Windows 8
-
31 నుంచి వాట్సాప్ పనిచేయదు
శాన్ఫ్రాన్సిస్కో: ఈ నెల 31 నుంచి మెసేజింగ్ యాప్ వాట్సాప్ సేవలను కొన్ని మొబైల్ ప్లాట్‌ఫాంలకు నిలిపేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. దీంతో బ్లాక్‌బెర్రీ ఓఎస్, బ్లాక్‌బెర్రీ 10, విండోస్ ఫోన్ 8.0, అంతకంటే పాత ప్లాట్‌ఫాంలకు వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. వీటికి సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి అప్డేట్స్ అభివృద్ధి చేయడం లేదని, కొన్ని ఫీచర్లు ఏ సమయంలోనైనా ఆగిపోవచ్చని పేర్కొంది. ఈ ఓఎస్‌లు వాడుతున్న వారు కొత్త ఓఎస్ వెర్షన్ (ఆండ్రాయిడ్ ఓఎస్ 4.0+, ఐఫోన్ ఓఎస్ 7+, విండోస్ ఫోన్ 8.1+)లోకి అప్‌గ్రేడ్ చేసుకోవడం ద్వారా వాట్సాప్ సేవలను పొందవచ్చని తెలిపింది. అలాగే నోకియా ఎస్40 ఫోన్లలో వాట్సాప్ ఈ నెల 31 తర్వాత పనిచేయదని పేర్కొంది. -
వచ్చేస్తోంది విండోస్ 10!
మైక్రోసాఫ్ట్ ఒక నంబర్‌ను తప్పించింది. విండోస్ 8 సీరిస్ నుంచి ఒకేసారి విండోస్ 10కు అప్‌గ్రేడ్ అవుతున్నట్టుగా ప్రకటించింది. విండోస్ ఎయిట్ విషయంలో తీవ్రంగా నిరాశచెందామని.. విండోస్ టెన్ మాత్రం తమ గొప్ప ఎంటర్ప్రైజ్ ప్లాట్‌ఫారమ్ అవుతుందని మైక్రోసాఫ్ట్ సంస్థ ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌తో కంప్యూటర్లను వాడుతున్న వారి సంఖ్య కోట్లలో ఉంటుంది. విండోస్ ఎక్స్పీ, విండోస్ 7, విండోస్ 8 సీరిస్‌లోని వివిధ వెర్షన్లపై కొన్ని కోట్ల కంప్యూటర్లు పనిచేస్తున్నాయి. అయితే విండోస్8 విషయంలో మైక్రోసాఫ్ట్ ప్రభ మందగించింది. ఇది యూజర్లను అంతగా ఆకట్టుకోలేకపోయింది. మైక్రోసాఫ్ట్ కూడా ఈ విషయాన్ని ఒప్పుకొంటోంది. చాలా తక్కువమంది వినియోగదారులు మాత్రమే విండోస్ ఎయిట్‌కు అప్డేట్ అయ్యారని ఆ సంస్థ ధ్రువీకరించింది. అనేకమంది టెక్ పండితులు కూడా విండోస్ ఎయిట్‌ను ఒక అన్‌పాపులర్ మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్‌గా అభివర్ణిస్తున్నారు. ఈ నేపథ్యంలో విండోస్ ఎయిట్ విషయంలో కూడా మైక్రోసాఫ్ట్ కూడా భారీ ప్రచార కార్యక్రమాలను చేపట్టింది. కానీ పెద్దగా ప్రయోజనం కనపడినట్టు లేదు. కేవలం 20 శాతం సంస్థలు మాత్రమే విండోస్ 8కి మారాయని మైక్రోసాఫ్ట్ గణాంకాలు చెబుతున్నాయి. చాలామంది విండోస్ ఎయిట్‌ను ఇష్టపడలేదని.. టచ్ ఇన్పుట్ కోసం రూపొందించిన ఈ ఓఎస్‌ను వారు స్వీకరించలేదని విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఆవిష్కరించనున్నట్టు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. పర్సనల్కంప్యూటర్లు, విండోస్ ఓఎస్‌పై పనిచేసే స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లకు విండోస్ 10 మంచి ఆపరేటింగ్ సిస్టమ్ అవుతుందని మైక్రోసాఫ్ట్ సంస్థ హామీ ఇస్తోంది. మరోవైపు ఈ విండోస్ 10 అనేది మైక్రోసాఫ్ట్‌కు అత్యంత కీలకమైనదని కూడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా మైక్రోసాఫ్ట్ తన సత్తాను నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు. ఒకవైపు స్మార్ట్ఫోన్ల ఆపరేటింగ్ సిస్టమ్ విషయంలో ఆండ్రాయిడ్, ఐఓస్‌లు దూసుకుపోతున్నాయి. మెజారిటీ స్మార్ట్ఫోన్లు ఆ ఆపరేటింగ్ సిస్టమ్స్ మీదే పనిచేస్తున్నాయి. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా స్మార్ట్ఫోన్లపై ఉనికిలో ఉన్నప్పటికీ అది మరీ ప్రభావాత్మకమైన స్థాయిలో అయితే లేదు. ఈ నేపథ్యంలో విండోస్ 10 ద్వారానైనా మైక్రోసాఫ్ట్ స్మార్ట్ఫోన్లపై తన ముద్రను వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి విండోస్ 10 ఎప్పుడు విడుదల అవుతుంది... ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందనే విషయం గురించి మైక్రోసాఫ్ట్ స్పష్టమైన ప్రకటన చేయలేదు. 2015 వసంత రుతువు కళ్లా ఈ కొత్త ఓఎస్ అందుబాటులోకి వస్తుందని మాత్రం హామీ ఇస్తోంది. విండోస్ యూజర్లు అయితే ఎక్స్పీ, విండోస్ 7లతోనే కంఫర్ట్‌గా ఉన్నారు. అలాంటి వారిని మైక్రోసాఫ్ట్ విండోస్ 10తో ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి! -
విండోస్ ఎక్స్పీ వాడుతున్నారా... జాగ్రత్త !
-
'విండోస్ ఎక్స్పీ'కి తెర !
-
ఏటీఎంలకు ‘ఎక్స్పీ’ గండం...
న్యూఢిల్లీ: విండోస్ ఎక్స్పీ నుంచి బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లోని చాలా పర్సనల్ కంప్యూటర్లు, ఏటీఎంలను ఆప్‌గ్రేడ్ చేయాల్సి ఉందని అమెరికా సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ పేర్కొంది. ఇలా చేయని పక్షంలో ఈ పీసీలకు, ఏటీఎంలకు సెక్యురిటీ రిస్క్‌లు తప్పకపోవచ్చని వివరించింది. ఈ కంపెనీ విండోస్ ఎక్స్‌పీని 2001, ఆక్టోబర్‌లో విడుదల చేసింది. ప్రస్తుతమున్న ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 8తో పోల్చితే విండోస్ ఎక్స్పీ మూడు జనరేషన్లు వెనకబడి ఉంది. వచ్చే నెల 8 నుంచి విండోస్ ఎక్స్‌పీకి సపోర్ట్ సర్వీసులందించడం ఆపేస్తామని మైక్రోసాఫ్ట్ వెల్లడించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం భారత్‌లో లక్ష వరకూ ఏటీఎంలు ఉంటాయని, వీటిల్లో అధిక భాగం విండోస్ ఎక్స్‌పీపైనే పనిచేస్తున్నాయని మైక్రోసాఫ్ట్ ఇండియా జీఎం(విండోస్ బిజినెస్) అమ్రిష్ గోయెల్ పేర్కొన్నారు. అయితే కేవలం కొన్ని పాత ఏటీఎంలకు మాత్రమే సమస్య ఉంటుందని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎం.వి. టంకసాలె పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ సపోర్ట్ సర్వీసులు ఆగిపోతే సమస్యలు పెరుగుతాయని, ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని గత వారంలోనే భారత రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) కూడా హెచ్చరించింది. -
విండోస్‌పై మ్యూజిక్ కంపోజ్...
