ఎనీ డెస్క్ యాప్ ద్వారా అవతలివారి ఫోన్ స్క్రీన్ కనిపిస్తుందిలా..
ఎంవీపీ కాలనీ(విశాఖపట్నం): ఎనీ డెస్క్.. టీం వీవర్.. లాంటి డెస్క్ టాప్ యాప్‌లను మీ ఫోన్‌లో అపరిచిత వ్యక్తులు డౌన్‌లోడ్ చేయిస్తే నష్టపోయే పరిస్థితి ఉంది. అవతలి వ్యక్తి చెబుతున్న విధంగానే అన్నింటికీ మీరు క్లిక్ చేస్తూ పోతే మీకు తెలియకుండానే మీ ఫోన్ అవతలి వ్యక్తి కంట్రోల్‌లోకి వెళ్లిపోతుంది. మీరు ఏం చేస్తున్నా అవతలి వ్యక్తికి కనిపిస్తుంది. ఉదాహరణకు.. మీరు ఫోన్ పే, యూట్యూబ్, బ్యాంకింగ్ యాప్ వంటివి మీ ఫోన్‌లో ఏం తెరిచినా అన్నీ అవతలి వ్యక్తికి కనిపిస్తాయి.
చదవండి: మీకు తెలుసా?.. విద్యుత్ శాఖ నుంచి మెసేజ్‌లు రావు
దీంతో మీ బ్యాంక్ అకౌంట్, ఫోన్ పే అకౌంట్ పాస్‌వర్డ్‌లు, ఓటీపీలు వారికి తెలుస్తాయి. తరువాత ఆయా అకౌంట్స్‌లో నగదును సులువుగా స్వాహా చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇలాంటి యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలంటూ వచ్చే సందేశాలు, మెసేజ్ లింక్‌లను పట్టించుకోకూడదు. విద్యుత్ బకాయిలు, ఈకేవైసీ పూర్తి, బ్యాంకు అనుసంధానం వంటి సేవల కోసం యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలంటూ గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌ను కూడా నమ్మొద్దు.
Comments
Please login to add a commentAdd a comment