడమంటే పర్సుకు భారీ చిల్లు పడ్డట్లే. అందుకే అతడు తెగ వర్రీ అయిపోయాడు. -
అపరిచితుల అడ్రస్ ఇదిగో!
స్వప్నలిపి అప్పుడప్పుడూ కలలో కొందరు అపరిచితులు కనిపిస్తారు. వారిని ఎప్పుడూ ఎక్కడా చూసి ఉండరు. కానీ కల నుంచి బయటికి వచ్చిన తరువాత కూడా వారి ముఖాలు గుర్తుండిపోతాయి. ఇంతకీ ఎవరీ అపరిచితులు? మనలోని భయాలు, విభిన్న భావోద్వేగాలే మానవరూపాలై కలలో కనిపిస్తాయి. కొన్నిసార్లు ఒక వ్యక్తి మనకు కలలో కనిపిస్తాడు. అతడు అదేపనిగా మీపై కేకలు వేస్తూనే ఉంటాడు... ఈ కల మర్మం ఏమిటంటే, ఒక విలువైన అవకాశం మీకు వచ్చినట్లే వచ్చి కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల దాన్ని వదులుకోవాల్సి రావడం. కొన్నిసార్లు పై నుంచి కింది వరకు నల్లటి దుస్తులు వేసుకొని, చింతనిప్పుల్లా కనిపించే కళ్లతో ఒక వ్యక్తి కనిపిస్తాడు. మీ వైపు కోపంగా చూస్తుంటాడు. ‘నా మీద ఫలానా వాళ్లు ఫిర్యాదు చేస్తారేమో’ ‘నా మీద దాడి జరుగుతుందేమో’ అనేటటువంటి భయాలు మనసులో గూడు కట్టుకున్నప్పుడు ఎవరో భయపెడుతున్నట్లుగా ఈ కలలు వస్తాయి. కలలో కనిపించే అపరిచితుల గురించి స్థూలంగా చెప్పాలంటే, మన అంతః చేతనలోని రహస్య భావోద్వేగాలు, సకారణ, అకారణ భయాలు... సందర్భాన్ని బట్టి కలల్లో నిర్దిష్టమైన రూపాన్ని ధరిస్తాయి. -
నేల.. నిప్పు...
-
రైతుల భూమల్లో అర్ధరాత్రి బీభత్సం
-
‘‘మామ్మగారు..మీరు బాగా నీరసపడ్డారు’’
చెల్లూరు(రాయవరం) : వృద్ధురాలితో ఆ అపరిచితురాలు మాటలు కలిపింది. పరిచయాన్ని పెంచుకుంది. ‘‘మామ్మగారు మీరు బాగా నీరసంగా ఉన్నారు’’ అంటూ తనతో తీసుకొచ్చిన జ్యూస్ ఇచ్చింది... కట్ చేస్తే... వృద్ధురాలి ఒంటిపైన, ఆమె ఇంట్లో బీరువాలో ఉన్న బంగారం, నగదు మాయం. పరిచయం పెంచుకుని... మండలంలోని చెల్లూరు మార్నివారి వీధిలోని ఈదల నాగేశ్వరరావు ఇంట్లో గోలి లక్ష్మి అనే వృద్ధురాలు అద్దెకు ఉంటోంది. అదే వీధిలో ఇంటిని నిర్మించుకుంటోంది. కొద్ది రోజుల క్రితం సుమారు 22 ఏళ్ల వయస్సు ఉన్న అపరిచితురాలు మామ్మగారు బాగున్నారా... అంటూ పలకరించింది. తాను ఫలానా సామాజిక వర్గం వారి అమ్మాయినంటూ మాటలు కలిపింది. తన భర్త రాజమండ్రిలో పండ్లు కొనుగోలు చేసి రామచంద్రపురంలో విక్రయిస్తుంటాడని తెలిపింది. వేణుగోపాలస్వామి ఆలయం వద్ద తాము ఉంటున్నామని, తన ఇద్దరు పిల్లలు స్థానికంగా ఉన్న పాఠశాలలో చదువుకుంటున్నారని తెలిపింది. ఇలా వారంలో రెండు సార్లు వచ్చింది. మొదటి సారి వచ్చినప్పుడు ‘‘నీరసంగా ఉన్నారు జ్యూస్ తాగమని ఆమె కోరినా వృద్ధురాలు నిరాకరించింది. బంగారం, నగదు చోరీ సోమవారం మధ్యాహ్నం 12:30 నుంచి ఒంటి గంట సమయంలో మరోసారి ఆ అపరిచితురాలు వృద్ధురాలి ఇంటికి వచ్చింది. ‘బాగా పాడైపోయారంటూ ప్రేమను నటిస్తూ ఆమె వెంట తెచ్చిన ద్రాక్ష జ్యూస్‌ను ఆమెకు ఇచ్చింది. అది తాగిన వృద్ధురాలికి తర్వాత ఏమి జరిగిందో తెలియలేదు. మధ్యాహ్నం నాలుగు గంటలకు మెలకువ వచ్చే సరికి ఆమె వంటిపైన, బీరువాలో ఉన్న 13 తులాల బంగారు చైనులు, గాజులు, రూ.9,500 నగదు చోరీకి గురయ్యాయి. చోరీ సొత్తు విలువ సుమారుగా రూ. నాలుగు లక్షలు ఉంటుందని స్థానికులు తెలిపారు. తాను మోసపోయానని గ్రహించిన లక్ష్మి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి వచ్చారు. విషయం తెలుసుకున్న రాయవరం ఎస్సై కట్టా శ్రీనివాసరావు, ఏఎస్సై కె.వి.వి.సత్యనారాయణలు సంఘటన స్థలానికి వచ్చి వృద్ధురాలి నుంచి వివరాలు సేకరించారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు క్లూస్‌టీమ్‌ను రప్పించనున్నట్టు ఎస్సై తెలిపారు.