సంగీతం వింటూ ఆనందించడం అందరూ చేసే పనే. ఇంకొంతమందికి సంగీతాన్ని కంపోజ్ చేయడం మరింత ఆనందాన్ని ఇస్తుంది. ఇందుకోసం ఇన్స్ట్రుమెంట్స్, రికార్డింగ్ థియేటర్ల అవసరం లేకుండా... కేవలం పీసీతోనే సంగీతాన్ని కంపోజ్ చేసుకునే అవకాశాన్ని ఇచ్చే డెస్క్‌టాప్ అప్లికేషన్లు ఎన్నో! సంగీతం గురించి, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి ప్రాథమిక అవగాహన ఉంటే చాలు... డెస్క్‌టాప్ అప్లికేషన్లను ఉపయోగించుకుని సొంతంగా సంగీతాన్ని కంపోజ్ చేసుకోవచ్చు. ఇలా మ్యూజిక్ కంపోజింగ్ అవకాశం ఇచ్చే అప్లికేషన్లలో ఒకటి మ్యూజిక్మేకర్ జామ్. విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఈ అప్లికేషన్ పనిచేస్తుంది. మ్యాజిక్మేకర్ జామ్ విండోస్8 ఓఎస్‌పై ఉత్తమమైన అప్లికేషన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. మల్టిపుల్ చానల్స్‌లో సౌండ్స్‌ను అందిస్తూ కొత్తరకంగా సంగీతాన్ని సృజించడానికి అవకాశం ఇస్తుంది ఈ అప్లికేషన్. ఒక్కో చానల్లో ఒక్కో ఇన్‌స్ట్రుమెంట్‌కు సంబంధించిన శబ్దాలు రికార్డు అయ్యి ఉంటాయి. వాటి వాల్యూమ్స్‌ను, మిక్సప్ను సెట్ చేసు కుంటూ ఔట్‌పుట్‌లో మనసుకు నచ్చినట్టుగా సంగీతాన్ని సృష్టించుకోవచ్చు. సృజనాత్మ కతను చాటుకోవచ్చు. ఈ అప్లికేషన్లో ఔట్పుట్ ఎమ్పీ3 ఫార్మాట్లో లభిస్తుంది. http://apps.microsoft.com/windows/en-us/app/music-maker-jam/5980cefa-aafa- 47e4-8ef1-8d72fc208dc0 క్లిక్ చేసి విండోస్ 8 ఓఎస్ కోసం ఈ అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. డెస్క్టాప్పై స్టాక్‌మార్కెట్ వివరాలు... విండోస్ 8 ఆపరేటింగ్ సిస్టమ్ వాడకందార్లకు మైక్రోసాఫ్ట్ అందిస్తున్న సేవ ఇది. కంప్యూ టర్ డెస్క్‌టాప్ మీద ప్రపంచ స్టాక్‌మార్కెట్ల వివరాలను, ఎక్స్ఛేంజ్ రేట్లను వివరించడానికి మైక్రోసాఫ్ట్ బౌర్సోరమ (boursorama) అనే ఈ అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చింది. బిజినెస్ ప్రొఫెషనల్స్ కు ఈ అప్లికేషన్ ద్వారా స్టాక్ ఎక్స్ఛేంజ్ స్టాటిస్టిక్స్, కరెన్సీ ఎక్స్ఛేంజ్ రేట్లను తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ ఉచిత డెస్క్‌టాప్ టూల్ విండోస్ 8 కంప్యూటర్లపై మాత్రమే పనిచేస్తుంది. ఇంగ్లిష్, ఫ్రెంచ్ వెర్షన్లలో అందుబాటులో ఉంది. ఈ అప్లికేషన్‌ను ఇన్స్టాల్ చేసుకోవడం అంటే ప్రపంచ స్టాక్‌మార్కెట్ల వివరాలను డెస్క్‌టాప్ మీద పెట్టుకున్నట్టేనని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. ఇందులో ఇన్‌బిల్ట్ కరెన్సీ కన్వర్టర్ కూడా ఉంటుంది. http://apps.microsoft.com/windows/en-us/app/ boursorama/99234fd7-d417-40d0-a838-049af697788a నుంచి ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
లెనోవో నుంచి కొత్త గేమింగ్ పీసీలు
బెంగళూరు: పర్సనల్ కంప్యూటర్లు తయారుచేసే లెనోవో కంపెనీ కొత్త రేంజ్ గేమింగ్ పీసీలను సోమవారం విడుదల చేసింది. వీటి ధరలు రూ.50,990 నుంచి రూ.1,36,500 రేంజ్లో ఉన్నాయని లెనోవో ఇండియా డెరైక్టర్(కన్సూమర్) శైలేంద్ర కత్యాల్ పేర్కొన్నారు. ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్‌తో తయారైన ఈ గేమింగ్ పీసీలు విండోస్ 8 ఓఎస్‌పై పనిచేస్తాయని తెలిపారు. లెనోవో ఐడియా ప్యాడ్ జడ్ 510 ధర రూ.50,990, లెనొవొ ఐడియా ప్యాడ్ వై 510పి ధర రూ.69,990, లెనోవో ఐడియా సెంటర్ హొరైజన్ 27 ధర రూ.1,36,500 అని వివరించారు. -
విండోస్ 8... వినూత్నాలెన్నో..! సాంకేతికం
మీ పీసీలో వాడుతున్న వెబ్‌బ్రౌజర్‌ను చూసి, మీ కంప్యూటర్లో ఓఎస్‌ను బట్టి... మీ మనస్తత్వాన్ని అంచనా వేసే ప్రపంచమిది. అందుబాటులోకి వస్తున్న నూతన టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో, దాన్ని ఉపయోగించుకోవడంలో ఏ మాత్రం ఆలస్యం అయినా.. అప్ టు డేట్‌గా లేరు... అనే అభిప్రాయం ఏర్పరుచుకొంటున్నారు. అధునాతన టెక్నాలజీని ఉపయోగించడం కొత్త కాన్ఫిడెన్స్‌ను ఇస్తోంది. ప్రత్యేకమైన గుర్తింపును ఇస్తోంది. ఈ నేపథ్యంలో.. పర్సనల్ కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ విషయంలో... అందులోనూ అప్లికేషన్ల విషయంలో అప్ టు డేట్ గా ఉండటం మంచిది. దీనివల్ల సౌకర్యానికి సౌకర్యం, ట్రెండీ అనే ఇమేజ్... రెండూ వస్తాయి. మరి కంప్యూటర్ల ఓఎస్ విషయంలో... ఇప్పుడు విండోస్ 8 వాడేవాళ్లు తాము ట్రెండీ అనుకుంటున్నారు. ఐఓఎస్‌తో నడిచే ఖరీదైన పీసీలను పక్కనపెడితే... మిగతా లాప్టాప్ల విషయంలో, డెస్క్‌టాప్‌ల విషయంలో విండోస్ 8 స్పెషల్ అట్రాక్షన్‌గా మారింది. ప్రత్యేకించి విండోస్8 లోని అప్లికేషన్లు ‘వావ్’ అనిపిస్తున్నాయి. మరి అంతలా ఆకట్టుకుంటున్న ఆ అప్లికేషన్లు ఏవంటే... క్లౌడ్ స్టోరేజ్ కోసం... 5 జీబీ ఫ్రీస్టోరేజ్కు అవకాశం ఇస్తోంది బాక్స్ అనే అప్లికేషన్. పర్సనల్, బిజినెస్ డాటా స్టోరేజ్‌కు బాక్స్ ఉత్తమ పరిష్కారం అంటారు. ఇంకా మైక్రోసాఫ్ట్‌కు చెందిన స్కై డ్రైవ్, ఫైల్ షేరింగ్ కు, క్లౌడ్‌లోని డాటా ఎడిటింగ్‌కు అవకాశమిచ్చే డ్రాప్‌బాక్స్, అంతులేని డాటా స్టోరేజ్‌కు అవకాశమిచ్చే బిట్‌కాసా ఇన్ఫెనైట్ స్టోరేజ్ అప్లికేషన్లు విండోస్ 8 పై అందుబాటులో ఉన్నాయి. వీటిలో తగినది ఎంపిక చేసుకునే ఛాయిస్ మీదే! వంటల విషయంలో పోటీ... నలభై వేల రెసిపీల ఐడియాలతో ఉన్న ఆల్ రెసిపీస్, కుకింగ్ ట్యుటోరియల్‌గా ఉండే యుమ్వైకుకింగ్ కంపానియన్, కొత్త కుకింగ్ బుక్ క్రియేట్ చేయడానికి అవకాశమిచ్చే రెసిపీ హౌస్ అప్లికేషన్లున్నాయి. టైమ్డ్ 2 పర్ఫెక్షన్, ఫుడ్మ్యాగ్ లు కూడా వంట విషయంలో గైడ్‌గా ఉండే అప్లికేషన్లు. గేమ్ అప్లికేషన్లు కూడా... విండోస్ 8 పై ఆకట్టుకునే గేమ్ అప్లికేషన్లు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. స్మార్టఫోన్లో ఉండే గేమ్ అప్లికేషన్లకు ధీటుగా ఉంటాయివి. టచ్ స్క్రీన్‌పై ఈ అప్లికేషన్లు అదుర్స అనిపిస్తాయి. గ్రావిటీ గయ్, గేమ్ దేవ్ టైకూన్, రేడియంట్, ర్యాట్ ఆన్ స్నోబోర్డ్, మంకీ ఫ్లైట్, ఎక్స్‌బాక్స్ గేమ్స్, ఫిన్బాల్ ఎఫ్ఎక్స్ 2, రేడియంట్ డిఫెన్స్, యాంగ్రీ బర్డ్స్ స్పేస్, యాంగ్రీ బర్డ్స్ స్టార్ వార్స్ వంటి గేమ్ అప్లికేషన్లు ఉన్నాయి. ఫొటో ఎడిటింగ్ కోసం... విండోస్ ఫోన్లో అందుబాటులో ఉన్న ఫొటో ఎడిటర్లను పీసీకి మైగ్రేట్ చేశారు. 70 స్టైల్ ఫ్రేమ్స్‌తో ఉండే ఫోటోరూమ్, కిడ్స్ డ్రాయింగ్ ప్రాక్టీస్‌కు ఉపయోగకరంగా ఉండే ఫ్రెష్ పెయింట్, ఫొటో లుక్ మార్చేయగల పర్ఫెక్ట్ 365, ఇంకా గ్యాలరీ హెచ్డీ, ఫోటొర్, పికాసా ఆల్బమ్ పెయిడ్ వెర్షన్, స్కెచ్ టచ్.. వంటి ఫొటో ఎడిటింగ్ అప్లికేషన్లూ ఉన్నాయి. మ్యూజిక్ లవర్స్ కోసం... విండోస్ 8 మ్యూజిక్ లవర్స్‌ను అలరించడానికి కూడా ఎన్నో అప్లికేషన్లను అందుబాటులో ఉంచింది. ఇంటర్నెట్లో అనుసంధానమైన ఆప్స్‌తో ఆకట్టుకుంటోంది. వీటిలో ఏడు లక్షల ప్లేలిస్ట్స్తో ఉండే 8 ట్రాక్ రేడియో, ఇంకా నోకియా మ్యూజిక్, ఫ్రీ ఇంటర్నెట్ రేడియో అయిన ట్యూనెలన్ రేడియో, రెండు కోట్లకుపైగా ట్రాక్స్ ఉండే 7 డిజిట్ మ్యూజిక్ స్టోర్, పాపులర్ మ్యూజిక్ డిస్కవరీ సర్వీస్ షాజమ్, మ్యూజిక్ ట్యూబ్ వంటి అప్లికేషన్లుఉన్నాయి. ప్రొడక్టివిటీ కోసం కూడా... కేవలం వినోదం కోసమే కాక... విద్య, వృత్తి, వ్యాపార రంగాలకు