విండోస్‌పై మ్యూజిక్ కంపోజ్... | Windows has composed the music ... | Sakshi
Sakshi News home page

విండోస్‌పై మ్యూజిక్ కంపోజ్...

Published Wed, Feb 26 2014 11:29 PM | Last Updated on Sat, Sep 2 2017 4:07 AM

Windows has composed the music ...

సంగీతం వింటూ ఆనందించడం అందరూ చేసే పనే. ఇంకొంతమందికి సంగీతాన్ని కంపోజ్ చేయడం మరింత ఆనందాన్ని ఇస్తుంది. ఇందుకోసం ఇన్‌స్ట్రుమెంట్స్, రికార్డింగ్ థియేటర్ల అవసరం లేకుండా... కేవలం పీసీతోనే సంగీతాన్ని కంపోజ్ చేసుకునే అవకాశాన్ని ఇచ్చే డెస్క్‌టాప్ అప్లికేషన్‌లు ఎన్నో! సంగీతం గురించి, మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ గురించి ప్రాథమిక అవగాహన ఉంటే చాలు... డెస్క్‌టాప్ అప్లికేషన్‌లను ఉపయోగించుకుని సొంతంగా సంగీతాన్ని కంపోజ్ చేసుకోవచ్చు. ఇలా మ్యూజిక్ కంపోజింగ్ అవకాశం ఇచ్చే అప్లికేషన్‌లలో ఒకటి మ్యూజిక్‌మేకర్ జామ్. విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఈ అప్లికేషన్ పనిచేస్తుంది. మ్యాజిక్‌మేకర్ జామ్ విండోస్8 ఓఎస్‌పై ఉత్తమమైన అప్లికేషన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. మల్టిపుల్ చానల్స్‌లో సౌండ్స్‌ను అందిస్తూ కొత్తరకంగా సంగీతాన్ని సృజించడానికి అవకాశం ఇస్తుంది ఈ అప్లికేషన్. ఒక్కో చానల్‌లో ఒక్కో ఇన్‌స్ట్రుమెంట్‌కు సంబంధించిన శబ్దాలు రికార్డు అయ్యి ఉంటాయి. వాటి వాల్యూమ్స్‌ను, మిక్సప్‌ను సెట్ చేసు కుంటూ ఔట్‌పుట్‌లో మనసుకు నచ్చినట్టుగా సంగీతాన్ని సృష్టించుకోవచ్చు. సృజనాత్మ కతను చాటుకోవచ్చు. ఈ అప్లికేషన్‌లో ఔట్‌పుట్ ఎమ్‌పీ3 ఫార్మాట్‌లో లభిస్తుంది. http://apps.microsoft.com/windows/en-us/app/music-maker-jam/5980cefa-aafa- 47e4-8ef1-8d72fc208dc0 క్లిక్ చేసి విండోస్ 8 ఓఎస్ కోసం ఈ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
 
డెస్క్‌టాప్‌పై స్టాక్‌మార్కెట్ వివరాలు...

విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టమ్ వాడకందార్లకు మైక్రోసాఫ్ట్ అందిస్తున్న సేవ ఇది. కంప్యూ టర్ డెస్క్‌టాప్ మీద ప్రపంచ స్టాక్‌మార్కెట్ల వివరాలను, ఎక్స్‌ఛేంజ్ రేట్లను వివరించడానికి మైక్రోసాఫ్ట్ బౌర్సోరమ (boursorama) అనే ఈ అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చింది. బిజినెస్ ప్రొఫెషనల్స్ కు ఈ అప్లికేషన్ ద్వారా స్టాక్ ఎక్స్‌ఛేంజ్ స్టాటిస్టిక్స్, కరెన్సీ ఎక్స్‌ఛేంజ్ రేట్లను తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ ఉచిత డెస్క్‌టాప్ టూల్ విండోస్ 8 కంప్యూటర్‌లపై మాత్రమే పనిచేస్తుంది. ఇంగ్లిష్, ఫ్రెంచ్ వెర్షన్‌లలో అందుబాటులో ఉంది. ఈ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవడం అంటే ప్రపంచ స్టాక్‌మార్కెట్ల వివరాలను డెస్క్‌టాప్ మీద పెట్టుకున్నట్టేనని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. ఇందులో ఇన్‌బిల్ట్ కరెన్సీ కన్వర్టర్ కూడా ఉంటుంది.
http://apps.microsoft.com/windows/en-us/app/ boursorama/99234fd7-d417-40d0-a838-049af697788a నుంచి ఈ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement