desktop applications
-
గూగుల్ క్రోమ్ యూజర్లకు షాక్.. ఆ కంప్యూటర్లకు సేవల నిలిపివేత
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ యూజర్లకు షాకిచ్చింది. జనవరి 10 నుంచి విండోస్ 7, 8, 8.1 విండోలతో పనిచేసే డెస్క్ ట్యాప్లలో గూగుల్ క్రోమ్ పనిచేయదు. గూగుల్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ వెర్షన్లకు సపోర్ట్ చేయడాన్ని మైక్రోసాఫ్ట్ మూడేళ్ల క్రితమే నిలిపేసింది. ఇప్పుడు గూగుల్ వంతు వచ్చింది. క్రోమ్109 పైన నడుస్తున్న డెస్క్ టాప్లకు పైన పేర్కొన్న ఓఎస్ వెర్షన్లవే చిట్ట చివరివి అవుతాయి. మైక్రోసాఫ్ట్ బాటలో.. కొత్త ఓఎస్ వెర్షన్ల రాకతో, పాతవి, సమర్థవంతంగా లేని ఆపరేటింగ్ సిస్టమ్స్‌కు సపోర్టు చేయటం తగ్గిపోతోంది. ఇప్పుడు విండోస్ 7, 8, 8.1 కొత్తగా చేరుతున్నాయి.మైక్రోసాఫ్ట్ ఈ ఓఎస్ వెర్షన్లకు సపోర్ట్ చేయడం నుంచి వైదొలగడంతో, వాటిల్లో ఉండే క్రోమ్‌కు సెక్యూరిటీ సపోర్ట్ నిలిపివేయాలని గూగుల్ నిర్ణయించుకుంది. వచ్చే నెలలో క్రోమ్ 110 వెర్షన్ క్రోమ్ కొత్త వెర్షన్ ‘క్రోమ్ 110’ ని గూగుల్ ప్రకటించింది. ఫిబ్రవరి 7, 2023లో కొత్తగా మార్కెట్లోకి విడుదల చేయనుంది. విండోస్ 10 దాని తర్వాత వెర్షన్ల వారికి ఉపయోగపడే మొట్టమొదటి క్రోమ్ వెర్షన్ ఇదే అవుతుంది. పాత వెర్షన్ విండోస్ .. అంటే విండోస్ 7, 8, 8.1 ఉన్న డెస్క్ టాప్ లకు ఈ బ్రౌజర్ ను పొందడం వీలుకాదు. క్రోమ్ 109 పనిచేస్తుంది.. కానీ విండోస్ 7, 8, 8.1 తో పనిచేసే డెస్క్ టాప్లకు క్రోమ్ 109 పనిచేస్తుంది. గూగుల్ నుంచి వాళ్లకి అప్ డేట్స్ రావు. దీనివల్ల కొత్త ఫీచర్లు అందుబాటులో ఉండవు. సెక్యూరిటీ రిస్క్, ఇతర సమస్యలు ఎక్కువ అవుతాయి. వీటిని ఎదుర్కోవటానికి ఉన్న ఏకైక మార్గం.. సపోర్టెడ్ విండో వెర్షన్‌ను అందుబాటులోకి తెచ్చుకోవటమే. వీలయినంత త్వరగా అప్ డేట్ చేసుకోవాలి కొత్తగా వచ్చే ‘క్రోమ్ 110’ బ్రౌజర్ వెర్షన్ ను అందుబాటులోకి తెచ్చుకోవాలనుకుంటే, మీ డెస్క్ టాప్‌ను విండోస్ 10కి వీలయినంత వేగంగా అందుబాటులోకి తెచ్చుకోవటమే. ► ‘విండోస్ అప్ డేట్’ సెట్టింగ్‌ను ఓపెన్ చేయండి. ‘అప్ డేట్ అండ్ సెక్యూరిటీ’ పై ట్యాప్ చేయాలి. ►అక్కడ ‘విండోస్ అప్ డేట్’ ఆప్షన్ పై క్లిక్ చేసి ‘చెక్ ఫర్ అప్ డేట్స్’ పై ట్యాప్ చేయండి ► మీ కంప్యూటర్ సపోర్ట్ చేస్తే ఆప్షన్ టు డౌన్ లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. ‘డౌన్ లోడ్ అండ్ ఇన్ స్టాల్’ అనేదాని మీద ట్యాప్ చేయండి. లేటెస్ట్ వెర్షన్ అప్డేట్ అవుతుంది. -
డేంజర్.. మీరు ఏం చేస్తున్నా అవతలి వ్యక్తికి కనిపిస్తుంది..
ఎంవీపీ కాలనీ(విశాఖపట్నం): ఎనీ డెస్క్.. టీం వీవర్.. లాంటి డెస్క్ టాప్ యాప్‌లను మీ ఫోన్లో అపరిచిత వ్యక్తులు డౌన్లోడ్ చేయిస్తే నష్టపోయే పరిస్థితి ఉంది. అవతలి వ్యక్తి చెబుతున్న విధంగానే అన్నింటికీ మీరు క్లిక్ చేస్తూ పోతే మీకు తెలియకుండానే మీ ఫోన్ అవతలి వ్యక్తి కంట్రోల్లోకి వెళ్లిపోతుంది. మీరు ఏం చేస్తున్నా అవతలి వ్యక్తికి కనిపిస్తుంది. ఉదాహరణకు.. మీరు ఫోన్ పే, యూట్యూబ్, బ్యాంకింగ్ యాప్ వంటివి మీ ఫోన్లో ఏం తెరిచినా అన్నీ అవతలి వ్యక్తికి కనిపిస్తాయి. చదవండి: మీకు తెలుసా?.. విద్యుత్ శాఖ నుంచి మెసేజ్‌లు రావు దీంతో మీ బ్యాంక్ అకౌంట్, ఫోన్ పే అకౌంట్ పాస్వర్డ్లు, ఓటీపీలు వారికి తెలుస్తాయి. తరువాత ఆయా అకౌంట్స్‌లో నగదును సులువుగా స్వాహా చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇలాంటి యాప్‌లను డౌన్లోడ్ చేసుకోవాలంటూ వచ్చే సందేశాలు, మెసేజ్ లింక్‌లను పట్టించుకోకూడదు. విద్యుత్ బకాయిలు, ఈకేవైసీ పూర్తి, బ్యాంకు అనుసంధానం వంటి సేవల కోసం యాప్‌లను డౌన్లోడ్ చేసుకోవాలంటూ గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌ను కూడా నమ్మొద్దు. -
విండోస్‌పై మ్యూజిక్ కంపోజ్...
సంగీతం వింటూ ఆనందించడం అందరూ చేసే పనే. ఇంకొంతమందికి సంగీతాన్ని కంపోజ్ చేయడం మరింత ఆనందాన్ని ఇస్తుంది. ఇందుకోసం ఇన్స్ట్రుమెంట్స్, రికార్డింగ్ థియేటర్ల అవసరం లేకుండా... కేవలం పీసీతోనే సంగీతాన్ని కంపోజ్ చేసుకునే అవకాశాన్ని ఇచ్చే డెస్క్‌టాప్ అప్లికేషన్లు ఎన్నో! సంగీతం గురించి, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి ప్రాథమిక అవగాహన ఉంటే చాలు... డెస్క్‌టాప్ అప్లికేషన్లను ఉపయోగించుకుని సొంతంగా సంగీతాన్ని కంపోజ్ చేసుకోవచ్చు. ఇలా మ్యూజిక్ కంపోజింగ్ అవకాశం ఇచ్చే అప్లికేషన్లలో ఒకటి మ్యూజిక్మేకర్ జామ్. విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఈ అప్లికేషన్ పనిచేస్తుంది. మ్యాజిక్మేకర్ జామ్ విండోస్8 ఓఎస్‌పై ఉత్తమమైన అప్లికేషన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. మల్టిపుల్ చానల్స్‌లో సౌండ్స్‌ను అందిస్తూ కొత్తరకంగా సంగీతాన్ని సృజించడానికి అవకాశం ఇస్తుంది ఈ అప్లికేషన్. ఒక్కో చానల్లో ఒక్కో ఇన్‌స్ట్రుమెంట్‌కు సంబంధించిన శబ్దాలు రికార్డు అయ్యి ఉంటాయి. వాటి వాల్యూమ్స్‌ను, మిక్సప్ను సెట్ చేసు కుంటూ ఔట్‌పుట్‌లో మనసుకు నచ్చినట్టుగా సంగీతాన్ని సృష్టించుకోవచ్చు. సృజనాత్మ కతను చాటుకోవచ్చు. ఈ అప్లికేషన్లో ఔట్పుట్ ఎమ్పీ3 ఫార్మాట్లో లభిస్తుంది. http://apps.microsoft.com/windows/en-us/app/music-maker-jam/5980cefa-aafa- 47e4-8ef1-8d72fc208dc0 క్లిక్ చేసి విండోస్ 8 ఓఎస్ కోసం ఈ అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. డెస్క్టాప్పై స్టాక్‌మార్కెట్ వివరాలు... విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టమ్ వాడకందార్లకు మైక్రోసాఫ్ట్ అందిస్తున్న సేవ ఇది. కంప్యూ టర్ డెస్క్‌టాప్ మీద ప్రపంచ స్టాక్‌మార్కెట్ల వివరాలను, ఎక్స్ఛేంజ్ రేట్లను వివరించడానికి మైక్రోసాఫ్ట్ బౌర్సోరమ (boursorama) అనే ఈ అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చింది. బిజినెస్ ప్రొఫెషనల్స్ కు ఈ అప్లికేషన్ ద్వారా స్టాక్ ఎక్స్ఛేంజ్ స్టాటిస్టిక్స్, కరెన్సీ ఎక్స్ఛేంజ్ రేట్లను తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ ఉచిత డెస్క్‌టాప్ టూల్ విండోస్ 8 కంప్యూటర్లపై మాత్రమే పనిచేస్తుంది. ఇంగ్లిష్, ఫ్రెంచ్ వెర్షన్లలో అందుబాటులో ఉంది. ఈ అప్లికేషన్‌ను ఇన్స్టాల్ చేసుకోవడం అంటే ప్రపంచ స్టాక్‌మార్కెట్ల వివరాలను డెస్క్‌టాప్ మీద పెట్టుకున్నట్టేనని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. ఇందులో ఇన్‌బిల్ట్ కరెన్సీ కన్వర్టర్ కూడా ఉంటుంది. http://apps.microsoft.com/windows/en-us/app/ boursorama/99234fd7-d417-40d0-a838-049af697788a నుంచి ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.