ఉపయోగపడే అప్లికేషన్లను కూడా అందుబాటులో ఉంచింది విండోస్ 8. వీటిలో స్కై డ్రైవ్‌తో సింక్ అయ్యే వన్‌నోట్, డిజిటల్ నోట్ మేకింగ్‌లో బెస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఎవర్ నోట్టచ్, టీమ్ వ్యూయర్ టచ్, పీడీఎఫ్ ఫైల్స్‌ను చ దవడంలో కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చే పీడీఎఫ్ టచ్ తదితరాలున్నాయి. రీడింగ్ కోసం.. చదువరుల కోసం ఆన్లైన్లో అందుబాటులో ఉన్న సైట్లలో బెస్ట్ అయిన వాటిని అప్లికేషన్లుగా అందుబాటులో ఉంచారు. వీటిలో దాదాపు పదిలక్షల బుక్స్‌తో ఉండే కిండ్లేస్టోర్, మ్యాగజీన్లు, న్యూస్పేపర్లను అందుబాటులో ఉంచుతూ... దాదాపు పదిలక్షల పుస్తకాలను ఉచితంగా చదువుకోవడానికి అవకాశమిచ్చే నూక్ తో పాటు పల్స్ న్యూస్, ఫర్ లేటర్, కామిక్స్, న్యూస్బెంటో, బుక్బజార్ రీడర్, అడోబ్ రీడర్ టచ్, మాగ్నా ఫ్లో వంటి అప్లికేషన్లు పుస్తకాల పురుగులకు దివిటీలుగా ఉన్నాయి. అంతేగాక... విజ్ఞానసర్వస్వం వికీపీడియాను ఒక బుక్ రూపంలో అప్లికేషన్‌గా అందుబాటులో ఉంచారు. ఆన్లైన్ షాపింగ్ కోసం... ఆన్లైన్ షాపింగ్ కోసం చక్కటి సైట్లుగా ఉన్న వాటిని అప్లికేషన్ల రూపంలో అందుబాటులో ఉంచారు. ఈ బే, అమజాన్, క్రెయిగ్ లిస్ట్ప్లస్ లు అప్లికేషన్లుగా ఉన్నాయి. వెబ్‌సైట్‌గా వీటిని బ్రౌజ్ చేయడం కంటే అప్లికేషన్లుగా వాడుకోవడం వల్ల సర్ఫింగ్ వేగవంతంగా ఉంటుంది. సోషల్ నెట్వర్కింగ్ కొంచెం కొత్తగా... విండోస్ 8 లో ఫేస్బుక్ అప్లికేషన్ లేదు. ఈ సోషల్ నెట్వర్కింగ్ సైట్‌ను వెబ్ బ్రౌజర్ ద్వారా ఓపెన్ చేసుకోవచ్చు. మిగతావాటిలో రెడిట్ ఆన్ రెడ్ హబ్, ట్విటర్, స్కైప్, మెట్రో ట్విట్, స్టంబుల్ అపాన్, ఐఎమ్ ప్లస్.. వంటి సైట్లు అప్లికేషన్లుగా అందుబాటులో ఉన్నాయి. - జీవన్‌రెడ్డి .బి స్మార్ట్‌ఫోన్ మార్కెటింగ్‌లో విండోస్ 8 ఓఎస్‌కు అప్లికేషన్ల లేమి ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నా, మిడిల్ రేంజ్ పీసీ ప్రపంచంలో మాత్రం అప్లికేషన్లో విషయంలో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ బెస్ట్‌గా నిలుస్తోంది. టచ్ పీసీలకు, సాధారణ టాబ్లెట్ల విషయంలో విండోస్ 8 వినూత్నమైన అనుభవంగా నిలుస్తోంది. ఒక్కో అప్లికేషన్ గురించి ఒక్కో పదంతో తేల్చేసినా టచ్ పీసీలో వీటిని వాడటంలో ఉండే ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలంటే ఎంతో ఉంటుంది.